హాని-రహిత వ్యవసాయం – మహిళల నేతృత్వంలోని వాతావరణ స్థితిస్థాపకత వ్యవసాయం (WCRF) నమూనా

మహిళలకు ఏమిపండించాలో, ఏ ఇన్పుట్లను ఉపయోగించాలో, ఎప్పుడు ఎక్కడ విక్రయించాలో నిర్ణయించుకునే అధికారం ఉన్నప్పుడు – వ్యవసాయం మరియు జీవనోపాధిలో కీలక మార్పులు సంభవిస్తాయి. WCRF నమూనా ద్వారా వ్యవసాయం ఆర్థికంగా లాభదాయకమైన ఆచరనీయమైన  వెంచర్ గా మారడానికి భరోసానిస్తూ వ్యవసాయ కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహంచింది, తద్వారా మరాఠ్వాడాలోని మహిళలలు వ్యవసాయంలో మార్పు సాధికారత సాధించారు.

మహారాష్ట్రలో ఆహార పంటలు పండించే భూమి 12 శాతం వరకు తగ్గింది .గత మూడు దశాబ్దాల్లో చెరకు వంటివాణిజ్య పంటలు దాదాపురెట్టింపు అయ్యాయి. కానీ నీటి ఎద్దడి పరిస్థితుల మూలంగా మరాఠ్వాడాలో ఈ పంటలను పండించడం సవాలుగా మారింది.అయినప్పటికీ, ఈ కరువు పీడిత ప్రాంతంలోని అనేక చిన్న మరియు సన్నకారు రైతులు తమ కోసం ఆహారాన్నిపండించుకోవడానికి బదులుగా సోయాచిక్కుడు మరియు చెరకు వంటి నీటి-అవసరమైన వాణిజ్య పంటలను పండించడం కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా, ఈ పంటలను పండించడంవల్ల రైతులకు ఖరీదైన రసాయన ఎరువులు, పురుగుమందులు మరియు మార్కెట్లో కొనుగోలు చేసిన హైబ్రిడ్  విత్తనాలపై ఆధారపడటం, తద్వారా వారి సాగు ఖర్చు బాగా పెరుగుతుంది. మరాఠ్వాడాలో దాదాపు 80% సాగుభూమి వర్షాధారం కావడంతో, నీరు ఎక్కువగా ఉండేవాణిజ్య పంటలు ప్రతికూల ఋతుపవనాల సమయంలో విఫలమయ్యే ప్రమాదం ఉంది. వ్యవసాయ పెట్టుబడుల కోసం రుణాలు తీసుకుని, ఒకేరకమైన పంటలు పండించే చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత కుటుంబాలలోని మహిళలలకు స్వంత భూమి లేని కారణంగాతగిన ప్రభుత్వ విస్తరణ సేవలు మరియు ఇతర ఉత్పాదక వనరులైన ఆర్థిక, మార్కెట్, నీటి లభ్యత వంటి సేవలపై వీరికి పరిమిత ప్రాధాన్యత ఉంటుంది, కావున ఈ కుటుంబాలలోని మహిళలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది.

 మహిళలపై ప్రత్యేక దృష్ఠి

చిన్న మరియు సన్నకారు రైతు కుటుంబాలకు చెందిన గ్రామీణ మహిళలు ప్రధానంగా వ్యవసాయ కార్మికులుగానే గుర్తింపును కలిగి ఉన్నారు.వారికి అపారమైన శ్రమపడే శక్తి, జ్ఞానం మరియు సమయం, ఉన్నప్పటికీ, వారురైతులుగా గుర్తించ బడలేదు. పురుషులే ఏమి పండిచాలి,ఎక్కడ  పండించాలి, ఎక్కడ విక్రయించాలి అనే దానిపై నిర్ణయాలు తీసుకుంటారు .పురుషులు, మహిళలకు పొలంలో కలుపు తీయడం మరియు కోయడం వంటి తక్కువ నైపుణ్యం కలిగిన పనులను చేయించుటలో ఆదేశాలిస్తుంటారు. ఈ ప్రాథమిక అవగాహనతో, ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఒక NGO SSP, మహిళా సాధికారతే ధ్యేయంగా వారిని సంత్సరంలోని నాలుగు ఋతువులలో కార్మికుల స్థాయి నుండి వ్యవసాయంలో అగ్రగామిగా మార్చడానికి మహిళలకు సాధికారత మార్గంగా మహిళల నేతృత్వంలోని వాతావరణ స్థితిస్థాపకత వ్యవసాయం (WCRF) నమూనాను రూపొందించింది.

వ్యవసాయం ఆర్థికంగా లాభదాయకమైన వెంచర్ గా మారేలా చేసి చూపించిన మహిళలు

మహిళలు స్వాభావికంగా కుటుంబం యొక్క ఆహారం మరియు పౌష్టికాహార అవసరాలను అర్థం చేసుకుంటారు, వారికి సరైన శిక్షణ దొరికినపుడు మంచి నిర్ణయాలు తీసుకోగలరు, ప్రకృతి సేధ్య విధానంతో స్థానిక తృణధాన్యాలు,  పప్పుధాన్యాలు మరియు కూరగాయలను పండించడాన్నిఎంచుకుంటారు. తక్కువ నీటిని వినియోగించే స్వల్పకాలిక పంటలు స్థానిక నీటిఎద్దడి పరిస్థితులు కలిగిన వాతావరణానికి బాగా సరిపోతాయి . అప్పుడు కరువు వంటి ప్రతికూల పరిస్థితులలో కూడా మెరుగైన ఆహార లభ్యత ఉంటుంది. సాంప్రదాయకంగా, స్త్రీలు ఇంటిలో పశువుల నిర్వాహకులుగా ఉంటారు – పశువుల దాణా తయారు చేయడం, పాలుపితకడం నుండి వంట కోసం వాటి పేడను ఆరబెట్టడం వరకు అన్నీ చేయగలరు. SSP యొక్క నమూనా లోని శిక్షణతో అతితక్కువ ధరకే పంటకు అవసరమైన జీవన మరియు సేంద్రీయ ఎరువులను వీరు తయారు చేయగలరు. అదనంగా, మహిళలు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు . మహిళలకున్న గొప్ప లక్షణానికి ఉదాహరణను తుగావ్, ఉస్మానాబాదుకు చెందిన రూపాలివికాస్షెండాగే ఇలా చెప్పారు“పురుగుమందులు తయారు చేయడానికి మనకు 10 రకాల ఆకులు అవసరమైతే, పదవ ఆకు దొరికేవరకు మహిళలు ప్రయిత్నిస్తూనే ఉంటారు అదే పురుషులు అయితే తొమ్మిదితో ఆకుతో సంతోషంగా ఉండవచ్చు”.  ఈ రోజు, మేము కలుసుకున్న చాలా మంది మహిళా రైతులు జీవన మరియు సేంద్రీయ ఎరువులను వాడకం వలన, వారినేల నాణ్యత మెరుగు పడిందని, అది తేమను నిలుపుకోవడానికి దోహదపడి,తక్కువ నీటినితో అధిక పంట దిగుబడులు పొందడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.

బిల్డ్–ఎంపవర్–సస్టైన్ నమూనా

SSP యొక్క WCRF నిర్వహణ సిద్దాంతంయొక్క ప్రధాన సూత్రం, బిల్డ్-ఎంపవర్మరియు సస్టైన్ (అనగా నిర్మించు , పూర్తి అధికారం కల్పించు మరియు దాన్ని నిలబెట్టు )గల మూడు-దశల నమూనా. మొదట, SSP కమ్యూనిటీ-ఆధారిత వనరులు, కీలక భాగస్వాములు,ఆధర్శరైతులను మరియు అనుకూలపర్యావరణ వ్యవస్థను నిర్మిస్తుంది మరియు కాలక్రమేణా వాటిని మెరుగుపరుస్తుంది.నిర్వహణలోని రెండవ దశలో, SSP ప్రభుత్వపథకాలను అంది పుచ్చుకోవడం ద్వారా దత్తత తీసుకున్న రైతులు సహకారంతో పొలాల్లో ప్రదర్శన క్షేత్రాలు, చిన్ననీటికుంటలు, మరియు ఊరికి ఉపయోగపడే చెరువులు వంటి కమ్యూనిటీ ఆస్తులను కూడా సృష్టిస్తుంది.వీటిని సాధించడానికి దత్తత తీసుకున్న మహిళా రైతులకు సమిష్టిగా ప్రధాన పర్యావరణ వ్యవస్థ లపై పూర్తి అవగాహన కలిగే వరకు SSP శిక్షణనిస్తుంది.స్థానికంగా ఉన్నవారినే కృషిసంవాద్ సహాయకాశ్ మరియు శిక్షన బృందాలుగా తయారుచేసి,దత్తత తీసుకున్న రైతులను వ్యవసాయ నిపుణులుగా మారడానికి SSP మార్గదర్శకత్వం వహిస్తుంది . కమ్యూనిటీ-ఆధారిత వనరుల సహాయంతో ఇది జరుగుతుంది. చివరి దశలో, రైతు సమూహాలను ATMAకి అనుసంధానించడం ద్వారా వారి కార్యకలాపాలను కొనసాగించడానికి మరియు ప్రభుత్వపథకాలను ఇతర రైతులు సద్వినియోగం చేసుకోవడానికి వీలు కల్పిస్తారు.ఈ పథకాల సహాయంతో, రైతు సమూహాలు తమ వ్యవసాయ ఆధారిత సంస్థలను విస్తరించి మార్కెట్ అనుసంధానాలను మెరుగు పరుస్తాయి, ఇది వారి కార్యకలాపాలను కొనసాగించడంలో వారికి సహాయపడుతుంది. అంతేకాకుండా,  కమ్యూనిటీ ఆధారిత వనరులు సృస్థించే నమూనాలో స్థానిక మహిళలు లబ్దిపొందుతారు మరియు ఆ పధకకాలం ముగిసిన తర్వాత కూడా వారికి శిక్షణ సహాయం SSP ద్వారా అందుతుంది. అదనంగా, రైతు సమూహాలు మరియు కమ్యూనిటీ-ఆధారిత వనరులతోసహా ప్రధాన పర్యావరణ వ్యవస్థలను నడిపేవారు, ప్రభుత్వ సంస్థలు మరియు దాత సంస్థలు పెట్టుబడి పెట్టగల దత్తత-సిద్ధమైన సామాజిక మూలధనంగా అభివృద్ధిచెందుతాయి.

క్షేత్ర స్థాయిలో

వ్యవసాయ పద్ధతుల్లో నాలుగు కీలక మార్పులను సాధించడం CRF నమూనా లక్ష్యం – నగదు పంటల నుండిఆహార పంటలకు, రసాయనాల నుండి బయో ఎరువులు మరియు పురుగు మందులకు మారడం, నేల మరియు నీటిసంరక్షణ మరియు వ్యవసాయ అనుబంధ వ్యాపారాల ద్వారా వైవిధ్య భరితమైన జీవనోపాధి సాధించాలి. ఈ మార్పులను తీసుకురావడానికి, మహిళలుతమ కుటుంబానికి ఆహారం మరియు పోషకాహార నిర్వాహకులుగా ఉండేవారి సహజమైన జ్ఞానాన్నినిరంతరం ఉపయోగించాలి, ఇది వారికి ఏమి పెరగాలి, ఏ ఇన్పుట్లు ఉపయోగించాలి మరియు ఏ వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను చేపట్టాలోఆలోచించడం మరియు నిర్ణయించుకోవడంలో వారికి సహాయపడుతుంది.

మహిళల నేతృత్వంలోని వాతావరణ స్థితిస్థాపకత వ్యవసాయం (WCRF) నమూనా మహిళలలను రైతులుగా, నాయకులుగా మరియు వారిపొలాల్లో ఆహార సురక్షిత పద్ధతులను అనుసరించే మార్పు ఏజెంట్లుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఈ నమూనా నాలుగుకీలక కోణాలపైదృష్టిపెడుతుంది: మార్కెట్లను అనుసంధానిచడం, మహిళా రైతులను సమాఖ్యపరచడం, సమగ్ర సాంకేతికతతో నీటిని పొదుపుగా వాడుకొనే సూక్ష్మనీటిపారుదల పద్దతులు పాటించడం. ఇదిఉత్పాదకతను మెరుగుపరచడం, ఆదాయాన్నిపెంచడం, కుటుంబం యొక్క ఆరోగ్యం మరియు పోషణను మెరుగుపరచడం మరియు స్థితిస్థాపకతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

వాతావరణ-స్థితిస్థాపక వ్యవసాయ నమూనాతో ప్రతి ఋతువులో 6-8 ఆహార పంటలను ఒక కుటుంబానికి ఉన్న చిన్న కమతంలో సహజ ఇన్పుట్లతో పండించడాన్నిప్రోత్సహిస్తుంది . దీనికి ఏకాగ్రత కృషి, శ్రద్ధ, నిబద్ధత మరియు సమయం అవసరం – ఇవి పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువ. అందువల్ల, SSP యొక్క వాతావరణ-స్థితిస్థాపక వ్యవసాయ నమూనా స్త్రీలను వారికుటుంబాల నుండి ఒక చిన్న భూమిలో సాగుహక్కులను పొందేలా ప్రోత్సహిస్తుంది – ఇది సాధారణంగా సగం లేదా ఒక ఎకరంతో మొదలవుతుంది, కుటుంబ వినియోగం కోసం స్థానిక కూరగాయలు, తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలు పండించడానికి. ఈ నమూనావలన స్థానిక విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల శిక్షణ మరియు వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది , పొదుపు, మెరుగైన ఆరోగ్యం, నీరు మరియు నేల పరిరక్షణకు భరోసా ఇస్తుంది.

మహిళలు గ్రామ స్థాయిలో 20 మంది సభ్యులతో కూడిన అనధికారిక బృందాలుగా ఏర్పాటు చేయబడతారు. ప్రతి సమూహానికి, గ్రూపులోని ఇద్దరు సభ్యులు నాయకత్వం వహిస్తారు, వారు సమూహ కార్యకలాపాలకు నాయకత్వం వహంచడానికి మరియు గ్రామ స్థాయి కమ్యూనిటీ ఫెసిలిటేటర్తో సమన్వయం చేయడానికి బాధ్యతవహస్థారు.

భాగస్వామ్య విధానాన్నిఅనుసరించి శిక్షణలు ఇప్పించడం ద్వారా అనేక విషయాలను నేర్చుకున్న తరువాత ఆఖరి సీజన్లో వారిని ప్రొడ్యూసర్‌ గ్రూపులుగా చేస్తారు. మొదటి రెండు సీజన్లలో, కొత్తగా దత్తత తీసుకోబడిన వ్యక్తి తన కుటుంబం నుండి ఒక చిన్న భూమిపై సాగు హక్కులను పొందగలుగుతారు మరియు కాలానుగుణ ఆహార పంటలను పండించడంలో జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందుతారు. స్థానికంగా లభించే విత్తనాలను గుర్తించడం మరియు తక్కువ ధర మరియు పర్యావరణ అనుకూల ఎరువులు మరియు పురుగు మందులను తయారు చేయడం ఈ దశలో ఉంది. ఈ దశను అమలు చేయడానికి,బయో-ఇన్పుట్ల కోసం పశువులను తన వ్యవసాయ క్షేత్రంతో అనుసంధానించి, కుటుంబం యొక్క ఆహారం మరియు పోషకాహార అవసరాలను తీర్చుకోగలుగుతారు.

బాక్స్ 1

ఉస్మానాబాదుకు చెందిన ఆశా హజ్గూడే దిక్కుతోచని స్థితిలో పడింది. ఆమె ప్రభుత్వ PMKSY పథకంకింద  బిందుసేద్యం చేయాలని కోరుకుంది, అయితే బిందుసేద్యం పరికరాలు కొనుగోలు చేయడానికి మొదటగా 30,000 రూపాయలు పెట్టుబడిపెట్టాలి. రైతు ఉత్పత్తి లేదా సేవను కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వ రాయితీలు ఖాతాలో జమ చేయబడతాయి. ఇది కుటుంబానికి పెద్దమొత్తం.ఆశా తన బిందు సేద్య వ్యవస్థను కొనుగోలు చేయడానికి రూ. 25,000 ఋణం ను శీఘ్ర, సులభమైన మరియు తక్కువ-వడ్డీకి CRF లో పొందినప్పుడు ఆమెకు విషయాలు తేలికగా మారాయి. “ఆసమయంలో నేను కేవలం 5,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టాల్సివచ్చింది” అనిఆషా గుర్తు చేసుకున్నారు. 2009లో ఉస్మానాబాద్మరియు తుల్జాపూర్‌ బ్లాకుల్లో  ప్రారంభించబడింది,CRFసంస్థ బ్యాంక్ ద్వారా ఋణ సదుపాయం కల్పిస్తే,SHG ఫెడరేషన్ సశక్ట్ సఖి సంగ్ స్థ ద్వారా నిర్వహంచబడుతుంది.

మూడవ సీజన్లో, ఒక ఏడాదిలోపు దత్తత అనుభవం గలవ్యక్తి సాధారణంగా తన ఆధీనంలో ఉన్న భూమిని విస్తరింపజేస్తుంది మరియు గృహ వినియోగ అవసరాలనుతీర్చిన తర్వాత విక్రయించదగిన మిగులును కలిగి ఉండేలా తన ఉత్పత్తిని పెంచుతుంది (బాక్స్2 చూడండి). అదేసమయంలో, ఆమెకుటుంబ ఆదాయాన్ని పెంచడానికి జీవన ఎరువులు , పౌల్ట్రీ, డైరీ, మేకల పెంపకం మొదలైన వాటిలో వ్యవసాయ ఆధారిత వ్యాపారాలను ప్రారంభించి, అమలు చేయడానికి శిక్షణ పొందుతుంది. నాల్గవ మరియు చివరి సీజన్లో, SSP మహిళా రైతుకు చట్టబద్ధమైన భూమి హక్కును పొందడంలో సహాయపడుతుంది, ఇది ఆమెపేరు మీద ప్రభుత్వ పథకాలను పొందడంలో సహాయపడుతుంది. అదనంగా,ఈ ప్రోగ్రాంప్రారంభ దశలో ఏర్పడిన అనధికారిక రైతు బృందాలకు స్కీములను కొనసాగించడానికి ATMAలో తమను తాము నమోదు చేసుకునేలా సలహా ఇస్తారు. ఎంపిక చేయబడిన మరియు శిక్షణ పొందిన బృందాలు  రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను ప్రారంభించడానికి మరుయు సమిష్టి వ్యాపారాలను నడపగల సామర్ధ్యం కలిగిఉంటారు.

సంఘం యొక్క స్థితిస్థాపక నిధి

కమ్యూనిటీ రీసైలెన్స్ ఫండ్ (CRF) అనేది కమ్యూనిటీ-యాజమాన్యం, నడిపే మరియు నిర్వహంచబడే తక్కువ-వడ్డీకి లబించే ఫండ్, ఇదిరైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వ పథకాలను పొందడంలో సహాయపడుతుంది. సంఘం యొక్క స్థితిస్థాపక నిధి (CRF)అనేది మహిళా సమూహాల కలయిక మరియు తక్కువ-వడ్డీకి పెట్టుబడి రుణాలు అందించడానికి వేగవంతమైన మరియు సులభమైన మార్గం. కీలకమైన ప్రభుత్వపథకాలను పొందడంలో రైతులకు CRF ప్రముఖ పాత్ర పోషించి సహాయపడుతుంది. (బాక్స్1 చూడండి).CRFనిసంప్రదించడం చాలా సులభం, బ్యాంక్ ఋణం కంటేతక్కువ వడ్డీరేట్లను కేవలం సాలుకి 8 శాతానికే అందిస్తుంది మరియు ఉత్పత్తి లేదా సేవను కొనుగోలు చేయడానికి ముందే వారి ఖాతాకు జమ చేయబడుతుంది. CRF రుణం దరఖాస్తు చేసుకున్న 8 రోజులలోపు రైతు బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది .

CRF రైతులకు పశుగ్రాసం, హైడ్రోపోనిక్స్, కూరగాయలు పండించడం మొదలైన వాటికోసం రుణాలను పొందడంలో సహాయపడుతుంది, వీటిని వారు MFIలు లేదాబ్యాంకుల నుండిపొందలేరు.

బాక్స్2: ఒక ఎకరం నేలలోని వ్యవసాయ నమూనాలో వాణిధ్య పంటల నుండి వైవిధ్యభరితమైన సేంద్రియ వ్యవసాయానికి మారడానికి సత్పలితాను ఇస్తుంది

“మేము మా ఎకరంలో సోయాబీన్‌ పంటను పండిస్తున్నాము మరియు రసాయన పురుగుమందులను ఉపయోగిస్తున్నాము. మేము మాసంపాదనలో కేవలం 30% మాత్రమే ఆదా చేసుకోగలిగాము” అని మహారాష్ట్రలోని గావుర్ గ్రామానికి చెందిన అర్చన తవాడేచెప్పారు. “శిక్షణ తర్వాత, నేను నేర్చుకొన్న మెళుకువులను అమలుచేయడానికి 10,000 చదరపు అడుగుల వ్యవసాయ భూమినిఇవ్వాలనినా భర్తను ఒప్పించాను”.

వివిధ రకాల పంటలు – కూరగాయలు మరియు తృణధాన్యాలు మరియు కేవలం సేంద్రీయ ఎరువులు ఉపయోగించి ప్రయోగాలు చేస్తూ, అర్చన మూడు రెట్లు దిగుబడిని చూసి ఆశ్చర్యపోయింది. ఆమె లాభాలను ఆర్జించి కాకుండా  ఆమెకుటుంబం మొత్తానికి విలువలుగల పోషకాహారం అందించడం ఒకఅతిపెద్ద విజయం. ఈ విజయంతో ఉత్సాహంతో అర్చన భర్త ఒక ఎకరంలో సేంద్రియ వ్యవసాయాన్నిఅనుసరించాడు. కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు మరియు నూనెగింజలు – 23 రకాల పంటలనుపండించడం ద్వారా వారు తమ సంపాదనలో దాదాపు 60% ఆదా చేయగలిగారు.

ఈరోజు అర్చన ఒక మంచి వక్త మరియు శిక్షకురాలు. ఆమె అనుభవం ఇతర మహిళలకు కూడా ఒక ఎకరం నేల నమూనా  అమలు చేయడానికి శక్తి వంతమైన ప్రేరణగా పనిచేస్తుంది. “ఒక మహిళగా, తల్లిగా మరియు రైతుగా – నా కుటుంబంమరియు నా భూమిఆరోగ్యం చాలా కీలకం. ఒక ఎకరం నమూనా రెండు లక్ష్యాలను చేరుకోవడానికినాకు సహాయపడుతుంది.ఇదినేను ఇతర మహిళలతో పంచుకునేసందేశం” అనిఅర్చన చెప్పారు.

 ప్రభావం

ఈ కార్యక్రమం మహిళా రైతుల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్నిచూపింది. స్త్రీలు భూమిని పొందారు మరియు భూమిని సాగు చేసుకునే హక్కును పొందారు, కుటుంబాల ఆహారం, పోషణ మరియు ఆదాయ భద్రత (బాక్స్3 చూడండి) పొందారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులకు మారడం ద్వారా, వారు మెరుగైన సహజ వనరుల నిర్వహణకు దోహదపడ్డారు. వ్యవసాయం నుండి ఆహార ప్రాసెసింగ్, సరఫరామరియు వినియోగ దారులకు పంపిణీ వరకు మొత్తం విలువ ఆదారిత గొలుసులో పాల్గొనడం, ఈ మహిళలకు మరింత నమ్మకం మరియు సాధికారత చేకూరింది. క్రయవిక్రయాలలో పాలుపంచుకోవడం ద్వారా మహిళలు ఆర్థికంగాస్వతంత్రులుగా మారారు. కుటుంబంలో మరియు సమాజంలో మహిళలకు రైతులుగా మరియు నిర్ణయాధికారులుగా గుర్తింపు పెరుగుతోంది.

బాక్స్3: మహిళా రైతులకు భూమి యాజమాన్యం

మరాఠ్వాడాలో పునరావృతమయ్యే కరువు రైతులను భారీనష్టాలతో బాధించింది మరియు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి.ఉస్మానాబాదు లో కల్లంబలోని ఏకుర్గా గ్రామానికి చెందిన మహిళా రైతులు ఈ ప్రతికూల పరిస్థితులనుతమ చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారుమరియు పరిస్థితిని అధిగమించడానికి వారికు టుంబాలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

పుండుమీద రోకలి పోటులా, ఈ ప్రాంతంలో పురుషులలో మద్యపాన వ్యసనం కూడా ఎక్కువ. “నా భర్త డ్రైవరు పనిచేయడంప్రారంభించాడు మరియు ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉండేవాడు. అతని మద్యపానం అదుపు లేకుండా పోయింది. అతను మా భూమి అంతా అమ్మేస్తాడేమోనని అత్తమామలకు భయం మొదలైంది. పరిస్థితిని కాపాడటానికి, నేను భూమిని నా పేరుమీద బదిలీచేయమని మా అత్తమామలను ఒప్పించాను” అని మనీషా యాదవ్తెలిపింది. ఈ రోజు మనీషాకు ఒక ఎకరం భూమిఉంది, దానినుండి ఆమె రూ.2,50,000 కూరగాయల సాగు ద్వారా సంపాదిస్తుంది .

వాతావరణాన్నితట్టుకోగల వ్యవసాయ నమూనాపై SSP ఎకుర్గాలో మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఈ శిక్షణ సమయంలో, ప్రభుత్వ వ్యవసాయ పథకాలు మరియు వనరులను పొందేందుకు భూమి హక్కులు మరియు యాజమాన్యం యొక్క ప్రాముఖ్యతను మహిళలు గ్రహంచారు. వారు భూమిపై హక్కులను పొందేందుకు 400 మంది మహిళా రైతులతో ఒక బృందాన్నిఏర్పాటు చేశారు.

మహిళల ప్రయోజనాల గురించి వారి కుటుంబాలతో సంప్రదించడం ప్రారంభించారు మరియు వారిపేరు మీద భూమిని విభజించమని కుటుంబాన్నిఒప్పించారు. సవితా తైభోరేతన భర్తను ఒప్పించిన మొదటి మహిళ మరియు బ్లాక్త హశీల్దార్వద్ద ఎటువంటిఖర్చు లేకుండా చట్ట పరమైన ప్రక్రియను పూర్తి చేసింది. సవిత ఎకుర్గా గ్రామంలో మహిళా భూ యాజమాన్యానికి న్యాయవాది మరియు మార్గదర్శి, కుటుంబం నుండి భూమియాజమాన్యాన్నిపొందడానికి 50 కంటే ఎక్కువ మందిమహిళలకు సహాయం చేసారు.

స్కేలింగ్అప్–ఈ నమూనాను ఇంకా వృద్దిచేయడం

SSP మొదట ఉస్మానాబాదులో ఈ నమూనాను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది, అక్కడ వారు ఒక ఎకరం భూమిలో తక్కువ నీటిఆధారిత ఆహార పంటల సాగుమరియు రసాయనాల నుండిసేంద్రియ వ్యవసాయం పద్దతులకు మారడాన్నిప్రారంభించారు. WCRF నమూనాలో ఇది ” ఒక ఎకరం నమూనాలా” కూడా ప్రసిద్దిచెందింది, మహిళలు ఒక ఎకరం లేదా అంతకంటేతక్కువ భూమినికొనుగోలు చేయడంమరియు ఆహార పంటలను పండించడంలో మార్పును సాధించగలమనే నమ్మకాన్ని కలిగిఉన్నారు.

ఈ నమూనాలో పూర్తినిజమైన సామర్థ్యాన్నిరాబట్టడానికిపరస్పర సహకారప్రయత్నం అవసరం. SSP UMED-మహారాష్ట్ర రాష్ట్ర గ్రామీణ జీవనోపాధిమిషన్, మహారాష్ట్ర ప్రభుత్వం, MISEREOR జర్మనీ, Huairouకమీషన్, Welthungerhilfe-GIZ, హందుస్తాన్‌ యునిలివర్ఫౌండేషన్, కమల్ఉద్వాడియా ఫౌండేషన్, MacArthur Foundation, ASHOKA, HSBCమరియు నాబార్డువంటికీలక పర్యావరణ వ్యవస్థలభాగస్వాములతో కలిసిపనిచేసింది. మరోవైపు, పర్యావరణ వ్యవస్థ భాగస్వాములు మహిళలతో వారిచొరవనుపెంచడంలో SSP సహకారాన్నిపొందారు.

2014లో, సన్నకారు రైతుకుటుంభాల్లో ఆహారం మరియు ఆదాయ భద్రతనునిర్ధారించడానికిమహిళల నాయకత్వ భాగస్వామ్యాన్నిప్రోత్సహంచేలక్ష్యంతో SSP బృందాలు ఈ విధానాన్నిరూపొందించాయి.2016లో, మహారాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం మహిళారైతులకు మరింత శిక్షణ ఇవ్వడానికిమరియు కమ్యూనిటీరిసోర్సు పర్సన్‌  వంటి క్రియాశీల సభ్యులుగా ,వ్యవసాయ నాయకులుగాతయారుచేయడానికిఒక అవకాశం ఏర్పడింది.

ఏడేళ్లలో, మహారాష్ట్రలోనిఉస్మానాబాద్, లాతూర్, షోలాపూర్‌మరియునాందేడుజిల్లాల్లోని750 గ్రామాలలో 75,000 మందిమహిళా రైతులు మరియుకుటుంబాలు వాతావరణాన్నితట్టుకునేవ్యవసాయం వైపు మళ్లడంప్రారంభించాయి. ప్రస్తుతం ఇదిజల్నా, అహమద్నగర్మరియు ఔరంగాబాద్జిల్లాలకు మరియు భారతదేశంలోనిబీహార్‌మరియు కేరళ రాష్ట్రాలకు కూడావిస్తరించబడుతోంది. ఈ ప్రక్రియలో, ఈ కార్యక్రమం ప్రత్యేకమైన బయోఇన్పుట్లను ఉపయోగించిఆహార పంటలను పండించడం ద్వారా 65,000 ఎకరాల వ్యవసాయ భూమినిమార్చింది. ఈ నమూనా అత్యంత సమర్ధమంతమయినది మరియు క్రిందిస్థాయివరకు సులభంగా చేరుకొని కొలవదగినది,సమర్థవంతమైనదిగామరల మరల ఆచరించదగినది .

ఉపమన్యు పాటిల్ 
స్వయం శిక్షాన్ప్రయోగ్
102, మొదటిఅంతస్తు
గాయత్రిభవనం, ఆర్చిడ్ స్కూల్ లేన్ ,
బలేవాడిఫాటా, బ్యానర్, పూణే411045
మహారాష్ట్ర
ఇమెయిల్: sspindia1@gmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి ౨౪ , సంచిక ౩ , సెప్టెంబర్ ౨౦౨౨

 

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...