పునరుత్పాదక ఇంధనం తో స్వయం సమృద్ధి

భారతదేశంలో వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధన (DRE) భావన  రైతులకు స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా గ్రామీణ  స్థాయి నుండి పర్యావరణ సమస్యల పరిష్కారానికి  ఎంతగానో దోహద పడుతుంది .  ఈ వ్యాసం లో గ్రామీణ ప్రాంతాల్లో వివిధ అవసరాలకు వినియోగించే  శక్తిని ఉత్పత్తి చేయడానికి సులభమైన మరియు స్థిరమైన కొన్ని స్పూర్తిదాయకమైన పద్దతులను తెలియచేయబడినది.

భారతీయ వ్యవసాయం అనగానే  వైవిద్యాభరితమైనది అని  మన మనస్సులోకి వస్తుంది – అనూహ్యమైన వాతావరణం, పెరుగుతున్న ఎరువుల ధరలు, నిలిచిపోయిన మార్కెట్ ధరలు, బకాయిలు చెల్లించకపోవడం, అప్పుల భారం చివరకు రైతు ఆత్మహత్యలు. మనకు అవసరమైన అన్ని ఆహారాలను నిరంతరం అందించే భారతీయ రైతు ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతుండగా సరఫరా గొలుసులలో మరెవరో లాభాలను ఆర్జిస్తున్నారు. అధిక రుణం మరియు తక్కువ ఆదాయాలు అనే విషపువలయం  నుంచి విముక్తిని ఇచ్చి మనం మన రైతులకు పచ్చని భవిష్యత్తును ఎందుకు ఇవ్వలేము?

మనం భారతదేశ వ్యవసాయరంగం గురించి మాట్లాడేటప్పుడు, సాదారణంగా స్పృహకు వచ్చేవి – ఊహకందని వాతావరణ పరిస్థితులు, ఎరువుల ధరల పెరగుదల, పంట ఉత్పతుల ధరలలో పెద్ద ఎదుగుదల లేకపోవడం, ఋణ బకాయిలు చెల్లించ లేకపోవడం, అప్పుల భారం,చివరకు రైతు ఆత్మహత్యలు. అయినప్పటికి సగటు భారతీయ రైతు, కష్టాలను తట్టుకొని మనకు అవసరమైన అన్ని నిత్యావసర పంట ఉత్పత్తులను నిరంతరం అందిస్తాడు, తన సరుకులు అమ్మేటప్పుడు తనకు గిట్టుబాటు ధర రాదుకాని దళారులు మాత్రం లాభాలను ఆర్జిస్తున్నారు . అధిక రుణం మరియు తక్కువ ఆదాయం అనే విషవలయాన్ని మనం ఎందుకు విచ్ఛిన్నం చేయలేము మరియు రైతుకు గిట్టుబాటు కలిగే చక్కని భవిష్యత్తును ఎందుకు కల్పించలేము?

అదృష్టవశాత్తూ,ఈ విషవలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి, గ్రామాల్లో మన రైతులకు భరోసా ఇవ్వడానికి మరియు స్వయం సమృద్ధి సాధించడానికి  క్లీన్ టెక్నాలజీ సహాయం అందిస్తోంది . భారతదేశంలో వికేంద్రీకృత పునరుత్పాదక శక్తి (DRE) సరఫరా గ్రామాల్లోని రైతులను క్లీన్ ఎనర్జీ వినియోగం వైపు నడిపించడమే కాకుండా, స్వయం సమృద్ధి మరియు పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తుంది .

DRE సరఫరా, శక్తి లబ్ధిదారులకు చౌకగా లబిస్తుంది మరియు భవిష్యత్తు భరోసాతో పాటు స్థిరత్వాన్నిస్తుంది. ఇక్కడ కొన్ని నూతన DRE సంస్థలు జరిపిన క్లీన్ టెక్నాలజీ శక్తి అంశాల పరిశీలనలు

(Casestudies) గ్రామీణ ప్రజలకు ఉపయోగపడతాయి. ఈ కంపెనీలు దేశవ్యాప్త నెట్‌వర్క్‌లో క్లీన్ (CLEAN) పేరుతో క్లీన్ ఎనర్జీ యాక్సెస్ నెట్‌వర్క్ (క్లీన్) ను దేశవ్యాప్తంగా ప్రాచుర్యపరచేందుకు మరియు DRE ని అమలు చేయుటకు సభ్యులుగా ఉంటారు.

ఫామ్‌గేట్ వద్ద ఆహార వృధా మరియు పంట అనంతర నష్టాల నియంత్రణ :

తాజా వ్యవసాయ ఆహార ఉత్పత్తులలో 20-30% తుది వినియోగదారుని చేరేలోపు పంట పొలం వద్ద వృదా అవుతుంది ఆనేది అందరికి తెలిసిన నిజం . వివిధ ప్రభుత్వ పథకాలు ఆహార వృధా పై దృష్టి సారించినప్పటికీ, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల కొరత కారణంగా తగినంత వృద్ది సాధించలేదు. వికేంద్రీకృత పునరుత్పాదక శక్తి సరఫరా,  ఆహార సంరక్షణ కోసం పరిష్కారాలను అందించగలదు మరియు పంట కోసిన తర్వాత శీతలీకరణ, నిల్వ, రవాణా మరియు పంపిణీ సౌలబ్యాన్నిచూపగలదు.

S4S టెక్నాలజీస్ పంట నష్టాలను ఫార్మ్-గేట్ సోర్సింగ్ మరియు ప్రాసెసింగ్ ద్వారా కావలసిన ఉపయోగకర ఆహారంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది . ఈ పనిని మహిళా వ్యాపారవేత్తలు చేస్తారు.. S4S భూమిలేని మహిళలు మరియు రైతులకు శిక్షణనిస్తుంది, సాంకేతికత, ఋణ సదుపాయం, మరియు మార్కెట్ యొక్క సరైన కలయికను అందించడం ద్వారా వారిని లఘు పారిశ్రామికవేత్తలుగా మారుస్తుంది. S4S టెక్నాలజీస్ వారి స్థిరమైన సాంకేతికతతో సౌరశక్తిని సృష్టించడంద్వారా హానికరమైన ఉద్గారాలను తగ్గించడంతోపాటు ఆహార వృధా మరియు పంట అనంతర నష్టాలను తగ్గించడం ,జీవనోపాధిని మెరుగుపరచడం మరియు పారిశ్రామికవేత్తలను ద్వారా ఇప్పటికే 6 దేశాలలో 1000 మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూర్చింది.

S4S మహారాష్ట్రలోని జల్గామ జిల్లాలోని వడల-వడాలిలో 29 మంది గ్రామీణ మహిళలకు వారి ప్రధాన ఉత్పత్తి అయిన సోలార్ కండక్షన్  డ్రయర్ ను అందజేసింది. సోలార్ కండక్షన్ డ్రయర్(SCD) అనేదిసౌరశక్తితో పనిచేసే ఫుడ్ డీహైడ్రేటర్(ఆహార ఉత్పత్తులను ఎండబెట్టే పరికరం), ఇదివ్యవసాయ-ఉత్పత్తిలో తేమ శాతాన్నితగ్గిస్తుంది, ఇది వాడటం వలన ఎలాంటి రసాయనాలు మరియు సంరక్షణ కారకాలను ఉపయోగించకుండా 1 సంవత్సరం వరకు వ్యవసాయ-ఉత్పత్తులను నిలవచేసుకోవచ్చు. SCD అనేదిమొదటి సోలార్ డ్రయర్, ఇది ఉష్ణబదిలీ యొక్క అన్నిరీతులను కలిపి(వాహకత, ఉష్ణప్రసరణ మరియు రేడియేషన్) 22% ఉత్తమ సామర్ధ్యంతో ఎండబెడుతుంది.

మహిళలకు ఉల్లిపాయలు మరియు అల్లం సోలార్ డ్రయర్ సహాయంతో ఎండబెట్టడంలో భద్రత మరియు పరిశుభ్రత, సమయ నిర్వహణ, ఆహార భద్రతనిర్వహణ నియమాలు మరియు డీహైడ్రేషన్ కోసం ఇతరప్రామాణిక నిర్వహణా విధానాలపై శిక్షణ ఇచ్చారు.ఆహార నిర్జలీకరణ ప్రక్రియ గురించి అవగాహన పొందిన తర్వాత, ఈమహిళలు లఘు పారిశ్రామికవేత్తలుగా మారడానికి అపారమైన అవకాశాలుఉన్నాయని గ్రహించారు. విశ్వాసం మరియు నమ్మకం కలిగిన తరువాత మొత్తం ముప్పైమంది మహిళలు S4S లో సభ్యత్వం పొందారు .

ధూర్పద శేవరేకేసు బాక్స్1లో వివరించబడింది.

బాక్స్1: ధూర్పద శేవరే అనే ఆమె మహారాష్ట్రలోని జల్గామ జిల్లాలోని వడల-వడాలి అనే మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు, ఆమె తన చిన్నతనం నుండే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవలసి వచ్చింది.పేదరికం కారణంగా తన తల్లిదండ్రులు ఆమెను పాఠశాల విధ్య 2వ తరగతిలోనే విద్యకు డబ్బు చెల్లించలేక మాన్పించారు . అందువలన తన విధ్య 2వ తరగతిలోనే ఆగిపోయింది . ధూర్పదకు పిన్న వయసులోనే వివాహం జరిగిపోయింది మరియు  నలుగురు పిల్లలకు తల్లి అయినది, ఇద్దరు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె మరియు తన భర్త తమ పిల్లలకు మంచి భవిష్యత్ అందించడానికి పొలాల్లో కష్టపడి పనిచేశారు.వారికి మంచి సీజన్ ఉంటే (సంవత్సరంలో 4 నెలలు) వారు నెలకు కేవలం రూ .  3,000 మాత్రమే సంపాదించగలిగేవారు. వారి పిల్లలు వేగంగా పెరిగారు వారికీ వివాహలు జరిగి స్వంత కుటుంబాలను ప్రారంభించారు.నలభైఐదేళ్ల ధుర్పద శేవరే ఎల్లప్పుడూ సంతృప్తికరమైన జీవితం కోసం తహతహలాడేవారు. ధుర్పద 45 సంవత్సరాల వయసుకే 17 ఏళ్లబాలుడికి అమ్మమ్మ అయింది. ఈ పరిణామాలతో ఆమె శారీరకంగా, మానసికంగా అలసిపోయింది.ఈ పరిస్థితుల్లో స్థిరమైన జీవితం గురించి ఆమెకలలు గల్లంతవుతున్నప్పుడు, సైన్స్ ఫర్ సోసైటీ (S4S) ద్వారా ఒక చక్కని అవకాశం మరియు జీవితానికి మంచి మార్గం లభించింది . S4S ద్వారా శిక్షణ పొందుతూ క్రమక్రమంగా మెలుకువలు నేర్చుకొని ప్రతిరోజూ ఆమె 45-90 కిలోల తాజా అల్లం ముడిసరుకును ఎండబెట్టడం ప్రారంభించింది. ఈ క్రమంగా, రోజుకు 10-12 కిలోల ఎండిన, వినియోగానికి తగిన మంచి నాణ్యమైన అల్లం ఉత్పత్తిని సాధించింది. ఆమె కొత్తగా సంపాదించిన నైపుణ్యాలతో నెలకు రూ . 5,000 సంపాదించగలిగింది. అన్నింటికంటే, ఇది ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. ఈ అవకాశం తనకు పునరుత్తేజాన్ని నింపింది మరియు తన భర్తతో కలిసి స్వతంత్ర జీవితాన్ని హాయిగా గడపగలననే ఉత్సాహాన్నిపునరుద్ధరించింది.

బయోమాస్ తో సురక్షితమైన వంట

స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలు దశాబ్దాలుగా కృషిచేస్తున్నప్పటికీ, నేటికీ పరిశుభ్రమైన వంట ఇంధనాన్నిపొందేందుకు గ్రామీణ మహిళలు కష్టపడుతున్నారు. బయోమాస్ ఇంధన వనరులు దేశవ్యాప్తంగా పుష్కలంగా అందుబాటులో ఉన్నందున, DRE ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు స్వయం సమృద్ధిని తీసుకురావడానికి కొన్నిక్లీన్ టెక్ అంకుర సంస్థలు మరియు పునరుత్పాదక ఇంధన సంస్థలు  పనిచేస్తున్నాయి.

బెంగుళూరుకు చెందిన TIDE (టెక్నాలజీ ఇన్ఫర్మేటిక్స్ డిజైన్ఎండీవర్)అనే పేరుతో ఉన్న క్లీన్ టెక్ కంపెనీ ప్రధానంగా కర్నాటక, తమిళనాడు మరియు అస్సాంలలో అటవీసరిహద్దు ప్రాంతాలలో అట్టడుగున ఉన్న గిరిజన వర్గాల మధ్య విస్తృత వ్యాప్తిని కల్పించడానికి భాగస్వామి సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా బయోమాస్ ఉత్పత్తులు మరియు క్లీన్ టెక్నాలజీలకు సంబంధించిన ప్రాజెక్టులను అమలు చేస్తుంది.

తగిన క్లీన్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా  పర్యావరణాన్నిపరిరక్షించడంతో పాటు జీవనోపాధిని సృష్టించడం మరియు సామాజిక సమస్యలను పరిష్కరించవచ్చు. WWF ఇండియా (వరల్డ్ వైడ్ఫండ్), దాని పడమట కనుమలలోని నీలగిరి పీటభాగ ప్రాంతంలో TIDEతో భాగస్వామ్యం కలిగిఉంది .

TIDE చే తయారుచేయబడిన మెరుగైన వంటపొయ్యి వంటగదిని పొగ రహితంగా మార్చింది

ఈ భాగస్వామ్యం తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం టైగర్ రిజర్వ్(STR)లోని మారుమూల గ్రామాలలో మెరుగైన సరళ వంట-పొయ్యిని ప్రతి లబ్దిదారునికి సమకూర్చింది. ఈభాగస్వామ్యం అటవీ అంచులలోని గృహాల మధ్య చీకటి మరియు పొగతో కూడిన వంటశాలలోని పొయ్యినిర్మాణంలో స్థానికులకు శిక్షణ ఇవ్వడం ద్వారా శుభ్రమైన మరియు పొగ లేని వంటశాలలుగా మార్చడానికిసహాయపడింది. ఇక్కడ ప్రత్యేక అంశం ఏమిటంటే, స్థానికులు ఈ పొయ్యి నిర్మాణ ప్రక్రియకు భాగస్వాములు, పొయ్యినిర్మాణ శిక్షణద్వారా స్థానిక ఉపాధికూడా సృష్టించబడుతుంది.

మాజీ జనాభా గణన గణనకర్త ఆర్సేకర్కూడాలబ్ధిదారుల్లో ఒకరు. అతను స్కిల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ జాబ్ సంస్థ నుండి మెరుగైనకుక్-స్టవ్ ఇన్స్టాలర్ గా సర్టిఫికేట్ పొందారు మరియు నీలగిరి ప్రాంతంలో 120 కంటే ఎక్కువ పొయ్యిలను నిర్మించారు. 2019లో, సరళ మెరుగు పరిచిన పొయ్యి నిర్మాణంలో TIDE ద్వారా శిక్షణ పొందిన తర్వాత తనుఅదృష్టవశాత్తు పెద్ద మార్పును చూశారు. 36 ఏళ్ల తండ్రి ఇప్పుడు కొత్తగా సంపాదించిన నైపుణ్యం గురించి గర్వపడుతున్నాడు మరియు “నేను నా కుమార్తె ఉన్నత విద్య కోసం బంగారంలో పెట్టుబడి నెలకురూ. 2,000 నెలవారీ పొదుపు చేయగలిగాను” అనిచెప్పాడు. వ్యవసాయం-సీజన్లో సాధారణ కూలీలకు పొలాల్లో పనిదొరకని సమయంలో ఈ పొయ్యినిర్మాణ ప్రాజెక్టుల సంస్థకు ఆయన నాయకత్వం వహించారు.

ఆర్సేకర్ అనేక మందికి ఈ పొయ్యి నిర్మాణంలో శిక్షణ ఇచ్చారు, వారి ఆదాయాన్ని సమర్థవంతంగా మెరుగుపరచడంలో వారికిసహాయం చేశాడు. నేడు, ఈరోడ్జిల్లాలో 15 మంది సర్టిఫైడ్ స్టవ్-బిల్డర్లు ఉన్నారు, మెరుగైన తక్కువధర గల వంట పొయ్యి నిర్మాణంలో TIDE ద్వారా శిక్షణ పొందారు .

శిక్షణ పొందిన తరువాత, ఈ నైపుణ్యం కలిగిన స్టవ్-బిల్డర్లు తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఉన్న అనేక చిన్న కుగ్రామాలలో సరళ పొయ్యిలను నిర్మించారు. ఒక స్టవ్-బిల్డరు రోజుకు 3-5 స్టవ్ను నిర్మిస్తే, రోజుకురూ. 300-500 సంపాదించవచ్చు. ఈ మెరుగైన వంట-పొయ్యిల యొక్క తుదిలబ్ధిదారు కూడా తమ వంటశాలలు పొగ రహితంగా ఉన్నాయనిమరియు అడవిలో కట్టెల కోసం తమ సమయాన్నివెచ్చించడం లేదని సంతోషిస్తున్నారు.

WWF-India, WGNLలో పనిచేసే సీనియర్  ప్రొగ్రామ్ఆఫీసర్RJA స్టెఫాన్అజయ్మాట్లాడుతూ, “TIDE మరియు WWF-ఇండియా మధ్య ఈ నైపుణ్య శిక్షణభాగస్వామ్యం STR ప్రాంతంలో అటవీకట్టెల వినియోగాన్నిసమర్థవంతంగాతగ్గించింది. తక్కువ జనాభా ఉన్న ఈ అటవీప్రాంతంలో గత మూడుసంవత్సరాలలో 1000 కంటేఎక్కువ సరళ వంట పొయ్యిలు నిర్మించబడ్డాయి.

1,000 స్టవ్ల పైలట్ ప్రొజెక్ట్ STR అటవీ పరిధిలోని వంటశాలలలో సంవత్సరానికి 1,440 టన్నులకు పైగా అటవీ కట్టెలను వినియోగించకుండా నిరోధించింది.ఇంకా ఈకార్యక్రమాన్ని పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంది, భవిష్యత్తు ప్రణాళికలో9,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేశాము.

STR ప్రాంతంలో శెకర్ లానే మరికొంత మందిని ఎంపిక చేసి హోటళ్ల కోసం సంస్థాగత కుక్-స్టవ్ల నిర్మాణం పైశిక్షణ ఇవ్వడానికి ప్రణాలికలు సిద్దం చేశాము . ఇది వారిఆదాయాన్ని పెంచడమే కాకుండా, వికేంద్రీకృత పునరుత్పాదక శక్తి DRE సరఫరా సత్ఫలితంలో బాగంగా ఒక యూనిట్వాణిజ్య కుక్-స్టవ్ఇన్స్టాలేషన్ వలన కనీసం 2.5 మెట్రిక్టన్నుల కార్బన్డయాక్సిడు విడుదల తగ్గే అవకాశం ఉంది.

STR ప్రాంతంలోని నివాసితులు మరియు వన్యప్రాణులు రెండింటికీ క్షేమమని భవిష్యత్తు చూసిస్తుంది, ఎందుకంటేఈ నూతన వంట పొయ్యిలు అటవీ ప్రాంతాన్నిసంరక్షించగల మరియు గిరిజన తెగల జీవితాలను మెరుగు పరచగల ఒక చక్కని DRE పరిష్కారం అని TIDE సంస్థ భావిస్తుంది.

బాక్స్2:బ్రిక్వెటి తయారీప్రక్రియ

అన్నిరకాల వ్యవసాయ-వ్యర్థ పదార్థాలను మొదట చిన్న ముక్కలుగా ముక్కలు చేసి.ఈ మిశ్రమాన్నికొద్దిగా నీరు మరియు ఆవు పేడతో కలిపి చిక్కని ద్రవంలా తయారుచేయాలి. స్లర్రీసిద్ధమైన తర్వాత, అది BLP యంత్రం యొక్క స్థూపాకార కుహరంలోకి పోసి,కుదింపు ప్రక్రియను ప్రారంభించడానికి మీటను నొక్కాలి. అప్పుడు కుదించిన మడ్డిని తీసివేసి, ఎండలో ఎండబెట్టిన తరువాత అది ఇటుకలా తయారవుతుంది.

వ్యవసాయ వ్యర్థాలతో సంపదకసృష్టి

చాలా మందిభారతీయ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఉత్పత్తయ్యే వ్యర్థాలకు విలువను జోడించరు. రైతులు వరి, చెరకు మరియు గోధుమ పంట అవశేషాలను పంట తర్వాత కాల్చడానికి మొగ్గు చూపుతారు, ఎందుకంటే పంట అవశేశాలను తొలగించి మేతగా ఉపయోగించడం కోసం శ్రమవనరులు మరియు సమయం అవసరం. ఈ రకమైన దహనం విలువైన వనరును వృధా చేయడమే కాకుండా వాయు కాలుష్యానికి కూడా కారణమవుతుంది.

ఈ రకమైన పంట అవశేశాలను కాల్చడాన్ని నివారించడానికి కొన్ని వినూత్నపరిష్కారాలు ఉన్నాయి. హ్యాపీసీడర్, రోటావేటర్, పాడీస్ట్రా ఛాపర్, మాన్యువల్ బ్రిక్వెటిమెషీన్ వంటివివిధ వ్యవసాయ యంత్రాలు అభివృద్ధి చేయబడ్డాయి, తద్వారా రైతులు పంటలను మరియు పంటవ్యర్థాలను సులభంగా నిర్వహంచవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి పంట యంత్రాలపై సబ్సిడీలను అందజేస్తాయి, తద్వారా రైతులు ఈయంత్రాలను కొనుగోలు చేయవచ్చు. వ్యవసాయ వ్యర్థాలను జీవ ఇంధనాలుగా ఉపయోగించడం వలన రవాణా లేదా తయారీ రంగానికి ఉపయోగపడతాయి, తద్వారా కార్బన్ ఉద్గారాలను కూడా గణనీయంగా తగ్గించవచ్చు.

వాపి లో ఉన్న SK ఇంజనీర్స్ అనేసంస్థ 2011లో నిపుణుల బృందంచే స్థాపించబడింది, ఏదైనా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగపడేటట్లుగా మార్చగల ఒకనూతన మాన్యువల్ బ్రిక్వెటి మెషీన్ గ్రామీణ భారతదేశానికి ఒక వరం అని నిరూపించారు. NM సద్గురు ఫౌండేషన్ కంపెనీతో పనిచేస్తున్నసమయంలో, SK ఇంజనీర్సు యజమాన్యం భాగస్వామి అయిన దర్శిల్ పాంచల్,గ్రామీణ పజలతో సన్నిహితంగా కలిసి పనిచేశారు.గ్రామాల్లో వంటకు కట్టెలు తప్ప నమ్మకమైన ఇతర ఇంధన వనరు లేకపోవడాన్నిగమనించారు. ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతున్న క్రమంలో దర్శిల్ కు బొగ్గుకు బదులుగా బ్రిక్వెట్లను ఉపయోగించే బాయిలర్లు ఆలోచన తట్టింది.

వ్యవసాయ వ్యర్థాలను నుండి గ్రామీణ సంఘాల నుండి బ్రిక్వెట్లను తయారు చేసే యజమానులు సేకరించి, వారు బ్రిక్వెట్లను బాయిలర్ ప్లాంట్లకు సరఫరా చేస్తారు. ఈ గొలుసును అర్థం చేసుకున్న దర్శిల్, వ్యవసాయ వ్యర్థాలను నిర్వహంచడానికి మాన్యువల్ గా బ్రిక్వెట్లను తయారుచేసే విధానాన్నివృద్ధిచేయాలని భావించారు.

వివిధ స్వచ్ఛంద కార్యకర్తలు మరియు స్వచ్ఛంద సంస్థలతో సన్నిహితంగా పనిచేస్తూ, వివిధ రకాల వ్యర్థాలయినవ్యవసాయ వ్యర్థాలు, పశుగ్రాసం, వంటగదివ్యర్థాలు, కాగితం/ప్లాస్టిక్/కార్డ్బోర్డ్ మొదలైన వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహంచడానికి తగిన పరిష్కారాన్నికనుగొన్నాడు. సాధారణంగా, ప్లాస్టిక్ వ్యర్థాలు, బహుళ లేయర్ల ప్లాస్టిక్ పాకేజులు, కాగితపు వ్యర్ధాలు, కార్డ్బోర్డ్, వ్యవసాయ వ్యర్థాలు మొదలైన వాటికి ఎక్కువ విలువ ఉండదు, ఎందుకంటే వీటిని రవాణాచేయడం అంత సులభం కాదు.ఈ సమస్యను అర్థం చేసుకున్న దర్శిల్ ,వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహంచడానికి మరియు వాటిని వ్యవస్థీకృత మార్గంలో రవాణా చేయడానికి సహాయపడే కొత్త రకం మాన్యువల్ బ్లేడర్ యంత్రాన్నిఆవిష్కరించారు.

ఈ మాన్యువల్ బ్లేడర్ యంత్రం కదుపుటకు చెక్రాలు అమర్చడం వలన సులభంగా రవాణా చేయబడుతుంది. దీనికినిర్వహణ అవసరం లేనందున ఖర్చు తక్కువతో సులభంగా ఎక్కువ కాలం వాడవచ్చు. ఈయంత్రాలు ప్రత్యేకమైనవి ఎందుకంటే వాటికి విద్యుత్తు అవసరం లేదు మరియు ఒక మనిషి సులభంగా ఇంస్టాలేషన్  నిర్వ్వహించగలరు. ఈ పరికరంతోవ్యవసాయ వ్యర్థాలను బ్రిక్వేట్లుగా మార్చి,ఈ బ్రికెట్లను నేరుగా ఇంట్లోనే వంట కోసం ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించవచ్చు మరియు అదనపు ఆదాయాన్నిసంపాదించడానికి మార్కెట్లో కిలోకు రూ. 7-10 ధరకు విక్రయించవచ్చు.

ఇప్పటికే అనేక స్వచ్ఛంద సంస్థలు మరియు గ్రామీణాభి వృద్ధిసంస్థలు ఈ యంత్రాలను కొనుగోలుచేశాయి మరియు వ్యర్థాల నిర్వహణ మరియు ఆదాయ ఉత్పత్తికి వాటిని వినియోగిస్తున్నాయి.

లెవిన్ లారెన్స్ 
కంటెంట్ డైరెక్టర్
ఈకోయిడెజ్వెంచర్స్
#24, 1వ క్రాస్, 2వ స్టేజ్,
గాయత్రిపురం, ఉదయగిరి, మైసూరు
కర్ణాటక - 570019, భారతదేశం.
ఇమెయిల్: editor@ecoideaz.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి ౨౪ , సంచిక 4 , డిసెంబర్ ౨౦౨౨

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...

హాని-రహిత వ్యవసాయం – మహిళల నేతృత్వంలోని  వాతావరణ స్థితిస్థాపకత వ్యవసాయం (WCRF) నమూనా

హాని-రహిత వ్యవసాయం – మహిళల నేతృత్వంలోని వాతావరణ స్థితిస్థాపకత వ్యవసాయం (WCRF) నమూనా

మహిళలకు ఏమిపండించాలో, ఏ ఇన్పుట్లను ఉపయోగించాలో, ఎప్పుడు ఎక్కడ విక్రయించాలో నిర్ణయించుకునే అధికారం ఉన్నప్పుడు -...