వ్యవసాయ జీవావరణాన్నిపెంపొందించే మార్గాలు

వ్యవసాయ జీవావరణ విధానాలు ఒక్కో ప్రాంతానికీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి, ఎందుకంటే అ ఆహార అవసరాలు, జీవనోపాధులు, స్థానిక సంస్కృతి, పర్యావరణం మరియు ఆర్ధిక పరిస్థితి మధ్య లంకెలు ఏర్పరుస్తాయి. కాబట్టి వ్యవసాయ జీవావరణం గురించి చెప్పాలంటే, మొత్తం ప్రక్రియ అంతా రైతులను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని, ఈ లంకెలన్నింటినీ కలుపుతూ, ఒక సమగ్రమైన విధానాన్ని అవలంభించాలి.

స్థానిక జీవావరణ వ్యవస్థను అర్ధం చేసుకోవడం శిక్షకులకు చాలా అవసరం. పర్యావరణం మీద మరియు ప్రజలఆరోగ్యం మీద రసాయన పురుగుమందులు మరియు ఎరువుల దుష్ప్రభావాలు గుర్తించడంతో ప్రభుత్వేతర సంస్థలు (ఎన్.జి.ఓ.లు) మరియు కమ్యూనిటీ బేస్డ్ఆర్గనైజేషన్స్ (సి.బి.ఓ.లు) గతకొన్ని సంవత్సరాలుగా వ్యవసాయంలో రసాయనేతర విధానాలను ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ సుస్థిరవ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, బయోడైనమిక్వ్య వసాయం, ప్రకృతి వ్యవసాయం,  జీవావరణ విధానాలు, లోఎక్స్టర్నల్ఇన్పుట్సస్టైనబుల్అగ్రికల్చర్ (లి.ఎ.ఐ.ఎస్.ఎ.), గో ఆధారిత వ్యవసాయం వంటి పేర్లతో ప్రోత్సహించ బడుతోంది. యునైటెడ్నేషన్స్ఫ్రేంవర్క్ఆఫ్క్లైమేట్చేంజ్కన్వెన్షన్ (యు.ఎన్.ఎఫ్.సి.సి.సి.) కి భారత దేశం సమర్పించిన ద్వైవార్షిక నివేదిక ప్రకారం, గ్రీన్హౌస్గ్యాస్ విధానాలను ప్రకృతి వ్య్వసాయం పేరిట దేశవ్యాప్తంగా ప్రోత్సహిస్తోంది.

జీవావరణ విధానంతో పోలిస్తే ఆధునిక వ్యవసాయం ప్రాంతాన్ని బట్టి అంతగా మారదు. అంతేకాక, ఆధునిక వ్యవసాయ సాంకేతికత రైతులను కేవలం టెక్నాలజీ వినియోగదారులుగా తయారు చేసింది.ఈకారణంగా రైతులు నేలరకాన్ని బట్టి వారి ప్రాంతానికి అనుమైన విత్తనాన్ని ఎంపికచేసుకోవడం, వాతావరణాన్ని బేరీజు వేసుకొని పొలంపనులకు ప్రణాళిక వేసుకోవడం, పంటలలో నాణ్యమైన విత్తనాలు గల రకాలను ఎంచుకోవడం వంటి సాంప్రదాయ నైపుణ్యాన్ని పోగొట్టుకుంటున్నారు.

వ్యవసాయ జీవావరణ విధానంలో మనం వ్యవసాయం యొక్క జీవావరణాన్ని అర్ధం చేసుకోవాలి. జీవావరణం అంటే కేవలం జీవ మరియు అజీవ వాతావరణమే కాదు, ఆర్ధిక మరియు సామాజిక  రాజకీయ వాతావరణం కూడా. రైతులనీ, వ్యవసాయాన్నీ ప్రభావితం చెయ్యగల అన్ని జీవావరణ వ్యవస్థలనీ లెక్కలోకి తీసుకోవాలి. వ్యవసాయ భూమి జీవావరణంవేరు, రైతు జీవావరణం వేరు. శిక్షణ అందించే వారు ముఖ్యంగా ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలి.

వనరులను ఎంత సమర్ధవంతంగా ఉపయోగించుకుని ఆహారం ఉత్పత్తి చేస్తాము అన్నది వ్యవసాయం కాదు.ఒక రైతు తనున్న వ్యవసాయ జీవావరణ పరిస్థితిలో తనకున్న వనరులతో ఏమిచేస్తాడు అన్నదే వ్యవసాయం. స్థానిక సంస్కృతి, స్థానిక పరిస్థితులు మరియు స్థానిక వాతావరణంతో ముడిపడి ఉన్న జీవనాధారం.

కాబట్టి వ్యవసాయ  జీవావరణవిద్య కేవలం ఆహార ఉత్పత్తికి తోడ్పడే హేతుబధ్ధమైన నిర్ణయాలే కాకుండా, తోటి ప్రజల ఆరోగ్యాన్నీ మరియు పర్యావరణాన్నీ పరిరక్షించే కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా శక్తిని పెంపొందించాలి. ఆహార అవసరాలు, జీవనోపాధులు, సంస్కృతి, పర్యావరణం మరియు ఆర్ధికపరమైన విషయాలు అన్నీ ఒకదానిటో ఒకటి కలిపే విద్య ఈరోజు చాలా అవసరం.

వ్యవసాయ విద్యావిధానాలు

ఒక కొత్త టెక్నాలజీకానీ ప్రక్రియ కానీ అనుసరించాలంటే మూడు అంశాలు ముఖ్యం.

1) అవసరమైన సాధనాలు మరియు పైకి కనిపించే వనరులు

2)టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి అన్న జ్ఞానం మరియు శిక్షణ

3) అటువంటి టెక్నాలజీని అసలు ఎందుకు ఉపయోగిస్తున్నామో, అందువలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్నది తెలుసుకోవడం.

సిధ్ధాంతాలు అవే అయినప్పటికీ, వ్యవసాయ జీవావరణం లేదా భౌగోళిక ప్రాంతంలో మార్పుని బట్టి టెక్నాలజీ మారవచ్చు మరియు స్థానిక పరిస్థితులను బట్టి పధ్ధతులను కొద్దిగా మార్చవలసిన అవసరంరావచ్చు. ఉదాహరణకు, ఉన్నత విద్య కలిగినవారితో పోలిస్తే తక్కువ అక్షరాస్యత ఉన్న రైతులకు ఉపయోగించే శిక్షణా సామగ్రి మరియు పధ్ధతులు వేరుగా ఉండచ్చు.నల్ల రేగడి భూమిలో పనికి వచ్చేది ఎర్రగరప నేలల్లో పనికి రాకపోవచ్చు.కొండ ప్రాంతాలతో పోలిస్తే, మైదాన ప్రాంతంలో జీవావరణం వేరుగా ఉంటుంది. చాలా కాలంగా రైతులకు సమాచారాన్ని చేరవేసే పని వ్య్వసాయ విస్తరణ వ్యవస్థ ద్వారా ప్రభుత్వమే ఎక్కువగాచేపట్టేది. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ యంత్రాంగంలో ప్రతి ఒక్క రైతునూ చేరుకోవడంచాలా కష్టంకాబట్టి, ఎన్.జి.ఓ. లు, ప్రైవేటు కంపెనీలు, ఆర్ధిక సంస్థలు వంటి అనేక ఇతర సంస్థలు రైతులను చేరుకునేపనిలో నిమగ్నమయ్యారు.

వ్యవసాయ జీవావరణ విద్యలో ముఖ్యమైనది పొలంలో చూసినేర్చుకోవడం

ప్రభుత్వేతర సంస్థలు ఈ రంగంలో అడుగు పెట్టడంతో అనుభవ పూర్వక అభ్యాసం మీద ప్రధానంగాదృష్టిపెట్టదం జరిగింది.డిస్కవరీ లెర్నింగ్ (కని పెట్టడం ద్వారా నేర్చుకోవడం) ప్రక్రియను అనుభవ పూర్వకంగా తెలుసుకునేందుకు రైతు పాఠశాలలు( ఎఫ్.ఎస్.ఎస్. ఫార్మర్ఫీల్డ్స్కూల్) ల వంటి పధ్ధతుల ద్వారారైతులకు శిక్షణ అందుతోంది.

ఈ పధ్ధతిలో ఎంపిక చేయబడ్డ  కొంతమంది  రైతుల బృందం కొన్ని రోజుల కొకసారి సమావేశమై, ఎంపిక చేసిన ఒకపొలంలో పెరుగుతున్న పంటను ఆ సీజను మొత్తం పరిశీలించి ఆ పంటగురించి బాగా తెలుసుకుంటారు.

వాతావరణ, చీడపీడల పరస్పర ప్రభాంలోని హెచ్చు తగ్గులు, చీడపీడల జీవితచక్రం, చీడపీడల మరియు సంరక్షక జీవుల మధ్య సంబంధాలు, పురుగులు కలుగచేస్తున్న నష్టాన్ని గమనించడం, చేపట్టిన పరిష్కారాల సమర్ధత తెలుసుకోవడంలాంటి విషయాలు వీటిలో కొన్ని.

ఈ విధంగా నేర్చుకోవడం అనేది చాలా సమర్ధవంతమైనదీ, సాధికారతను చేకూర్చేదీ అయినప్పటికీ ఎక్కువ వనరులు అవసరమౌతాయి. ఈ పధ్ధతి కమ్యూనిటీ రిసోర్స్పర్సన్స్ను  తయారుచెయ్యడానికి ఉపయోగించవచ్చు.

రైతులు ఒక ప్రక్రియను, అందుకు అవసరమైన సరుకులను, అవి ఎలా ఉపయోగించాలి అన్నది తెలుసుకోవడానికి, శిక్షణా కార్యక్రమాలు మరియు ప్రదర్శనలు ఇంకొక మార్గం. చాలా సంస్థలు రైతులకు శిక్షణా కార్యక్రమాలద్వారా బోధిస్తారు.బోధనా శాస్త్రం ప్రకారం రైతులకు తెలిసిన దానితో మొదలుపెట్టి, దాని ఆధారంగా కొత్తవిషయాలు బోధిస్తూ రావాలి. రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు స్థానికభాష, వారు ఉపయోగించే మాటలు ఎంతో ముఖ్యం.సేద్యంలో వ్య్వసాయ జీవావరణ పధ్ధతులు అవలంభించాలంటె రైతులఅనుభవాలు, స్థానిక వనరులు మరియు వాటి వినియోగం మీద రైతులకున్నపరిజ్ఞానం చాలాముఖ్యమైనవి.శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు, ట్రైనర్లు స్థానిక జీవావరణాని అర్ధం చేసుకుని ఉండడం చాలా అవసరం.రోజంతా తరగతి గదిలో కూర్చుని పాఠాలు వినడం అన్నది రైతులకు అలవాటుఉండదు. కాబట్టి దృస్యస్రవణ విధానాల ద్వారా మరియు కొన్ని పనులద్వారా వారిని చురుకుగా ఉంచాలి.

సి.ఎస్.ఏ. – వ్యవసాయ జీవావరణ విద్యలో పాత్ర

సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ (సి.ఎస్.ఏ.) అన్నది సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో సమగ్రమైన ఒక స్వతంత్ర ప్రభావశీల సంస్థ.  ప్రభుత్వేతర సంస్థలు,  కమ్యూనిటీ ఆధారిత సంస్థలు మరియు రైతు సంస్థలు (ఫార్మర్ప్రొడ్యూసర్ఆర్గనైజేషన్స్, ఎఫ్.పి.ఓ.లు) వంటి సంస్థలతో కూడి శాస్త్రీయ నేపధ్యంతో, విజయవంతమైన మోడల్స్నివిస్తరిస్తూ అనేక మోడల్స్నినెలకొల్పుతూ ఉంటుంది. సి.ఎస్.ఏ. ప్రధానంగా కృషి చేసిన అంశాలు :- రసాయనేతర పధ్ధతులలో పంటల యాజమాన్యం (నాన్ పెస్టిసైడిల్ మానెజ్మెంట్ – ఎన్.పి.ఎం.) , సేంద్రీయ / ప్రకృతి వ్య్వవసాయం, ఓపెన్ సోర్స్ విత్తన వ్యవస్థలు, రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్స్ (ఎఫ్.పి.ఓ.లు) మరియు ప్రజా విధానపరమైన అంశాలు.

90 లచివ్వర్లో, 2000 సంవత్స్రం మొదట్లో రసాయనిక పురుగు మందులు ప్రధానమైన సమస్యగా ఉండేది. రైతులకు, రైతులతో పనిచేసేవారికీ ఎన్.పి.ఎం.గురించి అవగాహన కల్పిస్తూ సి.ఎస్.ఏ. సంస్థ చీడపీడల సమస్యలపై పని చేసేది.ఎన్.పి.ఎం. అంటే రసాయనిక పురుగుమందులు లేకుండా వివిధ ఆచరణ పధ్ధతులలో చీడపీడలను నియంత్రించడం.

పురుగుల జీవితచక్రం, మిత్ర మరియు శత్రు పురుగుల మధ్య తేడా మరియు పంట వ్యవస్థలలోటృఆప్క్రాప్స్ (ఎరపంటలు) బార్డర్క్రాప్స్ (అంచుపంటలు) వంటి నివారణ పధ్ధతులు, ఫిరమోన్ట్రాపుల ఏర్పాటు, మరియు స్థానికంగా అందుబాటులో ఉన్నమొక్కలు, జంతువులు వంటి వనరులతో పంటకు వేసే జీవపదార్ధాల తయారీ వంటి విషయాలలో రైతులకు అవగాహన కల్పించింది. రైతులకు ఈ పధ్ధతుల వెనుక ఉన్న సిధ్ధాంతాలు అర్ధం అయ్యాక వారువారికున్న సాంప్రదాయ పరిజ్ఞానం బట్టి వివిధరకాలఇతరమొక్కలతో ప్రయోగాలు చెయ్యడం ప్రారంభించారు. సి.ఎస్.ఏ. వాటికి ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం జోడించింది.సి.ఎస్.ఏ. తన పనిని ఎన్.పి.ఎం.తో మొదలుపెట్టినా, ఒకసమగ్రమైన అవగాహనతోనే పనిచేసింది.

అప్పుడు అవసరాన్ని బట్టి పరిష్కరించాల్సిన ఒక అంశంతో మొదలు పెట్టి క్రమంగా వ్యవసాయానికి సంబంధించిన ఇతర అంశాలనన్నింటినీ పొందికగా చేర్చుకుంటూ వెళ్ళింది. రైతులకు అవగాహన  కల్పించే క్రమంలో కమ్యూనిటీ రిసోర్స్పర్సన్స్ను విస్తరణా సిబ్బందిగా తయారు చెయ్యడం చాలా మంచి ఫలితాల నిచ్చింది.రైతు సోదరులలో వ్యవసాయ జీవావరణ పధ్ధతులు పెంపొందించడంలో ఈ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ కీలక పాత్ర వహిస్తారు.

వ్యవసాయ జీవావరణ విధానం అంటే తిరిగి పూర్తిగా పాత వ్యవసథకు వెళ్ళిపోవడం కాదు, వ్యవసాయంలో ప్రస్తుతం ఉన్నమరియు భవిష్తత్తులో రాగల సమస్యల పరిష్కారానికై ఆధునిక శాస్త్రీయ అవ్గాహనకు, సాంప్రదాయ పరిజ్ఞానాన్ని జోడించడం. ఈ ప్రక్రియలో భాగంగా, రైతులు వ్య్వసాయ వాతావరణ పధ్ధతులు చేపట్టడానికి తోడ్పడే కార్యక్రమాలను విధాన కర్తలు ప్రారంభించేలా ప్రోత్సహించడానికి వారికి సరైన ఆధారాలలో తెలియ చెప్పడం జరిగింది.

ఇంటర్నెట్యుగానికి అనుగుణంగా, సి.ఎస్.ఏ. క్షేత్రస్థాయిలో పనిచేసేసిబ్బందికి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్  మరియు విద్యావంతులైన రైతులకు ఉపయోగ పడే ఎన్నోమొబైల్ (ఆండ్రాయిడ్) యాప్లను రూపొందించింది. ఈ విధమైన యాప్లలో పెస్టోస్కోప్ఒకటి. ఇది క్షేత్రస్థాయిలో చీడపీడలను గుర్తించడానికి ఉపయోగ పడుతుంది. క్షేత్రస్థాయి సిబ్బంది, సమస్య యొక్క చిత్రాన్నితీసి, వారి ప్రశ్నను జతచేసి పంపవచ్చు. వారు పంపిన చిత్రాలు ఆటోమాటిక్ గా జిఓ టాగ్ చేయ బడతాయి .  నిపుణుల బృందం స్పందించి, సమస్యకు పరిష్కారం సూచిస్తారు. ఈ యాప్నుగూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు . అంతేకాక ఈ యాప్ ఒక వెబ్ పేజీగా కూడా అందుబాటులో ఉంది (https://pestoscope.com ). అదే విధంగా ఈ కృషి టి.వి. అన్నపేరుతో ఒకయూట్యూబ్చానల్  కూడా సి.ఎస్.ఏ. నిర్వహిస్తోంది. వివిధభాషలలో, అనేక రకాల అంశాలకు సంబంధించిన అనుభవాలు, సన్నాహాలు, ఫిల్మ్లువంటి విషయాలు వీడియోరూపంలో ఈ ఛానల్ అందిస్తుంది .

సి.ఎస్.ఏ. ప్రారంభించిన నాటినుండీ ఎన్నోఎన్.జి.ఓ.లకు, ప్రభుత్వ అధికారులకు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలకు మరియు వ్యక్తులకు వ్యవసాయ జీవావరణ విధానం గురించి శిక్షణ అందించింది. కోవిడ్ 19 సమయంలో విధించిన లాక్డౌన్పరిస్థితుల కారణంగా వర్చువల్గా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే మార్గాలను అన్వేషించింది.వర్చ్యువల్ శిక్షణా కార్యక్రమాలు అటు రైతులకూ, ఇటు సి.ఎస్.ఏ. కీ కూడా కొత్తే అయినా, సి.ఎస్.ఏ. ఈ విధానానికి తొందరగానే అలవాటుపడి, ఈ కొత్త అవసరానికి తగ్గట్టుగా వారు అందించే విషయాలకు మార్పులు, చేర్పులు చేసింది. ఇప్పుడైతే వర్చ్యువల్ శిక్షణా కార్యక్రమాలు మరియు ఆన్లైన్సంప్రదింపులు నిత్య్కృత్యంలో భాగం అయిపోయాయి.

సి.ఎస్.ఏ. ఒక గ్రామీణ అకాడమీని ప్రారంభించింది.ఈ గ్రామీణ విద్యా పోర్టల్గ్రామీణాభివృధ్ధి అంశాల మీద క్రమం తప్పకుండా కోర్సులను నిర్వహిస్తుంది. ఉద్యోగ రీత్యా కానీ, వృత్తివ్యాపారరీత్యాకానీ గ్రామీణ రంగంలో అడుగు పెట్టాలనుకునే  గ్రామీణ యువత, మహిళలు మరియు ఇతరులు వారివారి పరిజ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పెంచుకోవడం కోసం ఒక  ప్రత్యామ్నాయవిద్యావ్యవస్థ ఏర్పాటుచెయ్యాలి అన్నఉద్దేశ్యంతో గ్రామీణ అకాడమీ మొదలు పెట్టడం జరిగింది. గ్రామీణాభి వృధ్ధికి సంబంధించిన అనేక విషయాల మీద ఈ అకాడమీ, భౌతికంగా,  వర్చువల్గా మరియు రెండూ కలిపి పని చేస్తుంది. సి.ఎస్.ఏ. మాత్రమేకాక, ఇతర సంస్థలు కూడా పరస్పర చర్చలతో, వారి నైపుణ్యాన్ని కూడా కోర్సుల రూపంలో ఈ ప్లాట్ఫారం ద్వారా అందించవచ్చు.

ప్రకృతి వ్యవసాయం, ఎఫ్.పి.ఓ.లు, విధానపరమైన అంశాలు వంటి వాటి మీద అధ్యాపకులకు శిక్షణా కార్యక్రమాలను అందచేస్తుంది.

ముగింపు

వ్యవసాయ జీవావరణ విద్యలో అతి ముఖ్యమైన అంశం, స్థానిక పరిస్థితి అర్ధంచేసుకుని, ఆ  ప్రాంతంలోని రైతుల యొక్క ప్రస్తుత మరియు భావి అవసరాలను తీర్చడానికి అనువైన వ్యవసాయ జీవావరణ పధ్ధతులను సూచించడం.

లీబిగ్స్బారెల్లోని చెక్కబద్దల్లా ప్రస్తుతపు సమస్య తీరిస్తే ఇంకొక సమస్య  రైతులకు మరింత పెద్ద సమస్యగా మారవచ్చు. కాలంతో బాటు సమస్యలు కూడా మారుతూ ఉంటాయి.కాబట్టి మారుతున్న రైతు పరిస్థితుల బట్టి సంస్థలు కూడా తమ పనిని, పని తీరును మార్చుకుంటూ పరిణామం చెందుతూ ఉండాలి. నేర్చుకున్నఅనుభవాలనిబట్టి ఎప్పటికప్పుడు, మారుతున్న పరిస్థితుల కనుగుణంగా విషయాంశాన్నినవీకరించుకోవడం, బోధనా సామగ్రిని సమకూర్చు కోవడం వ్య్వసాయ జీవావరణ విద్యలో ప్రధానాంశాలు.  అంతేకాక, స్థానిక వ్యవసాయ జీవావరణానికి సరిపడిన స్థానిక పరిష్కారాలు రూపొందించడానికి బోధనా ప్రక్రియలో రైతులను సాంకేతిక, విస్తరణ మరియు సృజనాత్మక భాగస్వాములుగా చేర్చుకోవడం తప్పనిసరి.

G Chandra Sekhar, G Rajashekar and G V Ramanjaneyulu
Centre for Sustainable Agriculture
H. No. 12-13-568, Nagarjuna Nagar, Street No 14,
Lane No.10, Tarnaka, Secunderabad – 500017
E-mail: sekhar@csa-india.org

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి ౨౪, సంచిక ౨, జూన్ ౨౦౨౨

 

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...