సేంద్రీయ సేద్యం దిశగా అడుగులు

వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చోటుచోసుకుంటున్నాయి. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారకాల స్థానంలో సంప్రదాయక ప్రత్యామ్నాయాల వాడకం క్రమంగా పెరుగుతోంది. అది కూడా సరి కొత్త పద్ధతుల్లో, నవీన ఆలోచనా దృక్కోణాలతోస సరి కొత్త సవాళ్లకు దీటుగా మార్పులకు వ్యవసాయదారులు స్వాగతం పలుకుతున్నారు. సేంద్రీయ సాగు పద్ధతులే కానీ, పునరుత్పాదక వనరులే కానీ, జీరో బడ్జెట్ సేద్యమే కానీ రైతుల ఆలోచనా సరళిలో నిత్యం ఆర్థికంగా వెసులుబాటుకు, పర్యావరణ సుస్థిరతకు అత్యధిక ప్రాధాన్యం ఉంటోంది.

మహారాష్ట్ర లోని చంద్రాపూర్ జిల్లా, చీమూర్ తాలుకాలోని గొండేడా గ్రామంలో జనరస్ టెక్నాలడీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సేంద్రీయ రంగంలో విశేషమైన అనుభవం ఉంది. ఈ రకమైన సేంద్రీయ వ్యవసాయంలో ఏకంగా 11 ఏళ్ల అనుభవం, సేంద్రీయ సాగు చేపడుతున్న మధ్యతరహా వరి సాగు రైతులతో కలిసి పనిచేయడంలో 5 సంవత్సరాల అనుభవం సంపాదించిన ఈ సంస్థ గత ఖరీఫ్ పంటకాలంలో చీడపీడలతో సతమతమవుతున్న గ్రామమాలవైపు దృష్టి మళ్లించింది. భండారా జిల్లాలోని అస్గావ్ గ్రామంలో చీడ పీడల సమస్య చాలా తీవ్రస్థాయిలో పెరిగిపోయింది. ఎంతటి తీవ్ర సమస్యలు ఎదురైనా ఇప్పుడు వాడుకలో ఉన్న సేద్య విధానాలలో మార్పు తీసుకురావడం అంత తేలిక కాదు. అయితే అందుకు ముందుకు వచ్చిన ఎనిమిది మంది రైతులకు కూడా అది కష్టసాధ్యమైన పనే. ఎన్నో సార్లు చర్చలు సాగించిన తరువాత, మరెన్నో సార్లు వారి పంట పొలాలను సందర్శించిన తరువాత మాత్రమే ఆ ఎనిమిది మంది ఒక్కొక్కరు ఒక్క ఎకరా విస్తీరణంలో మాత్రమే సేంద్రీయ పద్ధతులను అనుసరించేందుకు ముందుకు వచ్చారు. వారంతా ఏకాభిప్రాయంతో శ్రీ రామ్ రకం వరి సాగుకు నిర్ణయించుకున్నారు. ఈ రకం సాగులో బియ్యం ఫైన్ రకం, మీడియం సైజులో లభిస్తుంది.

ఎకరాకు రెండు టన్నుల శుద్ధి చేసిన కంపోస్టు ఉపయోగించారు. పొలంలో పోరుకుపోయే వ్యర్థాలనుంచే అవసరమైన ఎరువులను, డీకంపోజింగ్ కల్చర్ విధానంలో తయారుచేసుకున్నారు. దానికి 8 రకాల బాక్టీరియాను, ఫంగస్ ను  జత చేశారు. విత్తన శుద్ధికి వివిధ రకాల బయో ఫెర్టిలైజర్స్ ఎంపికచేసుకున్నారు. ఇంకా, ధించా లేక బోరు గ్రీన్ మాన్యూర్ తో పాటు, చీడల నివారణకు దశపర్ణి ఆర్క్ (10 ఆకుల రసం), వేప ఆకుల రసం, అగ్ని అస్త్ర్ర (మిరప, వెల్లుల్లి, అల్లం రసాలు) ఉపయోగించారు.          పార్థియమ్ రసం, జీవామృత్, వర్మీవాష్. పంచగవ్య వంటి వాటిని వరి సేద్యంలో మొక్కల ఎదుగుదలకు పోషకాలుగా వాడారు.

చిన్న కమతాలలో కూడా రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలను విస్తృతం ఉపయోగించే అలవాటు, లేబర్ వ్యయం, పెట్టుబడి చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మొట్టమొదటి సారి, ఈ ప్రయత్నం ప్రారంభమైంది. తొలి ఫలితాలు మాకే ఆశ్చర్యం కలిగించాయి. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ, పంటలు మాత్రం ఆశావహంగా సంతృప్తికమైన స్థాయిలోనే పెరుగుతూ వచ్చాయి. పక్కనే రసాయనాలు విరివిగా ఉపయోగించిన పొలాల్లో కూడా ఈ స్థాయిలో పంట పెరగకపోవడం నిజంగా ఆశ్చర్యమే. రైతులకు మంచి ఫలితాలు లభించాయి. చీడ పీడల సమస్య బాగా తగ్గిపోయింది. పంటల రోగ నిరోధక శక్తి బాగా మెరుగయింది. చివరికి వరి దిగుబడి కూడా మెరుగ్గా లభించింది.

సేంద్రీయ విధానంలో సేద్యానికి ముందుకు వచ్చిన ఎనిమిది మంది రైతులు మొదటి సంవత్సరంలోనే  ఎకరాకు 9 నుంచి 11 క్వింటాళ్ల దిగబడిని సాధించగలిగారు. రసాయన పోషకాలతో సాగుచేసిన పొలాలతో పోలిస్టే సేంద్రీయ సేద్యం వల్ల ఎకరాకు 2 నుంచి 4 క్వింటాళ్లు ఎక్కువ  దిగుబడినే ఇచ్చింది. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే – రసాయనాలతో పండించిన పంటలపై ప్రతికూల వాతావరణం ప్రభావం చాలా అధికంగా ఉండడం. మామూలుగా అయితే ఆ ప్రాంతంలో రసాయనిక ఎరువులతో పండించిన వరి దిగుబడి ఎకరాకు 15 నుంచి 16 క్వింటాళ్ల వరకు ఉండేది. ఈ ఫలితాలు రైతులకు కూడా పూర్తిగా సంతృప్తినిచ్చాయి. అదే సమయంలో వారి దిగుబడికి మార్కెట్ లో మేలైన ధర కూడా పలకడం వారికి మరింత ఆనందం కలిగించింది. ఉత్పత్తి వ్యయం సగానికి సగం తగ్గిపోయింది. కొన్ని సందర్భాలలో ఇంకా తక్కువే ఖర్చు అయింది. గత ఏడాది కంటే చాలా ఎక్కువ మొత్తాన్నే వారు ఆదా చేసుకోగలిగారు. అధికంగా లభాలు అందుకున్నారు.

వ్యవసాయవేత్తలుగా సేంద్రీయ సేద్యం ప్రోత్సహించడంలో ఉత్తమ ఫలితాలు సాధించి పెడుతున్న మాకృషికి ఇదే నిదర్శనం.

విధానపరమైన సహకారం

జిల్లా లేదా తాలూకా స్థాయిలో వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక నిర్వహణ ఏజెన్సీ (ఆత్మా – అగ్రికల్చర్ టెక్నాలజీ మానేజిమెంట్ ఏజెన్సీ) సేంద్రీయ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ప్రధానంగా భాగస్వామ్య హామీ పద్ధతిలో సహాయం అందుతోంది. సేంద్రీయ వ్యవసాయానికి అవసరమైన అన్ని రకాలైన ఇన్ పుట్ తయారీలో రైతులకు శిక్షణ ఇస్తున్నారు.  అత్యవసరాలైన 200 లీటర్ల డ్రమ్, వర్మీకంపోస్టు తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆత్మా సబ్సిడీ ధరలకే అందిస్తోంది.  రైతు సమాఖ్యలు, మహిళా స్వయం సహాయక సంఘాలలోని వారికి కూడా ఆకులకు హానికలిగంచే HaNPV క్రిమి సంహారకాలు, టిరిచో కార్డు ప్రిపరేషన్ తయారీలో అవసరమైన శిక్షణ అందుబాటులో ఉంటున్నది.  ఈ ప్రయత్నాల కారణంగా, అనేక రైతు సమాఖ్యలు తమ పేర్లు నమోదు చేసుకుని సేంద్రీయ సేద్యాన్ని చేపట్టేందుకు ముందుకు వస్తున్నారు. నాగపూర్ జిల్లాలో స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ సహకారంతో వ్యవసాయ శాఖ కీలకమైన దిశగా, రైతులకు ఉపయోగకరమైన సరుకులను విక్రయించేందుకు ఏర్పాటు చేస్తున్నది. సాధారణంగా రైతులకు ఇలాంటి విషయాలను తెలియజేసి అందుబాటులో ఉంచేందుకు సరైన మార్గాలు ఉండవు. ఆ కారణంగా ఇలా మార్కెటింగ్ కార్యకలాపాలను కూడా చేపడుతున్నారు.

———————————————————————————————————————————————

సేంద్రీయ సేద్యం చేపట్టే రైతులకు నేను ఎప్పుడూ అందించే సూచన ఒక్కటే. మీరు అనుసరిస్తున్న సేంద్రీయ సేద్యంపై మీ పక్కనే ఉన్న రైతుకు కూడా అవగాహన కలిగించండి. మ అనుభవాలను, మీకు లభించిన ప్రయోజనాలను వారికి వివరించండి. వారు మీ మాట వింటున్నా, అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నా, మీకు కూడా పరోక్షంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మీకూ ఆనందం మిగులుతుంది. ఆయన వివలేదనుకోండి – మీరు మాత్రం ఆనందంగానే ఉండగలరు. ఎలా అంటే, ఆయన రసాయనాలను ఉపయోగిస్తున్న కారణంగా చీడ పీడల సమస్య ముందుగా ఆయనకే ఎదురవుతుంది. అంతేకానీ మీ పొలం జోలికి రాదు. – రచయిత

———————————————————————————————————————————————-

 

జాతీయ స్థాయిలో హైదరాబాద్  కు చెందిన మానేజ్ సంస్థ, మోడీపురంలోని ఐఐఎఫ్ఎస్ఆర్ సంస్థ ఈ విషయాలపై నిరంతరం అధ్యయనాలు సాగిస్తున్నాయి. వివరాలను సేకరిస్తున్నాయి. తమ విస్తరణ కార్యక్రమాల ద్వారా సేంద్రీయ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి.  ఇటీవలె కొత్తగా ప్రవేషపెట్టిన సర్టిఫైడ్ ఫార్మ్ అడ్వయిజర్ కోర్సుల రూపంలో సేంద్రీయ వ్యవసాయం విషయంలో రైతులకు తోడ్పడే నిపుణుల తయారీకి పెద్ద ఎత్తున కృషి జరుగుతోంది.  భవిష్యత్తులో వీరి ద్వారా సేంద్రీయ వ్యవసాయానికి మరింతగా ప్రోత్సాహం లభిస్తుంది.

విస్తరణ కోసం ప్రతి దశలోనూ చేపట్టే ప్రతీ ప్రోత్సాహకం కూడా రైతులకు ఉపయోగాలనే సాధించి పెడతాయి. బాధ్యతాయుత ఉత్పత్తికి తోడ్పడుతూ, రైతులకు అవసరమైన సమాచారం చేరవేయడానికి, ఇవి ఉపకరిస్తాయి. బయో ఫెర్టిలైజర్స్ వంటివి మార్కెట్ లో ఇప్పుడు సులభంగానేలభిస్తున్నాయి. కొరత ఏర్పడినా, వెంటనే పరిష్కరించడం సాధ్యమవుతుంది.

ఎదురవుతున్న సవాళ్లు

సేంద్రీయ సేద్యాన్ని ప్రణాళికా బద్దంగా సాగించే వ్యవసాయం అన్న వాస్తవాన్ని ప్రతి ఒకక్రూ గుర్తించాలి. వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవడం ఇందులోని ప్రధాన అంశం. సేంద్రీయ సేద్యం ప్రారంభించడానికి ముందుగా కావలసింది ఓపిక. సహనంతో ముందుకే అడుగులు వేస్తూ ఉండాలి. మొత్తం ప్రక్రియను అవగాహన చేసుకునేందుకు ఓపిగ్గా శ్రద్ధ చూపించాలి. ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు అనుసరించవలసిన విధానాలపై పూర్తి అవగాహన సంపాదించుకోవాలి. ఈ విషయంలో కొన్ని చోట్ల పొరపాట్లు జరిగాయి.

ప్రభుత్వపరంగా ఈ సేంద్రీయ సేద్యాన్ని అనుసరించడానికి ఎన్నో అవకాశాలున్నాయి. అయితే రైతులవైపు నుంచి చాలా నెమ్మదిగా సానుకూలత రావడానికి కొన్ని కారణాలున్నాయి. వాటిలో కొన్ని … .

– రసాయనాలతో సేద్యం విషయంలో రైతుల ఆలోచనా సరళి పూర్చిగా మార్కెట్లో లభించే రెడీమేడ్ అండ్ ఫాస్ట్ పరిష్కారాలపైనే కేంద్రీకడతమై ఉంటోంది. అందుకు విరుద్ధంగా రైతులు స్వయంగా తమకు అవసరమైన ఎరువులు, క్రిమిసంహారకాలు, చీడల నివారణ పద్ధతులను తయారు చేసుకోవడం లేదా సమకూర్చుకోవడానికి సంసిద్ధులు కావాలి. అందుకు చాలా మంది సుముఖంగా లేరు.

– సేంద్రీయ వ్యవసాయం అనేది ముందస్తు నివారణ లక్ష్యంతో సాగుతుంది. తొలి దశలో స్ప్ర్రేయింగ్ షెడ్యూల్ ను పాటించడంలో రైతు సానుకూలంగా వ్యవహరించడం అవసరం. అప్పుడే మెల్లిగా ఆ విధంగా స్ప్రే చేసే సంఖ్యను పెంచుకుంటూ ముందుకు సాగవచ్చు. చాలా సందర్భాలలో రైతులు అలా చేయడం లేదు. ఒకసారి చీడ ఏదైనా ఎక్కువగా సోకినట్లయితే ఇక సేంద్రీయ సేద్యం అనేది నామమాత్రమే అవుతుంది. ఆశించిన ఫలితాలను సాధించడం సాధ్యం కాదు.

– రసాయనిక పద్ధతిలో కంటే లేబర్ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. లేబర్ సమస్య ఉన్న ప్రాంతాలలో ఇదే పెద్ద సమస్యగా మారుతోంది. అదే విధంగా విస్తీర్ణం హెచ్చుగా ఉన్నప్పుడు కూడా సమస్యలకు కారణమవుతోంది.

– సేంద్రీయ సేద్యంలో భాగంగా పశుపోషణ కూడా చేపట్టడం ఉపయోగకరం. అలా పేరుకుపోయే వ్యర్థాలు మరో విధంగా లాభదాయకమని గుర్తించాలి. చాలా మంది రైతులు స్వయంగా పశుపోషణను చేపట్టడం లేదు. పశువుల మలమూత్రాలను ఉపయోగించి అనేక రకాలైన వ్యవసాయ ఇన్ పుట్లు సిద్ధం చేసుకోవచ్చు. ఎంతో ఖర్చు పెట్టి బయట మార్కెట్ నుంచి కొనుక్కోవలసిన బెడద తప్పుతుంది. అలా చేయకపోతే అదో అదనపు ఉత్పత్తి వ్యయంగా మారుతుంది.

మన ముందున్న మార్గం

సాగుకు పంటను ఎంపిక చేసుకునేందుకు ముందే ఉత్పత్తికి ఉన్న మార్కెట్ అవకాశాలను గురించిన ఆలోచన కచ్ఛితంగా ఉండాలి. వ్యవసాయ ఉత్పత్తుల సమాఖ్య – ఎపిఎంసి- కి విక్రయించదలిచినట్లయితే, సేంద్రీయ పద్ధతి అనుసరించడం వృధా శ్రమే అవుతుంది. అందువల్ల ముందుగా మనం ఎక్కడ ఎలా విక్రయించాలనుకుంటున్నామో, వాటి ఆనుపానులు స్పష్టంగా తెలుసుకుని ముందడుగు వేయాలి. అప్పుడే సగం ఫలితం చేతికి చిక్కినట్లు భరోసా ఉంటుంది.

సేద్యం ప్రారంభానికి ముందు రైతులు సేంద్రీయ పద్ధతుల్లో సేద్యం చేయడంలో ఉన్న శాస్త్ర్రీయతను అవగాహన చేసుకోవాలి. పొలంలోని మట్టి నాణ్యతను నిర్ధారించుకోవడం, పంట లక్షణాలను, అందుబాటులో ఉన్న వనరుల గురించి అధ్యయనం చేసి ఉండాలి. మరెవరో అనుసరించిన విధానాన్ని (ప్యాకేజీ ఆఫ్ ప్రాక్టీసు) గుడ్డిగా పాటించకూడదు. పర్యావరణ పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు అనుకూలమా కాదా అని పరిశీలించుకోవాలి. ముందుగా వాటి గురించిన అవగాహన కోసం చిన్న విస్తీర్ణంలోనే సేంద్రీయ పద్దథిని అనుసరించాలి.

మరి కొందరితో కలిసి ఒక గ్రూపుగా ఏర్పడితే ఎక్కువ ప్రయోజనకరం. ఎందుకంటే ఒకరి అనుభవాలు మరొకరికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా క్రయవిక్రయాలలో సామర్థ్యం పెరుగుతుంది.

భూసారం పెరగడం, నీటి తేమ ప్రయోజనం, ఆ ఉత్పత్తులను ఉపయోగించే వారి ఆరోగ్యంలో మెరుగుదల వంటి పరోక్ష ప్రయోజనాలను అలా ఉంచితే నిజానికి మరెన్నో ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా మార్కెట్ విలువ పెరుగుతుంది. అందువల్ల ముందుగా రైతుకు నేరుగా ఆర్థికంగా కలిగే ప్రయోజనాలు తెలుసుకుని ఉండాలి. ఆ తరువాత పరోక్షంగా లభించే ప్రయోజనాలు వారికి అదనపు బోనస్ గా భావించవచ్చు.

రెడీమేట్ అండ్ ఫాస్ట్ ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. ఆర్థికంగా లేక పర్యావరణ పరంగా స్థిరత్వం లక్ష్యంగా అడుగులు వేయాలి.

—————————————————————————————————————————————————- రోహన్ యోగేశ్ రౌత్

63, మైర్ లే అవుట్, సుదాం పురి సమీపం
సక్కరదార స్క్వేర్, నాగపూర్, 440009
E-mail: raut.rohan1@gmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి ౨౩, సంచిక ౧, మార్చి ౨౦౨౧

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...