వరద ముంపుకు గురయ్యే సమూహాలలో తిరిగి కోలుకునే శక్తిని పెంచడం

వరదముంపుకు గురై భూమిలో మట్టి పేరుకుపోతే, పంటలు పండించడం కష్టమౌతుంది.  రైతులు వాతావరణ పరిస్థితుల కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది.వారి జీవనోపాధులు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.డిజిటల్వాతావరణ సూచన్మరియు ఈ – లెర్నింగ్శిక్షణ వంటి సాంకేతిక తోడ్పాటుతో పొలాలు తిరిగి కోలుకోగలిగే శక్తిపెరిగి, నిశా వంటిరైతుల అదృష్టం మారింది.

వరదముంపుకు గురై భూమిలో మట్టి పేరుకుపోతే పంటలు పండించడం కష్టమౌతుంది. రైతులు వాతావరణ పరిస్థితుల కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. డిజిటల్వాతావరణ సూచన  మరియు ఈ – లెర్నింగ్శిక్షణవంటి సాంకేతిక తోడ్పాటు తో పొలాలు తిరిగి కోలుకోగలిగే శక్తి పెరిగి, నిశావంటి రైతుల అదృష్టం మారింది.

భారీ వర్షాలు మరియు దగ్గరలోని కొండప్రాంతం నుండి కొట్టుకుని వచ్చే నీరు ఖరీఫ్పంటనీ మరియు కూరగాయ పంటలనీ కూడా నాశనం చేస్తాయి. అంతేకాక, బాల్మీకీవైల్డ్లైఫ్ సమీపంలోనే ఉండడంతో ఈ ప్రాంతంలో ఎన్నో జంతువులు కూడా ఉన్నయి.

సుస్థిర వ్యవసాయ పధ్ధతులు పాటించడం వలన సాధ్యమైన పుచ్చాఫాందూ పంట గ్రామంలో నివసించే చాలా మందికి వ్యవసాయమే ప్రధానమైన జీవనాధారం. ఖరీఫ్సీజన్లో కేవలం 15-20 % భూమి మాత్రమే సాగులో ఉంటే రబీసీజన్లో గోధుమ, ఆవ, కందిపప్పు మరియు కూరగాయలు పండిస్తారు. దాదాపు ఆరునెలల పాటు భూమి నీటి ముంపులో ఉంటుంది కాబట్టి, వరిసాగు చెయ్యడం కష్టం.ఈప్రాంతంలో ప్రధానపంట చెరకు. రైతులు వారు పండించిన చెరకును వేరే గత్యంతరంలేక  స్థానికంగా ఉన్న రెండు చెక్కెర మిల్లులకో లేదా ఎవరైనా వ్యాపారులకో తక్కువ లాభానికే అమ్ముకోవలసిన పరిస్థితి. రైతులు వారి చెరకును ఉత్తర్ప్రదేశ్కిచెందిన కుషీ నగర్జిల్లాలోని బెల్లం తయారీదారులకు కూడా అమ్ముతారు.కానీ ఇదికూడా వారికి అంత లాభదాయకంగాలేదు.

2018 లో పస్చిమచంపరన్కి చెందిన రాజ్వాటియా గ్రామంలో గోరఖ్పుర్ఎన్విరాన్మెంటల్యాక్షన్గ్రూప్ (జి.ఇ.ఎ.జి.) అనే ప్రభ్త్వేతర సంస్థ పని చెయ్యడం ప్రారంభించింది. ఎల్.డబ్ల్యు.ఆర్.తోడ్పాటు అందించిన కాంగ్రిగేషనల్ట్రాన్స్బౌండరీఫ్లడ్రెసిలియన్స్ప్రాజక్ట్స్, గండక్రివర్బేసిన్ ” అనే కార్యక్రమం కింద ప్రజా సమూహాల యొక్క తిరిగికోలుకునే సామర్ధ్యం (రెసిలియన్స్) పెంపుకు ఎన్నో చొరవలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా విలేజ్డిసాస్టర్మానేజ్మెంట్కమిటీ, ఫార్మర్ఫీల్డ్స్కూల్ (రైతుపాఠశాలలు), సెల్ఫ్హెల్ప్గ్రూప్స్ (స్వయం సహాయక బృందాలు) వంటి గ్రామస్థాయి సంస్థలు ఏర్పాటు చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంవల్ల లబ్ధిపొందిన ఒకరైతు నిశాదేవి గురించి…

ఆదర్శ రైతు నిశాదేవి

నిశాదేవి బీహార్లోని పశ్చిమ చంపరన్జిల్లాకు చెందిన రాజ్వాటియా గ్రామానికి చెందినవారు. నిశాగారికి 1.5 ఎకరా సాగుభూమి ఉంది.కాగా అందులో 0.4 ఎకరాల భూమి గండక్ర్ర్నది చేరువలోవరద, నీటి ముంపు ప్రాంతంలో ఉంది. సంవత్సరంలో 6 నెలలపాతు పొలం నీటిలో మునిగిపోయి ఉండడంవలన కుటుంబానికి సరిపడా ఆహారంపండించే ఆశెలేదు. అందువల్ల కుటుంబ పోషణకై ఆమె భర్త సంపాదనకోసం బెంగుళూరు, ఢిల్లీ వంటి పెద్దపట్టణాలకు వలస వెడుతుంటాడు.

2020 లో, కోవిడ్ 19 పాండమిక్సమయంలో నిశాచాలాకష్టమైన పరిస్థితి ఎదుర్కోవలసివచ్చింది. జూన్మాసంలో వరదలువచ్చి తనపొలంలోని పంటనునాశనం చేశాయి.దానికి తోడు, పాండమిక్పరిస్థితుల కారణంగా ఆమె భర్త గ్రామానికి తిరిగి రావలసి వచ్చింది.ఇది వారికుటుంబాన్ని చాలా అసహాయ స్థితిలోకి నెట్టేసింది.

నిశాదేవి ఒక ఎఫ్.జి.డి. సమావేశంలో జి.ఇ.ఏ.జి. బృంద సభ్యులను కలిసి, వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలలో వ్య్వసాయానికి సాయపడే సులభమైన, కానీ స్పష్టమైన పునరుధ్హ్దరణ చేకూర్చగల ఆచరణ పధ్ధతుల గురించి తెలుసుకున్నారు. జ్యూట్బ్యాగ్ (గోనెసంచి ) వ్యవసాయం, వెదురు నిర్మాణాల వినియోగం, మెండింగ్ (మరమ్మత్తులు), రైస్డ్బెడ్ఫార్మింగ్ (ఎత్తుమడులసాగు) మరియురైసెద్నర్సరీ ( ఎత్తుమడూల్లోనారుపెంపకం)  వంటివి ఈ పధ్ధతులలో ముఖ్యమైనవి. ఆమె రైతుపాఠశాల (ఫార్మర్ఫీల్డ్స్కూల్స్) ల్లో పాల్గొని నట్కాఎరువులు మరియు పురుగు మందులయొక్క ప్రభావాన్నీ, దీర్ఘకాలికఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాలగురించి తెలుసుకున్నారు. మట్కాఎరువులు మరియు మట్కా పురుగు మందుల తయారీ విధానాన్ని కూడా ఆమె నేర్చుకున్నారు. ఎఫ్.ఎఫ్.ఎస్.కార్యక్రమాలలో తాను జి.ఎ.జి. బృంద సభ్యులనుండి నేర్చుకున్న వివిధరకాల వ్యవసాయ పధ్ధతులను ఆమె తనపొలంలో ఆచరణలో పెట్టారు.

వాట్సప్సందేశాలు, ఎస్.ఎం.ఎస్.సందేశాలు మరియు ప్రజా కేంద్రాల దగ్గర ఏర్పాటు చేసినడిస్ప్లే (ప్రదర్శన) బోర్డుల ద్వారా తెలుసుకున్న ముందస్తు వాతావరణ హెచ్చరిక మరియు వ్య్వసాయ సొచనా సమాచారాన్ని ఆమె తన పొలంలోని వ్యవసాయపనులను ఒక ప్రణాళిక ప్రకారం చెయ్యడానికి ఉపయోగించుకున్నారు.

సెప్టెంబర్  2020 లో, నిశా జి.ఇ.ఎ.జి. ప్రాజక్ట్బృందం వారినుండి పుట్టగొడుగుల పెంపకం  (మష్రూంగ్రోయింగ్) తెలుసుకుని రూ. 1250/- ఖర్చుతో 18 బ్యాగ్గులసబ్స్ట్రేట్  (పుట్టగొడుగులు మొలవడానికి ఉపయోగించే ఉపరితలం) ను తయారు చేశారు. ఒక 40 రోజుల తరువాత ఆమెరూ. 840 ఖరీదుగల 7 కిలోల పుట్టగొడుగులను ఉత్పత్తి చేశారు. క్రమంగా ప్రతిమూడు, నాలుగు రోజులకూ, డిసెంబరు నెల చివరివరకూ పుట్టగొడుగులు వస్తూ ఉండడంతో మొత్తం 45 కిలోల పుట్టగొడుగులు ఉత్పత్తి అయ్యాయి.వారి కుటుంబసభ్యులు 15 కిలోల పుట్టగొడుగులు ఆహారంగా తీసుకోగా, అది వారి కుటుంబపు పోషకాహారంగా ఉపయోగపడింది. మిగతా 30 కిలోల పుట్టగొడుగులను కిలో రూ. 150,00 చొప్పున అమ్మడం ద్వారా ఆమెకి అదనంగా రూ. 4,500 ఆదాయం కొంచొంకొంచొంగా పెరుగుతూ వచ్చింది. ఈవిధంగా  3 నెలల సమయంలో, నిశాకి కొంత ఆదాయం లభించింది.

ఎప్.ఎప్.ఎస్.సెషన్స్ (తరగతులు) లో నేర్చుకున్నవ్య్వవసాయ సలహామరియుకొత్తవ్యవసాయ విధానాలనుఉపయోగించి నిశా కూరగాయల సాగును కూడా మొదలుపెట్టారు. ఆమె తన 0.30 ఎకరాల భూమిలో, రబీసీజన్లో, రెండువరుసల వెల్లుల్లి పంట మధ్యన మెంతులు విత్తారు, మరియు పొలంగట్ల మీద ముల్లంగి పెంచారు. ఆమెకు  7.5 క్వింటాళ్ళ వెలుల్లి, 3.8 క్వింటాళ్ళమెంతులు మరియు 60 కిలోల ముల్లంగివచ్చాయి. ఫలితంగా ఈ మూడు పంటల మీద పదివేల రూపాయల కన్నా ఎక్కువ ఆదాయం పొందారు.ఆమె మట్కాఎరువులు, పురుగుమందులు ఉపయోగించడంవలన పెట్టుబడి ఖర్చు కూడా తక్కువే, రూ 1,980 మాత్రమే.

నిశా అంతర పంటల ద్వారా కూడా అదనపు ఆదాయాన్నిసమకూర్చుకున్నారు.ఆమె వెల్లుల్లి పంటలోబెండ, నేతిబీర మరియు మొక్కజొన్న పంటలను అంతర పంటలుగా వేశారు.ఇందువలన ఆమెకురూ.12,600 ఎక్కువ ఆదాయం వచ్చింది.అటుపైన ఆమెకు 11 క్వింటాళ్ళనేతిబీర, 1.5 క్వింటాఖ్ఖబెండ పంట చేతికొచ్చి, ఆ పంట మార్కెట్లో అమ్మడం ద్వారా రూ.7,800 లు వచ్చాయి. “ఇది చూసి నా భరత నాకు పొలం పనులలో తోడ్పడడం మొదలుపెట్టారు. అందువలన డిసెంబరులో మట్టిపేరుకు పోయిన మా 1 ఎకరా భూమిలో కూడా వ్యవసాయం మొదలుపెట్టడానికి ప్రోత్సాహం లభించింది. భూమిసారాని తిరిగి తేవడానికి మేము అనేక విధమైన వ్యవసాయపనులు అనుసరించాము.వీటిలో ముఖ్యమైనవి సొంతంగా కంపోస్టు తయారు చేసుకోవడం, లైన్సోయింగ్ (వరుసలలో విత్తడం), స్థానికంగా దొరికే మొక్కల ఆకులతో భూమిలోని తేమను పట్టిఉంచడం”, అంటారు నిశా.

నిశా 12 అంగుళాల వ్యాసంతో ఒక అంగుళంలోతుతో ఒక గుంటతవ్వి, అందులో ఇంట్లో తయారుచేసిన కంపోస్టువేసారు. తరువాత పుచ్చపంటలో నేతిబీర మరియు సొరకాయ అంతరపంటగా వేశారు.లైన్సోయింగ్ (పొలంలో ఒక పక్క 2 మీటర్ల ఎడం వదలడంవలన ఇలా అంతరపంటలు వెయ్యడం సాధ్యపడింది. భూమిలోని  తేమనుపట్టి ఉంచడానికి ఆమె పుచ్చతీగ కొమ్మలుకత్తిరించి 1/2 అంగుళం మందాన, పొలం అంతాపరిచారు. ఇందువలన నీటిపారుదల ఖర్చుతగ్గింది. పొలంలో ఇలామల్చ్ (ఆచ్చాదన) ఏర్పడడం వలన కలుపుమొక్కలు పెరగలేదు. ఈ విధంగా ఆమెకు కలుపుతియ్యడానికి అయ్యే కూలీఖర్చు కూడా ఆదాఅయ్యింది. ఈపధ్ధతిలో పంటనేలకి తగలకుండా పెరగడంవలన పంటకుళ్ళుతెగులు సోకే అవకాశం కూడా తగ్గుతుంది.

వాతావరణ సంబంధిత సమాచారాన్నిఉపయోగించు కోవడం వలన ఆమె నీటిపారుదలకు అయ్యే ఖర్చును, వర్షం వలన కలిగే నష్టాన్నీ తగ్గించు కున్నారు.ఫలితంగా లాక్డౌన్సమయంలో ఆమె, మట్తి పేరుకు పోయిన తమ భూమిలో పండించిన పుచ్చకాయలు, సొరకాయలు మరియు నేతి బీరకాయలు అమ్మిరూ. 28,500.00 సంపాదించుకున్నారు. అంతరపంటలు వెయ్యడం ద్వారా నిసాదేవి అదనపు ఆదాయాన్నిపొందారు

ఈ రోజు నిశాదేవి రాజ్వాటియా గ్రామంలో ఒక మాస్టర్ట్రైనర్ (ప్రధానశిక్షకురాలు) అయ్యారు. సులభంగా చేపట్టగలిగిన పుట్టగొడుగుల పెంపకం ఆమెకి ఎంతగానో నచ్చి, ఒక ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా పుట్టగొడుగుల పెంపకాన్నిఆమె సంతోషంగా, సగర్వంగా ప్రోత్సహిస్తున్నారు.  పుట్టగొడుగుల పెంపకంతో రైతుల సామాజిక, ఆర్ధికస్థితి గతులు మెరుగు పరచగల అవకాశం ఎంతోఉంది.గ్రామీణ ప్ర్రాంతాలలోనిఅక్షరాస్యుల మరియు నిరక్షరాస్యుల నిరుద్యోగ సమస్యను కూడా తీర్చగలదు.”మహిళలకు ఇది నిజంగా ఒక వరం.ఇది మహిళలకు ఎంతో అనువైన వృత్తి. ఎందుకంటే మహిళలు వారి ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూనే, వారి తీరిక సమయాన్ని ఈపనికి వినియోగించుకోవచ్చు”, అని నిశా అంటారు.

సీజను బట్టివేసే పంటలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రణాళిక వేసుకోవడంలో ఆమెకు ముందస్తు వాతావరణ సూచనా సమాచారం మరియు వ్య్వసాయ సలహాసేవలు ఎంతో సహాయపడ్డాయి. పురుధ్ధరణ ఆచరణ పధ్ధతులు అనుసరిస్తూ, డిజిటల్టెక్నాలజీ మరియు సహజవనరులను ఉపయోగించుకుంటూ, నిశాదేవి మట్టిమేటలు పడినవారి భూమిని సాగుచేసి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు.

అర్చన శ్రీవస్తవ
ప్రాజక్ట్కోఆర్డినేటర్
e-mail: archanasri844@gmail.com

బిజాయ్ ప్రకాష్
ఎన్విరాన్మెంటల్ ప్లానర్
E-mail: bijay.plan@gmail.com

గోరఖ్పూర్ ఎన్విరాన్మెంటల్ ఆక్షన్ గ్రూప్
224, పూర్థిల్పూర్, M G కాలేజీ రోడ్
గోరఖ్పూర్ – 273 001, ఉత్తర్ ప్రదేశ్
www.geagindia.org

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి ౨౪ , సంచిక 3 , సెప్టెంబర్ ౨౦౨౨

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...