పొలంలోపాఠశాల, ఆశలఅల్లిక

పర్యావరణహితంగా ఆహారాన్ని పండించడంలో తమకుగల పరిజ్ఞానాన్ని, అనుభవాన్నీ పంచుకోవడంద్వారా సమాజానికి తిరిగి ఇస్తున్నారు. ఈ విధంగా జ్ఞానం సాంప్రదాయకంగా తరం నుండి తరానికి ఇలాగే అందించబడేది. అయితే ఈకాలపు రైతులు మరొక అడుగు ముందుకువేసి ఆధునిక సాంకేతికతనుమరియు సామాజిక మాధ్యమాలను జోడించి, వ్య్వసాయం అంటే ఆసక్తి ఉన్నఎంతోమందిని చేరుకుని, వారికి ఎన్నోవిషయాలను తెలియచేస్తున్నారు. అటువంటివారిలో ఒకరు, విన్నూత్నపధ్ధతుల్లో వ్య్వసాయాన్ని బోధించే గురువు శ్రీఆయ్యుబ్.

వ్యవసాయంలో మెలకువలు నేర్చుకోవడానికి పొలానికివచ్చిన విద్యార్ధులు ఈనాటి వాతావరణ మార్పునేపధ్యంలో మరియు ఆహారభద్రత దృష్ట్యా,  వ్య్వసాయరంగంలోని వివిధ అంశాలను నిర్వహించడానికి ఒకసమగ్ర ఆలోచనా విధానం అవసరం. సాంప్రదాయ బోధనా వ్యవస్థలలో అగ్రోఎకాలజీ (వ్య్వసాయజీవావరణం) కి సంబంధించిన వ్యావహారిక పరిగ్ఞానం వివరించడం అంతగా వీలుపడదు.కొన్ని ప్రైవేటు పాఠశాలలు, భావితరానికి వ్య్వసాయంతో పరిచయం ఏర్పరిచేందుకు వారి పాఠ్యాంశాలలో పౌష్టికతోటలు (న్యూట్రిషన్గార్డేన్స్ ), రైతు పాఠశాలలు వంటి విషయాలను చేర్చడంవంటి ప్రయోజనకరమైన ప్రయత్నాలు చేపట్టినప్పటికీ, ఇటువంటి భావాలు మన విద్యావ్యవస్థలోచేర్చడంవిషయంలో, ఈరోజుకీ మనం చాలా వెనకబడే వున్నాము.

కొంత మంది ప్రకృతి వ్య్వసాయ ప్రేమికులు క్షేత్రస్థాయిలో వారి అనుభవాల ఆధారంగా, ప్రజలను చైతన్యపరిచే బాధ్యతను తీసుకున్నారు.అటువంటి ఒక రైతు, కేరళలో నిమనంత్త్వాడీ, వెయనాడ్కు చెందిన స్రీ ఆయ్యుబ్త్ట్టోళి. ఆయన తన అనుభవాలను తోటివారితో పంచుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి కనబరిచేవారు, శ్రీఆయ్యుబ్తనపొలంలోనే, వ్యవసాయాన్ని లాభదాయకంగా ఎలాచెయ్యాలి, సేంద్రీయ వ్య్వసాయం, వివిధ వ్య్వసాయ పధ్ధతులు మరియు అనేక ఇతర అంశాల మీద రైతులకు, విద్యార్ధులకు, మహిళలకు, బయటివారికి శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.

ఆయ్యుబ్మొదతి నుండీ రైతు కారు. ఆర్ధికశాస్త్రం చదువుకుని బెంగుళూరులో ఒక ప్రైవేటు కంపెనీలో పని చేసేవారు. 2004 లో, వయసు మీరుతున్న తండ్రి అనారోగ్యకారణంగా,  ఆయన మంచిజీతం ఉన్న తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సొంత ఊరికి తిరిగివచ్చి వ్యవసాయం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు.

వ్యవసాయానికి కొత్తకావడం వలన మొదట్లోఆయ్యుబ్చాలా కష్టపడ్డారు. మొదట్లో ఆయన అరటి మరియు వివిధరకాల కూరగాయలు పెంచారు. తరువాత, రోజువారీ లేదా నెలవారీ ఆదాయాన్ని స్థిరంగా సమకూర్చి పెట్టే తక్కువ కాలవ్య్వధి పంటలకుమళ్ళారు. బొప్పాయి వంటికొన్ని పంటలను వేసినప్పుడు, పంటంతా ఒక్కసారి వచ్చేలా కాకుండా, సంవత్సరం పొడవునా పళ్ళువచ్చేలా పంటవేసేసమయాన్ని మార్చారు. అయితే మార్కెటింగ్పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన రసాయనాలు లేకుండామంచి నాణ్యమైన కూరలు పండించినపటికీ, అవి సూపర్మార్కెట్లో లభించే కూరగాయలలాగా ఆకర్షణీయంగా లేకపోవడంతో, వాటికి మంచిధర రాలేదు.ఈ సమస్యలను అధిగమించడానికి ఆయన తన ఉత్పత్తిని తనపొలం వద్దే అమ్మడం మొదలు పెట్టారు. నేరుగాపంటఅమ్మడంవలనఆయనకు అమ్మకాలు బాగాపెరిగాయి. ముక్యంగా పర్యాటకులనుండి.  ఆయనకు స్థానిక మీడియా కూడా తోడ్పడింది.నేర్చుక్నేఆసక్తి కలిగి ఉండడం వలనా మరియు ఆయన ప్రయత్నాల్వలనా కాలక్రమేణా శ్రీఆయ్యుబ్తన వ్య్వవసాయాన్ని లాభసాటిగా చేసుకోగలిగారు.

ఆశల నిలయం, ఆ తరగతి గది

అనేక సంవత్సరాలపాటు, నిరంతరం నేర్చుకుంటూ కృషి చేసిన ఆయ్యుబ్ఇ ప్పుడు సగర్వంగా చెప్తారు, తన వ్యవసాయ ప్రయత్నం విజయవంతమైంది అని .మనం మనస్వంత అనుభవాల నుండీ మరియు ఇతరులు పంచిన జ్ఞానము, తెలివితేటల నుండీ నేర్చుకోగలమని ఆయన గట్టిగా నమ్ముతారు.ఆయన కూడా తన ప్రయాణాన్నిఅనుభవజ్ఞులైన రైతులనుండి, పుస్తకాలు, వ్యాసాలు చదివి, వర్క్షాపిలలో  పాల్గొని మరియు ఇంటర్నెట్నుండీ  నేర్చుకోవడంతోనే మొదలుపెట్టారు.

దాదాపు 7  సంవత్సరాలముందు, వయ్నాడ్లో ని ఎం.ఎస్.ఎస్.ఆర్.ఎఫ్.కమ్యూనిటీ అగ్రోబయోడైవర్సిటీ  కేంద్రంలో ట్రైనింగ్కోఆర్డినేతర్గాపని చేస్తున్న శ్రీరామకృష్ణగారు, ఆయ్యుబ్బోధ్జనా  కార్యక్రమాలు మొదలు పెట్టేలాప్రోత్సహించారు. ఎంతోమందిదగ్గర, ఎన్నో ప్రచురణల ద్వారా జ్ఞానాన్ని సంపాదించినతను, తాను సంపాదించిన తను, తాను సంపాదించినజ్ఞ్ఞానాన్ని, అనుభవాన్నికూడా ఇతరులకు పంచవలసిన నైతిక బాధ్యత తనకుందని ఆయ్యుబ్అనుకున్నారు. ఎం.ఎస్.ఎస్.ఆర్.ఎఫ్. వారి తోడ్పాటుతోనూ మరియు తన కుటుంబం యొక్క సహకారంతోనూ రైతులు, పదవీ విరమణచేసిన ఉద్యోగులు, మహిళలు మరియు విద్యార్ధులకు శిక్షణా తరగతులు మొదలుపెట్టారు.ఒకసారి బోధనా కార్యక్రమాలు మొదలు పెట్టాక, తన దగ్గరకివచ్చేవారి నుండి  తాను కూడా ఎంతో నేర్చుకోవడం జరుగుతోందనీ, ఒకరినుండి మరొకరు నేర్చుకోవడం ఎంతో ముఖ్యమనీ ఆయన తెలుసుకున్నారు.

బోధన సాగించిన కొన్ని సంవత్సరాల కాలంలో తన దగ్గర నేర్చుకోవడానికి వచ్చేవారి నుండి తానుఎన్నోవిషయాలు తెలుసుకున్నాననీ, జ్ఞానం ఇచ్చిపుచ్చుకోవడం రెండువైపులా ఉండాలనీ కూడా ఆయనఅంటారు. గత ఒక్కసంవత్సరంలోనే, కోవిడ్నిబంధనలు పాటిస్తూ, ఆయన 1000 మందికి పైగా తరగతులు నిర్వహించారు.ఆయుబ్బ్ఎ న్నో విషయాల మీద క్లాసులు చెబుతారు, ముఖ్యంగా సేంద్రీయ నిర్వహణాపధ్ధతులు, వాతావరణ అనుకూల పధ్ధతులు, వియత్నాం పధ్ధతిలో మిరియాలసాగు, పశుపోషణ మరియు చేపల పెంపకం, బొప్పాయి సాగు, జీవామృతం వంటి జీవనఎరువుల ఉత్పత్తి, భూమి యాజమాన్యం, ఫిష్అ మైనో వంటివి. ఆయన ప్రధానంగా సుస్థిరతచే కూర్చే అంశాలమీద దృష్టిపెడతారు. కాబట్టి మొత్తం జీవావరణ వ్య్వస్థని గమనించవలసి ఉంటుంది. క్షేత్రస్థాయి అనుభవాలగురించి లోతైన అవగాహనను నేర్చుకునే వారికి సమర్ధవంతంగా అందించడం వలన వీరి శిక్షణా సదస్సులలో సిధ్ధాంతాలు మరియు ఆచరణ సరైన పాళ్ళలో కలిసిఉంటాయి.

బాక్స్ 1: శ్రీ ఆయ్యుబ్గారు పంచినకొన్నిటెక్నాలజీలు

వియత్నాం పధ్ధతి మిరియపు సాగులో,  మిరియపు తీగలు ఒక చెట్టుమీదకాక కాంక్రీట్స్తంభంవంటి ఒక నిర్జీవ స్టాండ్పైకి ఎగబాకుతాయి.ఈ పధ్ధతిలో మొక్కలను చిక్కగా దగ్గర దగ్గరగా నాటుతారు, తద్వారా పోషకాలు సమర్ధవంతంగా ఉపయోగించుకో బడతాయి.అయితే, ఈ పధ్ధతి చల్లటివాతావరణం కలిగిన ప్రదేశాలలో మాత్రమే అనువుగాఉంటుంది, ఎందుకంటే వేడి అధికంగా ఉన్న ప్రాంతాలలోకాంక్రీటు దిమ్మవేడెక్కి మొక్కకు హాని కలుగుతుంది.

బొప్పాయిసాగు

మార్కెట్స్థిరంగాలేని కారణంగా, ఆయ్యుబ్గారికి బొప్పాయిసాగులో మొదట్లో నష్టాలే వచ్చాయి. కానీ మొక్కలు నాటే సమయాలను మార్చడంద్వారా మరియు బొప్పాయి స్రవించే స్రవించే పెపైణ్అనేపాల వంటి పదార్ధాన్ని తియ్యడం ద్వారా మంచి లాభాలను ఆర్జించడం మొదలుపెట్టారు తోటిరైతులు కూడా లాభపడాలన్న ఉద్దేస్యంతో ఆయనతన అనుభవాన్నిఅందరికీ పంచుతున్నారు

ఆర్ధిక  శాస్త్రం చదివి వుండి, క్షేత్రస్థాయి పరిజ్ఞానంకలిగి ఉండడం వలన ఆయ్యుబ్గారి దగ్గరనేర్చుకోవడానికి వచ్చినవారికి సమర్ధవంతమైన, మిశ్రమమైన జ్ఞానం లభిస్తుంది.

విన్నూత్నమైన పధ్ధతులు పాటిస్తూ, ఆయ్యుబ్గారు, రైతులు తమ పొలాల్లోపంటల వైవిధ్యం తప్పనిసరిగా ఉండేలా, వివిధ రకాల కూరగాయలు, పండ్లు, స్థానికంగా ఉండేచెట్లు మరియు పశువులు కలగలిపిన సుస్థిరమైన పంటవైవిధ్యం ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించారు. ఆయన పొలంలోనే ఎన్నో దేశీయజాతుల ఆవులు, కోళ్ళు, చేపలు మరియు పండ్లరకాలు (మామిడి, జామ, అరటి, బొప్పాయి, డ్రాగన్ఫ్రూట్, అవకాడో, మాంగోస్టీన్, దానిమ్మవంటివి), కూరగాయలు, కాఫీ, పోక, కొబ్బరి, మితియాలు, దాల్చినచెక్క, వెదురు, మునగ, వేప మరియు స్థానిక జాతిచెట్లు ఉన్నాయి.

ఆయ్యుబ్గారిలో మంచి స్ఫూర్తి దాయకమైన విషయం ఏమిటంటే, ఆయన తను నేర్పించే అంశాలలో లాభాలను గడించడాన్నీ మరియు సుస్థిర వ్యవసాయ పధ్ధతులను ఎంతోచక్కగా కలిపి చెబుతారు.బోధనా తరగతులు పొలంలోనే జరపాలి, అని పట్టుబడతారు, ఎందుకంటే వ్యవసాయం చేయాలి అనుకునే వారు మొత్తం వ్యవసాయ జీవావరణ వ్య్వస్థను, పంటలు, నేల, సూక్ష్మజీవులు, పురుగులతో పాటుగా అర్ధం చేసుకోవాలనీ మరియు సమతుల్య తను కాపాడడంలో అవి పోషించవలసిన  పాత్రను అర్థం చేసుకోవాలనీ గట్టిగా నమ్ముతారు. “నేను ఈ భూమిని మా పూర్వీకుల నుండి స్వచ్చమైన రీతిలో అందుకున్నాను. నేను కూడా నా తరువాతి వారికి అదే విధంగా అందించాలి” అని ఆయన అంటారు.

క్లాసుల రూపంలోనే కాకుండా, అనేక మంది ఆయన పొలాన్ని సందర్షించడం ద్వారా కూడా ఎంతో నేర్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరం, వ్యవవసాయ విద్యాలయం విద్యార్ధులు మరియు విదేశీయులు ఆయన పొలాన్ని సందర్శించి వారిలోవారు ఆ జ్ఞానాన్ని పంచుకుంటారు.

వ్యవసాయ శాఖ మరియు ఇతర ప్రభుత్వశాఖల అధికారులు మరియు ప్రభ్త్వేతర సంస్థలు కూడా ఆయ్యుబ్గారి పొలానికి క్షేత్ర సందర్శనలు ఏర్పాటు చేశారు.

ఆయ్యుబ్గారు సామాజిక మాధ్యమాలలో కూడా చాలా చురుకుగా ఉంటారు. ఇతర రైతులు అడిగే ప్రశ్నలకు, సమాధానాలు చెబుతారు మరియు పంటనిర్వహణ, మార్కెటింగ్వంటి విషయాల మీద ఆయనకున్న అనుభవాన్ని, సంబంధిత సమాచారాన్నీ ఎప్పటికప్పుడు ఫేస్బుక్మరియు వాట్సప్ద్వారా పంచుకుంతూ ఉంటారు. కేవలం ఫేస్బుక్ద్వారానే ఆయన దేశవ్యాప్తంగా 10,000 మంది రైతులను చేరుకుంటున్నారు.

బోధనా వ్యాసంగం శ్రీఅయ్యుబ్గారికి ఎంతో సంతృప్తినిచ్చింది. ఆయనరిసార్తులు, తోటలు మరియు ఎస్టేట్యాజ్మానులకు సంప్రదింపు సేవను కూడా అందిస్తారు. ఎంతోమంది ఆయనను ప్రసంగాలకు ఆహ్వానిస్తూఉంటారు.ఆయన వ్య్వసాయంలో చేసిన కృషికి ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల నుండి ఎంతో గౌరవాన్నీ, ఎన్నో ప్రశంసలను అందుకున్నారు.

భవితపై ఆశ

రాబోయే సంవత్సరాలలో, సామాజిక మాధ్యమాలని, స్థానిక నెట్వర్క్లను ఉపయోగించుకుని మంచి మార్కెటింగ్నెట్వర్క్అ భివృధ్దిచెయ్యాలి అన్నది శ్రీఆయ్యుబ్గారి సంకల్పం.ఇంకొక ప్రణాళిక ఏమిటంటే సాధారణ ప్రజానీకం సేంద్రీయ వ్యవసాయం చేసేలా సులభతరం చెయ్యడం, అంటే సేంద్రీయంగా వ్య్వసాయం చెయ్యాలి అనుకునేవారికోసం ఒకచిన్నప్లాటులో పొలం నిర్వహించి పెట్టడం. ఈ ప్రణాళిక ఇప్పుడు అమలు పరిచే మార్గంలో ఉంది. ఇప్పటికే చాలామంది తమ ఆసక్తిని తెలియచేశారు.

Archana Bhatt, Vipindas and Divya P R
MSSRF-Community Agrobiodiversity Centre
Puthoorvayal, Kalpetta, Wayanad
Kerala – 673577
E-mail: archanabhatt1991@gmail.com

 

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి 24, సంచిక 2, జూన్ ౨౦౨౨

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...