చెట్లను పెంపకం వల్ల జీవనోపాధులకు ఊతం – పర్యావరణ భద్రం

గ్రో-ట్రీస్.కామ్ అనేది ఒక సామాజిక బాధ్యతతో ఏర్పడిన వెబ్ సైట్. వ్యక్తులకు, పెద్ద పెద్ద కంపెనీలకు తక్కువ ఖర్చుతో చెట్ల పెంపకం విషయంలో సేవలు అందిస్తోంది. ఇది వెబ్ ఆధారిత సేవలందిస్తున్నప్పటికీ, సంస్థాపరంగా వ్యక్తులు తమ తమ శక్తికి తగినట్లుగా పర్యావరణ రక్షణకు తోడ్పడేందుకు సహకరిస్తోంది.

మన దేశంలోని గ్రామ ప్రాంతాల ప్రజలు ఎలాంటి అవకాశాలు అందుబాటులో లేక అన్ని విధాలుగా వెనుకబడిపోయి పేదరికంలో మగ్గిపోతున్నారు. మనుగడకు అవసరమైన కనీస సదుపాయాలు కూడా వారికి అందడం లేదు. ఇక రోజువారీ జీవితం గడపడం అనేది నిత్య పోరాటమే. శుద్ధమైన తాగు నీరు కానీ, కడుపు నిండా ఆహారం కానీ, రోజుకింత అని చేతికి అందే ఆదాయం కానీ అంతంత మాత్రమే. చాలా మంది నివసిస్తున్న ప్రాంతాలలో భూసారం చాలా తక్కువ. ఉపాధి అవకాశాలు దాదాపు సున్నా. నీటి వనరులు పూర్తిగా కలుషితమైనవే.

సామాజికంగా, ఆర్థికంగా ఇలా వెనుకబడిపోయిన గ్రామీణ సామాజిక వర్గాల జీవన పరిస్థితులను సరిదిద్దేందుకు ఏర్పడిన సామాజిక బాధ్యత కల సంస్థే ఈ గ్రో-ట్రీస్.కామ్ సంస్థ. ఈ ఆశయాలను సాధించేందుకు ఈ సంస్థ 2010 నుంచి దేశవ్యాప్తంగా చెట్లను నాటే కార్యక్రమాలకు ప్రోత్సాహాలు ఇస్తోంది. ఆ రకంగా పల్లెవాసుల జీవనప్రమాణాలను మెరుగుపరచేందుకు కృషిచేస్తోంది.

బాక్సు 1: శ్రీమతి దేవి విజయగాథ

గ్రో-ట్రీ.కామ్ ప్రాజెక్టు వల్ల ఉత్తమ ఫలితాలు సాధించిన ఒక మహిళ గాథ ఇది. విల్లుపురం గ్రామానికి చెందిన గిరిజన మహిళ 35 ఏండ్ల శ్రీమతి దేవి ముగ్గురు కుమారుల తల్లి. నలుగురి పోషణ బాఱం ఆమెదే. గతంలో రోజు కూలీగా రోజుకు 13 గంటల పాటు కష్టపడితే కానీ డొక్క నిండేది కాదు. కుటుంబం కోసం కానీ, పిల్లల ఆరోగ్యం గురించి కానీ, వారి మంచిచెడులు లేదా విద్యాబుద్ధుల గురించి కానీ ఆలోచించే అవకాశం కూడా ఆమెకు ఉండేది కాదు.ఈ సంస్థ చేపట్టిన ప్లాంటేషన్ ప్రాజెక్టు కింద నిర్వహిస్తున్న నర్సరీలో సాధారణ కూలీగా చేరిన తరువాత ఆమె జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒక సంస్థ నిర్వహణలో పనిచేయడం ఆమెకు చాలా ప్రయోజనాలు ఇచ్చింది. ఇప్పుడు ఆమె పిల్లల విద్య, ఆరోగ్యం, మంచి చెడుల గురించి పూర్తి శ్రద్ధ చూపించగలుగుతున్నారు.  ఇరుగు పొరుగూ ఆమెను ఆదర్శంగా తీసుకుని తమ జీవితాలను మెరుగుపరచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

 గడచిన పది సంవత్సరాల కాలంలో సంస్థ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్నాటక, రాజస్తాన్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, చత్తీస్ గఢ్, తమిళనాడు, సిక్కిం, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పుదుచ్చేరి, పంజాబ్ రాష్ట్రాల్లో సంస్థ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇటీవల కాలంలో కీన్యాలోని చేరంగని హిల్స్ ప్రాంతంలో చేపట్టిన అడవుల పెంపకం ప్రాజెక్టును విశ్వవ్యాప్తంగా తీసుకువెడుతున్నారు.

పనితీరు

ప్రాజెక్టు కో ఆర్డినేటర్ల సాయంతో గ్రో ట్రీస్ ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. ఇందులో చెట్లు నాటడంలో భాగస్వాములుగా కొందరు వ్యవహరిస్తారు వారికి పర్యావరణ పరిశోధక శాస్త్రవేత్తలు సహకరిస్తారు. సాధారణంగా ఉమ్మడి సామాజిక భుములను ఇందుకు ఎంపిక చేస్తారు. అడవుల పెంపకం లేదా తిరిగి అటవీ ప్రాంతాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వారి కృషి సాగుతుంది. సాధ్యమైనంత వరకు అందరికీ లబ్ధి చేకూరాలనే ఆలోచనతో ఉమ్మడి భూముల్లోనే చెట్లను నాటే ప్రాజెక్టుకు చేపడతారు.

చెట్లను నాటే విషయంలో పల్లెవాసులకు అవగాహన కల్పించేందుకు ఆయా ప్రాంతాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశారు. పంచాయతీ సభ్యలు, ఆయా సామాజిక వర్గాల పెద్దలకు ప్రత్యేకంగా చెట్ల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పారు. నాటిన చెట్లను కాపాడే విషయంలోనూ, నాటే సందర్భంలోనూ తీసుకోవాలసిన జాగ్రత్తలు గురించి వారికి ముందుగానే తగిన అవగాహన కల్పించారు. అన్నిటికన్నా ముఖ్యంగా చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. చెట్ల పెంపకం ద్వారా భూ వనరును పరిమితికి మించి ఉపయోగించవలసిన అవసరం రాకూడందని, కేవలం పశువుల మేతకు మాత్రమే అనుకోరాదని వారికి వివరించారు.

పెద్ద ఎత్తున అధ్యయనం చేసిన తరాత పూర్తి పరిశోధనల తరువాతే ఏ జాతి చెట్లను విరివిగా పెంచడానికి అనుమతించాలనే అంశాన్ని ఖరారు చేస్తారు. ఈ అంశంపై నిపుణులతోనూ, స్థానిక సామాజిక వర్గాల ప్రముఖులతోనూ కూడా ముందుగానే సమగ్రంగా చర్చిస్తారు. స్థానికుల అవసరాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతుంది. ఆయుర్వేద ఔషధ సంబంధమైనవాటితో పాటు ఆర్థికరంగా లాభదాయకమైన వాటినే ఎంపిక చేస్తారు. ఆ రకంగా స్థానికంగా అందుబాటులో ఉన్న జీవ వైవిధ్యం సురక్షితంగా ఉండే విధంగా చెట్ల ఎంపిక జరుగుతుంది. అదే సమయంలో అక్కడి నేలల స్వభావం, వర్షపాతం తీరు తెన్నులు, ఆర్థికంగా, సామాజికంగా, స్థానికుల అవసరాలు, ఆయా ప్రాంతాలలో నెలకొని ఉన్న వన్యప్రాణి సంతతి వైవిధ్యం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.  వాటికి అనుగుణమైన చెట్లకే ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణకు, సుందరబన్ జాతీయ పార్కు (పశ్చిమ బెంగాల్) పరిసరాలలో అక్కడ తరచుగా సంభవించే తుఫానులు, భారీ వర్షాలు దృష్టిలో ఉంచుకుని విపత్తు నివారణకు అనుకూలమైన చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు. ఇటీవలి కొన్ని అధ్యయనాల ప్రకారం సుధరభన్స్ పార్కు పరిసరాలలో పెద్ద పెద్ద చెట్లను నాటి రక్షణ వలయాలు ఏర్పాటు చేసిన కారణంగా కోలంకతా లో ప్రకృతి వైపరీత్యాలకు కొంత మేరకు అడ్డుకట్ట వేయగలిగినట్లు నిర్ధారణ అయింది.

నాటిన తరువాత ఎక్కువ సంఖ్యలో చెట్లు జీవించగలగడం అనే అంశం దృష్టిలో పెట్టుకుని వాటిని ఎంపిక చేస్తున్నారు. అలాంటి వాటినే నర్సరీలలో పెంచుతున్నారు. తగు మాత్రం ఎదిగిన తరువాతనే వాటిని వాటిని నాటడానికి ఎంపిక చేసిన ప్రాంతాలకు తరలిస్తున్నారు. పల్లెల్లో నివసించే వారిని వివిధ రకాల కార్యకలాపాలలో భాగస్వాములను చేస్తున్నారు. నర్సరీలలో నారు మొక్కలను పెంచడం, వాటిని నాటే ప్రాంతాలకు తరలించడం, ఎంపిక చేసిన స్థాలలను చదును చేయడం, గోతులు తవ్వడం, నాట్ల కార్యక్రమాలలోనూ వారికి విస్తృత అవకాశాలు అందజేస్తున్నారు. వాటిని నాటిన దగ్గర నుంచి రోజువారీ నీరు పెట్టి పెంచడం కూడా వారికే అప్పగిస్తున్నారు. ఇది గిరిజన పేద ప్రజలకు ముఖ్యంగా మహిళలకు రోజువారీ కూలీ పద్ధతిపై ఉపాధి అవకాశాలు అందజేయగలుగుతోంది.

బాక్సు 2: చెట్లను బహుమతిగా అందించే అవకాశం

గ్రో-ట్రీ.కామ్ మరో వినూత్న అవకాశాన్ని పౌరులందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. చెట్ల పెంపకంపై ప్రజలలో మంచి అవగాహన కల్పించడంతో పాటు వారిలో ఆసక్తి పెంచడానికి బహుమతిగా చెట్లను అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆత్మీయులకు ఇలా ఒక చెట్టును నాటి బహుమతిగా అందించవచ్చు. ఇదంతా ఆన్ లైన్ వేదికగానే జరుగుతుంది. ఇలా చెట్లను నాటేందుకు, బహుమతిగా అందించేందుకు వీలుగా ఇ-సర్టిఫికెట్ ను గ్రీట్ ఎనీటైమ్ ట్ సబ్ స్క్రిప్షన్ సైటు ద్వారా ప్లాంట్ మన్త్లీ కార్యక్రమంలో ఎవరైనా చేరవచ్చు. ఇలా చేరిన వారి పేరుతో సర్టిఫికెట్ జారీ అవుతుంది. దీనిని ఆత్మీయులకు మనం బహుమతిగా అందించవచ్చు. పుట్టిన రోజులు, వార్షికోత్సవాలు, ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులకు, సన్నిహిత స్నేహితులకు వాటిని బహూకరించవచ్చు. వారి పేరుతో మీరు నాటే ప్రతీ చెట్టు గ్రామ ప్రాంతాలలోని వారికి ఒక జీవనోపాధిగా మారుతుంది. దేశమంతటా హరితహారం వెల్లివిరిసేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. విస్తృ స్థాయిలో చెట్లు నాటే కృషిలో పౌరులందరికీ సమానావకాశాలు అందిస్తుంది.

ఇలా ప్రతి ఒక్కరు నాటిన చెట్లు ఆ ప్రాంతంలోని పేద వర్గాలకు ఉమ్మడి ఆస్తిగా ఉంటుంది. కాబట్టి వాటి నుంచి అందే ప్రయోజనాలు కూడా వారందరికీ సమానంగా వర్తిస్తాయి. అంటే వారి సామాజిక, ఆర్థిక పురోగతికి తోడ్పడతాయి. ఆ చెట్ల ఫలసాయాన్ని తమ అవసరాలకు ఉపయోగించుకోవాలా లేక మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకోవాలా అనేది వారికే వదిలేయడం జరుగుతుంది. పండ్లు, కాయల రూపంలో కాని, టింబరేతర ఉత్పాదనల రూపంలో కూడా చెట్ల నుంచి వారికి లభ్ది చేకూరవచ్చు. చెట్లు తగినంతగా ఎదిగిన తరువాత టింబరేతర ఉత్పత్తులు కూడా వారికి ఆదాయ మార్గంగా ఉపయోగపడతాయి. వారికి జీవితాంతం ఆదాయ మార్గమవుతుంది.

ఫలితాలు – ప్రభావాలు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2010 సందర్భంగా దేశానికి కానుకగా అంది వచ్చిన ఈ సంస్థ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలలో 45 లక్షల చెట్లను నాటడంలో కీలకపాత్ర పోషించింది. ఈ బృహత్ కార్యక్రమం వల్ల 3,70,000 పనిదినాల ఉపాధి గ్రామీణ ప్రాంతపు పేద ప్రజానీకానికి అందివచ్చింది.

పల్లె ప్రాంతాలలోని పేద ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా ఈ సంస్థ తోడ్పాటు అందించింది. ముఖ్యంగా చెట్లను నాటే కార్యక్రమంలో వారిని కీలక భాగస్వాములుగా చేసింది. ఆ రకంగా వారికి అదనపు ఆదాయం లభించే మార్గాలను చూపించింది. ముఖ్యంగా టింబరేతర ఉత్పత్తులను వారి కుటుంబ అవసరాలకు ఉపయోగించేందుకు అనుమతించడమే కాకుండా వాటిని మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకునే అవకాశాలు కూడా అందజేసింది. “మా కన్న బిడ్డలు మమ్మలను వదిలి వెళ్లిపోయినా సరే ఈ చెట్లు కలకాలం మా బాగోగులలో తోడునీడగా ఉంటాయి. మా వృద్ధాప్యంలో కూడా నాకు, నా భార్యకు ఈ చెట్లు కొండంత అండగా ఉండి ఆసరాగా నిలుస్తాయి.” అన్నారు  ఈ కార్యక్రమంలో పాటు పంచుకున్న ఒక వ్యక్తి.

గ్రో-ట్రీస్ ప్రాజెక్టు కింద చేపట్టిన అనేక కార్యక్రమాలు రాజస్తాన్ లోనూ, గుజరాత్ లోనూ నిటి బొట్టు లేని ఎడారి ప్రాంతపు ప్రజలకు తాగు నీరు అందిస్తోంది. ఉదాహరణకు, సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం సమీపంలోని గ్రీన్ ట్రీస్ ప్రాజెక్టు రాక ముందు భూగర్భ జలాల మట్టాలు 400 అడుగుల లోతులో ఉండేవి. ఇప్పుడు అవి 40 అడుగుల లోతులోనే లభ్యమవుతున్నాయి. గడచిన నాలుగేండ్ల కాలంలో ఈ ప్రాంతంలో 4,00,000 చెట్లను నాటినందు వల్ల వచ్చిన ఫలితం ఇది. అక్కడి పేద పల్లెవాసులకే కాకుండా పులుల మనుగడకు కూడా కలిగిన ప్రయోజనాల్లో ఇది ఒకటి.

గ్రీన్ ట్రీస్ ప్రాజెక్టుల నుంచి లక్షలాది మంది జీవితాలకు మంచి దారి చూపించడమే కాకుండా ఆయా ప్రాంతాలను అభివృద్ధి మార్గంలో నడిపించే సాముకూల అంశాలను సాధించేందుకు కృషి సాగింది. దేశంలో పచ్చటి మొక్క పెరిగే అవకాశాలు కూడా లేని ప్రాంతాలలో కూడా చెట్లను నాటే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వాటిని సంరక్షించగలిగారు. ఈ కారణంగా ఇంతకాలం అన్ని విధాలుగా నిర్లక్ష్యానికి గురైన గ్రామ ప్రాంతాలలోని పేద వర్గాలకు అదాయం మరింత పెరిగే విధంగా అనుబంధ ఉపాధులను కూడా చూపించడం సాధ్యమైంది.

సుప్రియ పాటిల్
జి. 3, షాహెర్జాదే బిల్డింగ్
కొలాబా, మహారాష్ట్ర – 400 005
E-mail: supriya.patil@grow-trees.com
www.Grow-Trees.com

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...