కొబ్బరి తోటల చీడలకు బయో చికిత్సా పద్ధతులు – అందరికీ అనువైన సామాజిక ప్రక్రియ

వ్యవసాయ రంగంలో విస్తరణ పనులు చేపట్టే విషయంలో వ్యకులపరంగా ఎవరికి వారు కాకుండా, సామాజిక భాగస్వామ్యం ప్రధానంగా కృషి చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలా విస్తృత సామాజిక భాగస్వామ్యంతో చేపట్టే విస్తరణ పనులలో ఆధునిక సాంకేతికలను అందరూ కలిసి ఉపయోగించుకునేందుకు, మెరుగైన సాంకేతికతలను అనుసరించేందుకు, మెరుగైన సామర్థ్యం ప్రదర్శించేందుకు మాత్రమే కాకుండా ఆధునిక సాంకేతికతలను ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు ఉపయోగపడుతుంది.

సాధారణంగా, సాదాసీదా రైతులు మాత్రమే కొబ్బరి చెట్లను తమకున్న కొద్ది పాటి పొలం గట్లపై పెంచడం కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న కమతాలే ఉన్న ఆ చిన్న, సన్నకారు రైతులు కొబ్బరి తోటల సంరక్షణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం కష్టమైన పనే. ఈ సంప్రదాయక సంరక్షణ విధానాలు ఒక రైతు నుంచి మరొకరికి చాలా నెమ్మదిగా విస్తరిస్తుంటాయి. పైగా వారు అనుసరించే పద్ధతులకు సమయం, సందర్భాలు సహేతుకంగా ఉండవు. పంపిణీ సంబంధిత ఆవశ్యకతలు, రైతు అనుసరిస్తున్న విధానాల సామర్థ్యం గురించిన విచక్షణ కనిపించదు.

కొబ్బరి చెట్లకు హాని కలిగించే చీడపీడల్లో బ్లాక్ బీటిల్ లేదా రైనోసరస్ బీటిల్ అని వ్యవహరించే (వీటికి రైనోలా కొమ్ము ఉండడం వల్ల ఇలా వ్యవహరిస్తారు.) వల్ల కలిగే కష్టనష్టాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా చెట్లు ఎదుగుతున్న దశలో వీటి తాకిడి అధికంగా ఉంటుంది. కొబ్బరి మొక్కలు ఎదిగే సమయంలో 25 నుంచి 48 శాతం వరకు, పూత కాసే సమయంలోను, కాయ కాసే సమయంలోనూ 23 శాతం వరకు రైనో బీటిల్ దాడికి గురవుతూ ఉంటాయి. వాటి లక్షణాలలో ప్రధానమైన అంశాలు – విచ్చుకున్న ఆకుల్లో ఆంగ్ల అక్షరం వి ఆకకారంలో చీలికలు కనిపిస్తాయి. చీడ సోకిన మొక్కలు నశించిపోతాయి. దిగుబడి కనీసం 10 శాతం వరకు నష్టపోవలసి ఉంటుంది. అందువల్ల ఈ చీడ విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సివస్తుంది. దీనిని పరిసర రైతాంగం అంతా కలిసికట్టుగా చేపట్టినప్పుడే మంచి ఫలితాలనుస్తుంది. లభించిన సమాచారం ప్రకారం, ఈ చీడ విషయంలో రైతులలో అంతగా చైతన్యం లేకపోవడం, సరైన విధానాలు అనుసరించకపోవడం జరుగుతోంది.

సంబంధిత వర్గాల భాగస్వామ్యంతో చేపట్టిన అధ్యయనంలో నిర్ధారణ అయిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. సాధారణంగా రైతులు చీడ నివారణ పద్ధతి ఏదైనా తక్కువ ఖర్చుతో కూడినది కావాలని, సురక్షితమైనదిగా ఉండాలని, పర్యావరణ అనుకూలమైనదిగా ఉండాలని ఆశిస్తున్నారు. వీలైతే జీవ సంబంధ (బయో)  పరిష్కార మార్గాలు కోరుకుంటున్నారు. అందుకు కొన్నికారణాలు కూడా ఉన్నాయి. అవి –

– ఇంటి పెరడులో కొబ్బరి చెట్లను పెంచుతున్న వారికి ఇది నిత్యం ఎదురవుతున్న సమస్య.

– ఇవి చాలా ఎత్తుకు పెరిగిపోతుంటాయి. కాయలు కోయడానికి ప్రత్యేక నైపుణ్యాలున్న వారు అవసరమవుతారు. కాయలు కోసే సమయంలోనే కాకుండా, వాటి పై భాగాలను శుభ్రం చేయడానికి, చెట్టు రక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా ఇలాంటి నిపుణుల సేవ తప్పనిసరి.

– ప్రస్తుతం వినియోగంలో సాంకేతికత ఆధారిత విస్తరణ విధానాలు విడివిడిగా రైతుల ప్రయోజనాలకు అనువైనవి.

– అత్యంత ప్రధానమైన జీవ సంబంధ ముడి సరుకులు అరకొరగానే అందుబాటులో ఉంటున్నాయి. అందువల్ల కూడా రైతుల్లో వాటిపై సమగ్రమైన అవగాహన ఉండడం లేదు.

దేశీయ పద్ధతులు కొన్ని ఇప్పటి వరకు లభించేవి. కొబ్బరి సాగు చేసే రైతులు ఆచరిస్తున్నవే. ఎందుకంటే కొబ్బరి సాగుకు, ఈ బ్లాక్ బీటిల్ చీడ బెడద ఎప్పటి నుంచో ఉన్నదే. సంప్రదాయ పద్ధతుల్లో కలుపు మొక్కల్లో ఒకటైన క్లిరోడెండ్రన్ ఇన్ ఫార్థినిన్ కలుపును ఆవు పేడలో కలిపి పెంచుతారు. కంపోస్టుగా ఉపయోగిస్తారు. చెత్త కుప్పల్లో కూడా పెంచుతారు.ఎందకంటే ఇలాంటి చో్లే బ్లాక్ బీటిల్ జీవిస్తాయి. పెరుగుతుంటాయి. కొక్కెంలాంటి ఇనుప వస్తువుకు ఒద బ్లాక్ బీటిల్ ను ఫిక్స్ చేసి ఉంచడం, క్రిస్టల్ ఉప్పు, బూడిద, ఇసుక సమాన పాళ్లలో కలిపిన మిశ్రమాన్ని చెట్ల పై కొమ్మలపై చల్లడం, (ఇలా ఏడాది కాలంలో మూడు సార్లు చేస్తుంటారు.)  ఇవి ఇంతకాలం రైతులు అనుసరించిన విధానాలు. వాస్తవానికి పాత తరం రైతులకు వీటి వల్ల మంచి ఫలితాలే వచ్చేవి. అయితే ప్రస్తుత కాలంలో వాటిని ఎవరూ అనుసరించడం లేదు. అవసరం ప్రాతిపదికగా, సామాజిక విస్తరణ పద్ధతులను అనుసరిస్తున్నారు. అవి మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. తక్కువ ఖర్చుతోనే ఫలితాలు వస్తున్నాయి. అలాంటి విధానాలలో ఒకటి – ఆయా ప్రాంతాలకు మొత్తం వర్తించే సామాజిక విస్తరణ విధానాలు (ఏరియా వైడ్ కమ్యూనిటీ ఎక్స్ టెన్షన్ అప్రోచెస్ – AWCA) పేరుతో రైనోసర్స్ బీటిల్ (దీనినే ఆరైటీస్ రైనోసరిస్ లిమ్ అని కూడా వ్యవహరిస్తారు.) జీవసంబంధ పరిష్కారాలను అనుసరిస్తున్నారు. ఈ పద్ధతిని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చి (ఐకార్) సంస్థ విస్తరణ శాస్త్రవేత్తలు, కేంద్ర మొక్కల పెంపకం రీసెర్చి సంస్థ (సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ – CPCRI)) శాస్త్రజ్ఞులు కలిసి రూపొందించారు.

భాగస్వామ్య విస్తరణ విధానం

కొబ్బరి చెట్ల సాగు రైతులకు సహకరించేందుకు వీలుగా గ్రీన్ ముస్రడైన్ ఫంగస్ తయారీ విధానాన్ని మొట్ట మొదటి సారిగా 2007లో చేపట్టారు. అలప్పుజా జిల్లాల్లోని రెండు పంచాయతీలలో అమలు చేయగా, క్షేత్ర స్థాయి ఫలితాలు సానుకూలంగా రాలేదు. క్షేత్ర స్థాయి ఉత్పత్తి (ఫీల్డ్ లెవెల్ ప్రొడక్షన్ – ఎఫ్.ఎల్ పి.) ఆశావహంగా లేదు. దాంతో 2008 నుంచి క్వాలిఫైడ్ నిపుణుల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఎప్.ఎల్.పి స్థాయిలోనే చేపట్టారు. కానీ అది నిలకడగా కొనసాగలేదు. అప్పుడు 1500 హెక్టార్ల విస్తృత ప్రాంతంలో చీడ సోకిన ప్రాంతాలలో నివారణ పద్ధతులు చేపట్టారు. ఇది పూర్తి చేసేందుకు ఎక్కువ సమయమే పట్టింది. వాటి ప్రభావం కూడా తక్కువగానే ఉన్నది. వాటి నివారణకు అవసరమైన బయో ఏజెంట్ కొరత, పూర్తి ప్రాంతాన్ని ఏకకాలంలో నిర్వహించలేకపోవడంతో కొన్ని సమస్యలు తప్పలేదు.

ఈ ఫలితాలను గమనించిన తరువాత, సామాజిక స్థాయి అనుసరణ పద్ధతులను మూడు దశలలో చేపట్టారు. అవి :

1వ దశ – గ్రామీణ మహిళా రైతులు, స్వయంసహాయక బృందాలను సమీకరించి సమిష్టి పద్ధతిలో భాగస్వామ్య విధానం చేపట్టారు. వారికి ఈ సమయంలోనే వారికి ఈ రైనో బీటిల్ చీడను సమీకృత నివారణ పద్దతులపై (ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మానేజ్ మెంట్ – ఐఎంపి) అవగాహన కల్పించారు. ఈ  కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోనే నిర్వహించారు. సాంకేతికతను, దాని ప్రభావాన్నివారి కళ్లముందు ప్రదర్శించేందుకు, వారిలో వాటిపై నమ్మకం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమం చేపట్ట వలసి వచ్చింది. అలాంటి నమ్మకం ఏర్పడినప్పుడే రైతులు కూడా ఐచ్ఛికంగా ఈ ప్రక్రియను అనుసరించేందుకు ముందుకు రాగలుగుతారు. అన్ని  దశలకు సంబంధించిన సాంకేతికతలపై వారికి ప్రదర్శన రూపంలో పరిచయం చేశారు.

2వ దశ – వికేంద్రీకరించిన క్షేత్ర స్థాయి మెటర్హిజమ్ ఉత్పాదన నమూనాను ఆచరణాత్మకంగా సిద్ధం చేశారు. ఇందులో విద్యావంతులైన గ్రామీణ మహిళల సహకారం తీసుకున్నారు. వారిని మధ్యవర్తులుగా పెట్టుకుని, సాంకేతిక విధివిధానాలను స్థానికి మహిళా రైతులకు వివరించారు. ఆయా పంచాయతీల వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేయగా, ఈ విధంగా రైతు ప్రతినిధులకు పూర్తి అవగాహన కల్పించారు. ఈ కృషిలో మహిళా రైతుల స్వయం సహాయక బృందాల తోడ్పాటు ప్ర్తత్యేకంగా చెప్పుకోవాలి. తక్కువ ఖర్చుతో వారి భాగస్వామ్యంతోనే బహుముఖ విధానాలను రూపొందించడమే కాకుండా వాటిని మెరుగు పరచడంలో వారి సహకారం అమూల్యం. ప్రభావాన్ని విశ్లేషించడంలో, పరస్పరం నైపుణ్యాన్ని పంచుకోవడంలో, చివరి వరకు ఆచరణ దీక్షతో వారు చేసిన కృషి అపూర్వం.

3వ దశ – గ్రీన్ ముస్కరడైన్ ఫంగస్ ప్రయోజనాలను ఉత్పత్తి లేదా బహుముఖ స్థాయిలో మంచి ఫలితాలను రాబట్టేందుకు, వాటి ఫలితాలను అధ్యయనం చేసే కార్యక్రమాన్ని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) –  సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్టి ఇనిస్టిట్యూట్ (సీపీసీఆర్ఐ) శాస్త్రజ్జ్ఞుల సమన్వయంతో చేపట్టారు. అవసరమైన మార్దదర్శకం, సహాయాన్ని వ్యవసాయ అధికారులు, స్థానికి మహిళా నాయకులు, స్థానిక యంత్రాంగం నుంచి లభించింది. దీనిని సామాజిక ప్రయోగంగా వారిలో ప్రేరేపించడం జరిగింది.

భాగస్వామ్య పద్ధతిలో ఈ ఏరియా వైడ్ విస్తరణ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా తిరువనంతపురం జిల్లాలోని ఎడవ పంచాయతీలో ప్రారంభించారు. 520 హెక్టార్ల విస్తీర్ణంలో 5465 కొబ్బరి చెట్లు పెంచుతున్న రైతులు ఇందులో పాలు పంచుకున్నారు. ఈ రైతులందరూ కలిసి ఏకంగా 1,10,143 కొబ్బరి చెట్లను పెంచుతున్నారు. ఎడవ పంచాయతీ వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీమతి తేజస్వీ బాయ్ వారికి మార్గదర్శిగా వ్యవహరించారు. ఆమె కృషిని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అయితే ఆమె ఈ అంశంపై తన అభిప్రాయాలను ఇలా వివరించారు. ‘ఈ పంచాయితీ పరిధిలో కొబ్బరి చెట్ల పెంపకం రైతులకు వెన్నుముక వంటిది. సంప్రదాయకంగా ఇక్కడి వారు కొబ్బరి పీచుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ విషయంలో వారికున్న అనుభవం ప్రాతిపదికగా, ఐకార్-సిపిసిఆర్ఐ పరిశోధనలు సాగిస్తున్నాయి. ఇవి మాకు గర్వకారణం.  ఎందుకంటే వారి అనుభవం మా విస్తరణ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఉపకరిస్తున్నాయి. ఇక్కడ చేపట్టిన పరస్పర బోధన, అధ్యయనం, రైతుల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం చూసినప్పుడు పరిశోధన సంస్థలు రూపొందించే సాంకేతికతలను, మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతామన్న నమ్మకం పెరుగుతోంది. భాగస్వామ్య పద్ధతిలో చేపట్టిన ఈ సామాజిక పరిశోధనలు వివిధ ప్రాంతాలలోని ఆయా సామాజిక వర్గాల సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. మహిళా రైతులు సంపాదించుకున్న వనరులలు ఎలాంటి ఆధునిక సాంకేతికతనైనా ఇట్టే వినియోగించుకోగల స్థాయిలో ఉంది. అందుబాటులోకి వచ్చే ఆధుిక సాంకేతికతను ఇతరులకు చేరవేయడంలో కూడా వారు పూర్తి సామర్థ్యాన్ని, నైపుణ్యాలను సంపాదించుకున్నారు. ’

అదనపు తోడ్పాటు

ఈ ప్రాజెక్టులో భాగంగా, ఆయా కమ్యూిటీల పరంగా చైతన్యం పెంపొందించడం, వారిని కార్యాచరణ దిశగా నడిపించడం, సమష్టి కృషి ఫలితాలను వారికి చేరవేయడం, అందుకు అనుగుణంగా విస్తరణ విధులను నిర్వహిస్తున్న సంస్థలతో అనుసంధానం చేయడం, బయో నివారణ విధానాలను వికేంద్రీకరణ పద్ధతిలో చేపట్టేలా ప్రోత్సహించడం, భాగస్వామ్య పద్ధతిలోనే పర్యవేక్షణకు సహకరించడం, మహిళా రైతు సంఘాలను ఆధునిక సాంకేతికతలను అనుసరించేందుకు వీలుగా సంఘటితం చేయడం వంటి చర్యలను కూడా అందజేస్తున్నారు.

సామాజిక సమీకరణ, అవగాహన పెంపు వంటి కార్యక్రమాలను చేపట్టారు. పంచాయతీ వ్యాప్తంగా జిఎంఎఫ్ నివారణ విధానంతో పాటు ఆవు పేడతో నింపిన గోతులు, వర్మీ కంపోస్టు యూనిట్లు, నాన పెట్టిన కొబ్బరి పీచు గుజ్జు, బాగా నీటిలో నానపెట్టిన కొబ్బరి కాండాలు వంటి వాటిలో జిఎంఎఫ్ ను ఉపయోగించి, ఈ పరాన్నజీవులను నాశనంచేయవలసి ఉంటుంది. కొబ్బరి చెట్లపై వివిధ ప్రాంతాలలో కేవలం వారం వ్యవధిలో ఈ ఫంగస్ సాయంతో నశింపజేయవచ్చు. కాస్త పెద్దగా ఎదిగిన పరాన్నజీవాలను నాశనం చేసేందుకు మరి కొంత వ్యవధి  అవసరమవుతుంది. వర్మీ కంపోస్టులోని వానపాములకు మాత్రం దీని వల్ల ఎలాంటి హాని ఉండదు. అవసరమైనంత జిఎంఎఫ్ లభించకపోవడం అనేది ఒక సమస్య కాగా, ఈ విధానంలోని సాంకేతికత, ఇంకా దాని ప్రయోజనంపై అంతగా ఇంకా రైతుల్లో చైతన్యం లేకపోవడం వల్ల ఈ విధానం వ్యాప్తికి అడ్డంకులుగా మారాయి. గ్రీన్ ముస్కర్డైన్ ఫంగస్ (జిఎంఎఫ్) తయారీ విధానాన్ని ఒకే చోట కాకుండా వేరు వేరు చోట్ల వికేంద్రీకరణ పద్ధతిలో చేపట్టవలసి వస్తోంది. సాధారణంగా దీని తయారీని క్షేత్ర స్థాయిలో చేపడుతున్నారు. స్వయంసహాయక బృందాలకు చెందిన సుశిక్షితులైన  మహిళా రైతుల ద్వారా ఈ ప్రక్రియను మరింతగా పెంచేందుకు కృషి జరుగుతోంది. రైతుల సామర్థ్యం పెంపు, నైపుణ్యాల పెంపు చర్యలను నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. ఇది వారిలో ఈ విధానంపై వారిలో నమ్మకం బలపడుతోంది. ఇదే సమయంలో వ్యవస్థీకరణ, అనుసంధాన ప్రక్రియలను, సాంకేతికత వ్యాప్తికి, ఇతర కార్యక్రమాల ద్వారా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సంబంధిత వ్యవసాయ మంత్రిత్వ శాఖ, కొబ్బరి రైతు సమూహాలు, వెటర్నరీ డిపార్టుమెంటు, పాల సహకార సంఘాలు, పశుపోషణ చేపట్టిన రైతులు, ఇంకా ప్రసార మాధ్యమాలు, ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో, స్థానిక పాలనా యంత్రాగం, వంటి భాగస్వామ్య పక్షాలన్నిటి సహకారం తీసుకోవడం జరుగుతోంది.

అలప్పుజా, త్రివేండ్రం జిల్లాలలోని మూడు పంచాయతీల – టెక్కెకర, దేవికులంగర, ఎడవ – పరిధిలోనూ ఉన్న రమారమి 2000 హెక్టార్ల కొబ్బరి తోటల విస్తీర్ణంలో ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. రెండు మూడు మహిళా స్వయంసహాయక బృందాలకు చెందిన మహిళా రైతులు, ఆయా పంచాయతీల విస్తరణాధికారులు, ఆయా పంచాయతీలు, వాటి పరిధిలోని ఒక్కో వార్డు నుంచి కొబ్బరి రైతు సంఘాల తరఫున ప్రతినిధులుగా 8 లేక 10 మంది,  కలిసికట్టుగా పనిచేస్తున్నారు. వారంతా కూడా ఈ విధానాన్ని మరి కొంత మంది రైతులకు పరిచయం చేసేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా సాంకేతికత బదిలీ, చీడ పెరిగే వాటి మూలస్థానాల విధ్వంసం వంటి కార్యక్రమాలను వీరు నిర్వహిస్తున్నారు. ఆ రకంగా చూస్తే మొత్తం 150 నుంచి 200 మంది మహిళా రైతులు ఈ మూడు పంచాయతీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి ఉత్సాహం గమనిస్తే, ఈ విధానం వారికి అనుకూలమైనదిగా ఉన్నదని, మహిళా రైతులకు ఆసక్తి కలిగిస్తోందని, విధానం తేలికగా అనుసరించదగ్గదేనని నిర్ధారణ అవుతుంది.

ఇప్పటి వరకు రైతులు, మహిళా రైతుల కోసం 32 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్య మధ్యలో సర్దుబాట్లు సూచించేందుకు వీడియో కాన్ఫరెన్స్ లు కూడా నిర్వహించారు. తక్కువ ఖర్చు అయ్యే, జిఎంఎఫ్ తయారీ యూనిట్లను ఎక్కడికక్కడ మహిళా రైతులు ఏర్పాటు చేసి, తయారీని వికేంద్రీకరించుకోగలుగుతున్నారు. ఆ విధంగా జిఎంఎఫ్ కు కొరత రాకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇలాంటి యూనిట్ ఏర్పాటుకు ప్రారంభంలో రూ. 8000 నుంచి రూ. 10,000 వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ఇక అవసరమైన ఇతర సరంజామా – ప్రెషర్ కుక్కర్ (20 లీటర్ల సామర్థ్యం), జిఎంఎఫ్ మూలకం (కల్చర్), పోలిప్రొపైలిన్ కవర్లు, నాణ్యమైన బియ్యం, ఇతర అనుబంధ వనరులు – అంటే పత్తి, అల్యూమినియం ఫాయిల్, దళసరి కొవ్వుత్తులు, చేతి గ్లోవ్స్ వంటివి అవసరమవుతాయి. క్షేత్ర స్థాయిలో తయారీకి పరిశుభ్రమైన వాతావరణం అన్నిటికన్నా చాలా ముఖ్యం. అనుసరించే విధానం చాలా తేలిక. ఒక ప్యాకెట్ (100 గ్రాములు) జిఎంఎఫ్ ను లీటర్ నీటిలో కలపాలి. ఆ మిశ్రమాన్ని ఆవు పేడ గోతులపైనా, కంపోస్టు గోత్తులపైన, శిథిలమైన కొబ్బరి కొమ్మలపైనా విరచిమ్మాలి. సాధారణంగా ఇలాంటి వాటినే ఆశ్రయించుకుని ఈ చీడ ఎదుగుతుంది. తొలిదశలో చిన్నవి నశిస్తాయి.

మొత్తం సామాజిక ప్రయోజనానికి అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేయడంలో పంచాయతీ వ్యాప్తంగా వార్డుల వారీగా రైనో బీటిల్స్ వృద్ధి కేంద్రాలన్నిటిని జిపీఎస్ సాయంతో ముందుగా గుర్తించారు. అక్కడక్కడ విడిపోయిన కేంద్రాలను – అంటే పశు శాలలను పెంచుతున్న రైతులు (వారి సంఖ్య సుమారుగా 643) , వర్మీ కంపోస్టు యూనిట్లు (వాటి సంఖ్య 7), కొబ్బరిపీచు గుట్టలుగాపేరుకుని ఉండే ప్రాసెసింగ్ కేంద్రాలు (వాటి సంఖ్య 3) గుర్తించారు. వాటిలో సమస్యాత్మకమైనవి అంటే 82 శాతం, 6 వార్డులలో ఉన్నట్లు గమనించారు. అటువంటి వాటిలో జిఎంఎఫ్ ఉపయోగించి చీడ నాశనం చేశారు. భాగస్వామ్య పక్షాలందరి సహకారంతో ఈ కార్యక్రమం పూర్తి చేసేందుకు వారం రోజులు పట్టింది ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు, పశు సవంర్ధక శాఖ ప్రతినిధులు, పాడి సహకార సంఘాల ప్రతినిధులు (ఈ పాడి సంఘాలలో పశువులను పెంచుతున్న రైతులు, మహిళా సహకార సంఘాల వారిలో 85 శాతం  సభ్యులుగా ఉన్నారు.)  సహకరించారు ఈ పద్ధతి కారణంగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే దీనికి సుముఖంగా ఉన్న వారిలో 90 శాతం మందిని సమీకరించడం సాధ్యమైంది. ఆ తరువాత సేకరించిన సమాచారం ప్రకారం రైనో బీటిల్స్ ప్రభావం 75.8 శాతం అదుపులోకి వచ్చింది. మళ్లీ తలెత్తలేదు. ఈ విధానం చేపట్టిన వారం రోజులలోనే, గుడ్డు దశలోని క్రిములు నాశనమైనట్లు రైతులు తెలిపారు. అలా జీవరహితమైన గుడ్లను, బీటిల్స్ క్రిములను గుర్తించి, తొలగించినట్లు వారు తెలిపారు. అంటే ఆ తరవాత వాటి వ్యాప్తి మళ్లీ కనిపించలేదు.

ఎప్పటికప్పుడు తాజా సమాచారం సేకరించే పద్ధతి కొనసాగుతోంది. ఇందులో పాలు పంచుకున్న రైతులు ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి వివరిస్తున్నారు. వారిచ్చిన సమాచారం ప్రధానంగా ఒక ఏడాది కాలంలో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ఎన్ని సార్లు ఇలా వాటి నివారణ చర్యలు తీసుకోవాలనే అంశంపైనే ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు రెండేళ్లకు ఒకసారి నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇలా రెండేళ్లకోసారి సరిపోతుందని నిపుణులు అనంతర అధ్యయనాల తరువాత నిర్ధారించారు.

చేకూరిన ప్రయోజనాలు

కొబ్బరి చెట్లను పెంచుతున్న రైతులలో దాదాపు 70 నుంచి 80 శాతం మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. పూత దశలో ఈ చీడ సోకే అవకాశాలు దాదాపు 75 శాతం వరకు తగ్గిపోయింది.

ఈ కార్యక్రమం అమలు చేయకుండా ఉన్న ప్రాంతాల (కొల్లాంజిల్లా నీండకర గ్రామ పంచాయతీ)లోని  రైతులతో పోల్చి చూసినప్పుడు దీనిని అనుసరిస్తున్న తిరువనంతపురం జిల్లా ఎడవ పంచాయతీలోని కొబ్బరి సాగు చేసే రైతులలో మెరుగైన అవగాహన ఉన్నట్లు గమనించారు. రెండు ప్రాంతాలలోనూ కూడా దాదాపు 90 శాతం మంది రైతులు పూర్తిగా ఎదిగిన బీటిల్స్ ను గుర్తించగలరు. మరో 50 నుంచి 60 శాతం మంది అవి వృద్ధిపొందే ప్రదేశాలను, చెట్లకు సోకిన చీడ తీరుతెన్నులను గుర్తించగలరు.

జిఎంఎఫ్ వాడకం ద్వారా పూత దశలోని చెట్లకు రైనోసెరస్ బీటిల్స్ పీడ మళ్లీ తలెత్తడం అనే సమస్య దాదాపు 75 శాతం తగ్గిపోయింది 

క్షేత్ర స్థాయిలో సమీకృత పద్ధతిలో కొబ్బరి చెట్లు, జాక్ (పనస) చెట్లు, కూరగాయలు, దుంపలు,  కుక్క గొడుగుల సాగు చేపలు లేక ఇతర గుడ్లు ఉత్పాదన, ప్రాసెసింగ్ లేక ఆవు పేడ సేకరణ, వర్మీ కంపోస్టు తయారీ పనులను పెద్ద ఎత్తున చేపట్టారు.

క్షేత్ర స్థాయిలో జిఎంఎఫ్ ఉత్పాదన సాంకేతికను మరింతగా మెరుగుపరచారు. తయారీ ఖర్చును 40 శాతం తగ్గించగలిగారు. ఉత్పత్తి సమయాన్ని 30 శాతం తగ్గించగలిగారు. గ్రామీణ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, వేర్వేరు జిల్లాలకు చెందిన 2054 మంది రైతులకు పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వగలిగారు.

నేర్చిన గుణపాఠాలు

ఇందుకోసం సిద్ధం చేసిన సాంకేతిక ప్యాకేజీలో అవసరమైన విస్తరణ సదుపాయాలను కూడా రైతుల సామాజిక – ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా, సాంకేతిక ప్రమాణాలతో అమర్చడం జరిగింది. ఫలితంగా సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ సాంకేతికతపై పూర్తి అవగాహన కుదిరింది. చేపట్టేందుకు ప్రోత్సాహం కలిగింది. మరింత మంది నుంచి గిరాకీ పెరుగుతోంది.

అట్టడుగు స్థాయిలో కూడా భాగస్వామ్యం, నిర్వహణకు సంబంధించిన అవకాశాలను సమృద్ధిగా లభిస్తున్న కారణంగా, ఈ సాంకేతికతను వినియోగించేందుకు చాలా మందిలో సానుకూల దృక్పధంతో పాటు ఆసక్తి కూడా పెరుగుతున్నది. కమ్యూనిటీ మొత్తానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దిన కారణంగా కూడా అనుసంధాన ప్రక్రియ తేలికగా అందుబాటులోకి వస్తోంది. ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాలు, రైతు నాయకులు, సహకర సంఘాలతో ప్రభుత్వపరంగా వివిధ శాఖల నుంచి, రీసెర్చి సంస్థలనుంచి సమన్వయం సమర్థవంతంగా తోడవడంతో ఈ విధానం రైతుల ఆదరాభిమానాలను సంపాదించుకుంటున్నది.

అత్యంత కీలకమైన విస్తరణ విధానాన్ని వికేంద్రీకరణ పద్ధతిలో చేపడుతున్నందున సాంకేతికతను అందరికీ చేరువ చేయడం సులభ సాధ్యంగా మారింది. ముఖ్యంగా మహిళా రైతుల సామర్థ్యాన్ని సరైన శిక్షణల ద్వారా మెరుగుపరచని కారణంగా, ఇప్పుడు వారే ఇతరులకు శిక్షకులుగా మారి ప్రోత్సాహం అందించగలుగుతున్నారు. క్షేత్ర స్థాయిలోనే జిఎంఎఫ్ తయారీని వారు ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఈ విధానం అనుసరించడానికి అనువైన ఇతర సభ్యులను (పశు పోషణ చేపట్టిన రైతుల దగ్గర సమృద్ధిగా ఆవు పేడ కుప్పలు లభిస్తాయి. అలాగే వారి అధీనంలో కొబ్బరి పీచు, కంపోస్టు తయారీ యూనిట్లు కూడా ఉంటాయి.)  గుర్తించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.  వారి సాయంతో బయో కంట్రోల్ సాంకేతికతను విస్తరించడంలో కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సాంకేతికతను పాటించవలసినఅవసరం ఉన్నప్పటికీ,  అలాంటి వాళ్లు ఈ విధానం అనుసరించకపోయినట్లయితే, ఆయా సామాజిక వర్గంలోని ఇతరులు కూడా చెడు ఫలితాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే కొందరి ఉత్సాహం ఈ చీడ విస్తరణను నియంత్రించేందుకు ప్రయత్నాలు సాగిస్తుండగా, మరి కొందరు వాటికి దూరంగా ఉన్నట్లయితే చీడ నివారణ కృషి పూర్తి  ఫలితాలు అందించలేదు.

మొత్తం మీద ఈ విధానం విజయవంతం కావాలంటే సాంకేతికతల మధ్య సమన్వయం సాధించడమే అన్నిటికన్నా ముఖ్యమైన అంశం. దేశీయ సాంకేతిక పరిజ్జ్ఞానాన్ని (ఇండిజినస్ టెక్నికల్ నాలెడ్జి – ఐటీకే) కూడా కలగలుపుకుంటూ సాంకేతికతను మరింతగా మెరుగుపరచుకోవడం ఇక్కడ ముఖ్యమైన ప్రక్రియ. దేశీయ సాంకేతికత ప్రకారం, రైనాసెరస్ బీటిల్స్ ఎదిగేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలలో క్లెరోడెండ్రాన్ మొక్కల పెంపకం ప్రధానమైన అంశం. కొమ్మల మూలాల్లో ఉప్పు / ఇసుక / బూడిద మిశ్రమాన్ని (లీఫ్ యాక్సిల్ ఫిల్లింగ్ విధానం) వినియోగించవలసి ఉంటుంది. నిపుణులు సిఫార్సు చేసిన ప్రక్రియతో పాటు ఈ విధానం కూడా తప్పనిసరిగా అనుసరణీయం.

సాంకేతికత ప్రాధాన్యమైన సామాజిక ప్రయోజనకర విస్తరణ విధానాలు రైతు సమాజంలోని ప్రతి ఒక్కరి సాంకేతిక పరిజ్జ్ఞానాన్ని కూడా పెంపొందించడంలో తోడ్పడుతుంది. ఈ విషయంలో వయసు కానీ, ఆసక్తి లేదా భాగస్వామ్యం స్థాయి కానీ ఎలాంటి ప్రభావం చూపించదు. అందువల్ల, మెరుగైన దిగుబడి సాధన కోసమైనా ఈ సాంకేతికతను అనుసరించడానికి మరి కొందరిలో కూడా ప్రేరణ కలుగుతుంది.

ఈ విధానంలో ప్రధానమైన అంశం చిన్న చిన్న ప్రాంతాలు కాకుండా ఆ పరిధిలోని మొత్తం ప్రాంతానికి ప్రయోజనం కలిగించడం ప్రధాన ఆశయం కావడం వల్ల, వీటికి ప్రచార సాధనాల నుంచి కూడా పూర్తి సహకారం,  మద్దతు లభిస్తుంది. వారి ద్వారా మరి కొందరికి దీని గురించిన ప్రచారం చేరుతుంది. సామాజిక భాగస్వామ్యం. విస్తరణ సంబంధాలు, శిక్షణ కార్యక్రమాలు, పరిశోధనలు, విస్తరణ సంబంధిత అనుసంధాన వ్యవస్థల తోడ్పాటు కారణంగా  ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం ఈ విధానాలను అనుసరించిన విధానాలను గమనించినప్పుడు నిర్ధారణ అవుతుంది.

సాధారణంగా పశు పోషణ కూడా చేస్తున్న రైతులు ఈ బయో-కంట్రోల్ విధానం పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అయినప్పటికీ, ఆయా ప్రాంతాలలోని మొత్తం సామాజిక వర్గానికి ఇతర ప్రక్రియలపై – అంటే లీఫ్-యాక్సిల్ ఫిల్లింగ్, యంత్ర సాయంతో నిర్మూలన, ఇతర రోగ నిరోధక విధానాలపై కూడా పూర్తి అవగాహన అవసరం. అప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. అప్పుడే విస్తరణ సంబంధాలు మెరుగవుతాయి. భాగస్వామ్యం విస్తరిస్తుంది.  ప్రచార సాధనాల దృష్టి పడుతుంది.

మెళకువలు నేర్చుకునే సమయంలో కానీ, శిక్షణ కాలంలో కానీ, రైతుల మధ్య పరస్పర అభిప్రాయాలను పంచుకోవడంలో ఉత్సాహం చూపించినప్పుడే, సానుకూల ప్రచారం సంపాదించుకోగలుగుతాం. మెరుగుపరచడం సాధ్యమవుతుంది. మరెందరో కొబ్బరి రైతులను ఆకట్టుకోవడం సాధ్యమవుతుంది.

ముగింపు

చీడపీడల నివారణ విషయంలో విస్తృత పరిధి ఆధారిత విస్తరణ విధానాలు ఇతర సాంకేతిక అంశాలతో జతపరచి వినియోగించినప్పుడే ఈ సమస్యకు సరైన పరిష్కారం సాధ్యమవుతుంది. ఏరియా వైడ్ ఎక్స్ టెన్షన్ అప్రోచ్ విధానంఈ ప్రయోజనం చేకూర్చడంలో ఉత్తమ మార్గంగా నిర్ధారణ అవుతోంది. అందరి భాగస్వామ్యానికి అవకాశం ఇస్తూ, సాంకేతిక అభివృద్ధికి తోడ్పడుతూ, ఈ విధానం ఎక్కువ సానుకూలమైనదిగా నిర్ధారణ అయింది. రైతుల నుంచి, ఇతర వర్గాల నుంచి అందిన స్పందనలను చూస్తే, ఇతర రైతు వర్గాలకు కూడా ఆచరణయోగ్యంగా కనిపిస్తోంది.

విస్తృత పరిధికి ఉపయోగపడేలా, ఆసక్తిగల రైతుల గుర్తింపు ప్రాతిపదికపై నిర్వహించినప్పుడు వ్యక్తిగతంగా ఎవరి మటుకు వారు చేపట్టే చర్యలతో పోలిస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించడం సాధ్యమవుతుంది. ఏ సాంకేతికత అయినా ఎవరి మటుకు వారు తమ సామాజిక ఆర్థిక స్థోమతల ఆధారంగా తమ క్షేత్రాలలో అనుసరిస్తే పూర్తి ప్రయోజనాలు ఉండవు. కలిసికట్టుగా ఆయా ప్రాంతాల వారందరూ ఏకమై కమ్యూనిటీ భాగస్వామ్యంతో చేపట్టినప్పుడే మెరుగైన ఫలితాలు పొందడం సాధ్యమవుతుంది.      అయితే ఈ కృషి నిరంతరం కొనసాగాలి. అప్పుడే అందరికీ ప్రయోడనకరంగా ఉంటుంది. అవసరమైన ఇన్ పుట్ల తయారీలో కూడా వ్యక్తిగత స్థాయి నుంచి గ్రామస్థాయికి విస్తరించాలనే ఆలోచన రూపుదిద్దుకుంటోంది. అదే సాధ్యమైతే సాంకేతికతను పర్యవేక్షణ, క్వాలిటీ నియంత్రణ మెరుగుపడడమే కాకుండా ఎక్కువ కాలం లాభదాయకంగా ఉంటుంది. అలా సాధ్యం కాని పక్షంలో ఈ విధానం విజయవంతం కాదు.సుస్థిర ఫలితాలకు దారి చూపించదు.

అనితా కుమారి, పి.
ప్రిన్సిపాల్ సైంటిస్టు (వ్యవసాయ విస్తరణ)
ఐకార్ - సీపిసీఆర్ఐ, ప్రాంతీయ కార్యాలయం
కృష్ణపురం (పోస్ట్ ఆఫీస్)
కాయంకులం - 690533
E-mail: anithacpcri@gmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి ౨౩, సంచిక ౧, మార్చి ౨౦౨౧

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...