కాక్టస్ – పశు దాణాగా పెరుగుతున్న ప్రాధాన్యత


వెన్ను బలంగా అంతగా లేని కాక్టస్ (కలబంద తరహా మొక్క) చాపకింద నీరులా పశువులకు అన్ని విధాలా యోగ్యమైన మేతగా ప్రాముఖ్యాన్ని సంపాదించుకుంటోంది. నీటి వనరులను అద్భుతంగా సద్వినియోగం చేసుకోవడంలో ఎదురు లేని ఈ తరహా మొక్కలు నీటి వనరుల కొరత ఉన్న ప్రాంతాలలో పశువుల ఆకలి మంటలను చల్లార్చడంలో అమూల్యమైనదిగా గుర్తింపు పొందుతోంది. కర్నాటక రాష్ట్రంలో బెయిఫ్ సంస్థ చేపట్టిన కాక్టస్ వినియోగం ఇప్పుడు దక్షిణ రాష్ట్రాలన్నిటికీ విస్తరిస్తోంది.


మన దేశంలో దాదాపుగా 53 శాతం భూభాగం ఎడారి ప్రాంతమే. వాటిలో కొంత పాక్షికంగా ఎడారి లక్షణాలతో ఉంటుంది. చాలా ప్రాంతాలలో వాతావరణ ప్రతికూలతల ప్రభావం ఇప్పటికే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పొడి భూముల్లోనూ, పాక్షికంగా పొడిబారిన ప్రదేశాలలోనూ పంటల ఎదుగుదల రానురాను తగ్గిపోతోంది. పశువులకు సరిపడా మేత లభించడం లేదు. ప్రజలు జీవనోపాధి లేక అలమటిస్తున్నారు. ఇక వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు కడుపు నిండే దారి లేక గోల పెడుతున్నారు. చివరికి వారు పెంచుకుంటున్న పశువులకు కూడా సరిపడా మేత పెట్టలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

నీటి బొట్టు లేక పూర్తిగా పొడిబారిన భూములు, లేదా పాక్షికంగా పొడిబారిన నేలల్లో నీటి వనరులు చాలా పరిమితంగానే ఉంటాయి. పశువులకు మేతగా ఉపయోగపడే పచ్చగడ్డి పెంచడం కూడా అలాంటి నేలల్లో అసాధ్యం. ముఖ్యంగా వేసవి కాలంలో పశువులకు అందించే మేతలో ప్రత్యామ్నాయ మిశ్రమాలను ఉపయోగించవలసి వస్తూ ఉంటుంది. వేసవి వచ్చిందంటే రైతులు పచ్చగడ్డి కోసం చాలా పెద్ద ఎత్తున గాలించాల్సిందే. ఇక పశువులైతే నీటి శాతం హెచ్చుగా ఉన్న గడ్డి వంటి ఆహారం కోసం వెంపర్లాడతాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడిన మన దేశంలో ఇటీవల కొద్దికాలంగా కాక్టస్ తరహా అంటే కలబంద జాతికి చెందిన మొక్కలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. కానీ వాటిని మన దేశంలో వాణిజ్య స్థాయిలో పండించే ప్రయత్నాలు ఇంకా మన దేశంలో మొదలవలేదు.

ఇలాంటి కష్ట సమయాలలో ఆదుకోవడంలో ఇలాంటి కలబంద రకం మొక్కలు చాలా ఉపయోగకరం. వీటిని పెంచడం వల్ల భూసారం సురక్షితంగా ఉంటుంది. భూమిలోపలి పొరల్లో నీటి తేమను కాపాడుతుంది. అంతేకాకుండా పశువులకు అనువైన మేతగా కూడా ఉపయోగపడుతుంది. ఈ కారణాల వల్ల కాక్టస్ మొక్కల పెంపకాన్ని పశువుల దాణాగా ఉపయోగించేందుకు వేసవి వేళల్లో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతోంది. అంతేకాక ఈ మొక్కలకు కొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వీటిలో 85 నుంచి 90 శాతం వరకు నీరు ఉంటుంది. అందువల్ల పశువులకు ఆహారంగా ఇది చాలా అనువైనది. ఇంకా విటమిన్లు, కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు (5-9 శాతం) కాల్షియమ్, పొటాషియమ్ తదితర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.

బెయిఫ్ ప్రోత్సాహం

కర్నాటకలోని టిప్ టూర్ కేంద్రంగా పనిచేస్తున్న బెయిఫ్ గ్రామోదయ క్యాంపస్ ద్వారా క్యాక్టస్ సాగుకు ప్రోత్సాహం లభిస్తోంది.  అందుకోసం నాలుగు విభాగాలను ఏర్పాటుచేసింది. వాటిలో ఒకటి పరిశోధనల కోసం, మరొకటి ప్రదర్శనల నిర్వహణకు, ఇంకొకటి శిక్షణ కార్యకలాపాలు చేపట్టేందుకు వేర్వేరుగా పనిచేస్తుంటాయి. అంతేకాకుండా 2018-19లో జెర్మ్ ప్లాస్మా ను నిల్వచేయడం ప్రారంభించింది. బెయిఫ్ ప్రోత్సాహంతో పొలాల గట్ల మీద కాక్టస్ పెంపకాన్ని రైతులు చేపట్టారు. అదే విధంగా సాగుయోగ్యం కాని నేలల్లోనూ దీన్ని సాగు చేయడం ప్రారంభించారు. ఆ విధంగా సేద్య కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు.

2019-20 తరువాత నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, కొన్ని స్వచ్ఛంద ప్రభుత్వేతర సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాలల విద్యార్థులు, స్వయం సహాయక బృందాల వారు, ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేటర్లు (కృత్రిమ గర్భోత్పత్తి నిపుణులు) కాక్టస్ సాగు, మేతగా ఉపయోగాలపై ఏర్పాటుచేసిన ప్రదర్శనకు హాజరయ్యారు. వారిలో వేరు వేరు జిల్లాలకు చెందిన వారే కాక, రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో దాదాపు చిత్రదుర్గ జిల్లాకు చెందిన వారు 120 మంది, సిరా జిల్లాకు చెందిన వారు 220 మంది, 110 మంది ఇన్ సెమినేటర్లు కూడా ఉన్నారు. వారంతా కర్నాటకలోని మైసూరు, బెల్గాం, ధార్వాడ్, గదగ్, భాగల్ కోట్, హసన్, తుంకూరు జిల్లాల నుంచి వచ్చిన వారు. అలాగే తమిళనాడు నుంచి 65 మంది రైతులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 180 మంది, తెలంగాణ, టిప్ టూర్ ప్రాంతం నుంచి సిక్షణ కోసం వచ్చిన రైతులు లేదా పశు నిపుణులు ఉన్నారు. వాళ్లంతా కూడా కాక్టస్ ప్రయోజనాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తితోనే వచ్చారు. పశువులకు మేతగా దాని ప్రయోజనాలను నిర్ధారించుకునేందుకు ఆసక్తితో ఉన్నారు. వారిలో చాలా మంది చిరు మొక్కలను సేకరించి తమ వెంట తీసుకెళ్లి నేలలో పాతి పెంచడం ప్రారంభించారు. సుమారుగా ఒక్కో రైతు 10 నుంచి 15 కాక్టస్ మొక్కల పెంపకాన్ని చే

పొడి బారిన నేలల్లోనే కాక్టస్ మొక్కలను సాగుచేయవచ్చు. వీటికి నీటి సరఫరా మళ్లీ మళ్లీ అందించాల్సిన అవసరం లేదు. అయితే నెలకోసారి నీటిని అందించినా చాలు. అప్పుడే ఎదుగుదల సాఫీగా ఉంటుంది. దిగుబడి కూడా ఎక్కువగా లభిస్తుంది. నిస్సారమైన నేలల్లో కూడా పెంచుకోవచ్చు. అయితే అక్కడి నేలల్లో ఉప్పు పాలు అధికంగా ఉండరాదు. అలాంటి భూముల్లో వీటిని పెంచినప్పుడే అక్కడి భూమిని మళ్లీ సారవంతంగా మార్చుకోవచ్చు. అందుకు అనుసరించే ప్యాకేజీ ఆఫ్ ప్రాక్టీసెస్ చాలా సరళమైనవి. (బాక్సు 1) ముఖ్యంగా పశువుల దాణా గా ఎంతో అనువైన కాక్టస్ పెంపకం చాలా తేలిక. వీటి సాగుకు చాలా కొద్ది మాత్రం ఇన్ పుట్లు అవసరమవుతాయి. వాటి గురించి అవగాహన కలిగించడం కూడా చాలా తేలిక. నీటి ఎద్దడి సమస్యను ఇవి సమర్థవంతంగా తట్టుకోగలవు. ఎంత వేడిమి ఉన్న ప్రదేశాలలో అయినా ఏడాది పొడవునా పెంచుకోవచ్చు. ఈ కారణాల వల్ల కాక్టస్ సాగుకు ప్రత్యేకంగా ఎలాంటి నిర్వహణ భారం ఉండదు. సహజంగా రైతులకు అది ప్రోత్సాహకరం. పైగా పొలం గట్లపైనా లేదా ఎక్కడ కాస్త జాగా ఉంటే అక్కడే వీటిని పెంచుకోవచ్చు. ఇది ఒకరకంగా సజీవ సరిహద్దుగా కూడా ఉపయోగపడుతుంది. గాలి వేగాన్ని నియంత్రిస్తుంది. పశువులకు మేతగా ఉపయోగపడుతుంది.


కాక్టస్ సాగు విధానం

అక్టోబర్ నుంచి మార్చి వరకు అంటే వర్షాలు కురిసే వేళల్లో కాక్టస్ సాగు చేపట్టడానికి అనువైన సమయం. సాధారణంగా 6 నుంచి 15 అంగుళాల వెడల్పు ఉన్న కాక్టస్ ఆకులను భూమిలో నాటవలసి ఉంటుంది. అంటే ఆ ఆకులలోని తేమను 65 – 70 శాతం ఉండేలా నీడలోనే ఆరబెట్టవలసి ఉంటుంది. ఎత్తైన పొలం భూమిలో రెండు అడుగుల వెడల్పు, అడుగు ఎత్తు ఉండేలా సిద్ధం చేసిన నేలను సముచితమైన దూరంలో కాక్టస్ మొక్కల పెంపకం చేపట్టాలి.

నాటిన వెంటనే మొక్కలకు నీరు అందించరాదు. వారం రోజుల తరువాత కొద్దిగా నీటిని అందించాలి. (అంటే ఒక పాట్ కు లీటర్ చొప్పున) ఆ తరువాత 10 రోజుల వ్యవధిలో నీరు అందిస్తే చాలు.

నాటిన తరువాత 12 నెలల నాటికి 15 నుంచి 30 పెద్ద ఆకులు పెరుగుతాయి. ఏడాది తరువాత మాత్రమే కాక్టస్ సాగు సమయంలో బయో మాస్ సేకరణ చేపట్టాలి. మిగిలిన  ఆకులను మళ్లీ నాటడానికి ఉపయోగించవచ్చు. పూర్తిగా పెరిగిన వాటిని భద్రం  చేసుకోవాలి. మరి కొన్నిటిని కత్తితో ముక్కలు ముక్కలుగా చేసి పశువులకు ఆహారంగా అందించవచ్చు. మొక్కలను మొదటి సారి వీలైతే మీటర్ ఎత్తు వరకు పెరిగే వరకు పెంచుకోవచ్చు.

————————————————————————————————————————————————–

హెక్టార్ స్థలంలో 20 టన్నుల వరకు కాక్టస్ ఆకులను పండించవచ్చు. అది కూడా అదనంగా ఎలాంటి శ్రమ పడకుండా. ఎలాంటి నిర్వహణ ఒత్తిడి ఉండదు. ఏడాది కాలంలో 5 – 6 పశువులకు సరిపడే మేతను అందించగలదు. రోజుకు 10 కిలోల కాక్టస్ ఆకులను (అంటే 8 నుంచి 10 ఆకులను) పూర్తిగా ఎదిగిన పశువుకు ఆహారంగా అందించవచ్చు. (ఒక్కో ఆకు 0.800 గ్రాముల నుంచి 1.200 గ్రాముల బరువు ఉండవచ్చు.) వీటిలో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. బాగా ఎదిగిన ఆకులు చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఎండు గడ్డితో జతచేసి దాణాగా పశువులకు, గొర్రెలకు అందించవచ్చు. వీటిలో ఫైబర్ కుడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల వేసవిలో కూడా వీటిని మేతగా ఉపయోగించవచ్చు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చాలా మంది రైతులు ఇటీవలి కాలంలో తాము పెంచుకుంటున్న పశువులకు, చిన్న చిన్న జీవాలకు కాక్టస్ ఆకులను ఆహారంగా అందిస్తున్నారు. చిత్రదుర్గ పరిసరాలలో 23 మంది రైతులు 15020 కాక్టస్ మొక్కల పెంపకం చేపట్టారు. వారంతా వాటిని తమ పశువులకు ఎప్పుడెప్పుడు ఆహారంగా అందిద్దామా అని ఎదురు చూస్తున్నారు.

—– కాక్టస్ మొక్కల్లో నీటి మోతాదు అత్యధికం. అందువల్ల పశువులకు చాలా మేలు చేస్తాయి. వీటిలో 85-90 శాతం వరకు నీరు ఉంటుంది. అంతే కాకుండా విటమిన్లు, కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కాల్షియమ్, పొటటాషియమ్ ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. —–

 


ఐ.ఐ. హ్యుగర్

రీసెర్టి ప్రోగ్రామ్ మేనేజర్

బెయిఫ్ గ్రామోదయ క్యాంపస్

టిప్పు టూరు, కర్నాటక

E-mail: iranna.hugar@baif.org.in

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి ౨౦౨౩, సంచిక ౪, డిసెంబర్ ౨౦౨౧

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...