ఆరోగ్యమైన జీవితం కోసం పట్టణ వ్యవసాయం

అత్యంత వేగవంతమైన పట్టణీకరణ, భూసీలింగ్, బహుళ అంతస్థుల నిర్మాణం, రహదారి విస్తరణ, కార్యాలయాలు, మార్కెట్లు కారణంగా పెద్ద పట్టణాలలో, నగరాలలో తోట పనిచెయ్యడానికి భూమి కరువైపోతోంది. నగరాలలో అంతకంతకూ పెరిగేజనాభా, పెరుగుతున్న వాహనాలు కారణంగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఈ యాంత్రికతకు కొంత అంతరాయం కలిగించి, అలసిన మనసులు సేదతీర్చవలసిన అవసరం ఎంతోఉంది. నగరవాసులకు మిద్దెతోటల పెంపకం అన్నది ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తూ వారికి అందుబాటులో ఉన్న ఒక మంచిమార్గం.

ఆరోగ్యకరమైనకూరగాయలు, పండ్లు పండించుకోవడానికి తోటపని అనాదిగా ఆచరణలో ఉన్న పధ్ధతి. రోజువారీ ఆహారానికి ఆరోగ్యకరమైన, ఎటు వంటిరసాయనాలులేని పంట పండించుకోవడానికి ఇంటి పెరటిలోతోటల పెంపకం ఎంతో దోహదపడుతుంది. అయితే నగరాలలో భూమి దొరకడం కష్టంకాబట్టి ఇలా తోటలు పెంచుకోవడం సాధ్యపడదు. కాకపోతే, మిద్దెలవంటి ప్రదేశాలను ఆరోగ్యకరమైన కూరగాయలు పండించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సేంద్రీయంగా ఇంటిలో తోటలు పెంచుకోవడంవలన కలిగే ప్రయోజనాలలో సమర్ధవంతమైన వంటింటి వ్యర్థాల నిర్వహణఒకటి.

జూన్  2020 లో విధించిన లాక్డౌన్సమయంలో మిద్దెతోటల పెంపకం అన్న భావన ఊపందుకుంది. వ్యవసాయవిద్యలో పట్టాకలిగి ఉన్నందున, మొక్కలు పెంచడం పట్ల ఆసక్తికలిగి ఉండడం వలన, లాక్డౌన్సమయంలో నేను మిద్దెతోటను పెంచడం మొదలుపెట్టాను. ముందు చిన్నగా మొదలుపెట్టి, మామిద్దె 3నుకూరగాయల పెంపకానికివాడుతూ, క్రమంగావిస్తరించాను.

మిద్దె తోట ఏర్పాటు:

మిద్దెతోట ఏర్పాటుచేసే ముందు, ఎంతస్థలంఉంది, ఎటువంటి కంటైనర్లు (కుండీలు, సంచులువంటివి) ఉపయోగించాలి, ఏఏ మొక్కలు పెంచాలి, నీటి అందుబాటువంటి ఎన్నోవిషయాలు ఆలోచించడంజరిగింది. మిద్దెతోట పెంపకానికి ఉన్న స్థలం ఎంతోగుర్తించడం, మిద్దెతోట పెంపకానికి చాలా ముఖ్యం, ఎందుకంటే ఇలాగుర్తించడం వలనఉన్న స్థలంలో ఎన్ని కుండీలు పడతాయి అన్నది అంచనావేసుకోచ్చు. మొక్కలకు సరిపడా సూర్యరశ్మి, నీరు అందేవిధంగా ఈస్థలం ఎంపికజరిగింది.

తరువాత, మేడమీదపంటలు పెంచడానికి అనువైన మాధ్యమాలు ఏమిటి అన్నవి చూశాము. మార్కెట్లో మిద్దె తోటకి పనికివచ్చే ఎన్నోరకాల కంటైనర్లు ఉన్నాయి కానీ సాధారణంగా మనం ఎటు వంటి కూరగాయమొక్కలు వేస్తున్నాము అన్నదాన్ని బట్టి వీటిని ఎంచుకుంటాము. మేము 24 సెం.మీ. X  24 సెం.మీ. X  30 సెం.మీ. (పొ. X వె. X ఎ.) సైజులో, 150 మైక్రాన్ల మందం మరియు 600  గేజ్ఉన్న యు.వి. స్టెబిలైజ్డ్ఎ ల్.డి.పి.ఇ. బ్యాగ్లు ఎంచుకున్నాము. ఈ సైజు చాలావరకూ అన్ని రకాల కూరగాయమొక్కలకీ అనువుగాఉండి, దాదాపు 18 కిలోల పాటింగ్మిశ్రమం పడుతుంది. ఈ రకం మెటీరియల్ 4 – 5 సంవత్సరాల పాటు మన్నిక కలిగిఉంటుంది. అంతేకాక, ఖర్చుకూడాతక్కువే.

మొక్కలకి అవసరమైన పోషకాలు అందించడానికి ఈ సంచులలో మట్టి, కోకోపీట్మరియు కంపోస్ట్  1:1:1 నిష్పత్తిలో నింపాము. భూమినుండి సంక్రమించే తెగుళ్ళ నివారణకోసం, 100 కిలోల మిశ్రమానికి 1 కిలోచొప్పున ట్రైకోడెర్మాకలిపాము. ఈ మిశ్రమాన్ని సంచులలో 2/3 భాగంవరకూనింపాము.

ఇంటి వాడకానికై  వివిధ రకాలకూరగాయలు క్రమం తప్పకుండావచ్చేలా, విత్తనాలు వేసే సమయంలోనే, వివరంగా ప్రణాళికవేసుకున్నాము. అప్పటి సీజనుబట్టి, ఆ సాజన్లో బాగాదిగుబడి ఇచ్చేకూరగాయలనుఎంచుకున్నాము. అంతేకాక, త్వరగా పెరిగిత్వరగాకాపుకి వచ్చేపంటలనే ఎంచుకున్నాము. విత్తనాలను ధ్రువీకృత కంపెనీలు మరియు ఐ.ఐ.హెచ్.ఆర్. వంటి ప్రభుత్వ సంస్థల నుండి తెచ్చుకున్నాము, ఎందుకంటేవారుఇచ్చేనాణ్యమైన విత్తనాలుమంచి దిగుబడి ఇవ్వగల శక్తిని కలిగిఉంటాయి.

ఎన్నో రకాలకూరగాయలు 60 సంచులలో పెంచాము. నలుగురైదుగురు ఉన్న చిన్న కుటుంబానికి అవసరమైన కూరగాయలు పండించడానికి దాదాపు 50-60 సెంచులు (గ్రోబాగ్స్) సరిపోతాయి. ఫ్రెంచ్చిక్కుళ్ళు, నేలమీదపాకే  తీగజాతి మొక్కలను మూలలకి ఉంచడం జరిగింది, ఎందుకంటే ఈవిధంగా అవి పాకడానికినేల ఎక్కువ లభిస్తుంది. మిగతా సంచులనువాటి సూర్యరశ్మి అవసరాన్నిబట్టి, అంటే పూర్తి ఎండ, సగంఎండ మరియు చల్లని ప్రదేశం, ఏది కావాలో దాన్నిబట్టి అమర్చడం జరిగింది. చిక్కుడు జాతి పంటలను చేర్చడంవలన, కూరగాయలు లభించడంతో బాటు సహజీవన నత్రజని స్థిరీకరణద్వారా భూసారం పెరిగింది.

బాక్స్ 1 : వివిధ సెజన్లలో వివిధ కూరగాయలు

ఖరీఫ్ (జూన్నుండిఅక్టోబర్) – వంకాయ, టమోట, మిరప, బెండ, పందిరిచిక్కుడు, గోరుచిక్కుడు, మెంతికూర, తోటకూర, ఫ్రెంచ్చిక్కుడువంటివి

రబీ (అక్టోబర్ – మార్చి) ముల్లంగి, పాలకూర, సొయకూర, కొత్తిమిర, నూల్ఖోల్, బంగాళాదుంప, ఉల్లి, క్యాబేజీ, గోబీపువ్వు, చుక్కకూర, బీట్రూట్, బఠానీ, బ్రోక్కొలివంటివి.

వేసవి – అన్ని రకాల సొరజాతి పంటలు, దోస, తర్భుజ, పుచ్చ, ట్మోటోలు, ఫ్రెంచ్చిక్కుళ్ళువంటివి

వివిధ రకాల పంటలు ఈవిధంగా పండించ బడ్డాయి:

1) 15 సంచీలు, ఆకుకూరల కోసం, ఆయా సీజను బట్టి పాలకూర, తోటకూర, కొత్తిమిర, సోయకూర, మెంతి, పుదీనా, రాజ్గీరావంటివాటికి

2) 30 సంచులు బెండ, వంగ, టమోట, మిరప పెంచడానికి (ఒక్కోటీ 5 సంచులలో)

3) 10 సంచులు ఫ్రెంచ్చిక్కుళ్ళూ

4) 2 సంచులు పందిరి చిక్కుళ్ళకి (పాకేరకం)

5) 8 సంచులు ముల్లంగి మరియు నూల్ఖోల్

6) 5 సంచులు ఉల్లిపాయలకి

పంటసమ్రక్షణ

ప్రతి ఇంట్లో రోజూ కొంత సేంద్రీయ పదార్ధం, అనగా, వంటింటి వ్యర్ధం, ఎండూ అకులు, మిగిలి పోయిన పాదార్ధాలు వంటివి ఉంటాయి. ఈ వ్యర్ధాలను సమర్ధవంతంగా రేసైకల్ చేయొచ్చు . వీటిని వానపాములకు ఆహారంగా వేసి వెర్మీకంపోస్టు గా తయారుచేసుకోచ్చు. అంతేకాక  వంటింటి వ్యర్ధాన్ని మిరప, వంకాయ, టొమాటో మరియు బెండవంటి మొక్కలకు మల్చ్ గా వేయవచ్చు.

రోజువారీ చెత్త ఈ పంటలలో మల్చ్ గావేశి, కొంత చివికిన తరువాత, ఈ వ్యర్ధాని వెర్మీకంపోస్టు బిన్లో ఆవు పేడ స్లర్రీ వరుస మీద వెయ్యగా, వానపాములు వర్మీకంపోస్టింగ్ ప్రక్రియను మరింత సమర్ధవంతంగా చేస్తాయి. వెర్మీకంపోస్టు బిన్ను నీడలో, వాననీరు నేరుగా లోపలికి వెళ్ళని ప్రదేశంలో పెట్టాలి. 2-3 నెలల తరువాత, బిన్ ఖాళీ చేసి, వెర్మి కాస్ట్ గా ఉపయోగించవచ్చు. అంతేకాక, వెర్మీవాష్, అంటే బిన్యొక్క బయటి చ్ద్వారం దగ్గర చేరుకునే ఒకరకమైన ద్రవం 10 % చొప్పున నీటిలో కలిపి, మొక్కలకు పిచికారీ చెయ్యడంవలన, మొక్కలకు పోషకాలు అందడంతో బాటు పెరుగుదల ప్రోత్సాహకంగాకూడా పనిచేస్తుంది.

వెర్మీకంపోస్టుతో బాటు, ఒక్కో పంటా అయిపోయాక దిబ్బెరువు మరియుకం పోస్టుకూడా ఉపయోగించుకోచ్చు. తోటకి సున్నం మరియు పోటాష్ అందాలంటే కచిక బూడిద చాలామంచిది. కొంచొం బూడిదను కంపోస్టులో కలిపి పెరుగుతున్న పంటలకువెయ్యచ్చు.

మిద్దెపంటలో ఎప్పుడూ మనం సేంద్రీయ పదార్ధాల మీద ఆధారపడతాము కాబట్టి, పంటల మీద చీడపీడలు రావడం చాలాసహజం. అయితే పలురకాల మొక్కలు వెయ్యడం వలన చీడపీడల వలన కలిగే నష్టం తక్కువ ఉంటుంది. ఉదాహరణకి, మిరపలో ఆకుముడుత, చిక్కుడుపంటల్లో తెల్లదోమ – వృక్ష కీటకనాశినులతో నివారించవచ్చు.

బాక్స్ 2

ప్రిడేటర్లు పారాసిటాయిడ్స్ద్వారా కూడా చీడ పీడలు సహజంగా నియంత్రించ బడతాయి. కూరగాయ పంటను సకాలంలో నాటడంవలన కూడా పంట చీడపీడల నుండి తప్పించుకుంటుంది. మేము ఎటువంటి పురుగు మందులు ఉపయోగించలేదు.

 

బాక్స్ 2: వృక్ష కీటక నాశినులు కొన్ని ఉదాహరణలు

వేపాకుకషాయం: 250 గ్రా. వేపాకు అరలీటరు నీటిలో నాన బెట్టాలి . పాత్రమూతను బుట్టలో కప్పి ఉంచి 3 రోజుల పాటు మురగనివ్వాలి. ఈ ద్రవాన్ని 10 ఇంతలు నీటితో కలిపి రసంపీల్చే పురుగుల నివారణకు ఉపయోగించవచ్చు.

పుల్లమజ్జిగ: పుల్ల మజ్జిగను పల్చగానీటితో కలిపి మొక్కల మీద పిచికారీ చెయ్యడం వలనకొన్ని తెగుళ్ళు నియంత్రించవచ్చు.

కచికబూడిద: వంగ, తీగజాతి కూరగాయలు మరియుబెండ వంటి పంటలలో కచిక బూడిద చల్లడం ద్వారా దాసరి పురుగు, పేనుబంక, కుకుంబర్స్ బీటల్ అనే పెంకిపురుగు వంటికొన్ని చీడ పురుగులను,  బూడిదకు ఉన్న యాంటీ ఫీడింగ్ (ఆకులు తినడానికి వీలు లేకుండా చెయ్యడం గుణంకారణంగా) నియంత్రించవచ్చు.

 

పంటకోత ప్రయోజనాలు

విత్తనాలు వేసే సమయంలోనే సరైన ప్రణాళిక వేసుకోవడంవలన దీర్ఘకాలం పాటు వరుసగా కూరగాయలు కోతకు వచ్చయి. వివిధ రకాల కూరగాయ పంటలతో నా మిద్దెతోట చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. ఉదాహరణకి అన్ని ఆకుకూర పంటలూ 30 రోజులకు కోతకు వస్తాయి. తరువాత 15 రోజుల కొకసారి కోతకువస్తాయి.

చిక్కుడు పంట 50 రోజుల తరువాత పంటకు వస్తుంది. తరువత 2-3 రోజుల వ్య్వధిలో కోసుకోచ్చు. మిగతా కూరగాయలు వాటికాలాన్నిబట్టి కోతకు వచ్చి కనీసం ఒకనెల రోజుల పాటు కాస్తాయి.

చాలా శ్రధ్ధగా పెంచడం వలన పంట ఉత్పత్తి పొలాల్లో పెంచినపంట అంత బాగానూ వస్తుంది. అంతేకాక, మార్కెట్లో లభించే కూరగాయలతో పోలిస్తే ఈ కూరగాయలు తాజాగా ఉండి మంచి పోషక విలువలు కలిగ్, రుచిగా కూడా ఉంటాయి. ఈ కూరగాయలు ఇంటి వినియోగానికి వాడబడతాయి. గ్రుహావసరాలకి మించిన కూరగాయలు చుట్టుపక్కలవారికి పంచి పెట్టడం జరుగుతుంది.

ఖర్చులు, రాబడిలెక్కకట్టగా, మిద్దెతోట ఏర్పాటుకు మరియు కూరగాయలపెంపకానికీ, ఏడాదిలి అయిన మొత్తం ఖర్చు రూ. 5,222. ఉత్పత్తి  అయిన కూరగాయల విలువరూ. 8,480. ఇందువలన, మిద్దెల మీద కూరగాయలు పెంచడం అన్నది లాభసాటి వ్యవహారమే అని రుజువైంది.

మిద్దెతోటల పెంపకం ఆరోగ్యానికి హానికలిగించే అవకాశాన్ని తగ్గించడం, విరామ సమయాన్ని ఉపయోగించి ఆరోగ్యకరమైన ఆహారం పండించు కోవడం వంటి అనేక ఇతర ప్రయోజనాలు కూడాఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇంటితోటలు సేంద్రీయంగా పండించడంవలన వంటింటి వ్యర్ధం సమర్ధవంతంగా నిర్వహించబడుతుంది. అంతేకాక, ఇది నగరవాసుల పని ఒత్తిడి తగ్గించి సేద తీరుస్తుంది.

మిద్దె తోటల పెంపకంలో ప్రత్యక్ష అనుభవం గడించాక, ఆరోగ్యకరమైన జీవితం కోసం తోటలు పెంచడంలో మా ప్రాంతంలోని వారికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. భవిష్యత్తులో, బెంగుళూరులో మిద్దెతోటలపెంపకం విషయమై నేను ఒక కన్సల్టెన్సీ (సలహాలు, సంప్రదింపు) మొదలుపెట్టే ఉద్దేశ్యంతో ఉన్నాను.

కృతజ్ఞతలు  : తోటఏర్పాటులోనూ, ఈవ్యాసంరచనలోనూ శ్రీసంతోషకె.ఎం. గారు అందించిన తోడ్పాటుకు, రచయిత తమ మన హ్పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

రుండన్ వీ
Ph .D . స్కాలర్, డిపార్ట్మెంట్ అఫ్ అగ్రోనోమి
యూనివర్సిటీ అఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, ధార్వాడ్
E-mail: rundangowda10@gmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి ౨౪ , సంచిక 1 , మార్చ్ ౨౦౨౨

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...