అతి సూక్ష్మజీవాలు సేద్య వనరుల పునర్వినియోగానికి నేస్తాలు

వ్యవసాయం సాగుతున్న దశలోనే సేద్య వనరులను మళ్లీ మళ్లీ వినియోగించుకునేందుకు అనుకూలంగా తీర్చిదిద్దడంలోనూ, వాటి నిర్వహణలో సమర్థత పెంపొందించడంలోనూ ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వాతావరణపరంగా మొక్కలకు ఎదురయ్యే సవాళ్లను తట్టుకునే విషయంలో ప్రయోజనకరం. అలాగే విచక్షణ లేకుండా వ్యవసాయంలో రసాయనిక పదార్థాలను ఉపయోగించడం వల్ల ఎదురయ్యే చెడు ఫలితాలను అదుపు చేయడం సాధ్యమవుతుంది. చివరిగా భూసారాన్ని కలుషితం చేసే  కాలుష్య కారకాలైన సేంద్రీయ-లోహ (ఆర్గానో-మెటల్ పొల్యుటెంట్స్) మిళిత ప్రభావాలనుంచి రక్షణ పొందవచ్చు.

ప్రస్తుతం వ్యవసాయ రంగానికి హాని కలిగించే ధోరణి చాలా ఎక్కువయింది. ముఖ్యంగా పునర్వినియోగం సాధ్యంకాని రసాయనాలతో కూడిన  సేద్య ముడివస్తువుల వాడకాన్ని విపరీతంగా ప్రోత్సహించి భూసారాన్ని ధ్వంసమయ్యే స్థాయికి తీసుకువెళ్లే విధానమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రకమైన పునర్వినియోగానికి తోడ్పడని ముడి వస్తువులను ఉపయోగించినట్లయితే అధిక దిగుబడి వచ్చినా భూసారం అట్టడుగుకు క్షీణించిపోతుంది. ఈ విధానాలలో భూసారాన్ని కేవలం ఒక భౌతిక-రసాయనిక వస్తువుగా మాత్రమే పరిగణిస్తున్నారు. అంతేకాని సహజసిద్ధంగా భూమిలోని మట్టికి ఉండే చైతన్యశీలమైన, క్రియాశీలమైన జీవసంబంధ విశిష్టమైన లక్షణాలను గుర్తించడం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సేద్య విధానాలలో మార్పులు చేస్తే వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు పరిష్కారాలు లభిస్తాయి. సేద్య రంగంలో భూమికి పైన ఉండే మట్టిలోను, లోపల ఉండే జీవ సంబంధ రసాయన లక్షణాలను కాపాడుకుంటూ బాహ్యంగా ప్రభావం చూపించే పర్వరణ అనుకూల విధానాలను కూడా అనుసరించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వ్యవసాయం పర్యావరణ సమతుల్యతతో పురోగతి సాధిస్తుంది. రసాయనాలను విరివిగా ఉపయోగం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలను గమనించిన వ్యవసాయదారులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఎదురుచూస్తున్నారు. భూసారాన్ని సజీవంగా ఉంచి కాపాడుకోవడంపై ఇప్పుడు వారు తమ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. మరే విధంగాను వ్యవసాయం-పర్యావరణం మధ్య సమతుల్యత అనేది పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని వారు గుర్తించారు. ఈ అన్వేషణలో భాగంగానే ప్రకృతిపరంగా సహజ సిద్ధమైన అతిసూక్ష్మజీవులను ఆధారం చేసుకుని పర్యావరణ అనుకూల సేద్యం చేసేందుకు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ భూముల ఉత్పాదనకతను సుస్థిరంగా నిలబెట్టుకునేందుకు సేద్యంలో జీవవైవిధ్యం చాలా ప్రధానమైన అంశమని గుర్తించగలుగుతున్నారు.

అతిసూక్ష్మజీవాలు-ప్రయోజనకరమైన ప్రక్రియలు

మన భూగోళంపైనే మనతో పాటు సహజీవనం సాగిస్తున్న సాధారణ, అసాధారణ, విపరీతమైన సూక్ష్మజీవాలు ఇవి. ఇవి కూడా జీవజాలంలో ఎదుగుతూ వస్తున్న జీవాలే. సహజసిద్ధంగా భూసారాన్ని పునరుద్ధరించడంలో, పునరుజ్జీవన లక్షణాలతో తమ నివాస స్థలాలకు అనుగుణంగా మార్పు చెందుతూ మనకు అత్యంత సహాయకారులుగా జీవనం సాగిస్తున్నాయి.ఇలా మార్పు చెందే క్రమంలో భూసారాన్ని పునరుజ్జీవింపజేయగల సామర్థ్యం వీటికి ఉంది. మొక్కలను ఆరోగ్యవంతంగా కాపాడుతూ వాటి ఎదుగుదలకు తోడ్పడతాయి. సేద్య రంగంలో పంటల సాగు క్రమంలో మెరుగైన దిగుబడుల సాధనకు సహాయపడతాయి. అయితే అందుకు మన వంతుగా మనం వాటి మనుగడకు అనువైన భద్రతను మనమే సమకూర్చాలి. పర్యావరణాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడంలో వీటి ప్రయోజనాలను ముందుగా మనం గుర్తించాలి. అందుకు జీవ సంబంధ వస్తువులను (అంటే బయో ఫెర్టిలైజర్లు, బయో పెస్టిసైడ్స్, సూక్ష్మజీవులను ఉపయోగించడం ద్వారా) తయారుచేసుకుంటూ వాటి వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే పర్యావరణకు అనుకూలమైన భూసారాన్ని మనకు అవి సమకూర్చగలుగుతాయి.

మట్టిపై పొరలలో నిక్షిప్తమై ఉండే జీవ సంబంధ విశిష్ట లక్షణాలను వివరించే శాస్త్రం ప్రకారం, మొక్కల ఎదుగుదలకు సంబంధించి గణనీయమైన ప్రభావం తెలుసుకోవచ్చు. ఈ మట్టి పొరలలోని పై పొరలలో ఉండే రసాయనక ప్రత్యేకతల వల్ల మొక్కల ఎదుగుదల సవ్యంగా ఉంటుంది. పంటల పెరుగుదలకు, అధిక దిగబడికి అత్యవసరమైనవని గమనించవచ్చు.  ఈ ప్రయోజనాలను సాధారణ పరిస్థితులలో మాత్రమే కాకుండా నష్టదాయకంగా ఉండే పరిస్థితులలో కూడా పొందవచ్చు. అందువల్లనే అత్యంత సూక్ష్మజీవజాలాన్ని కాపాడుకుంటూ వాటిలో కూడా వైవిధ్యాన్ని పెంపొందించడం చాలా అవసరం. అలా చేయగలిగితే రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. సేద్య కార్యక్రమాలలో భాగంగా వాటి అభివృద్ధి కూడా మెరుగవుతుంది.

వ్యవసాయ పంటలకు ఈ అతి సూక్ష్మ జీవుల ప్రతిక్రియల ఫలితంగా మొక్కలకు అత్యంత అవసరమైన అనేక వల్ల అనేక రకాలైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాంటి పోషకాలలో ముఖ్యమైనవి – నత్రజని, ఫాస్ఫరస్ పోషకాన్ని ద్రవరూపంలోకి మార్చి మరింత ఎక్కువ పాళ్లలో అందడానికి తోడ్పడతాయి. ఇంకా పొటాషియం, జింక్, ఐరన్ అందించే చెలేట్ సైడర్ఫోర్స్ వంటివి కూడా అందుబాటులోకి వస్తాయి. పైటోహార్మోన్స్, ఇతర కార్బన్ ఆధారిత పోషకాలు అందుతాయి. పోషకాలను మొక్కల వినియోగానికి అనువైన ఖనిజాల రూపంలోకి రూపాంతరం చేసి సమకూరుస్తాయి. పునరుద్ధరణకు అవకాశం ఉన్న వ్యవసాయ వ్యర్థాలను కుళ్ళిపోయేలా చేసి భూసారం పెంపొందించడంలో ఉపకరిస్తాయి. భూసారానికి నష్టం కలిగించే వాటిని తొలగించి వాటి వల్ల ఎదురయ్యే హానికర ప్రభావాలను తగ్గించి భూసారాన్ని కాపాడతాయి. ఈ ప్రయోజనాలన్నిటనీ నిశ్సబ్దంగా నిరంతంరం అందిచగలవు ఈ సూక్ష్మజీవజాలం. మొక్కల మొదళ్లను అంటే వేళ్ల ఎదుగుదలకు సహకరిస్తాయి. పెరుగుదలలో ఎదురయ్యే ఇబ్బందులను చాలా వరకు అదుపు చేయగలుగుతాయి. మొక్కల ఎదుగుదలకు ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. మొక్కల్లో సహజసిద్ధమైన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వేళ్ల మొదళ్లలో ఉండే మట్టిలో జీవ సంబంధ రసాయ క్రియలకు తోడ్పడతాయి. ఈ విధంగా అత్యంత సూక్ష్మజీవుల వలన సేద్య కార్యకలాపాలకు అందివచ్చే ప్రయోజనాల గురించి వ్యవసాయదారులకు సరైన అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అలా వీటి ప్రాధాన్యతపై రైతులకు అవగాహన పెరిగి అమలులోకి తీసుకువస్తే ఈ జీవజాల సంపత్తిని పెంచుకోవడమే కాకుండా ఆరోగ్యవంతమైన మొక్కల పెరుగుదలతో పాటు భూసారాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఒక విధంగా బయట మార్కెట్ నుంచి తీసుకువచ్చి ఉపయోగించే అనేక ముడి వస్తువులలో పాటు కానీ, వాటికి ప్రత్యామ్నాయాలను స్వయంగా తమతమ వ్యవసాయ క్షేత్రాలలోనే తయారుచేసుకోవచ్చు. అందుకు అనుకూలంగా రైతు సమాజాన్ని ప్రోత్సహించవచ్చు.

అతి సూక్ష్మ జీవజాలం సహాయంతో సిద్ధంచేసిన ముడి వస్తువులు  పంటల ఎదుగుదలకు విశేషంగా తోడ్పడతాయి. వీటి ఉపయోగం ఎన్నో ప్రయోజనాలకు దారి చూపిస్తుంది. భూసారాన్ని ప్రభావితం చేసే వాతావరణ, జీవ భౌతిక కారణాలు, ఇంకా దీర్ఘకాలిక సేద్య కార్యక్రమాల ప్రభావాల కారణంగా వచ్చే వ్యతిరేక ప్రభావాలను నివారించవచ్చు. భూసారం సవ్యంగా ఉంటేనే మొక్కల ఎదుగుదల సవ్యంగ సాగుతుంది. ఇటీవల కాలంలో వ్యవసాయదారులలో పెరుగుతున్న అవగాహన, విషయ పరిజ్ఞానం కారణంగా పంట మొక్కల పెరుగుదల విషయంలో మూక్ష్మజీవజాలం ప్రయోజనాలపై స్పష్టత కూడా పెరుగుతోంది. పర్యావరణ పరంగా కూడా లాభదాయకం అయినందున  రకమైన సూక్ష్మజీవజాలం సహాయంతో సేద్యం చేసేందుకు వారు ముందుకు వస్తున్నారు. వాస్తవానికి ఈ క్రమంలో జరిగే సహజసిద్ధమైన క్రియ, ప్రక్రియలపై వారికి అంతగా ఆసక్తి ఉండడం లేదు. కానీ, వాటి ప్రభావంతో సమకూరే ప్రయోజనాలపై మాత్రం ఆసక్తి పెరుగుతోంది. అందువల్ల వారికి సరైన శిక్షణ ఇవ్వడం అవసరం. ముఖ్యంగా జీవ సంబంధింత ప్రత్యామ్నాయాల గురించి వారికి సరైన అవగాహన కల్పించాలి. ప్రత్యామ్నాయాలను తెలియజేయాలి. భూసారం రక్షణలోను, మొక్కల ఎదుగుదలలోను కలిగే ప్రయోజనాలు వారికి వివరించడం చాలా అవసరం. వీటి వలిల కలిగే లాభాల్లో నాణ్యత రూపంలోనూ, ముందు జాగ్రత్తలు, సాంకేతిక అంశాలతో పాటు ఖర్చులు తగ్గడానికి ఉన్న అవకాశాలను వివరించాల్సి ఉంటుంది.

ఈ లక్ష్యం సాధించే ఉద్దేశంతోనే సూక్ష్మజీవాల ప్రయోజనాలను దాదాపు 1200 మంది వ్యవసాయదారులకు సమగ్రంగా వివరించేందుకు ప్రయత్నం చేశాం. వారు ఇప్పుడు పూర్తిగా సుశిక్షితులయ్యారు. వారిలో ఉత్సాహం కనిపిస్తోంది. ఇలాంటి ముడి వస్తువులను విత్తన శుద్ధిలో విరివిగా ఉపయోగించేట్లు ప్రోత్సహించడం జరిగింది. అంతేకాకుండా ఏయే సమయాలలో ఏరకమైన పద్ధతి అనుసరించాలో వివరించాం. నాట్లకు ముందు, పంట మధ్యకాలంలో, పూత దశకు పది రోజుల ముందు  వాటిని పాటించాల్సి ఉంటుందని తెలిపాం.

ఫలితాలు

 సమన్వయంతో కూడిన ఈ పద్ధతిలో వరి, గోధుమ, కూరగాయల సాగులో నాణ్యత పరంగాను, దిగుబడుల పరంగాను మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇది గమనించిన రైతు సోదరులు ఈ పంటల సాగులో తరచుగా బయో-ఎన్ పీ కే ఇంకా జెడ్ ఎన్ సూక్ష్మజీవజాల ఆధారిత ముడి సరుకుల వినియోగిస్తున్నారు. ఇటువంటి బ్యాక్టీరియా ఆధారిత నమూనాలను వినియోగించడం వల్ల వరి, గోధుమ సాగులో రసాయనక ఎన్ పి కె వాడకం వల్ల అయ్యే ఖర్చులో 30 శాతం వరకు ఆర్థికంగా ఆదా అవుతోంది. అదే విధంగా బయో క్రిమిసంహారకాలైన ట్రిచోడెర్మా, సిండోమోనస్ (Trichoderma and Pseudomonas) ఉపయోగిస్తున్నారు. వీటిని విత్తన శుద్ధకి, మొక్కల శుద్ధికి మాత్రమే కాకుండా వ్యవసాయ క్షేత్రాలలో మట్టికి కూడా ఉపయోగిస్తున్నారు. చిక్కుడు సాగులో మట్టి ద్వారా వ్యాపించే చీడపీడల నివారణకు కూడా వీటిని వినియోగిస్తున్నారు. ఫలితంగా సాగు వ్యయం భారీగా తగ్గిపోయింది. అలాగే నర్సరీలలో పెంచుతున్న మొక్కల ఆరోగ్య పరిస్థితిలో 40 శాతం వరకు మెరుగుదల కనిపించింది. మట్టి కారణంగా వచ్చే చీడపీడల బెడద తగ్గిన కారణంగా కనీస నష్టాల సమస్య పరిష్కారమైంది. ఇక దిగుబడి విషయంలో దాదాపు 7 నుంచి 10 శాతం వరకు పెరుగుదల కనిపించింది.

 ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ రకమైన ఉప ఉత్పత్తులను వినియోగించడం మొదలుపెట్టిన తరువాత ఒకవేళ పాత పద్దతిలోకి వెళ్లినా తిరిగి ఈ విధానాలనే అమలుచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకోసం ఈ రకమైన ముడి వస్తువులు మట్టి నాణ్యతపై చూపించే ప్రభావం వెనుక ఉండే శాస్త్రీయ అంశాలను తెలుసుకునేందుకు వారు ఉత్సాహం చూపిస్తున్నారు. భారత ప్రభుత్వ అనుబంధ శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల విభాగం చేపట్టిన ప్రోత్సాహక చర్యలలో భాగంగా సాంకేతిక అంశాలను వివరించే కరపత్రాలు, బులెటిన్లు, ఇంకా సూక్ష్మజీవుల ప్రయోజనాలను (ద్రవరూపంలో కానీ, పౌడర్ రూపంలో కానీ తయారుచేసే విధివిధానాలు – ఫార్ములేషన్స్) తెలియజేసే సమాచారాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటిని అధ్యయనం చేసిన తరువాత రైతులు రాష్ట్ర వ్యవసాయ శాఖల ద్వారా లేదా బయట మార్కెట్ లో లభించే ఉత్పాదనలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

రైతులలోని గమించిన తరువాత ఈ అధ్యయన ఆసక్తి సూక్ష్మజీవుల ఆధారిత ముడి వస్తువుల వినియోగం వల్ల పంటలపై కనిపించే  సానుకూల ప్రభావాలను వివరించేందుకు మాకు కూడా మరింత ఉత్సాహం పెరిగింది. సుస్థిర ప్రయోజనాలు, పెట్టుబడి రూపంలో సమకూరే లాభాలు, వినియోగించవలసిన ఉత్తమ పద్ధతులు, సాంకేతిక-వాణిజ్య పరమైన అంశాలు, పర్యావరణపరంగా సానుకూలతలు వివరించే కృషిని మరింత చురుగ్గా చేపడుతున్నాం. విస్తృత విస్తీర్ణంలో ఇలాంటి వాటిని ఉపయోగించినందువల్ల మెరుగైన పంట చేతికి వస్తుందని వివరించగలుగుతున్నాం. ఇదే లక్ష్యంతో సూక్ష్మజీవుల ఆధారిత సేద్య విధానాలను అనుసరించేలా ప్రోత్సహించగలుగుతున్నాం. వ్యక్తులుగా కానీ, కొంతమంది సమష్టిగా కానీ రసాయనాల వాడకాన్ని విడిచిపెట్టి ధాన్యపు పంలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, చెరకు కూరగాయల సాగులో ఈ రకమైన నివారణ చర్యలు చేపట్టేలా ప్రోత్సహించడం జరుగుతోంది.

బయో కంపోస్టు ప్రాధాన్యత

పెద్ద ఎత్తున చేపడుతున్న పంటల సాగు, ఉత్పత్తులలో భూ సంబంధిత సేంద్రీయాల (సాయిల్ ఆర్గానిక్ మేటర్ – ఎస్ఓఎం) పరిమాణం చాలా తక్కువగానే ఉంటున్నది. మట్టిలో ఉండాల్సిన సేంద్రీయాల పరిమాణం కేవలం 0.4 శాతం నుంచి 0.5 శాతం లోపే ఉంటున్నది. ఈ సేంద్రీయాలను పునరుద్ధరించడం చాలా కష్టసాధ్యమైన విషయం. అందుకు మనం చాలా హెచ్చు మోతాదులో కార్బన్ మిళిత ఉపఉత్పత్తులను వినియోగించాల్సి ఉంటుంది. దీర్ఘకాలం పాటు ఇటువంటి సేంద్రీయాలు కొరతగా ఉన్న నేలల్లో సూక్ష్మజీవులు బతకలేవు. మనుగడ సాగించలేవు. ఫలిత్గా ఉత్తమ వ్యవసాయ పద్ధతులలో సేద్యపు నేలల్లో సహజసిద్ధమైన ప్రయోజనాలు లభించడం కూడా చాలా క్లిష్టమైన సమస్యగా మారుతుంది. అందువలన అతి కీలకమైన సేంద్రియాలను వ్యవసాయ భూములకు ప్రత్యామ్నాయ మార్గాలలో అందజేయడం అత్యవసరం. అప్పుడే భూమి నుంచి ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతాం. పెరిళ్లలోనే తయారుచేసిన ఎరువులను (ఫార్మ్ యార్డ్ మాన్యూర్) మట్టిలోనికి చేర్చడం కొన్ని రకాలైన పంటలకు మరింత అవసరం. అలాంటి పంటల్లో ముఖ్యమైనవి – సెస్బినియా, క్రోటలేరియా – వంటి పంటలను ముందుగా సాగుచేసి వాటి వ్యర్థాలను పొలాలోని మట్టికి అందించాలి. వీటి సాగు వల్ల మట్టికి కావలసిన సేంద్రియాలు లభ్యమవుతాయి. అయితే ఆ తరువాత మళ్లీ రసాయనిక ఎరువులు వంటివి వినియోగించినట్లయితే ఏ ఉపయోగం ఉండదు. నేలలోని కార్బన్ పరిమాణం క్షీణించిపోతుంది.

 దేశవ్యాప్తంగా రసాయనాలపై ఆధారపడి చేస్తున్న పంటల సాగులో పెద్ద మొత్తంలోనే వ్యర్థాలు లభిస్తుంటాయి. వాటిని రీసైకిల్ చేసి మళ్లీ సరైన పద్ధతిలో వినియోగించవచ్చు. అలా చేయకపోతే ఆ వ్యర్థాలు వృధా చెత్తగానే మిగిలిపోతాయి. అందువల్ల వ్యవసాయ వ్యర్థాలను సరైన పద్ధతిలో రీసైకిల్ చేసినట్లయితే కార్బన్ మిళిత సేంద్రీయాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇందుకు వ్యవసాయ వ్యర్థాలను సూక్ష్మజీవుల సహాయంతో బయో కంపోస్టుగా రూపొందించినట్లయితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. అంతేకాకుండా ఈ రకంగా వ్యవసాయ వర్థాలతో తయారుచేసిన కంపోస్టును మరింత శుద్ధిచేసి ద్రవీకరించడానికి అనువైన నత్రజని, ఫాస్ఫేట్, ఇంకా పోటాషియం, జింక్ వనరులు, ఐరన్ సమృద్ధిగా ఉండే కెలేటర్లు, ఫైతోహార్మోన్లు నిండిన సంపన్నమైన ఎరువుగా మార్చుకోవచ్చు. కేవలం 15 నుంచి 20 రోజుల పాటు ఈ వ్యర్థాలను పొలంలోనే ఉంచివేయాలి. ఈ రకంగా బయో పోషక సమృద్ధమైన కంపోస్టు ప్రయోజనకరమైన లక్షణాలతో నిండి ఉంటాయి. సంప్రదాయక వినియోగానికి ఉపయోగకరం.

 ఇటువంటి బయో బదిలీ (కన్వెర్షన్) విధానం గురించి ఉత్తరప్రదేశ్ లోని నాలుగు జిల్లాల్లోని రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నం సాగింది. మావ్, అజాంగఢ్, ఘాజీపూర్, బల్లియా జిల్లాల్లోని 30 గ్రామాలకు చెందిన 3500 మంది రైతులకు ఈ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం పూర్తయింది. నత్రజని, జింక్ సంపన్నమైన ఈ తరహా బయో కంపోస్టును వరి పొలాలలోనూ, ఐరన్ ఆధారిత కంపోస్టును ఇతర పంటల సాగు అంటే కూరగాయలు, పువ్వులు, పండ్ల తోటలలోనూ విస్తృతంగా ఉపయోగిచేందుకు ప్రోత్సహించడం జరిగింది. ముడి కంపోస్టును మరింత శక్తివంతం చేసేందుకు వ్యాధుల నివారణలో ఉపయోగపడే సూక్ష్మజీవులను ఉపయోగించేలా ప్రోత్సహించాము. ఇందుకు ట్రిచోడెర్మా (ఫంగి), పెండోమానస్, బసిలీస్ (బ్యాక్టీరియా) ఆధారంగా కంపోస్టును మరింత ప్రయోజనకరంగా తయారుచేసే విధానం వివరించడం జరిగింది. ఈ కంపోస్టును విత్తనాభివృద్ధిలోను, మట్టి ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వగల కాయగూరల సాగులోనూ, అడవుల్లో పెరిగే చెట్ల పెంపకంలోనూ ఉపయోగించడం జరుగుతోంది. ఈ రకంగా కాయగూరలను వాణిజ్య పరంగా కూడా సాగుచేయవచ్చు. మరో మార్గం ఏమిటంటే కొంత మంది రైతులు సమష్టిగా లేదా రైతు సహాయ బృందాల రూపంలో పెద్ద మొత్తంలో శక్తివంతమైన సూక్ష్మజీవుల ఆధారిత కంపోస్టు తయారీని చేపట్టవచ్చు. ఈ విధానం అనుసరిస్తే రైతులలో పారిశ్రామిక నిర్వహణ సామర్థ్యం కూడా పెంపొందుతుంది. ఫలితంగా అదనపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

ముగింపు

 సూక్ష్మజీవుల సాయంతో వ్యవసాయ క్షేత్రాలలోనే సూక్ష్మజీవుల సాయంతో చేపట్టే సేద్య విధానాల వల్ల రైతు బయట మార్కెట్ లో లభించే ముడి వస్తువులపై ఆధారపడవలసిన అవసరం బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా రసాయనిక ఎరువులు, క్రిమి సంహారకాలు మార్కెట్ నుంచి కొనుగోలు చేయవలసిన అవసరం తగ్గిపోతుంది. అంతేకాక భూసారం గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అతి  సూక్ష్మజీవులను వృద్ధిచేస్తే అవి అత్యంత సహజసిద్ధమైన రీతిలో భూసారాన్ని పెంపొందిస్తాయి. ఈ రకమైన నేలలు కాయగూరలు, పండ్ల సాగుకు బాగా అనుకూలంగా ఉంటాయి. మొత్తం మీద రైతులు సాగు వ్యయం చాలా మేరకు తగ్గిపోతుంది. ఒకసారి ఈ రకమైన సూక్ష్మజీవాలను వ్యవసాయ క్షేత్రంలో పెంపొందించినట్లయితే చాలా కాలం అవి మనుగడ సాగించగలుగుతాయి. అందుకు మనం చేయవలసినదల్లా పొలంలో వ్యవసాయ వ్యర్థాలను పడవేస్తూ, సేంద్రీయాలను, ఖనిజాలను కాపాడుతూ రావాలి. తేమ తగినంత ఉండేలా చూస్తే, పర్యావరణ అనుకూల వాతావరణాన్ని కాపాడాల్సి ఉంటుంది. అంటే అనూకలమైన మట్టి ఈ సూక్ష్మజీవాలను పొలం మట్టిలో స్థిరంగా నిలిచేందుకు అవకాశాలు పెరుగుతాయి. వీటి వల్ల మట్టిలో సహజంగా ఉండే భూసార లక్షణాలను సురక్షితంగా కాపాడుకోవచ్చు. మొక్కల ఎదుగుదల ఆరోగ్యవంతంగా సాగుతుంది. సేద్యం పూర్తిగా పర్యావరణ అనుకూలంగా సాగుతుంది.

కృతజ్ఞతలు: వ్యాస రచయిత ప్రత్యేకించి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, శాస్త్ర, సాంక్తిక డిపార్టుమెంటు, భయో టెక్నాలజీ డిపార్టుమెంటు నుంచి వివిధ పరిశోధనా, అభివృద్ధి పథకాల రూపంలో అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ధనంజయ పి. సింగ్
ప్రిన్సిపాల్ సైంటిస్టు (బయో టెక్నాలజీ)
E-mail: Dhananjaya.Singh@icar.gov.in
psfarm@rediffmail.com

రేణు
ప్రిన్సిపాల్ సైంటిస్టు (అగ్రికల్చరల్ బయో టెక్నాలజీ)
ఐసిఏఆర్ – నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్ ఇంపార్టెంటు మైక్రో ఆర్గానిజమ్స్
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్టి, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
మవు, 275101, ఉత్తరప్రదేశ్, ఇండియా
E-mail: Renu1@icar.gov.in; renuiari@rediffmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి 21 , సంచిక 2 , జూన్ 2019

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...