భూసార పునరుద్ధరణ

వర్షాధారిత భూముల్లో సాగు ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. సరికదా, భూసార క్షీణత సమస్య కూడా ఎదురవుతూ ఉంటుంది. అలాంటి నేలల్లో మట్టిని తిరిగి సారవంతం చేయాలంటే చెరువులలోని ఒండ్రు మట్టిని ఉపయోగించవలసి ఉంటుంది. అలా చేయడం వల్ల భూ సారాన్ని పునరుద్ధరించ గలం.  అంతేకాక, ఆ నేలల్లోని చెరువుల్లో నీటి నిల్వలను నిలకడగా కాపాడగలుగుతాం. ఈ వాస్తవాన్ని దక్షిణ భారత దేశంలోని రైతు సోదరుల సంఘటిత వ్యవస్థ వయలగం నిరూపించాయి.

తమిళనాడు రాష్ట్రంలో కనీసం 40,000 సాగు నీటి చెరువులున్నాయి. వాటిలో దాదాపు 80 శాతం చిన్న తరహా చెరువులే. వాటి కింద గట్టిగా 40 హెక్టార్ల లోపు భూములు మాత్రమే సాగవుతుంటాయి. ఈ చిన్న చరహా చెరువులను కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించారు. అస్థిరంగా ఉండే రుతుపవనాల ప్రభావాన్ని తట్టుకునే ఉద్దేశంతోనే వీటిని నిర్మాణాన్ని చేపట్టారు. మంచి వర్షాలు కురిసిన సమయంలో లభించే నీటి వనరులను సురక్షితంగా సాగు అవసరాలకు సుదీర్ఘ కాలం ఉపయోగించుకోవడమే ఈ చెరువుల నిర్మాణం వెనుక ఆనాటి తరాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇంత ప్రణాళికా బద్ధంగా చెరువులను సిద్ధం చేసుకున్నప్పటికీ, తమిళనాట ఉన్న భూముల్లో 60 శాతం ఇంకా వర్షాధారంతో సాగవుతున్నాయి. అందుకు ఏకైక కారణం – అవసరమైన స్థాయిలో నీటి వనరులు లేకపోవడమే.

వర్షాధారిత సాగు యోగ్యమైన భూముల్లో ఎక్కువ భాగం నదులు లే మరి ఇతర నీటి వనరుల ఆయకట్టు పరిధిలోనే ఉన్నాయి. అందువల్ల చెరువులలో నీటిని నిల్వచేయడంలో ఎలాంటి ఇబ్బంది ఎదురుకావడం లేదు. అత్యధిక వర్షపాతం ఉన్న సమయంలో ఉపరితల నీటి ప్రవాహాల వేగానికి భూమి కోతకు గురవుతూ ఉంటుంది. అలా వర్షపు నీటిలో కొట్టుకుపోయే మట్టి వాస్తవానికి సేద్యానికి చాలా విలువైనది. అలాంటి విలువైన పోషకాలు ఉన్న సారవంతమైన మట్టి కోతకు గురికావడం అంటే రైతన్నకు తీరని నష్టం తప్పదు. అలా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయే సారవంతమైన మట్టి అందుబాటులో ఉన్న చెరువుల్లోకి చేరి ఆ చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి.

అయితే ఇలా చెరువల్లో పూడిక రూపంలో పేరుకుపోయే మట్టిని తీసుకువచ్చి తమ పంట చేలల్లో వేసి పోగొట్టుకున్న భూ సారాన్ని మళ్లీ ఉద్ధరించుకోవడం అనేది దక్షిణ భారత దేశ ప్రాంతాలలోని రైతులకు తరతరాలుగా తెలిసిన విధానమే.  ఈ విధానం ద్వారా చేలల్లో మట్టిని పోషకాలతో కూడిన ఒండ్రు మట్టితో సారవంతం చేయడమే కాకుండా చెరువులలోని పూడిక సమస్య పరిష్కారం అవుతుంది. అంటే ఆ చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం ఆ విధంగా కాపాడుకుంటున్నారన్న మాట. అదే సమయంలో చెరువులలో నిరంతరం అవసరమైన మేరకు నీటిని నిల్వ ఉంచుకోగలుగుతున్నారు. అన్నదాతలకు అత్యధిక ప్రయోజనాలు చేకూర్చే ఈ విధానాన్ని గడచిన దశాబ్ద కాలంలో వ్యవసాయదారులు నిర్లక్ష్యం చేశారు. దాదాపు అదృశ్యమైపోయిందని చెప్పవచ్చు. అందుకు చాలా కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి – సేద్యం పనుల్లో యంత్రాల వాడకం పెరిగిపోయింది. అంతేకాక, అధిక దిగుబడి కోసం పెద్ద మొత్తంలో రసాయనిక ఎరువుల వాడకం సర్వసాధారణంగా మారింది. ఫలితంగా సాగు వ్యయం తలకు మించిన భారంగా మారిపోయింది. ఇవి చాలవన్నట్లు స్థానికంగా గ్రామ స్థాయిలో అధికారుల నుంచి రకరకాలైన ఆంక్షలు వారికి అన్ని విధాలా సమస్యలు సృష్టిస్తూ వచ్చాయి.

వయలగం – ప్రజల ఆవిష్కరణే

ఈ తరహా వయలగం పద్ధతిని అనుసరించి చెరువుల వాడకాన్ని తిరిగి ప్రోత్సహించేందుకు ధన్ ఫౌండేషన్ కృషిచేస్తోంది. వయలగంలను ఒక విధంగా స్థానిక ప్రజల సమష్టి శక్తి కేంద్రాలుగా చెప్పుకోవచ్చు. అంటే వాటిని సాగు చెరువుల విధానాన్ని చేపట్టిన స్వయం సహాయక సంఘాలుగా అర్థం చేసుకోవచ్చు. వాటిని నెలకొల్పడంలోనూ, నిర్వహించడంలోనూ, పునరుద్ధరించడంలోనూ కూడా స్థానికుల పాత్రే అత్యంత కీలకమైన విషయం. ఈ సమష్టి వ్యవస్థలకు స్వతంత్రమైన విధివిధానాలున్నాయి. స్వతంత్రంగా చేపడుతున్న కార్యక్రమాలున్నాయి. ఇలా కలిసికట్టుగా వారు చేస్తున్న కృషి కారణంగా తమ పరిసరాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవి అడుగులు వేస్తున్నాయి.

ఒక్కో బ్లాకు (తాలూకా) లోని స్థానిక సమాజం తమకు చేరువగా ఉన్న నీటి వనరులను ఆధారం చేసుకుని 15 నుంచి 20 వయలగంలను ఏర్పాటు చేసుకునేందుకు, నిర్వహించుకునేందుకు బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా ఈ రకంగా మూడు నుంచి అయిదు పంచాయతీల పరిధిలోని నీటి వనరులను ఇందుకు ప్రధాన వనరుగా సమష్టి ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు.  ఈ మొత్తం పరిధిలోనూ ఉన్న కనీసం 350 నుంచి 500 మంది వ్యవసాయ దారుల ఉమ్మడి ప్రయోజనాలకు వీటిని ఉపయోగించుకుంటారు. అంటే బ్లాకు స్థాయిలోని సంఘటిత వ్యవస్థను ఒక యూనిటంగా పరిగణించవచ్చు. ఈ యూనిట్లో 25 నుంచి 30 మంది సభ్యులుగా ఉండే సూక్ష్మ రుణ్రగహీతల బృందాలుగా ఏర్పడతాయి. వారంతా తరచుగా సమావేశమై పొదుపు, రుణ సేకరణ వ్యవహారాలను నిర్వహించుకుంటారు. మూడు నాలుగేళ్ల తర్వాత మిగులు నిధులను సిబ్బంది నిర్వహనకయేయ ఖరుచలకు సరిపోయేంతగా ఉంటుంది.

అందువల్ల మొదటి మూడు సంవత్సరాలు వారి దృష్టి సభ్యత్వం నమోదుపైనే ఉంటుంది. ఆ తరువాత ఆర్థిక వనరుల సమీకరణపై వారి దృష్టిని మళ్లించటం జరుగుతుంది.  అంతవరకూ పొదుపు మొత్తాలు, రుణ పరపతి సదుపాయాలు విస్తరించుకునేందుకు శ్రద్ధ తీసుకుంటారు. ఈ విధంగా మరో మూడు సంవత్సరాల పాటు అందుబాటులోకి వచ్చే వనరులను జీవనోపాధులతో బ్యాంకుల లింకేజీని పటిష్టం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఆ తరువాత అంటే నాలుగో విడత మూడేళ్లు నాలుగో తరం పౌర సంఘాల మధ్యవర్తిత్వానికి పునాదిగా వినియోగిస్తారు. ఇందుకు తగినట్లుగా ధన్ ఫౌండేషన్ వనరుల సమీకరణ లేదా పౌర సమాజం సహకారానికి అండగా నిలుస్తుంది.

అందుకు వారికి హైదరాబాద్ లోని మెట్ట ప్రాంతాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం (CRIDA) సహాయం ఉపకరించింది. ఈ సంస్థ తెలంగాణ ప్రాంతంలోని నల్లబెల్లి, రేగొండ మండలాలలో జరిపిన పరిశోధనలు ప్రాతిపదికగా ఉపయోగపడ్డాయి. వారి పరిశోధనలను గమనిస్తే చెరువులలోని ఒండ్రు మట్టిని ఉపయోగించడం వల్ల తేమ నిల్వ సామర్థ్యం 4 నుంచి ఏడు రోజుల పాటు స్థిరంగా ఉంటుందని నిర్ధారణ అయింది. అంతేకాక మొక్కల సంఖ్య, వాటి ఎత్తు, దిగుడులు (హెక్టారుకు మొక్క జొన్న (మైజ్) 700 కిలోల వరకు, పత్తి వెయ్యి కిలోల వరకు) అధికంగా లభిస్తాయని స్పష్టమయింది.  ఇక రసాయన ఎరువుల వాడకం తగ్గిపోవడం వల్ల హెక్టారుకు రూ. 2500 నుంచి రూ. 3750 వరకు ఆదా అవుతుందని తేలింది.

        కర్నాటకలో అనేక చెరువుల పరిసరాల్లో బెంగళూరులోని వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధనల్లో ఈ విధంగా ఒండ్రు మట్టిని ఉపయోగించినట్లయితే మొక్కలకు అవసరమైన అన్ని రకాలైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని నిర్ధారణ అయింది. ఫలితంగా భూసారం గణనీయంగా పెరగడమే కాక, దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని తేలింది.

ఒండ్రు మట్టి వినియోగం – విలువల నిరూపణ

ఇలా చెరువులలోనుంచి సేకరించిన ఒండ్రు మట్టి (పెరటి ఎరువులు లేదా కొబ్బరి పీచు వంటి వాటి సహాయంతో) ఉపయోగాల గురించి 2008-09, 2009 – 2010 సంవత్సరాల కాలంలో ధన్ ఫౌండేషన్ రైతన్నలను చైతన్యపరిచేందుకు కృషిచేసింది. పంట పొలాల్లో తేమ స్థిరంగా నిలవడానికి అనుసరించవలసిన విధానాలపై రైతన్నలకు అవగాహన కల్పించింది. ఈ అవగాహన కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ జల వనరుల మంత్రిత్వ శాఖ మద్దతుతో రెండు పంట కాలాల్లో (సీజన్లు) మద్దతు ఇచ్చింది. రైతుల భాగస్వామ్య పరిశోధనా కార్యక్రమం (Farmers Participatory Action Research Program (FPARP) కింద కేంద్రం నుంచి సహకారం లభించింది.

ఈ అవగాహనా కార్యక్రమాలను తమిళనాడులోని మదురై జిల్లాలోనూ, ఉమ్మడి ఆంధ్ర్రపదేశ్ లోని చిత్తూరు, నల్లగొండ జిల్లాల్లోనూ ఔత్సాహికులైన 30 మంది వ్యవసాయ క్షేత్రాలలోనే నిర్వహించారు. ఇందుకోసం దాదాపు 30 హెక్టార్ల వ్యవసాయయోగ్యమైన పంట పొలాలను ఎంపిక చేసుకున్నారు. వీటిలో 20 హెక్టార్లు మెట్ట భూములు కాగా మిగిలినవి అనుబంధ సాగునీటి సదుపాయం ఉన్న పంట పొలాలే. పరిశోధనలకు అవసరమైన వ్యయంలో సగ భాగాన్ని ఆయా భూముల యజమానులైన రైతన్నలే భరించారు. ఇందుకు ఒక్కో యూనిట్ కు రూ. 14000 వరకు ఖర్చు అవుతుంది. ఇందులో సగభాగం అంటే రూ. 7000 రైతన్నలే భరించారు.

రైతుల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ పరిశోధనా కార్యక్రమం కారణంగా మెట్ట భూముల్లో 15 శాతం, అనుబంధ సాగు వనరులున్న భూముల్లో 25 శాతం అధిక దిగుబడులు వచ్చాయి. దీంతో ఉత్సాహం రెట్టింపు కావడంతో తమిళనాడులోని మదురై, శివగంగై, రాంనాడ్, తేనీ, తిరువళ్లూరం, కంచీపురం ప్రాంతంలోని రైతులు,

చిత్తూరు, నల్లగొండ జిల్లాల రైతన్నలు ఇలా చెరువుల మట్టిని తమ 228 హెక్టార్ల చేలల్లో ఎరువులుగా ఉపయోగించుకునేందుకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సహజ వనరుల నిర్వహణ సమగ్ర కార్యక్రమం (Umbrella Programme on Natural Resources Management (UPNRM) కింద నాబార్డ్ 275 మంది వ్యవసాయ దారులకు రూ. 40 లక్షలు మంజూరు చేసింది.

ఒండ్రు మట్టి వాడకం – ప్రోత్సాహకాలు

చాలా సందర్భాలలో గమనించిన విషయం ఏమిటంటే – చెరువుల్లో పూడిక తీయడం, ఆ రకంగా వచ్చిన ఒండ్రు మట్టిని పొలాల్లో ఉపయోగిచడం గురించి ప్రయత్నాలు ప్రారంభించిన ప్రతీ సందర్భంలోనూ రైతుల నుంచ్ సానుకూలమైన స్పందన రావటం లేదు. అందుకు ఆర్థిక కారణాలతో పాటు మరి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఒక పక్క వారికి ఇలా ఒండ్రు మట్టి ప్రయోజనాలను గురించి చైతన్యపరిచడమే కాకుండా వారికి ప్రతిబంధకాలుగు నిలుస్తున్న కారణాలను గుర్తించి వాటికి పరిష్కారాలు చూపడం కోసం మరో కార్యక్రమం చేపట్టవలసివచ్చింది. 2009-11లో కర్నాటకలో సర్ దొరాబ్జీ టాటా ట్రస్టు సహకారంతో అది సాకారమయ్యింది. ఈ కార్యక్రమం కింద చెరువుల నుంచి తొలగించిన మొత్తం ఒండ్రు మట్టిని రైతుల భూముల్లో వినియోగానికి కేటాయించడం జరిగింది. మట్టి తీయడంలో రాళ్లూ, బండలను చెరువు గట్లను పటిష్టం చేసేందుకు ఉపయోగించారు. ఫలితంగా 900 మంది రైతులకు చెందిన 1963 హెక్టార్ల భూమికి లబ్ధి చేకూరింది. (టేబుల్ చూడగలరు.)

టేబుల్ 1: ఒండ్రు మట్టి వాడకంలో కర్నాటక రైతన్నలు

బ్లాక్  చెరువులు  - సంఖ్య  ఒండ్రు మట్టి -   (క్యూబిక్ మీటరుల)  విస్తీర్ణం - హెక్టార్లు లబ్దిపొందిన   రైతన్నలు
యాదగిరి7193881081587
గుర్మికల్   413324882342
మొత్తం11327121963929

 

సవాళ్లు – పరిష్కారాలు

తమిళనాడులోని రైతులకు ఇలా చెరువుల నుంచి వెలికి తీసిన ఒండ్రు మట్టిని తమ పొలాలకు తరలించడానికి రవాణా సదుపాయం పెద్ద సమస్యగా తయారైంది. స్థానిక రెవెన్యూ అధికారులు అభ్యంతరం చెప్పారు. ఉన్నతాధికారులతో చర్చించిన తరవాత కూడా ఆ సమస్య అలాగే ఉండిపోయింది. చివరికి, ధన్ ఫౌండేషన్ మద్దతుతో ఒక అసోసియేషన్ చొరవ తీసుకుంది. సమాచార హక్కు చట్టం ఉపయోగించి, ఇలాంటి ఒండ్రు మట్టిని రవాణా చేయడాన్ని నిరోధించే ప్రభుత్వపరమైన ఆదేశాలు ఏవీ లేవని తెలుసుకుంది. ఇలా అన్ని విధాలా ప్రయత్నించిన తర్వాత మాత్రమే రైతులు చెరువుల్లోని పూడిక తీసేందుకు, దానిని తమ పంట పొలాల్లో ఉపయోగించుకునేందుకు సాధ్యమైంది.

ఎన్. వెంకటేశన్
ప్రోగ్రాం లీడర్
ధన్ వయలగం (చెరువులు) ఫౌండేషన్
1 ఎ, వైద్యనాథపురం, ఈస్ట్ క్రాస్ కెన్నెత్ రోడ్డు
సెవెన్త్ డే అడ్వెంటిస్ట్స్ స్కూల్ సమీపంలో
మదురై – 625016. తమిళనాడు
E-mail: n.venkatesan@dhan.org

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 17, సంచిక 1, మార్చ్ ౨౦౧౫

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....