తూర్పు ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉన్న, అధికంగా గిరిజనులు నివసించే కరంజియా బ్లాక్‌లో కను చూపు దూరం వరకు గుమ్మడి తోటలే కనిపిస్తాయి.
కొన్ని సంవత్సరాల క్రితం కథ చాలా భిన్నంగా ఉండేది. ఈ ప్రాంతంలో ఇసుకతో కూడిన బంకమట్టి మరియు వాతావరణం గుమ్మడికాయ సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికీ, సాంప్రదాయ సాగు పద్ధతులు మరియు స్థానిక గుమ్మడికాయ రకాలను ఉపయోగించే చిన్నకారు రైతులు తక్కువ దిగుబడి మరియు పేలవమైన మార్కెట్ సామర్థ్యంతో ఇబ్బంది పడ్డారు. పెద్ద గుమ్మడికాయలకు మార్కెట్ డిమాండ్ ఉంది మరియు స్థానిక రకాలు వైరల్ వ్యాధులకు గురికావడం వల్ల అధిక పురుగుమందుల వాడకం మరియు తక్కువ పండ్ల నాణ్యత ఏర్పడింది.
2021లో ఈస్ట్-వెస్ట్ సీడ్ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ఫౌండేషన్ (EWS-KT) మయూర్‌భంజ్ మరియు కియోంఝర్‌లోని చిన్న రైతులతో కలిసి పనిచేయడం ప్రారంభించినప్పుడు పరిస్థితి మారడం ప్రారంభమైంది. EWS-KT స్థానిక రైతులతో కూరగాయల ఉత్పత్తి ప్రదర్శన ప్లాట్‌లను ఏర్పాటు చేసింది మరియు మెరుగైన సాగు పద్ధతులపై శిక్షణా తరగతులను నిర్వహించింది. ఎత్తు మళ్లు , వరుసల మద్య సరైన అంతరం, తగిన ఎరువులు మరియు ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ (IPM) పద్ధతులు రైతులకు అధిక మరియు మెరుగైన-నాణ్యత దిగుబడికి దారితీశాయి. అయినప్పటికీ, స్థానిక గుమ్మడికాయ రకాలతో మార్కెట్ సవాళ్లు అలాగే ఉన్నాయి.
2022లో EWS-KT కెయోంఝర్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను స్థాపించింది. ఇది కూరగాయల ఉత్పత్తికి సంబంధించిన ఒక అభ్యాస కేంద్రం, ఇక్కడ రైతులు ఉత్పాదకత మరియు లాభదాయకతను పెంచడానికి సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి నేర్చుకుంటారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మరియు EWS-KT రైతుల గుమ్మడికాయ ప్రదర్శన క్షేత్రాలలో, రైతులు ఏకరీతి ఆకారంలో ఉన్న పెద్ద గుమ్మడికాయలను చూశారు. తాము నేర్చుకున్న మెరుగైన వ్యవసాయ పద్ధతులతో జోడించిన మెరుగైన ఈ గుమ్మడికాయ రకం, మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి తమకు సహాయపడుతుందని వారు త్వరలోనే గ్రహించారు.
బాక్స్ 1: మెరుగైన జీవనోపాధి కోసం గుమ్మడికాయ సాగులో మెరుగుదల రైబారి బెహెరా ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లా, కరంజియా బ్లాక్‌లో ఉన్న సారంగగడ్ గ్రామానికి చెందిన ఒక యువ కూరగాయల రైతు. ఆమె తన భర్త సహాయంతో సొంతంగా వ్యవసాయం చేస్తుంది, మరియు ‘మా తారిణి’ అనే మహిళా స్వయం సహాయక బృందంలో భాగంగా కూడా పంటలు పండిస్తుంది. జూలై 2023లో, రాయ్‌బారి ఈస్ట్-వెస్ట్ సీడ్ నాలెడ్జ్ ట్రాన్స్ ఫర్ ఫౌండేషన్‌లో టెక్నికల్ ఫీల్డ్ ఆఫీసర్ అయిన సాను కుమార్ బెహెరా అమూల్యమైన మార్గదర్శకత్వంలో 800 చదరపు మీటర్ల ప్రదర్శన స్థలంలో గుమ్మడికాయలను సాగు చేసింది. ఈ అనుభవం ఆమెకు నివారణ మరియు సహజ తెగులు నియంత్రణ పద్ధతులకు ప్రాధాన్యతనిచ్చే రైజ్డ్ బెడ్‌లు, నాణ్యమైన విత్తనాలు మరియు ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ (IPM) వంటి మెరుగైన వ్యవసాయ పద్ధతుల గురించి నేర్పింది. ఈ విధానాలు ఆమెకు గణనీయంగా అధిక దిగుబడిని మరియు 286% ఆకట్టుకునే ROIని తెచ్చిపెట్టాయి. రైబారి గర్వంగా ఇలా పంచుకున్నారు, “సరైన వ్యవసాయ పద్ధతులు అద్భుతాలు చేయగలవని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. మెరుగైన పద్ధతులను అవలంబించినప్పటి నుండి, నా పంటల నాణ్యతను మెరుగుపరుచుకుంటూనే, ఉత్పత్తి ఖర్చులలో గణనీయమైన తగ్గింపును నేను చూశాను.” రైబారికి 2 ఎకరాల భూమి ఉంది, అందులో ఆమె టమాటాలు, పచ్చిమిరపకాయలు, క్యాలీఫ్లవర్ మరియు కాకరకాయల వంటి కూరగాయలను పండిస్తుంది. అయితే, తన గుమ్మడికాయల ప్రదర్శన క్షేత్రం యొక్క విజయవంతమైన ఫలితాలను చూసిన తర్వాత, ఆమె ఇటీవలి ఖరీఫ్ సీజన్‌లో (జూలై నుండి అక్టోబర్ 2024 వరకు) పెద్ద ఎత్తున గుమ్మడికాయలను సాగు చేయాలని నిర్ణయించుకుంది. ఆమె 30 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని, 5,481 టన్నుల గుమ్మడికాయలను పండించి, తన 738,000 రూపాయల (US$8,800) పెట్టుబడిపై 1,819,800 రూపాయల (US$21,700) అద్భుతమైన నికర లాభాన్ని సంపాదించింది. ఒడిశాలో గుమ్మడి సాగు విస్తరణలో కీలక పాత్ర పోషించిన EWS-KT టెక్నికల్ ఫీల్డ్ ఆఫీసర్ సాను కుమార్ బెహెరాతో రైబారి. రైబారి తన సొంత భూమిలో వ్యవసాయం చేయడంతో పాటు, మా తారిణి స్వయం సహాయక బృందంతో కలిసి సామూహికంగా గుమ్మడికాయల సాగును ప్రారంభించింది. ఆ స్వయం సహాయక బృందంలోని మహిళలు రైబారి యొక్క గుమ్మడికాయల ప్రదర్శన క్షేత్రంలో EWS-KT నిర్వహించిన శిక్షణా తరగతులకు హాజరయ్యారు మరియు వారిలో కొందరు తమ వ్యవసాయ పద్ధతులను అభివృద్ధి చేసుకోవడానికి మరియు తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి గుమ్మడికాయలను సాగు చేయడంలో ఆసక్తి చూపారు. అది లాభదాయకమైన పెట్టుబడి; వారి సామూహిక గుమ్మడికాయల వ్యవసాయం ద్వారా వారికి 17,50,200 రూపాయల (US$20,800) నికర లాభం వచ్చింది, దానిని వారు తమలో తాము సమానంగా పంచుకున్నారు. ఈ లాభాలతో, రైబారి మరియు ఆమె బృందం తమ పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు మరియు వచ్చే సీజన్ పంట కోసం సామాగ్రి, కూలీలతో సహా తమ వ్యవసాయంలో మరింత పెట్టుబడి పెడుతున్నారు. గుమ్మడికాయ ఖరీఫ్ కాలానికి బాగా సరిపోయే పంట, కాబట్టి రబీ సీజన్‌లో (నవంబర్ నుండి ఏప్రిల్ వరకు) రైబారి పుచ్చకాయలను పండించాలని యోచిస్తోంది. ఆమె తన భర్తతో కలిసి కౌలుకు తీసుకున్న భూమిలో 8 ఎకరాల్లో, మరియు స్వయం సహాయక బృందంతో కలిసి 10 ఎకరాల్లో పుచ్చకాయ సాగు చేయనుంది. సరైన మద్దతు మరియు పంటపై అవగాహన ఉంటే, మహిళలు వ్యవసాయ ఆవిష్కరణలలో మార్గదర్శకులుగా నిలవగలరని రైబారి నిరూపించింది. మూలం: https://www.ews-kt.com/improved-pumpkin-farming-forbetter- livelihoods/ మద్దతు మరియు జ్ఞానంతో, మహిళలు వ్యవసాయ ఆవిష్కరణలలో మార్గదర్శకులుగా నిలవగలరు. |
రైతులు కొత్తగా నేర్చుకున్న తెగులు నిర్వహణ పద్ధతులను అవలంబించి పురుగుమందులకు బదులుగా ఫెరోమోన్ ఉచ్చులను అమర్చి సహజ పద్దతిలో పంటను పురుగులు మరయు తెగుళ్ళబారినుండి కాపాడగలుగుచున్నారు. పురుగుమందుల వాడకంలో గణనీయమైన తగ్గింపువలన చాలా మంది రైతులు తమ గుమ్మడికాయ పొలాలలో ఎటువంటి మందులను ఉపయోగించకపోవడంతో రైతులు వారి సమయాన్ని మరియు డబ్బును ఆదా చేయడంతో పాటు పర్యావరణం మరియు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చింది.
ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే గుమ్మడికాయలలో ఎక్కువ భాగం వ్యాపారులకు విక్రయించబడి, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు (సుమారు నాలుగు గంటల దూరంలో) రవాణా చేయబడతాయి కాబట్టి, కొత్త రకం యొక్క దీర్ఘకాల జీవితకాలం, సుదూర రవాణాను తట్టుకునే సామర్థ్యం మరియు పైభాగం మరియు దిగువ చదునుగా ఉండటం వల్ల రైతులు మార్కెట్ ప్రయోజనాలను కూడా చూశారు, ఇవి ప్రయాణం కోసం గుమ్మడికాయలను పేర్చడాన్ని సులభతరం చేస్తాయి.
నేడు కరంజియా మరియు ఆవల ఉన్న రైతులు అధిక-నాణ్యత గల విత్తనాలను మరియు మెరుగైన వ్యవసాయ పద్ధతులను స్వీకరించారు – మరియు గుమ్మడికాయ ఉత్పత్తిని గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచారు. గుమ్మడికాయ సాగు కోసం ఎక్కువ భూమిని లీజుకు తీసుకున్నారు. పంటకోత సమయంలో ఇంతకు ముందు ఉపయోగించని ఈ మార్కెట్ కోసం రైతుల నుండి అధిక-నాణ్యత గల గుమ్మడికాయలను సేకరించడానికి వందలాది ట్రక్కులు పశ్చిమ బెంగాల్ నుండి వస్తాయి మరియు రైతులు తమ లాభాలను రెట్టింపు లేదా మూడు రెట్లు పెంచుకున్నారు.
EWS-KT యొక్క జోక్యం గుమ్మడికాయల మార్కెట్‌ను మార్చివేయడమే కాకుండా, అధిక దిగుబడినిచ్చే సంప్రదాయేతర గుమ్మడికాయ రకాలకు రైతులు మారినందున, గుమ్మడికాయ విత్తనాలతో సహా అధిక నాణ్యత గల వ్యవసాయ ఉత్పాదకాలకు ఒక కొత్త మార్కెట్‌ను కూడా సృష్టించింది. ఇది రైతులు, వ్యవసాయ ఉత్పాదకాల డీలర్లు మరియు కూరగాయల విలువ గొలుసులోని ఇతరులకు ఒక ఉత్తేజకరమైన విస్తరణ అవకాశంగా ఉంది.
EWS-KT ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టువర్ట్ మోరిస్ ఇటీవల తూర్పు ఒడిశాలోని గుమ్మడికాయ పొలాలను సందర్శించారు. “మార్కెట్ మరియు భూమి అందుబాటులో ఉన్న చోట అధిక పోషకాలుగల గుమ్మడికాయ ఒక అద్భుతమైన పంట” అని ఆయన అన్నారు. EWSKT యొక్క ఆఫ్రికాలో పంప్కిన్స్ ప్రాజెక్ట్ గురించి ప్రతిబింబిస్తూ, “ఆఫ్రికాలో ఒక మిలియన్ ఎకరాలలో గుమ్మడికాయ పంటను సాగుచేయాలని కళలు గన్న ఈస్ట్ –వెస్ట్ విత్తన సంస్థ వ్యవస్థాపకుడు మరియు ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత సైమన్ గ్రూట్ ప్రేరణతో ఈ సరళమైన అధిక లాభదాయకమైన పంటను భారతదేశంలోని ఒడిశాలోని పొలాల నుండి పొందుచున్నారు” అని ఆయన అన్నారు.
గమనిక: ఈ వ్యాసం వాస్తవానికి https://www.ews-kt.com/odisha-india-a-new-hub-for-pumpkinfarming/ అనే వెబ్‌సైట్‌లో ప్రచురించబడింది.
Source: LEISA India, English Edition, September 2025



