అక్వా సమస్యలకు డిజిటల్ పరిష్కారాలు

ఫార్మ్ మోజో అన్న సంస్థ అక్వాకల్చర్ రంగంలో ఎదురయ్యే అనేక సమస్యలకు డిజిటల్ పరిష్కారాలను అందిస్తోంది. ఇది కేవలం సరళమైన మొబైల్ అప్లికేషన్. ప్రధానంగా నీటి నాణ్యత, చేపల ఆహారం – వినియోగ విధానాలు, చెరువుల పరిపూర్ణ యోగ్యతా లక్షణాలను గురించిన సలహా సూచనలు అందిస్తుంది. ఈ సూచనలను పూర్తిగా చేపల పెంపకానికి ఎంపిక చేసిన చెరువులను ఆధారం చేసుకుని వాటికి అనువైన వాటినే అందజేస్తుంది.

గడచిన దశాబ్ద కాలంలో చేపల పెంపకం రంగం ఎన్నడూ లేని వేగంతో ముందుకు సాగుతోంది. మరో నాలుగేళ్లలో అంటే 2025 నాటికి అక్వా రంగం 20890 వందల కోట్ల డాలర్ల విలువను చేరుకోనున్నదని అంచనాలున్నాయి. ఆరోగ్య పరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయోజనాలు అందించనున్నది. 2030 నాటికి ప్రపంచం మొత్తం మీద చేపల వినియోగంలో మూడింట రెండు వంతుల వరకు అక్వా రంగం సమకూర్చగలదని ఐక్యరాజ్యసమితి (యూఎన్ – ఎఫ్ఏఓ) కి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ భావిస్తున్నది.

అక్వా రంగం ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు డిజిటల్ రంగంలో ఎన్నో  అవకాశాలున్నాయి. వాటిని రూపొందించేందుకు, ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు చేపల పెంపకం దారుల సంస్థలు (ఫార్మ్స్), ప్రభుత్వ వర్గాలు, ఇతర సంస్థలు, రీసెర్చి చేసే వారు, సరఫరాదారులు ఇలా ప్రతి ఒక్క భాగస్వామ్య పక్షమూ కూడా ఈ తరహా డిజిటల్ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో బాధ్యతతో చొరవ తీసుకోవలసి ఉంది. కేవలం సాంకేతికతను సిద్ధం చేయడంలో మాత్రమే కాకుండా, ఈ రంగాన్ని వ్యాపార సరళిలోకి నడిపించాల్సి ఉంది. ఉదాహరణకు, ఈ-ఫిషరీ సాంకేతికత ఇంటర్నెట్ ఆధారిత పరిష్కారాలను సూచిస్తుంది. చేపల పెంపకం చెరువులపై పర్యవేక్షణతో పాటు అందులో పెంచుతున్న చేపలు ఏ మేరకు వినియోగదారులకు తృప్తి కలిగించగలదో కూడా ఈ సాంకేతికత నిర్దేశించగలుగుతుంది.

డిజిటల్ సొల్యూషన్స్ సత్తా

అక్వా రంగంలో పరస్పరం సంప్రదించుకునేందుకు లేదా కీలకమైన సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, కేంద్రీకృత వ్యవస్థ అవసరం. దానితో పాటు అక్కడ విధి నిర్వాహకులకు మొత్తం ఈ రంగానికి సంబంధించిన సమగ్రమైన పూర్తి సమాచారం అందజేయడం అవసరం. ఇంటర్నెట్ ఆధారిత సాధనాలు (ఐఓటి డివైజెస్) ఈ విషయంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్ పాండ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ సిస్టమ్ నీటి ఉష్ణోగ్రతలను గుర్తించేందుకు సెనన్సార్లను ఆధారం చేసుకుంటుంది. అంతేకాకుండా నీటిలోని పీహెచ్ పరిమాణం, నీటిలో కరిగిపోయిన ఆక్సిజన్ స్థాయి, నీటి పరిమాణం వంటి వాటిని కూడా ఇవే సాధనాలతో గమనించగలుగుతుంది. సౌరశక్తి ఆధారిత లేదా ఇతరత్రా పనిచేసే సెన్సార్లు వాడుకలోకి వచ్చాయి. ఈ సిస్టమ్ సాయంతో చేపల, రొయ్యల పెంపకం చెరువులపై 24 గంటల పర్యవేక్షణ సాధ్యమవుతుంది. అన్ని వేళలా ఫోన్ ద్వారా కానీ, కంప్యూటర్ల సాయంతో కానీ రైతు తమ చెరువులపై నిఘా వేసి ఉంచవచ్చు. ఇది రైతులు తగినంత విశ్రాంతినిస్తుంది. కూలీల ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా మనిషికి, యంత్రానికి మధ్య సంధానకర్తగా నిలుస్తుంది. రిమోట్ కంట్రోల్ అంటే ఎక్కడి నుంచి అయినా సరే చెరువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇంకా క్లౌడ్ అండ్ బిగ్ డాటా రిపోసిటరీ అంటే సమాచార నిక్షిప్తం చేసే సదుపాయం లభిస్తుంది. రోజువారీ సమాచారం నమోదు చేసుకుని నిర్వహణ (మేనేజ్ మెంట్) కార్యక్రమాలను గ్రాఫిక్ రూపంలో రైతు గమనిస్తూ ఉండవచ్చు.

మేధో నియంత్రణ సదుపాయంతో (ఇంటెలిజెంట్ కంట్రోల్ సిస్టమ్) చెరువులలోని నీటిలో ఉన్న ఆక్సిజన్ స్థాయిని గుర్తించి అవసరమైతే ఏరేటర్ ప్రక్రియ చేపట్టవచ్చు. అదే విధంగా ఫీడర్ ను నియంత్రి్చవచ్చు. నీటి ఉష్ణోగ్రతలను గుర్తించే సాధనం, నీటిలోని క్షార స్థాయిని నిర్దేశించే సదుపాయం, పీహెచ్ మీటర్, ఆక్సిజన్ మీటర్, వాటర్ లెవల్ మీటర్, ఈసీ మీటర్, ఎన్ హెచ్ 4 -ఎన్ మీటర్ నైట్రేట్ మీటర్, వాటర్ పంపు, జెనరేటర్ కనెక్షన్ లను నియంత్రించవచ్చు. ఏ విషయంలోఏ చిన్న తేడా వచ్చినా ఈ ఇంటెలిజెంట్ కంట్రోల్ సిస్టమ్ గుర్తించి హెచ్చరికలు జారీచేస్తుంది. ఏరేటర్ తనంతట తానే అవసరాన్ని బట్టి పనిచేయడం ప్రారంభిస్తుంది. లేదా అవసరం తీరగానే ఆగిపోతుంది. అలా నీటిలో ఆక్సిజన్ స్థాయిని బట్టి దానిని నియంత్రించవచ్చు.

 చేపల, రొయ్యల ఫీడర్లు కూడా ఇలా అవసరానికి అనుగుణంగా, సమయానుకూలంగా పనిచేయించవచ్చు. ఇందుకు లోకల్ నెట్ వర్క్ సిస్టమ్ సాయపడుతుంది. దీనికి రౌటర్, మోడెమ్, 12 వి బ్యాటరీలను సంధానం చేయాల్సి ఉంటుంది. వీటి సాయంతో సమాచారం మార్పిడి సాఫీగా – సెన్సార్ల నుంచి క్లౌడ్ సర్వర్ లేదా ఇటు నుంటి అటు –  సాగుతుంది. దీనికి మెసేజి, క్యూయింగ్, టెలిమెట్రీ ట్రాన్స్ పోర్టు (ఎంక్యూటీటీ) ప్రొటోకాల్ సహకరిస్తుంది.

క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఇప్పుడు చాలా ఎక్కువగా వాడుకలో ఉంది. ముఖ్యంగా సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి అత్యంత అనుకూలమైన వ్యవస్థ ఇది. కంప్యూటర్లలో వాడే హార్డ్ డ్రైవ్ లేదా లోకల్ నెట్ వర్క్ స్టోరేజి లాంటిది కాదు ఇది. విజయవాడ (ఆంధ్రప్రదేశ్) కు చెందిన ఏరువాక టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అక్వా రంగానికి సంబంధించి క్లలౌడా ఆధారిత పరిష్కారాలు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయినప్పుడు హెచ్చరించేందుకు వాయిస్ రూపంలో కూడా హెచ్చరిస్తుంది.

 ఫార్మ్ మోజో అందించే ప్రయోజనాలలో నీటి నాణ్యతపై, ఫీడ్ లభ్యత, వ్యాధుల విస్తరణలపై నిరంతర నిఘా వేయడమే కాకుండా బయో మాస్ బదలాయింపు (కన్వెర్షన్) సాధ్యమవుతుంది. ఇవన్నీ కూడా ఫార్మ్ ఫీడింగ్ స్ట్రాటజీలో చాలా కీలక భూమిక నిర్వహిస్తాయి.

పరిశ్రమ వర్గాల విశ్వాసాలు ఎలా ఉన్నాయంటే హడూప్ (Hadoop) వేదిక ఆధారంగా బిగ్ డాటా మార్పిడి భవిష్యత్తులో అత్యంత కీలకమైనది. పరిశ్రమ అభివృద్ధికి, దానిని సజావుగా నడిపించడంలో, దిగుబడిని పెంపొందించడంలో ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది. బిగ్ డాటా వ్యవస్థ నిక్షిప్తం చేయగల సమాచారాన్ని ఒక సగటు మనిషి జ్ఞప్తిలో ఉంచుకోలేడు. ఈ డాటాలో వినియోగదారులకు సంబంధించిన లావాదేవీల వివరాలు, ఉత్పత్తికి సంబంధించిన గణాంకాలు, వెబ్ ట్రాఫిక్ లాగ్స్, అటోమేషన్, ఉపగ్రహాలు, సెన్సీర్లు, ఐఓటి వంటివి ప్రధాన అంశాలు.

ఇలాటి సదుపాయాలు అందించడంలో ముఖ్యమైన కొన్ని డిజిటల్ ప్లాట్ ఫారమ్ లు – ఐ క్వాటిక్ ఒకటి. ఇది రొయ్యల సైజు, నీటి నాణ్యత, ఫీడింగ్ తీరు తెన్నులు, వాతావరణ స్థితిగతులు, ఆరోగ్య సంబంధ అంశాల వివరాలను నిక్షిప్తం చేయగలగుతుంది. ఈ సమాచారం ఆధారంగా రైతులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలరు. ఉత్తమ పద్ధతులను అనుసరించగలుగుతారు. ఇంకా అక్వానెటిక్స్ (Aquanetix), అక్వామేనేజర్ (Aquamanager), అక్వాట్రాకర్ (Aquatracker), స్మార్ట్ వాటర్ ప్లానెట్ (Smart water planet) వంటి ప్లాట్ ఫారమ్ లు అక్వా రంగంలో సమీకృత పరిష్కారాలను సూచించగలవు. స్మార్ట్ ఐటీ సాయంతో చేపల పెంపకంలో ఆవిష్కరణలను కూడా తెలియజేయలవు. కేజీయీ (cageeye)అన్న వేదిక నుంచి చేపల ప్రవర్తనలో తేడాలను, ఫుడ్ సైకిల్స్ గురించి సమాచారం పొందవచ్చు. అక్వావిస్టా (Aquavista) ఐఓటీ ఆధారిత వేదిక. దీని సాయంతో ఉత్పత్తికి సంబంధించిన సమగ్ర స్వరూపం గమనించవచ్చు.

ఫార్మ్ మోజో వేదిక ప్రత్యేకతలు

ఇది 2018 మార్చిలో ప్రారంభమైంది. దేశంలోని చేపల, రొయ్యల పెంపకందారులకు అవసరమైన డిజిటల్ పరిష్కారాలను సూచించేందుకు అనువుగా దీనిని రూపొందించారు. మొబైల్ యాప్ గా అందుబాటులో ఉన్న ఈ వేదిక నీటి నాణ్యత, ఫీడ్ యూసేజీ, చెరువుల సానుకూల స్థితిగతులను తెలియజేస్తుంది. క్షేత్ర స్థాయి సమాచారం ఆధారంగా ఇది పనిచేస్తుంది. అంటే రైతులు అందించిన సమాచారమే దీనికి ప్రాతిపదిక.

ఇది బిగ్ డాటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేస్తుంది. మొబైల్ సమాచారం తీసుకుని ఉత్పత్తికి సంబంధించిన వివరాలు అందించగలదు. ఐఓటీ లేదా స్మార్ట్ ఫార్మ్ మేనేజ్ మెంట్ ఆధారంగా సేకరించిన సమాచారం ఆధారంగా ఇది ఉపయోగపడుతుంది. ఆయా చేపల చెరువులలో ఉత్పత్తికి సంబంధించిన సమాచారం ఆధారంగా అల్గోరిథమ్ సూత్రాల ప్రకారం అత్యంత కీలకమైన సలహా సూచనలు అందిస్తుంది. ఫీడ్ వినియోగం, నీటి నాణ్యత, చేపల ఆరోగ్య సంరక్షణ వంటి విషయాలపై సహకరిస్తుంది. సిప్ (SIP)ఆక్సిలేటర్ అనే వేదిక ఇండోనేసియా, ఆసియా వాయువ్య దేశాలలో రొయ్యల పెంపకంలో ఎన్నో విధాలుగా సహకరిస్తోంది.

 ఫీడ్, పెరుగుదల, ఆరోగ్యం వంటి విషయాలను ఈ యాప్ విశ్లేషించగలదు. అనుసరించవలసిన కనీస ప్రమాణాలను ఎప్పటికప్పుడు రైతుకు అందజేస్తుంది. నీటి నాణ్యత, ఫీడ్ ఇన్ టేక్ పర్యవేక్షించడమే కాకుండా వ్యాధుల గురించి, బయో మాస్ కన్వర్షన్ గురించిన సూచనలు అందిస్తుంది. ఫీడ్ కన్వర్షన్ రేషియో లో వచ్చే ఎలాంటి తేడాలనైనా ఫార్మ్ మోజో యాప్ గుర్తించగలదు. అవసరమాన నివారణ ఉపాయాలను అందిస్తుంది. ఈ యాప్ రొయ్యల సాగులో చాలా ఉపయోగకరమని నిర్వాహకులు గట్టిగా హామీ ఇస్తున్నారు. వ్యాధుల ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరించగలదు. ఉత్పత్తి పెంపు, మెరుగైన నాణ్యతలకు తోడ్పడగలదు. అధిక లాభాలకు దారి చూపిస్తుంది. పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేపట్టేందుకు ఉపయోగపడుతుంది. రోజువారీ అవసరాలలో పదేపదే నిపుణుల సాయం తీసుకోవలసిన అవసరాన్ని తప్పించి, ఖర్చు ఆదా చేస్తుంది.

 యాప్ సేవలు పొందాలంటే నెలవారీ చెల్లింపులు చేయవలసి ఉంటుంది. ఫార్మ్ మోజో బేసిక్ ప్లాన్ లో ఒక్కో చెరువుకు నెలకు రూ. 500/ చెల్లించాలి. రొయ్యల సాగుకే కాకుండా మరోన్నో ఇతర ఆదాయ మార్గాలను అంటే హేచరీస్, ఫుడ్ ప్రాసెసర్స్, ఫీడ్ కంపెనీలు, ఆరోగ్య పరిరక్షణ ఉత్పాదనల తయారీదారులు వంటివి- సూచిస్తుంది. చేయూత ఇస్తుంది. సమీప భవిష్యత్తులో రుణ పరపతి, బీమా సదుపాయాలు కూడా కల్పించాలని ఫార్మ్ మోజో ఆలోచిస్తోంది.

 ఫార్మ్ మోజో ఆసక్తి గల రైతులకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ముఖ్యంగా సాంకేతిక ఆవిష్కరణలను పాటించడంలో కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ఈ కార్యక్రమాలను ఉద్దేశించింది. ఫార్మ్ మోజో వ్యవస్థాపనలో కీలక పాత్ర పోషించిన రాజమనోహరర సోమసుందరం “ఇప్పటి వరకు తమ సేవలను దాదాపు 1350 మంది రైతులు ఉపయోగించుకుంటున్నారని” తెలియజేస్తున్నారు.వారి నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తున్నదని ఆయన అన్నారు. ముఖ్యంగా ఫీడ్ వేస్టేజీ బాగా తగ్గినట్లు వారు చెప్పారని ఆయన తెలిపారు.

 ఇవన్నీ అలా ఉంచితే ఈ డిజిటల్ సొల్యూషన్స్ సాంకేతికత విస్తరణకు కొన్ని ఆటంకాలు కనిపిస్తున్నాయి. ముందుగా నిరక్షరాస్యత పెద్ద సమస్య. సరైన అవగాహన లేకపోవడం మరొకటి. ఇది చాలా కష్టసాధ్యమైన వ్యవహారం.  సాదా సీదా రైతులు సంప్రదాయక విధానాలవైపే మొగ్గు చూపుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఆధారిత సేవలకు పెట్టుబడి వృధా అన్న భావన ఎక్కువగా ఉంది. అంతేకాకుండా సాంస్కృతిక, భాషా పరమైన అడ్డంకులు ఎలాగూ తప్పవు.

రిఫరెన్స్ అంశాలు:

1. గ్లోబల్ అక్వాకల్చర్ ఇండస్ట్రీ నివేదిక. https://www.reportlinker.com/p05443599/?utm_source=GNW
2. ఫిష్ ఫార్మ్స్ టు ప్రొడ్యూస్ నియర్లీ టూ థర్డ్స్ ఆఫ్ గ్లోబల్ ఫుడ్ ఫిష్ సప్లయ్ బై 2030 -FAO – 5 February 2014, 
http://www.fao.org/news/story/en/item/213522/icode/
3. డైగవేన్, వైష్ణవి వి రచన – వాటర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ బేస్ డ్ ఆన్ ఐఓటి - అడ్వాన్సెస్ ఇన్ వైర్ లెస్ 
అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్, నవంబర్ 2017
4. రాయ్, అజిత్ కుమార్ రచన – బిగ్ డాటా అనలిస్టిక్స్ టు ఫైట్ ఛాలెంజెస్ ఆఫ్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ సెక్టర్, 
JIFSI 51 (1): 30-36, 2019
5 ఇంబకందన్, డి - అక్వాకల్చర్ ఇన్ ఫార్మాటిక్స్ : ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ & అక్వాకల్చర్ 
ఇన్ ఇండియా - International Journal of Applied Bioengineering,Vol.3.no.1.35-42.January, 2009.
6. రాయ్ ఏ.కే., డి.పి. రథ్, పి.కె. శతపలి - బయో ఇన్ ఫర్మటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇన్ అక్వాకల్చర్ రీసెర్చి, 
Proc National Workshop cum Training Programme on Bioinformatics and Statistics In 
Aquaculture Research held at CIFA,Kausalyaganga during 8-11, Feb., 2000. Pp ,200.
పార్థా పి బిశ్వాస
ఇన్ చార్జి - ఫిషరీస్ ట్రైనింగ్ అండ్ కల్చర్ యూనిట్
సిమురలి కృషి కేంద్ర
సిమురలి డిస్ట్ర్రిక్ట్ - నదియా, పశ్చిమ బెంగాల్
E-mail: parthapbis2006@yahoo.co.in

Recent Posts

బీడు భూముల నుండి సంపద దిశగా  వాతావరణ స్థితిస్థాపకత వైపు ఒక ప్రయాణం

బీడు భూముల నుండి సంపద దిశగా వాతావరణ స్థితిస్థాపకత వైపు ఒక ప్రయాణం

సాలిక్స్ (విల్లో) తోటలను, పప్పుజాతి అంతరపంటలను మరియు అధిక విలువగల ఉద్యానవన పంటలతో అనుసంధానించే వ్యవసాయ అటవీ ఆధారిత...