వ్యవసాయ పంటల నిర్వహణలో రైతులకు తోడ్పడేందుకు గాను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ పేరే ‘నా పంట’. ఆండ్రాయిడ్ ఫోన్ లకు అందుబాటులో ఉండే ఈ యాప్ వినియోగదారుల సంఖ్య – ప్రత్యేకంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో – ఇప్పుడు 1,17,000 దాటింది.
హైదరాబాద్ లో నివసిస్తున్న నవీన్ కుమార్ 2016 డిసెంబర్ లో తన స్వస్థలమైన హనుమకొండ సంద్ర్శించాలని బయలుదేరాడు. ఆ క్షణంలో తన జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన ఏ మాత్రం ఊహించలేదు. (అనుకోకుండా ఆ తరువాతి పరిణామాలలో రిటైల్ స్థాయిలో రుణ ఒడంబడికలకు వేదిక గా రూపుదిద్దుకున్న ‘అప్నా లోన్ బజార్’ పేరుతో ఏర్పాటు చేసే అవసరం వస్తుందని ఆయన అనుకోనేలేదు.
ఆ నాటి స్థితిని గుర్తుచేసుకుంటూ ఆయన ఈ అభిప్రాయాలు వెల్లడించాడు. “ఆ క్షణాలు ఇప్పటికీ నేకు బాగా గుర్తున్నాయి. ఒక రైతు మృతదేహం కనిపించింది. క్రిమిసంహారక మందు తాగి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం – కల్తీ పత్తి విత్తనాలను విక్రయించిన ఒక వ్యాపారి నమ్మకద్రోహం ఆయనను ఆత్మహత్యకు ప్రేరేపించింది. ఇలా కల్తీ విత్తనాలను విక్రయించిన వ్యాపారికి దక్కిన లాభం కేవలం రూ. 300. పంట ఏపుగా పెరిగింది. చాలా సంతోషించాడు. కానీ దిగుబడి మాత్రమే సున్నా. అది చూసిన రైతు గండె మండిపోయింది. నష్టం భర్తీ చేసుకునే మార్గం కనిపించలేదు. పైగా సాగు కోసం చేసిన రుణాల భారం ఎలా వదిలించుకోవాలో అర్థం కాలేదు. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ”
ఆ తరువాత ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా నవీన్ గడిపాడు. రైతుకు ఎదురైన సమస్య మరొకరికి రాకూడదనుకున్నాడు. పల్లె్ పల్లెకు తిరిగాడు. సాధ్యమైనంత మంది రైతులను కలుసుకున్నాడు. వారితో చర్చించాడు. వ్యవసాయ అధికారులను సంప్రదించాడు. శాస్త్రవేత్తలను, నిపుణులను కలిసి వారి సలహాసూచనలు తీసుకున్నాడు. నిజానికి ఈ దిశగా ఆయన చాలా పెద్ద స్థాయిలోనే అధ్యయనం చేశాడు. కొన్ని ఉత్తమ ఆలోచనలకు రూపం వచ్చింది.
“‘నా పంట’ యాప్ ను రూపొందిస్తున్న సమయంలో మేము పైసా పెట్టుబడి పెట్టలేదు. మాకే ఆశ్చర్యం వేసింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో 50,000 మంది రైతులు దీనిని డౌన్ లోడ్ చేసుకున్నారు. ఒకరి నుంచి మరొకరు మాత్రమే దీని వ్యాప్తికి ఆధారంగా నిలిచింది. షేర్ ఇట్ ఆప్షన్ సాయంతో వారు తమ తోటి రైతులకు దీని గురించి తెలియజేశారు. అప్పటి నుంచి మా అడుగులు వేగంగా ముందుకు సాగాయి. ఎన్నో గుణపాఠాలు నేర్పాయి. ఈ రోజున సగర్వంగా చెప్పగలను ‘నా పంట’ యాప్ సాదాసీదా రైతులకు ఎన్నో అంశాలను వివరించే ఎన్ సైక్లోపీడియా లేదా నిఘంటువు అని. ఏ సమాచారం కోసమైనా సరే ఒకసారి యాప్ ఉపయోగిస్తే ఇక మరే సమాచారం కోసమైన సరే యాప్ నే చూస్తున్నారు. చూడకతప్పదు.”
సంపన్నులకూ, విద్యావంతులకు ప్రభుత్వ సంబంధిత పోర్టల్స్ లేదా వ్యవసాయ అధికారుల నుంచి ఉత్తమ పద్ధతుల గురించిన సమాచారం తెలుసుకోవడం పెద్దగా కష్టం కాదు. కానీ, సగటు వ్యవసాయదారులకు అవసరమైన సమాచారాన్ని వేర్వేరు మార్గాల ద్వారా తెలుసుకోవడం కోసం దాదాపు 20 నుంచి 30 శాతం అధికంగా శ్రమపడాల్సి వస్తుంది. అలాంటి సందర్భాలలో సైతం వారు మోసగాళ్ల వలలో చిక్కుకుపోతున్నారు.
కీలకమైన సమాచారం సరైన సమయంలో లభించకపోవడం వల్లనే ఇలాంటి చిన్న కమతాల రైతులు మోసగాళ్ల వలలో పడి కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు, ఉత్పత్తి ఖర్చుల అదుపు వంకతో దళారీల మాటలకు లోబడిపోయి వారి బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారు.
అందువల్ల అలాంటి రైతులకు సహాయకారిగా ఉండే మార్గం అవసరమని నవీన్ భావించారు. “తక్షణం అలా రైతులకు ఉపయోగపడే అన్ని రకాలైన సేద్య సమాచారం, ప్రభుత్వం నుంచి లభించే ప్రయోజనాలను తెలియజేసే యాప్ ను రూపొందించడం అవసరం. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ‘నా పంట’ యాప్ రూపకల్పన జరిగింది. అది కూడా ఉచితంగానే. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చడానికే దీనిని అభివృద్ధి చేశాం. ” అని వివరించారు నవీన్.
ఆ రకంగా ‘నా పంట’ యాప్ నవీన్ ఆలోచనల్లోంచి అందుబాటులోకి వచ్చింది. మెరుగైన దిగుబడి సాధన మాత్రమే కాకుండా రైతులకు ఆత్మహత్యలు చేసుకోవలసిన అవసరం లేకుండా రక్షించడం కోసమే ఏర్పడింది.
‘నా పంట’ యాప్ – సేద్య సంబంధ సమగ్ర సమాచార దర్శిని
‘నా పంట’ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా వ్యవసాయంలో పంట సాగు కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించుకునేందుకు తోడ్పడుతుంది. ఇది ప్రధానంగా ఆండ్రాయిడ్ ప్లాట్ ఫారమ్ లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య మన రెండు తెలుగు రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) 1,17,000 దాటింది.
నూతన ఆవిష్కరణల్లో ఒకటిగా ‘నా పంట’ యాప్ కు అవసరమైన ఎఐపి-ఇక్రిశాట్, ఐఐఐటీ, హైదరాబాద్ సంస్థలు పూర్తి సహకారం, మద్దతు ఇస్తున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారం ఇందులో లభిస్తుంది. అది కూడా అప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
సుమారు 3500 అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న మార్కెట్లలో రోజువారీ ఉత్పత్తుల ధరలను ఇది తెలియజేస్తుంది. ఇంకా 300 అంతకన్నా అధికంగా ఉన్న వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి ఓ మోస్తరుగా ఇంటర్ నెట్ సదుపాయం ఉంటే చాలు.
అంతేకాకుండా ‘నా పంట’ యాప్ సాయంతో రైతులు పటిష్టంగా రూపొందించిన పద్ధతిలో తమ వ్యవసాయ ఖర్చులలో తేడాలను గుర్తించవచ్చు. అవసరమైన ముడి సరుకుల ధరవరలు, క్రిమి సంహారకాల లభ్యత అవకాశాలు, వాటి కంపోజిషన్, తయారీ విధానాలు తెలియజేస్తుంది.
అంతేకాకుండా అయిదు రోజుల పాటు వాతావరణంలో వచ్చే మార్పులను ఇది సూచించగలదు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పంటల బీమా సదుపాయం, పొలంలో భూసారం పరీక్షలు చేసే కేంద్రాల వివరాలు, నిల్వచేేసే సదుపాయాలు, వ్యవసాయ సంబంధింత డీలర్ల సమాచారం చూడవచ్చు.
ఇంటర్ నెట్ సదుపాయం లేని రాతన్నల కోసం ఆఫ్ లైన్ సదుపాయం కూడా కల్పించారు. ఇంటర్ నెట్ లేకున్నా పంటల గురించి, చీడపీడల నివారణ గురించిన సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. సుమారు 100 రకాల పంటల సమాచారం ఇందులో లభిస్తుంది.
ప్రస్తుతం ఈ యాప్ ఇంగ్లీషు, తెలుగు భాషలలో లభిస్తున్నది. ఇందులో అవసరమైన వ్యవసాయ పరికరాలను చౌక ధరలకే కొనుగోలు చేసేందుకు, లేదా కొద్ది పాటి అద్దెపైనే అందించే వారి వివరాలు కనిపిస్తాయి. ఇవి చిన్న సన్నకారు రైతులకు చాలా ఉపయోగకరం. అదే విధంగా మధ్య దళారీల ప్రమేయం లేకుండానే తమ ఉత్పత్తులను ఆన్ లైన్ లో విక్రయించుకోవచ్చు.
పూర్తి విజయం అందించలేకపోతున్నాం
వాస్తవానికి ఇలాంటి యాప్ రూపకల్పన అంత తేలిక అయితే కాదు. ప్రారంభించిన మొదటి మూడు నెలల వ్యవధిలోనే దాదాపు 50,000 మంది యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. కాని అతి తక్కువ సమయంలో వారంతా యాప్ ను తీసేయడం ప్రారంభించారు. కారణం, యాప్ నుంచి లభించే సమాచారం వారి అంచనాలకు తగిన స్థాయిలో లేకపోవడమే. ఒక్కో రైతుకు ఒక్కో రకమైన సమాచారం అవసరమయింది. అందుబాటులో ఉన్న సమాచారంతో వారి సమస్యలకు పరిష్కారం చూపడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
“ఆఫ్ లైన్ పద్ధతిలో అనేక ఫీచర్స్ ప్రవేశపెట్టినప్పుడు వారి ఫోన్ లు సవ్యంగా పనిచేయకుండా మొరాయించాయి. దాంతో మరి కొందరు కూడా యాప్ ను తీసేశారు. అలాంటి పరిస్థితులలో లభించిన సమాచారాన్ని భద్రపరచడంతో పాటు రకరకాల మార్పు చేర్పులు చేసి 16 సేవలను అందుబాటులోకి తెచ్చాం. అదే సమయంలో ఫోన్ లో యాప్ కారణంగా ఎదురయ్యే లోడ్ సమస్య పరిష్కారం కోసం యాప్ సైజ్ ను గణనీయంగా తగ్గించివేశాం.ఇప్పుడు ఈ యాప్ ఏర్పాటు చేసుకుంటే కేవలం 40 ఎంబీ స్పేస్ మాత్రమే ఆక్రమిస్తుంది. ఇది ఫోన్ పై ఎలాంటి భారం కాదు. దీంతో చాలా సాదా ఫోన్ ఉన్న వారికి కూడా యాప్ అనుకూలంగా మారింది. ” అని ఆయన వివరించారు.
“పరిణామక్రమం అంటేనే కొత్త కొత్త ఫీచర్లను జత చేయడం అనేది నిరంతరం సాగవలసిన ప్రక్రియ” అని ఆయన అన్నారు.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. యాప్ లోని డేటా అంతా కూడా సెంట్రల్ ఇన్ సెక్టిసైడ్స్ బోర్డు & రిజిస్ట్ర్టేషన్ కమిటీ (సీఐబీఆర్ సీ) మార్గదర్శకాల ప్రకారమే కూర్చడం జరిగింది. దేశంలోని వివిధ మార్కెట్ ల లోని వ్యవసాయ ఉత్పత్తుల ధరల వివరాలను కూడా అగ్ మార్కెట్ డాట్ నిక్ వెబ్ సైట్ ఆధారంగానే చేరుస్తున్నారు.
ఇవాళ్టి రోజున 1,17000 మంది ఈ ‘నా పంట’ యాప్ ను ఉపయోగిస్తున్నారు. రోజువారీగా లెక్కిస్తే 3000 మంది రైతులు దీనిని సంప్రదిస్తున్నారు. అలాగే రోజువారీగా 25000 వరకు ఇరువైపులా సంప్రదింపులు జరుగుతున్నాయి.
‘నా పంట’ యాప్ విస్తరణ తీరును కాలిఫోర్నియా యూనివర్శిటీ, బర్కలీ సంస్థలు నిర్వహించిన సర్వేలు నిర్ధారిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలోని 10,000 మంది రైతులతో వీరు మాట్లాడారు. ఈ యాప్ ద్వారా అందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారనే అంశంపై సర్వే దృష్టి పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ గ్రామాలలో స్మార్ట్ విలేజీ ప్రాజెక్టు అమలు అవుతోంది. ఈ యాప్ అక్కడి రాష్ట్ర ప్రభుత్వంతోనూ, కాలిఫోర్నియా వర్సిటీతోను కలిసి పనిచేయడానికి ఇక ఎంతో కాలం పట్టదు.
ఈ సందర్భంలో రైతులతో జరిపిన ముఖాముఖీ కార్యక్రమ విశేషాలను ఆయన గుర్తుచేసుకున్నారు. మహబూబాబాద్ దగ్గరి తాళ్ల పూసల పల్లి గ్రామంలో ‘నా పంట’ యాప్ ఉపయోగిస్తున్న కొంత మంది ఔత్సాహిక రైతులు తమ ప్రయోగ ఫలితాలను వివరించడం చాలా ఆసక్తి కలిగించింది.
“ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సమయంలో తమకు ఏ విధంగా ‘నా పంట’ యాప్ ఉపయోగపడిందో వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి (డిఏఓ), వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ (జేడిఏ), అసిస్టెంట్ డైరెక్టర్ (వ్యవసాయ శాఖ) తెలంగాణా అక్కడే ఉన్నారు. వారు కూడా ఈ యాప్ విషయంలో చాలా ఆసక్తి చూపించారు. రైతులను ఈ యాప్ వాడకం దిశగా ప్రోత్సహిస్తున్నారు.” ప్రస్తుతం నవీన్ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ యాప్ వివరించి వారి ఆమోదంతో అక్కడ కూడా దీనిని విస్తరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఈ యాప్ కు మద్దతు ఇస్తున్నాయి.
చివరిగా ఆయన తన ‘నా పంట’ యాప్ రైతులకు చాలా ఉపయోగకరం అని చెబుతూ ఇలా సందేశం ఇచ్చారు. “అందుబాటులో ఉన్న వనరులను, సాంకేతికతను పూర్తిగా వినియోగించుకోవడమే తక్షణ అవసరం. పొలంలో పనిచేసుకుంటూ జీవితం సాగించే రైతులకు సుదీర్ఘమైన వివరణలతో కూడిన వ్యాసాలు కాదు కావాల్సింది. ఉత్తమ సేద్య పద్ధతుల గురించి, వాటి సిద్ధాంతాల గురించి విస్తృతంగా వివరించే కథనాలు, మాటలు కాదు కావలసింది. వారు ఆశించేది తమలాగే పొలంలో కష్టపడుతున్న తోటి రైతుల అనుభవాలు, వాటి సారాంశం మాత్రమే. వారికి సరైన సమాచారం సరైన సమయంలో అందించాలి. వారి సమస్యలకు పరిష్కారాాలు చూపించాలి. అవి వారు తేలికగా అర్థం చేసుకునేందుకు అనుకూలంగా ఉండాలి. అప్పుడే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు సాధ్యం.”
ఇవాళ్టి రోజున 1,17000 మంది ఈ ‘నా పంట’ యాప్ ను ఉపయోగిస్తున్నారు. రోజువారీగా లెక్కిస్తే 3000 మంది రైతులు దీనిని సంప్రదిస్తున్నారు. అలాగే రోజువారీగా 25000 వరకు ఇరువైపులా సంప్రదింపులు జరుగుతున్నాయి.
అది కూడా ఒక్క క్లిక్ తో …..
గమనిక: ఇది గతంలో ప్రచురితమైన (This is an edited version of the original published at https://www.thebetterindia.com/ 170783/ hyderabad-man-develops-app-that-helps-75000-farmers-get-better-yield/ )వ్యాసానికి సంక్షిప్తరూపం.



