వ్యవసాయ రంగంలోనికి డిజిటల్ సాంకేతికను ప్రవేశపెట్టాలనే ఆలోచన కేవలం భవిష్యత్తుకు సంబంధించిన అంశం మాత్రమే అనుకోరాదు. ప్రస్తుత అవసరాలకు కూడా దాని ఆవశ్యకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగానికే ఇది అత్యవసరం. డిజిటల్ సాంకేతికత అన్ని దేశాలలోనూ కూడా వ్యవసాయ రంగం పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతోంది. క్రాప్ ఇన్ డిజిటల్ సొల్యూషన్స్ అందిస్తున్న పరిష్కారాలు వ్యవసాయదారుల నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నాయి. వారిని భవిష్యత్తులో ఎదురయ్యే అనేక సవాళ్లను తట్టుకునే విధంగా శక్తివంతులను చేస్తున్నాయి.
ఇన్ ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అంటే సమాచారం, సమాచార మార్పిడికి సంబంధించిన సాంకేతిక పద్ధతులు - వీటిని తేలిక భాషలో ఐసీటీలు అని కూడా అంటారు - ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతున్నాయి. సేద్య రంగంలోని వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు చూపించడం ద్వారా వారిలో సానుకూల దృక్పథం పెంపొందించి భవిష్యత్తు సవాళ్లకు సన్నద్ధం చేస్తున్నాయి. ఐసీటీ సాయంతో గ్రామీణ ప్రాంతాలలోని వారికి సాంకేతికతను, సహజ వనరులను చేరువచేసి, మెరుగైన ఉత్తమ పద్ధతులను పరిచయం చేస్తూ, అధికోత్పత్తికి మార్గాలు సూచిస్తూ, మార్కెట్ అవకాశాలను అందజేస్తూ వారిని అన్ని విధాలుగా ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు నేర్పి వారిని సమర్థులనుగా మార్చివేస్తున్నది ఈ ఐసీటీ విస్తరణ.
కర్నాటక రాష్ట్రంలో 2010 నాటికి గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయదారులు అనేక సమస్యల సుడిగుండంలో అష్టకష్టాలు పడుతున్నారు. అవసరమైన ఆర్థిక పెట్టుబడి అందుబాటులో లభించడం లేదు. వాతావరణ పరంగా నిత్యం సవాళ్లు ఎదురయ్యేవి. భూసారం విపరీతంగా తగ్గిపోయింది. పంటలకు చీడపీడల బెడద ఎక్కువైంది. ఇక నిర్వహణాపరంగా అనేక లోపాలు వారిని దుక్కుతోచని స్థితిలో పడేస్తూ ఉండేవి. దిగుబడి విషయం పూర్తిగా అంతుబట్టకుండా మారిపోయింది. అన్నిటకన్నా దారుణమైన విషయం - గత్యంతరం లేని రైతుల ఆత్మహత్యలు రోజురోజూకీ పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాతావరణంలో రైతుల్లో ఆత్మహత్యలను తగ్గించేందుకు, వ్యవసాయ రంగాన్ని ఆ సంక్షోభం నుంచి బయటపడేసేందుకు తన వంతుగా ఏదో చేయాలనే తాపత్రయంతో శ్రీ కృష్ణకుమార్ ముందుకు వచ్చాడు. ఆ సమయానికి కృష్ణకుమార్ జీఈ సంస్థలో మంచి వేతనంతో ఉద్యోగంలో ఉన్నాడుయ కానీ ఈ ఆలోచన రాగాేనే ఉద్యోగానికి రాజీనామాచేశాడు. స్వయంగా క్రాప్ ఇన్ సొల్యూషన్స్ సంస్థకు అంకురార్పణ చేశారు. వ్యవసాయ రంగంలో సమస్యలకు పరిష్కారాలు అన్వేషించే లక్ష్యంతో ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. అదిప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతన్నలకు అండగా నిలుస్తూ భరోసా ఇస్తోంది.
సాంకేతికత సాయంతో ముందుగా వ్యవసాయ భూముల విలువను ఎకరా ప్రాంతిపదికగా మెరుగపరచడంపై క్రాప్ ఇన్ దృష్టి పెట్టింది. అందుకోసం డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి, సేమాచార సేకరణ-విశ్లేషణ (డెటా అనలిసిస్) అంశానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలోనే రైతుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు కృషి ప్రారంభించింది. పర్యావరణ వ్యవస్థకు ఎలాంటి ముప్పు ఏర్పడకుండా సేద్య రంగానికి అవసరమైన సేవలను అందించే బాధ్యతను స్వీకరించింది. ఈ ప్రయత్నంలో కేవలం వ్యవసాయ రంగానికి మాత్రమే కాకుండా అనుబంధ రంగాలన్నిటికి తన సేవలను విస్తరించింది. ఒక్కో రంగానికి ఎలాంటి సేవలు అవసరమో వాటినే సమకూర్చేందుకు సిద్ధమైంది. క్రాప్ ఇన్ రూపొందించిన కార్యక్రమం సమాచారపరంగా సంపన్నమైన వ్యవసాయదారులకు మాత్రమే కాకుండా ఆ రంగంతో ఏదో రూపంలో అనుబంధం ఉన్న ఇతర భాగస్వామ్య పక్షాలన్నిటికీ ఉపయోగకరంగా రూపు దిద్దుకుంది. ముఖ్యంగా క్రాప్ ఇన్ పరిష్కారాలు పర్యావరణ వ్యవస్థలోని వివిధ స్థాయిల్లో జరిగే వ్యవసాయ-వ్యాపార కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని బి2బి సూత్రప్రాతిపదికగా ఉపయోగపడతాయి. ఈ సంస్థ దృష్టి కేంద్రీకరించిన రంగాలు వ్యవసాయం, ప్రాసెసింగ్ (శుద్ధి చేయడం), సేకరణ దళాలు, ఎగుమతిదారులు, ఆహార విక్రేతలు (టోకు లేదా చిల్లర), వ్యవసాయప్రాధాన్యత ఉన్న ముడి పరికరాల తయారీదారులు (ఇందులోనే యంత్రసాధనాలు, విత్తనాలు, ఎరువులు, సస్య పోషకాలు, క్రిమిసంహారకాలు కూడా ఉంటాయి), బ్యాంకింగ్, తదితర ఆర్థిక సహాయ సంస్థలు, పంటల బీమా సంస్థలు, అభివృద్ధికు తోడ్పడే సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, వ్యవసాయదారులు అన్న క్రమంలో ముందుకు వెడతాయి. వీరంతా కూడా వ్యవసాయ సంబంధిత వ్యాపార వర్గాలుగా గుర్తించాలి.
ఇప్పటివరకు అంటే గడచిన పదేండ్ల కాలంలో కార్ప్ ఇన్ రూపొందించిన పరిష్కారాల ప్రభావం వ్యవసాయ రంగంపై చాలా ఉంది. ఫలితాలు కూడా సంతృప్తికరంగానే ఉన్నాయి. విశ్వవ్యాప్తంగా వ్యవసాయదారులకు లబ్ధి చేకూరుస్తున్నాయి.
విజయ గాథలు
వ్యవసాయ సంబంధిత సాంకేతిక రంగంలో క్రాప్ ఇన్ సాధించిన విజయాలు కేవలం సాంకేతికంగా మాత్రమే కాకుండా సామాజిక-ఆర్థిక పరమైన ప్రయోజనాలకు కూడా మార్గం చూపించాయి. ఇందుకు ముఖ్యమైన కారణం క్రాప్ ఇన్ పరిష్కారాలలో అభివృద్ధి లక్ష్యంతో పనిచేసే సంస్థలు కూడా వాటిలో భాగస్వామ్యం కావడమే.
ఏ. టాటా సీఐఎలనేఐ ప్రాజెక్టు
మధ్య భారత దేశంలోని గిరిజన తెగల జీవన స్థితిగతులను మెరగు పరిచేందుకు గానూ టాటా ట్రస్టు కలెక్టివ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ లైవ్ లీహుడ్ ఇనీషియేటివ్స్ (సీఐఎన్ఐ) పేరిట కొన్ని కార్యక్రమాలు చేపడుతోంది. వారితో కలిసి క్రాప్ ఇన్ కూడా పనిచేస్తోంది. ఏప్రిల్ 2015లో సీఐఎన్ఐ అత్యున్నత ఆశయాలతో మిషన్ 2020: లక్షపతి కిసాన్ - స్మార్ట్ విలేజీస్ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. దీని కింద 101000 కుటుంబాలను పేదరికం నుంచి విముక్తులను చేయాలని సంకల్పించింది. వారి జీవన ప్రమాణాలను, ప్రత్యామ్నాయ జీవిత ఉపాధులను అందించేందుకు ఆశయంగా పెట్టుకుంది. మహారాష్ట్ర, గుజరాత్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల పరిధిలోని 17 బ్లాకులను ఇందుకు ఎంపిక చేసుకుంది. లక్ష్యంగా పెట్టుకున్న 101000 కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి ఏడాది కాలంలో కనీసం 1590 డాలర్లు (ఇప్పటి రేట్ల ప్రకారం … రూపాయలలో 116514) ఆదాయం వచ్చేలా కృషిచేయాలని నిర్ణయించింది. ఆ సమయంలో కనీస ఆదాయం ఏడాదికి 530 డాలర్లు మాత్రమే. అంటే కేవలం 38838 రుపాయలు అదీ ఏడాది కాలానికి సాగటు కుటుంబాల ఆదాయం. ఈ నాటికి 70000 కుటుంబాల జీవితాలలో మార్పు తీసుకురావడానికి అవసరమైన వ్యవస్థీకృత పరిధిలోకి చేర్చడం సాధ్యమైంది.
ఈ లక్ష్యాల సాధన కోసం చేపట్టిన కార్యక్రమాలలో రైతుల సామర్థ్యం పెంపు ముఖ్యమైనది. ఇందులో క్రాప్ ఇన్ తయారుచేసిన స్మార్ట్ ఫార్మ్ డేటా భాగస్వామ్యం కీలకంగా మారింది. క్షేత్ర స్థాయి కార్యకర్తలు రోజువారీ ప్రాతిపదికన రైతు సోదరులతో కలిసి మెలసి తిరుగుతారు. చర్చిస్తారు. సమస్యలను గుర్తిస్తారు. తోడ్పాటు చర్యలను నిర్ణయిస్తారు. క్షేత్రస్థాయి కార్యకర్తలు ఈ విధంగా సేకరించిన సమాచారాన్ని రైతులు తేలికగా ఉపయోగించుకునే పద్ధతిలో పంపిణీ చేయడం జరుగుతుంది. క్లౌడ్ ప్లాట్ ఫారమ్ లో నిల్వచేసి ఉంచే ఈ సమాచారాన్ని రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిశీలించే అవకాశం ఉంటుంది. రైతులే కాదు. ఇతర భాగస్వామ్య పక్షాలకు కూడా ఈ డేటా అందుబాటులో ఉంటుంది.
క్రాప్ ఇన్ సహకారం ఫలితంగా సీఐఎన్ఐ రైతులకు ఉపయోగకరమైన స్మార్ట్ ఫార్మ్ సదుపాయాలను అందించగలుగుతున్నది. పంట సాగు వ్యవధి మొత్తంలో ఏ దశలో అయినా రైతులకు అవసరమైన సమాచారం ఇందులో లభిస్తుంది. ఝార్ఖండ్ పరిసరాలలోని గోడ్ బండ్, ధల్భూమ్ గఢ్ ప్రాంతాలలోని 4,300 మంది రైతులకు అవసరమైన సాగు సమాచారం అందించడంతో పాటు వారికి మెరుగైన జీవనోపాధులను అందిస్తోంది. ఈ రెండింటి సమన్వయంతో ఇప్పటివరకు 3,400 అంతకన్నా ఎక్కువ సంఖ్యలోనే వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించిన సమగ్ర సమాచారం డిజిటల్ రూపంలో భద్రంగా ఉంది. అందులో రైతులకు సంబంధించి, వారి పంట పొలాలకు సంబంధించి పూర్తి విివరాలు ఉంటాయి.
స్మార్ట్ ఫార్మ్ సదుపాయం వల్ల రైతులకు సరైన సమయంలో సరైన సలహా సూచనలు అందితాయి. ఉత్తమ పద్ధతుల గురించిన వివరాలు లభిస్తాయి. రసాయనాల మోతాదు గురించి లభించే సమాచారం అధిక దిగుబడి సాధనకు తోడ్పడుతుంది. రోజువారీ క్రమంలో రైతులతో సంప్రదింపులు చేయవలసిన బాధ్యత ఉన్న క్షేత్రస్థాయి కార్యకర్తల పనితీరుపై నిఘా ఉంచే అవకాశం ఉంటుంది. రైతుల నుంచి లభించిన అత్యంత కీలకమైన సమాచారం సేకరించి భద్రపరచడం సాధ్యమవుతుంది. ఈ రకంగా సేకరించిన సమాచారం అంతా కూడా రేతులకు, ఇతర భాగస్వామ్య పక్షాలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతారు. క్రాప్ ఇన్ క్లౌడ్ ప్లాట్ ఫారమ్ పై నిల్వచేసిన ఈ సమాచారం ఎప్పుడైనా అందరికీ చేరువలోనే ఉండేలా సరళమైన స్మార్ట్ ఫార్మ్ విధానంలో చేర్చబడుతుంది. ఇలా అందుబాటులో ఉన్న సమాచారం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. దిగుబడి గురించి సరైన అంచనాలు వేయడానికి మాత్రమే కాకుండా ఆ రకమైన అంచనాల ఆధారంగా సీఐఎన్ఐ చర్యల ప్రయోజనాలను గుర్తించడానికి సాధ్యమవుతుంది.
సమగ్రమైన సమాచారంతో వ్యవసాయదారులకు సరైన మార్గదర్శకం చేయడం సాధ్యమవుతుందని క్రాప్ ఇన్ భావిస్తోంది. ఈ రకమైన మార్గదర్శకం ద్వారానే పోషక విలువలతో కూడిన ఆహారం, ఆర్థికంగా లాభసాటిగా సేద్య రంగంలో మార్పులు చేయడం, సుస్థిరత సాధించడం, అధిక దిగుబడులను విశ్వవ్యాపితంగా సాధించవచ్చని విశ్వసిస్తోంది. ఉత్తమ సేద్య పద్ధతులు అనుసరించినప్పుడు ఈ ప్రయోజనాలు సాధ్యమని నమ్ముతున్నది. ఈ లక్ష్యసాధనలో క్రాప్ ఇన్ సరైన దిశలోనే అడుగులు ముందుకు వేయగలుగుతోంది.
బి. జీవిక – ఉఫాదుల పెంపు, వాతావరణ సవాళ్లకు దీపిక
సుస్థిర జీవనోపాధులు, వాతావరణపరమైన సవాళ్లకు దీటుగా పరిష్కారాల అన్వేషణ (ది సస్టయినబుల్ సైవ్ లీహుడ్స్ అండ్ అడాప్షేషన్ టు క్లైమేట్ చేంజి - ఎస్ఎల్ఏసిసి) ప్రాజెక్టును మన దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ గ్రామీణ జీవనోపాధుల ప్రాజెక్టు (నేషనల్ రూరల్ లైవ్ లీ హుడ్స్ ప్రాజెక్టు-ఎన్ఆర్ఎల్ పీ)కు అనుబంధంగా అమలుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో క్రాప్ ఇన్ భాగస్వామి కావడం వల్ల వాతావరణ సవాళ్లకు దీటైన సాంకేతికత రూపకల్పన సాధ్యమవుతోంది. రైతులకు వాటిని అందిబాటులోకి తీసుకురావడం సాధ్యమవుతోంది. దీని సాయంతో వాతావరణపరంగా ఎదురయ్యే సమస్యలను, ఫలితంగా ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని రైతుల్లో పెంచగలుగుతోంది.
వ్యవసాయంలో సర్వసాధారణంగా ఎదురయ్యే వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భరోసా ఇవ్వడం అనేది చాలా పెద్ద సమస్య. స్వల్పకాలిక లేదా దీర్ఘకాలికంగా ప్రయోజనం కల్పించే పరిష్కారం గుర్తించడం చాలా కష్టం. అయినప్పటికీ బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని నాలుగు జిల్లాలలోభారీ ఎత్తున ప్రయోగం చేపడుతున్నారు. ఇందులో వాతావరణ సమస్యలకు డిజిటల్ సమాచారం ఆధారంగా సమాధానం కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా సాగుతున్న ప్రయత్నాలలో రాష్ట్ర స్థాయి ఉపాధి కల్పన (స్టేట్ రూరల్ లైవ్ లీ హుడ్స్ మిషన్ - ఎసేఆర్ఎల్ఎం) కు క్రాప్ ఇన్ సహకరిస్తోంది. అధిక దిగుబడి సాధనకు వాతావరణ పరిస్థితులు, భూసారం తీరు తెన్నులు, తదితర అంశాల ఆధారంగా చేపట్టవలసిన చర్యలను రైతులకు ఎప్పటికప్పుడు అందించడం సాధ్యమవుతోంది.
పంట సాగు సమయంలో రైతు సాధిస్తున్న పురోగతిని ఖచ్ఛితంగా నిఘా వేసి ఉంచేందుకు సరైన సమయంలో హెచ్చరికలను చేస్తూ, భాగస్వామ్య పక్షాలకు మార్గదర్శకం చేసేందుకు పటిష్టమైన వ్యవస్థ చాలా అవసరం. ముఖ్యంగా పర్యావరణ అనుకూల సేద్య రంగంలో ప్రతి దశలోనూ ఇటువంటి పర్యవేక్షణ అవసరం. క్రాప్ ఇన్ రూపొందించిన స్మార్ట్ ఫార్మ్ వ్యవసాయ రంగ అవసరాలకు సంబంధించిన అత్యాధునిక సాంకేతిక సాధనం. ఈ సాంకేతికత ఆధారంగా రైతులకు సకాలంలో సరైన పరిష్కారాలు లభిస్తాయి. సాగు కృషిలో ప్రతి దశలోనూ అవసరమైన సూచనలు లభిస్తాయి. నిరంతరం సాగు కార్యకలాపాలు, వాటి పురోగతి తీరును పర్యవేక్షిస్తూ అధికోత్పత్తికి తోడ్పడుతుంది.
క్రాప్ ఇన్ సాంకేతికత వాతావరణ స్థితిగతులకు తగినట్లుగా సలహాలు సూచనలు అందించగలదు. అలాగే సీజన్ ల తగినట్లు అన్ని రకాల ముఖ్యమైన పంటల రక్షణకు సూచనలు అందించగలదు. స్థానికంగా వాడుకలో ఉన్న హిందీ భాషలోనే రైతులకు వాతావరణ ఆధారిత సూచనలు అందజేయగలు. ఎప్పటికప్పుడు తగిన పరిష్కార మార్గాలను కూడా సూచిస్తుంది. వాస్తవానికి వ్యవసాయ పనులను ఖచ్ఛితంగా పర్యవేక్షించడం అంత తేలికైన విషయం కాదు. పైగా భాగస్వామ్య పక్షాలకు మొబైల్ సాయంతో అటువంటి సమాచారాన్ని చేరవేయడం తేలికైన పని కాదు. ఈ విషయాలలో క్షేత్ర స్థాయి విస్తరణ కార్యకర్తలే తమ సామర్థ్యం చూపించాల్సి ఉంటుంది. పారదర్శకతను పాటిస్తూ చీడపీడల ముప్పు ఎదురైనప్పుడు భాగస్థులకు సరైన సమయంలో సరైన హెచ్చరికలు అందించాలి.
ఈ సమయంలోనే గ్రామస్థాయి రిసోర్స్ నిపుణులకు సహకరించేందుకు వెబ్ లేదా మొబైల్ ఆధారిత సమాచార సలహా వ్యవస్థను కూడా సిద్ధమై ఉంది. నాట్లు వేయడం, భూసారాన్ని గమనించడం, విత్తనాలను శుద్ధి చేయడం, ఎరువుల వినియోగం వంటి అంశాలతో పాటు వారం రోజుల పాటు ఉండే వాతావరణ పరిస్థితులను నిత్యం గమనిస్తూ తగిన సలహా సూచనలను వీరు అందించాలి. ఈ మొత్తం సమాచారాన్ని పంట పొలాలకు అనుకూలమైన అంటే చిన్న కమతాల రైతులకు ఉపయోగపడేలా అందించాల్సి ఉంటుంది. అలా ముందస్తుగా అందుతున్న సమాచారం ఆధారంగానే రైతులు సరైన నిర్ణయాలకు రాగలుగుతారు. తమ పంటలను కాపాడుకోగలుగుతారు. వ్యవసాయ నిపుణుల నుంచి ఎప్పటికప్పుడు అనుసరించవలసిన సాంకేతికపరమైన సూచనలు రైతులకు చేరవేయాలి. ఈ విషయంలో పరిశోధన సంస్థలకు చెందిన నిపుణులు తమ వంతు సాయం అందిస్తారు.
క్రాప్ ఇన్ రూపొందించిన సాంకేతిక అంశాలపై ఆధారపడి మాత్రమే రిసోర్స్ కార్యకర్తలు నాట్లు, భూసారం, విత్తన శుద్ధి, వాతావరణ సూచనలు వంటి వాటిని రైతులకు ఉపయోగపడే విధంగా అందించడం సాధ్యమవుతుంది. బీహార్ లో రైతులకు ఈ విధానం మంచి ప్రయోజనాలు చేకూర్చింది. వీటి ఆధారంగా రైతులకు అందుతున్న సాంకేతిక సూచనలను రైతులకు అర్థమయ్యే విధంగా రిసోర్స్ కార్యకర్త వివరించగలుగుతారు. రైతులకు సరైన శిక్షణ ఇవ్వగలుగుతారు. అదే సమయంలో రైతుల అనుభవాలను, సూచనలను పాటించి సాధించిన ఫలితాలను క్రాప్ ఇన్ నిపుణులకు చేరవేయగలుగుతారు.
సవాళ్లు అనేకం
ఇలా రైతులకు ఉపయోగకరమైన సాంకేతిక సమాచారాన్ని, పరిష్కారాలను డిజిటల్ రూపంలో అందించే క్రమంలో అనేక రకాలైన సవాళ్లు తప్పలేదు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వ్యవసాయ పెట్టుబడి దారులకు ఇలాంటి మార్పులు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా కనిపించలేదు. డిజిటల్ సాంకేతిక సమాచారం విషయంలో కూడా వారు అనేక అనుమానాలు లేవనెత్తారు. ఈ రకంగా డిజిటల్ పద్ధతిని రైతులు అనుసరించినట్లయితే తమకు ఏ విధమైన ప్రాధాన్యం ఉండదని వారు ఆందోళన చెందారు. ఇది మొదటి సమస్య.
స్మార్ట్ ఫార్మ్ : వ్యవసాయ క్షేత్రాల నిర్వహణకు సంబంధిచిన పరిష్కారాలు సూచించడంలో అవార్డు సాధించిన వ్యవస్థ. ఇందులో వ్యవసాయ పంట పొలాలు, వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచార సంపద, అలాంటి సమాచార ససాయంతో నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు, సూచనలను పాటిస్తున్న రైతుల వ్యక్తిగత సమాచారం, వారు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, వారు చేపట్టిన సేద్యం ద్వారా సాధించనున్న దిగుబడులకు సంబంధించిన అంచనాలు లభిస్తాయి. అన్ని విధాలా అనుకూలమైన సేద్య పద్ధతుల గురించి, వాటి ప్రామాణీకరణ ధృవీకరణలు, చీడ పీడల నివారణ పద్ధతులు అన్నీ తెలుసుకోవచ్చు. పంటను ఆరోగ్యవంతంగా చూసుకోవచ్చు.స్మార్ట్ రిస్క్ : వ్యవసాయ సంబంధిత వ్యాపార రంగానికి అనువైన సొల్యూషన్స్ లభించే సదుపాయం. వ్యవసాయేతర ప్రత్యామ్నాయ సమాచారం, రిస్క్ నివారణ పద్ధతులు, ముందస్తు అంచనాల ఆధారంగా రుణభారం సరైన క్రమంలో తగ్గించుకునే మార్గాలు, రుణాల వసూలుకు అనుకూలమైన విధానాలు తెలుసుకోవచ్చు. ఉపగ్రహాల ఆధారంగా వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి అందించిన సమాచారం అన్ని సందర్భాలలోనూ ఉపయోగకరంగా ఉంటుంది.ఎంవేర్ హౌస్ : ప్యాక్ హౌస్ సమస్యలు, ప్రాసెసింగ్ సమస్యలు, ఎగుమతిదారుల వివరాలు ఉన్న ఈ సమాచారం పంట పొలం నుంచి చిట్టచివరి వినియోగదారు వరకు వాస్తవ స్థితిగతులు, క్వాలిటీ కంట్రోల్ విధానాలు, వాటి ఆచరణ తీరుతెన్నులు, అవసరానికి తగినట్లుగా ఇన్వెంటరీ మార్పులకు దోహదపడుతుంది.స్మార్ట్ సేల్స్ : క్రయవిక్రయాలకు ఉపయోగపడే సమగ్రమైన సీఆర్ఎం సమాచారం, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సేల్స్ టీమ్ లకు ఎంతో ఉపయోగకరం.ఎకరా స్క్వేర్ : రైతుకు ఉపయోగకరం. కంపెనీలు నేరుగా రైతులతో సంప్రదింపులు జరిపేందుకు తోడ్పడుతుంది. సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా ఉంటుంది. అవసరమైన అవగాహన కల్పిస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. ఫలితంగా రైతులకు అవసరమైన సమాచారాన్ని కంపెనీలు సకాలంలో అందించగలుగుతాయి. రైతుల ఆదరాభిమానాలను కంపెనీలకు సంపాదించి పెడుతుంది.
ఇక రెండవది - మొబైల్ వినియోగం, రైతులలో అక్షరాస్యత. ఇంటర్ నెట్ సదుపాయాలు, బ్రాడ్ బ్యాండ్ సేవలు, మొబైల్ సేవలు విస్తరిస్తున్న మాట నిజమే అయినా వాటి వాడకం గ్రామ ప్రాంతాలలో బాగా వ్యాప్తిలోకి రాలేదు. ఇంకా ఈ పరిస్థితి మెరుగు కావాలి. ఇక సాంకేతిక రంగం నిత్యం మార్పులతో దూసుకుపోతోంది. క్రాప్ ఇన్ కూడా ఆ మార్పులను అనుసరించడం తప్పనిసరి. సాంకేతిక మార్పులతో పోటీ పడి ముందుకెళ్లాలంటే అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. పైగా కాలపరిమితులు ఉంటాయి.
వ్యవసాయ రంగంలో సాంకేతికత విస్తరించేందుకు రైతులకు పూర్తిగా చేరేందుకు ఈ సవాళ్లను ఎదుర్కోవాలి. అయితే క్రాప్ ఇన్ సంస్థ సాధ్యమైనంత వరకు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకెడుతోంది.
జవాబుదారీతనంలో భాగస్వామ్యం1. క్రాప్ ఇన్ సాంకితిక బృందాలతో పాటు ఆయా అంశాలపై పూర్తి అవగాహన ఉన్న నిపుణులు అవసరమైన సలహాసూచనలు అందిస్తారు. అలాగే రైతుల అనుభవాలను ఇతరులకు తెలియజేస్తారు. వనరులను అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తారు. అవసరమైన శిక్షణ కార్యక్రమాలను రూపొందించి రైతులకు పూర్తి నైపుణ్యం కలిగిస్తారు.2. క్రాప్ ఇన్ బ్లాక్ స్థాయి సమన్వయకర్తలు స్థానిక అవసరాలకు అనువుగా ఉండే కార్యక్రమాలను రూపొందిస్తారు. అవసరాన్ని బట్టి (విలేజీ రిసోర్స్ పర్సన్ లు- విఆర్ పీలు, వైపిలు, రైతులకు) శిక్షణ ఇస్తారు.3. విఆర్ పి లు రైతులకు అవసరమైన అవగాహన కల్పించడంతో పాటు వారికి సరైన శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణను రైతులకు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుంది. ఇంకా రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలను అందించే సరఫరాదారులు కూడాశిక్షణలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలలో పాల్గొనే సమయంలో తమ కస్టమర్లకు అవసరమైన సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.4. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తమ తమ పంట పొలాల్లో పాటించవలసిన బాధ్యత రైతులదే.
ప్రభావం
ప్రస్తుత కాలంలో రైతులు ఆధునిక సాంకేతికను స్వీకరించేందుకు ఆసక్తిగానే ఉన్నారు. ప్రయోజనకరమైన సమాచారం డిజిటల్ రూపంలో అందుతుండడం వారికి అనుకూలంగానే ఉంది. దిగుబడి పెరగడం, పొలంలో ఉత్పాదకత మెరుగు కావడం వల్ల సాంకేతికతను అనుసరించేందుకు వారు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు క్రాప్ ఇన్ ప్రభావం దాదాపు 21 లక్షల మంది రైతులకు మార్గదర్శకం చూపిస్తోంది. ఇంకా 52 దేశాలలోని 61 లక్షల ఎకరాల్లో క్రాప్ ఇన్ తన సేవలను అందిస్తోంది. సుమారుగా 388కి పైగా పంటలకు సంబంధించి క్రాప్ ఇన్ తన సహాయం అందిజయగలుగుతోంది. 9,400 అంతకన్నా ఎక్కువ సంఖ్యలోనే వివిధ రకాల పంటల సాగులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను క్రాప్ ఇన్ అందించగలుగుతోంది.
వ్యవసాయంలో డిజిటల్ సేవలు అన్న సూత్రం కేవలం రేపటి అవసరాలకు మాత్రమే ఉపయోగపడేవి కావు. నేటి ప్రపంచంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల నేపథ్యంలో ఇది చాలా ప్రాముఖ్యం కల అంశం. ప్రపంచవ్యాప్తంగా సేద్య రంగాన్ని ప్రోత్సహించడంలో ఉత్తేజపరచడంలో డిజిటల్ సేవలు చాలా కీలకంగా మారనున్నాయి. డిజిటల్ సేవల వ్యాప్తి ప్రభావం వల్ల ఎన్నో అనూహ్యమైన ఫలితాలు సాధ్యమయ్యాయి. ఆహార ఉత్పత్తి రూపంలోనే కాకుండా రైతుల జీవనోపాధికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. డిజిటల్ వ్యవసాయం అంటే స్మార్టర్, డేటా ఆధారత నిర్ణయాధికారం, అధిక దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తి సాధ్యమవుతున్నాయి. ఇందుకు చాలా ఖచ్ఛితత్వంతో కూడిన సమాచారం, ఆ రకంగా సిద్ధం చేసిన సమాచారం సరైన సమయానికి రైతుకు అందడం వల్లనే సాధ్యమవుతోంది. భవిష్యత్తును అందరికీ శ్రేయస్సు కలిగించేలా రూపొందుతోంది.
కృష్ణకుమార్
క్రాప్ ఇన్ వ్యవస్థాపకులు, ప్రస్తుతం సీఈఓ
3వ ఫ్లోర్, 1021, 16వ మెయిన్ రోడ్డు
తవరకెరె, అయికోబ్ నగర్, 1వ స్టేజీ
బిటిఎం లే అవుట్ 1, బెంగళూరు
కర్నాటక - 560029



