నాయకత్వానికి ఉదాహరణగా నిలిచిన బీబీ ఫాతిమా విజయగాథ

మహిళా సాధికారత అనేది సమాజంలో సాంప్రదాయకంగా వెనుకబడిన మహిళల ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ స్థితిని పెంపొందించే ప్రక్రియ. మహిళలను సాధికారపరచడం వల్ల ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి, ఉత్పాదకత మరియు వృద్ధిని పెంచుతాయి. కర్ణాటకకు చెందిన బీబీ ఫాతిమా ఉదంతం, మహిళల వ్యాపారం లేదా సంస్థ వారికి ఆర్థిక స్వాతంత్ర్యం మరియు సాధికారత ఇవ్వడం ద్వారా సమాజాన్ని గణనీయంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందని రుజువు చేస్తుంది.

బీబీ ఫాతిమా హవేరి జిల్లాలోని షిగ్గోన్ తాలూకాలోని తీర్థ గ్రామానికి చెందిన 38 ఏళ్ల యువ, ఔత్సాహిక గ్రాడ్యుయేట్. సహజ్ సముర్ధ అనే NGO సహాయంతో, బీబీ ఫాతిమా 2018 నుండి మహిళల సాధికారత కోసం కృషి చేస్తోంది. ఆమె మొదట బీబీ ఫాతిమా స్వ సహాయ సంఘాన్ని స్థాపించింది, ఇది స్వయం సహాయక బృందం (SHG) మరియు షిగ్గోన్ మరియు కుండ్గోల్ అనే రెండు తాలూకాలలో ఆరు స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు దోహదపడింది.

కమ్యూనిటీ సీడ్ బ్యాంక్

బీబీ ఫాతిమా 2019లో తీర్థలో విత్తన బ్యాంకును ప్రారంభించారు, దీని ద్వారా విత్తనాల ఉత్పత్తి మరియు లభ్యతను పెంచారు. ప్రస్తుతం ఆమె వద్ద వివిధ పంటలకు చెందిన 300 రకాల విత్తనాలు ఉన్నాయి. ఆమె వద్ద 75 రకాల ఫింగర్ మిల్లెట్ (రాగులు) విత్తనాలు, 25 రకాల లిటిల్ మిల్లెట్ (సామలు), 25 రకాల బ్రౌన్ టాప్ మిల్లెట్ (అండు కొర్రలు) విత్తనాలు, 10 రకాల ఫాక్స్‌టైల్ మిల్లెట్ (కొర్రలు) మరియు రెండు రకాల ప్రోసో మిల్లెట్ (వరిగలు) ఉన్నాయి. ఆమె విత్తన బ్యాంకులో కూరగాయలు మరియు పప్పుధాన్యాలలో విభిన్న విత్తనాలు కూడా ఉన్నాయి.

రైతులు తమ పొలంలో అనేక పంటలు పండించడానికి సహాయపడటానికి 9 రకాల విత్తనాలతో కూడిన "నవధాన్య కిట్" అభివృద్ధి చేయబడింది. ఇందులో పప్పుధాన్యాలు, నూనె గింజలు, తృణ ధాన్యాలు మరియు కూరగాయలు వంటి వివిధ విత్తనాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం, ఈ కిట్లను హవేరి, ధార్వాడ్, గుల్బర్గా, మైసూర్ మరియు మాండ్య జిల్లాల నుండి ఎంపిక చేసిన రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఆసక్తి ఉన్న ఇతరులకు ఈ కిట్లను ధరకు అమ్ముతారు.

సీడ్ బ్యాంక్ అనేది భవిష్యత్ తరాలకు జన్యుపరంగా స్వచ్ఛమైన రకాన్ని నిర్వహించడానికి విత్తనాలను నిల్వ చేసే సదుపాయం. విత్తనాలు సాధారణంగా శీతోష్ణస్థితి నియంత్రణలో, తక్కువ తేమ మరియు తగిన ఉష్ణోగ్రతలలో నిల్వ చేయబడతాయి, ఇవి విత్తనాలను దీర్ఘకాలికంగా నిల్వ చేయడంలో సహాయపడతాయి. విత్తన భాండాగారం అనేది ఒక రకమైన బీమా, ఇది అంతరించిపోకుండా వీలైనన్ని ఎక్కువ మొక్కల జాతులను కాపాడటానికి అనుమతిస్తుంది. బాగా నిధులు సమకూర్చబడిన మరియు బాగా నిర్వహించబడే విత్తన బ్యాంకులు వ్యవసాయంపై వాతావరణ మార్పు యొక్క ప్రభావాన్ని తగ్గించడంలో ప్రపంచవ్యాప్తంగా ఇవి కీలకమైనవి.
 

2021లో సహజ సమృద్ధి సహాయంతో, హైదరాబాద్‌లోని ICAR-IIMR ఆర్థిక సహాయంతో గ్రామంలో తొమ్మిది మిల్లెట్ ప్రాసెసింగ్ యంత్రాలు (టేబుల్ 1 చూడండి) స్థాపించబడ్డాయి. ఇది బీబీ ఫాతిమా నాయకత్వంలో నిర్వహించబడుతోంది. ఈ యూనిట్‌లో, రాగి దోశ మిక్స్, రాగి మల్టీగ్రెయిన్ అట్టా, రాగి స్పెషల్ మాల్ట్, అన్ని ధాన్యాల పిండి మొదలైన వివిధ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి కాకుండా బొప్పాయి సబ్బులు మరియి బొగ్గు సబ్బులను స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో తయారు చేస్తున్నారు, తులసి, వేప, వేప రసం, పాలు, పసుపు మరియు కలబంద వంటి సహజ ఉత్పత్తులను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. అన్ని విలువలు జోడించిన ఉత్పత్తులు హంపి ఉత్సవ్ వంటి వివిధ ఈవెంట్‌లలో ప్రదర్శించబడతాయి.  తద్వారా పెద్ద కమ్యూనిటీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం జరుగుతుంది.

2023లో, 1000 మంది వాటాదారులతో "దేవధాన్య" పేరుతో రైతుల ఉత్పత్తిదారుల సంస్థ (FPO) ఏర్పడింది, ఇందులో 80 శాతం మంది మహిళలు ఉన్నారు. FPO ద్వారా వారు ప్రతి వారం 5క్వింటాళ్ల వివిధ రకాల మిల్లెట్ అటుకులను విక్రయిస్తారు. వారు మేళాలు మరియు సమావేశాల సమయంలో క్యాటరింగ్ సేవలను కూడా చేస్తారు. వారు తృణధాన్యాలతో తయారు చేసిన రొట్టెలను వారి సొంత జిల్లాలో ఒక్కొక్క రొట్టెను 7-8 రూపాయలకి మరియు జిల్లా వెలుపల రూ. 10/రోటీని  అమ్ముతారు. మొత్తం మీద వారికి దాదాపు 20% లాభం వస్తుంది.

టేబుల్ 1: మిల్లెట్ ప్రాసెసింగ్ యంత్రాలు

ఆస్పిరేటర్చిరు ధాన్యాల పై పొట్టును తొలగించడానికి ఉపయోగిస్తారు. పొట్టు మరియు బియ్యాన్ని ఆస్పిరేటర్ ద్వారా వేరు చేస్తారు. బియ్యం పొట్టు నుండి సమర్థవంతంగా వేరు చేయడానికి రెండు గదులను ఉపయోగిస్తారు. పూర్తిగా పాలిష్ చేయని చిరు ధాన్యాల బియ్యం తుది ఉత్పత్తి.
సైజు గ్రేడర్ మిల్లెట్ యంత్రంధాన్యాలను వాటి పరిమాణాల ఆధారంగా గ్రేడింగ్ చేయడానికి గ్రేడర్ ఉపయోగించబడుతుంది.

డెస్టోనర్ I &

డెస్టోనర్ II

ధాన్యం మరియు రాళ్ళు కంపించే కదలిక ద్వారా వేరు చేయబడతాయి. రాతి తెర ఉపరితలంపై ఉన్న పెద్ద రాళ్ళు, కంపన వ్యవస్థ యొక్క శక్తి మరియు వాయు ప్రసరణ చర్యలో, పెద్ద రాతి అవుట్‌లెట్‌లోకి విడుదల చేయబడతాయి.
పిండి మిల్లుపిండి మిల్లులను గ్రైండ్ చేసి, ధాన్యాలను చిన్న ముక్కలుగా చేసి వేరు చేయడానికి ఉపయోగిస్తారు. మీ అవసరాలను బట్టి, మార్కెట్లో అందుబాటులో ఉన్న విస్తృత శ్రేణి పరిమాణాల నుండి మీరు ఎంచుకోవచ్చు.
ఆస్పిరేటర్ కమ్ డీహల్లర్సరైన పద్దతిలో శుభ్రపరిచిన తర్వాత ముడి పదార్థాలను పొట్టు తొలగింపు కోసం హల్లర్‌లోకి పంపుతారు.
ప్యాకింగ్ఉత్పత్తులను సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా ప్యాకేజీ చేయడానికి ప్యాకింగ్ యంత్రాలను ఉపయోగిస్తారు. ప్యాకింగ్ యంత్రాలు వివిధ రకాలుగా వస్తాయి, ప్రతి ఒక్కటి నిర్దిష్ట ప్యాకేజింగ్ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఈ యంత్రాలు వాటిని సమర్థవంతంగా, ఖచ్చితమైనవిగా మరియు నమ్మదగినవిగా వివిధ రకాలుగా అమర్చబడి ఉంటాయి.
 

ఆల్ ఇండియా కో-ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్-ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ తో సహకారం

ఆల్ ఇండియా కో-ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్- ICAR మహిళా వ్యవసాయం, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ (CIWA), భువనేశ్వర్ 12 రాష్ట్రాల్లో శ్రీ అన్న గ్రామ్ యోజన అనే ప్రోజెక్ట్ ను అమలు చేసింది. దత్తత తీసుకున్న ప్రాంతం/గ్రామాల్లో చిరుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడం మరియు పోషకాహారాన్ని పెంచడానికి చిరుధాన్యాల ఆధారిత ఆహార పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. AICRP - WIA, ధార్వాడ్ సెంటర్, తన కార్యక్రమాన్ని అమలు చేయడానికి హవేరి జిల్లాలోని షిగ్గావ్ తాలూకాలోని శిశువినల్ మరియు బన్నికొప్ప గ్రామాలను ఎంపిక చేసింది. ఈ కార్యక్రమం కింద దత్తత తీసుకున్న గ్రామాల్లో చిరుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి తీర్థ విత్తన బ్యాంకు నుండి విత్తనాలను కొనుగోలు చేశారు.

అవార్డులు మరియు గుర్తింపు

బీబీ ఫాతిమా తన నిరంతర ప్రయత్నాలు, ఆసక్తి మరియు కుటుంబ మద్దతుతో ఆర్థిక స్వాతంత్ర్యం, మెరుగైన సామాజిక గుర్తింపు మరియు ఆత్మవిశ్వాసాన్ని పొందారు. ఆమెను 2023లో డెక్కన్ హెరాల్డ్ చేంజ్ మేకర్‌గా గుర్తించింది. బెంగళూరు, మాండ్య, చెన్నై మరియు ఢిల్లీకి చెందిన అనేక సంస్థలు ఆమెను అనేక అవార్డులు, నగదు సర్టిఫికెట్లు మరియు పతకాలతో సత్కరించాయి. ఇప్పుడు బీబీ ఫాతిమా కుండ్‌గోల్‌లో 40 మరియు షిగ్గావ్‌లలో 10 మరియు NRLM-సంజీవిని గ్రూప్ కింద 83 SHGలను ఏర్పాటు చేసింది మరియు ప్రస్తుతం ఆమె పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

వ్యవస్థాపక కార్యకలాపాలు మరియు విలువ జోడింపుల ద్వారా గ్రామీణ మహిళలను సాధికారపరచడం వారి ఆదాయాన్ని పెంచడమే కాకుండా గ్రామ స్థాయిలో వారి ఆత్మవిశ్వాసం మరియు సామర్థ్యాలను పెంపొందించడానికి దోహదపడుతుంది. బీబీ ఫాతిమా ప్రయత్నాలు సామర్థ్యం మరియు నైపుణ్య నిర్మాణం ద్వారా మహిళల విజయంపై వెలుగునిస్తాయి. అందువల్ల, విస్తరణ కార్మికులు అటువంటి వ్యవస్థాపకులను గుర్తించి, వారిని ప్రోత్సహించాలి మరియు వారిని ఇతర రైతులు, విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు మరియు వినియోగదారులతో అనుసంధానించాలి.

మరింత సమాచారం కోసం, బీబీ ఫాతిమా, తీర్థ గ్రామం, హవేరి జిల్లా 8431988093 నంబర్‌లో సంప్రదించండి.

 

Geeta P. Channal
Senior Scientist, AICRP-WIA (Extn)
University of Agricultural Sciences
Dharwad - 580 005
Karnataka, India
E-mail: geetrajpatil@yahoo.co.in
Rajeshwari Desai
Senior Scientist, AICRP-WIA (FRM)
University of Agricultural Sciences
Dharwad - 580 005
Karnataka, India

Source: LEISA India, English Edition, June 2024

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....