బహుళ అవసరాలు - ఆహారం మరియు పోషకాహార భద్రత, ఆదాయం మరియు వనరులను సరైన రీతిలో వినియోగించుకొనుటకు వైవిధ్యభరితమైన మరియు వ్యవసాయ పద్దతులలో వివిధ సంస్థలను ఏకీకృతం చేయడం వలన ఎంతో మేలు జరుగుతుంది మరియు మంచి ఫలితాలనిస్తుంది. శ్రీమతి మంజుల కేసు దీనిని రుజువు చేస్తుంది.
భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చిన్న మరియు సన్నకారు రైతులు కీలకం మరియు మొత్తం వ్యవసాయం చేసేవారిలో వీరి వాటా 85 శాతం ఉంది . ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ (IFS) అనేది ఆహార భద్రత మరియు పోషకాహార భద్రత, మెరుగైన ఆదాయాలు అలాగే వనరులను సమర్ధవంతంగా ఉపయోగించడం ద్వారా పంట వ్యర్ధాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా (ఉత్పత్తులు కొన్నిసార్లు వ్యర్థంగా పరిగణించబడుతుంది) మరొక వ్యవస్థకు ఇన్‌పుట్‌గా మారడానికి ముందుకు సాగే మార్గంగా గుర్తించబడింది. IFS అనేది తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి ఉద్యానవన పంటలు, మామిడి, పశుపోషణ- పాడి, పశుగ్రాస పంటలు మరియు చెరువులలో ఆక్వాకల్చర్, కోళ్ల పెంపకం మొదలైన వ్యవసాయ సంస్థల మిశ్రమం, వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఆర్థిక మరియు స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తిని సాధించడం.
శ్రీమతి మంజుల బోక్నేకర్ కేసు
శ్రీమతి మంజుల బోక్నేకర్ వయసు 43 సంవత్సరాలు. ఆమెది కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా, ధార్వాడ్ తాలూకాలోని కుంబార్కొప్ప గ్రామం. ఆమె సంప్రదాయ కుటుంబం నుండి వచ్చింది మరియు పేదరికంలో ఉంది. ఆమెకు చదువు లేదు మరియు 18 సంవత్సరాల చిన్న వయసులోనే వ్యవసాయ కూలీ అయిన శ్రీ నారాయణ్ బోక్నేకర్‌తో వివాహం జరిగింది. ఆమె ఇప్పుడు ఆరుగురు పిల్లల అమ్మమ్మ.
శ్రీమతి మంజుల వ్యవసాయ కుటుంబంలో పెరగడంతో తన భర్తకు పొలంలో సహాయం చేయడం ప్రారంభించింది. 1999లో వారు కుంబార్కొప్ప గ్రామంలో రుణాలు తీసుకొని 4 ఎకరాల 3 గుంటల సాగునీటి భూమిని కొనుగోలు చేశారు. ఒక ఎకరం మామిడి తోటకు కేటాయించారు. ప్రారంభంలో ఏటా రెండు పంటలు పండించేవారు. అలాగే గృహ వినియోగం కోసం అన్ని రకాల కూరగాయలు, అలసందలు(బొబ్బర్లు), పెసలు మరియు ఉలవలు వంటి పప్పుధాన్యాలను పండించేవారు.
బాక్స్ 1: ఆల్ ఇండియా కో-ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్-వ్యవసాయంలో మహిళల జోక్యం భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పోషణ్ అభియాన్‌ను బలోపేతం చేయడానికి "న్యూట్రిషన్ స్మార్ట్ విలేజ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కొత్త చొరవ భారతదేశంలోని 12 రాష్ట్రాలలోని 13 కేంద్రాలలో అమలులో ఉన్న ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ (AICRP-WIA) నెట్‌వర్క్ ద్వారా భారతదేశం అంతటా 75 గ్రామాలను చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ మహిళలు మరియు పాఠశాల పిల్లలతో గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార అవగాహన, విద్య మరియు ప్రవర్తనా మార్పులను ప్రోత్సహించడం, పోషకాహార లోపాన్ని అధిగమించడానికి స్థానిక వంటల ద్వారా సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మరియు పెరటి వ్యవసాయం మరియు న్యూట్రి-గార్డెన్ ద్వారా పోషకాహార-సున్నితమైన వ్యవసాయాన్ని అమలు చేయడం ఈ చొరవ యొక్క లక్ష్యాలు. పోషకాహార లోప రహిత గ్రామాల లక్ష్య సాధనకు విస్తృత అవగాహన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు, కూరగాయల విత్తనాలు, పండ్ల మొక్కల పంపిణీ చేపట్టడం జరిగింది. ఈ చొరవ కింద ధార్వాడ్‌లోని యుఎఎస్ 2020-21లో న్యూట్రి-స్మార్ట్ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కుంబార్కొప్ప గ్రామాన్ని దత్తత తీసుకుంది.
|
స్టాకింగ్ మరియు మల్చింగ్: కూరగాయల మొక్కలను నిటారుగా ఉన్నకర్రకు తాడుతో కట్టి కొమ్మలను నేలకు తకాకుండా పైకి పెరగేటట్లు చేసే పద్దతిని స్టాకింగ్ అంటారు. ఈ విధానంలో స్టాకింగ్ ఇచ్చే శక్తి మరియు మద్దతు కారణంగా మొక్కలు వాటి పండ్ల బరువు, బలమైన గాలులు, వర్షం లేదా ఇతర అడ్డంకులకు వ్యతిరేకంగా పైకి నెట్టగలవు. స్టాకింగ్ పద్దతి మొక్కలు వంగకుండా లేదా విరిగిపోకుండా నిరోధించవచ్చు, ముఖ్యంగా భారీ ఆకులు, పండ్లు లేదా పూల తలలు ఉన్న మొక్కలు. అదనంగా, వాటిని నిటారుగా ఉంచడం వల్ల మెరుగైన గాలి ప్రసరణను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది, ఇది మొక్కల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
టొమాటోలను స్టాకింగ్ చేయడం వలన మొక్కలను నేల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడటానికి మరియు వాటి పైకి ఎదుగుదల అలవాటులో సహాయపడుతుంది. నేలద్వారా సంక్రమించే అనేక తెగుళ్ళను ఈ విధానంలో కట్టడి చేయవచ్చు, వాటిని భూమికి దూరంగా ఉంచడానికి నిర్మాణాత్మక వ్యవస్థను ఉపయోగించడం వివేకం.
మల్చింగ్ అంటే కలుపు నియంత్రణ కోసం నేల పైభాగాన్ని కప్పి, మొక్కలకు అందుబాటులో ఉన్న నేల తేమను నిలుపుకునే ప్రక్రియ. వ్యవసాయంలో మల్చింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు, నేల తేమ పరిరక్షణ, నేల సంపీడనం మరియు కోతను తగ్గించడం, నేల ఉష్ణోగ్రత నియంత్రణ, నేల సారవంతమైన భూమిని మెరుగుపరచడం, ఉప్పు ఒత్తిడిని తగ్గించడం, మొక్కల పెరుగుదల, అభివృద్ధి మరియు దిగుబడి, వ్యాధుల తగ్గింపు మరియు కలుపు మొక్కల క్షీణత.
కూలీల కొరత మరియు పెరుగుతున్న కూలీ ఖర్చులను ఎదుర్కోవడానికి, వారు మిశ్రమ పంటగా కూరగాయలతో పాటు చెరకును పండించడం ప్రారంభించారు. ప్రారంభంలో, గృహ వినియోగం కోసం కూరగాయలు పండించేవారు. డిమాండ్‌ను గ్రహించి, త్వరలోనే కూరగాయల సాగు ప్రాంతాన్ని విస్తరించారు. ప్రారంభంలో వారు మిగులును సమీప గ్రామాలలో విక్రయించారు, క్రమంగా బెల్గాం నగరానికి సరఫరా చేశారు. అయితే, ఎక్కువ విస్తీర్ణంలో పండించిన టమోటాలు మరియు క్రీపర్ కూరగాయలను కోయడం రైతుకు కష్టంగా అనిపించింది.
'న్యూట్రి-స్మార్ట్ విలేజ్' ప్రాజెక్ట్ చొరవ (బాక్స్ చూడండి) కింద ఒక శాస్త్రవేత్త రైతుకు పెద్ద ఎత్తున కూరగాయల పెంపకం, మెరుగైన కూరగాయల పెంపకం పద్ధతులు మరియు సమగ్ర వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడానికి మార్గనిర్దేశం చేస్తూ పొలాన్ని సందర్శించారు. మార్గదర్శకత్వంతో పాటు, వివిధ కూరగాయలు మరియు ఆకు కూరల విత్తనాలు మరియు టమోటా, వంకాయ మరియు మిరప మొక్కలను పంపిణీ చేశారు. మంజులను ఒప్పించిన తర్వాత ఆమె కూడా తన పొలంలో ఈ సాంకేతికతలను స్వీకరించింది.
మల్చింగ్ మరియు స్టాకింగ్ పద్ధతిని ఉపయోగించడం ద్వారా మంజుల బీరకాయ మరియు ఆనపకాయల పాదులను పెద్ద ఎత్తున పండించడంలో విజయం సాధించింది.ఆమె పాలకూర, కొత్తిమీర, సేపు మరియు తోటకూర వంటి ఆకు కూరలను కూడా పండిస్తుంది మరియు మార్కెట్లో వాటికి అధిక ధర లభిస్తుంది. టమాటాలను చెరకులో మిశ్రమ పంటగా పండించగా, వంకాయలను స్టాకింగ్ పద్ధతిని ఉపయోగించి పండించారు.
పాడి, పట్టుపురుగుల పెంపకం వంటి భాగాలను ఆమె దత్తత తీసుకుంది. ఆమె ఒక ఆవుతో పాడి పరిశ్రమ ప్రారంభించి, నేడు వారికి ఒక ఆవు, రెండు ఎద్దులు కలిపి మూడు ఉన్నాయి, ఆమె అదనపు పాలను అమ్ముతుంది మరియు పెడను పొలనికి పెంట ఎరువుగా ఉపయోగిస్తుంది. ఆమె మల్బరీ సాగును కూడా ప్రారంభించింది. తరువాత, ఆమె పట్టుపురుగుల పెంపకం భాగాలను జోడించాలని యోచిస్తోంది. మల్బరీ మొక్కలు ఇప్పుడు చిన్నవిగా ఉన్నందున, ఆమె మల్బరీ సాగులో మిశ్రమ పంటలుగా కూరగాయలను పండిస్తోంది.
ఇంటి వినియోగం కోసం ఆమె మూడు నుండి నాలుగు రకాల పప్పు ధాన్యాలను పండిస్తుంది, ఉలవలు, పెసలు, అలసంద, బొబ్బర్లు మొదలైన కూరగాయలు. ఆదాయం కోసం ఆమె మొక్కజొన్న, వరి మరియు చెరకును పండిస్తుంది. ఒక ఎకరం పొలంలో మామిడి తోట ఉంది. ప్రారంభంలో, ఆమె గృహ వినియోగం కోసం కూరగాయలు పండించేది. ఇప్పుడు ఆమె వాటిని పెద్ద ఎత్తున పండిస్తోంది. ఇంకా ఆమె వద్ద నిమ్మ, కరివేపాకు, జామ, కొబ్బరి మరియు సపోటా పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. మామిడి పండ్లు అమ్ముడవుతుండగా, మిగిలినవన్నీ గృహ వినియోగం కోసం ఉపయోగిస్తారు.
ఆమె సేంద్రియ ఎరువులను తయారు చేస్తుంది. సేంద్రియ ఘన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ఆమె కంపోస్ట్ ను తయారు చేస్తుంది. ఆమెకు ఒక కంపోస్ట్ యూనిట్ ఉంది, దీని కోసం చెత్తను కుళ్లగొట్టడానికి కల్చర్ ను ప్రాజెక్ట్ ద్వారా అందించారు. వ్యవసాయ శాఖ మద్దతు ఇచ్చిన మరొక పథకం కింద వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఆమె కృషి హోండాను నిర్మించింది. ఇది కరువు కాలంలో ఐదు ఎకరాల భూమికి సాగునీరు అందించడానికి సహాయపడుతుంది.
శ్రీమతి మంజుల బోక్నేకర్ వ్యవసాయ ఆదాయం దాదాపు 2 లక్షల నుండి రూ. 297500/- కు గణనీయంగా పెరిగింది. వివిధ రకాల కూరగాయలు మరియు వ్యవసాయ ఉత్పత్తులను పొందడమే కాకుండా ఆమె తన పొలంలో తాజా కూరగాయలను స్నేహితులు మరియు బంధువులతో పంచుకుంటున్నానని గర్వంగా చెబుతుంది. అనేక మంది రైతులు ఆమె పొలాన్ని సందర్శించారు. ఆమె చాలా మందికి మార్గదర్శకంగా నిలిచింది. ఆమెను ఉదాహరణగా IFS మోడల్ చిన్న రైతులకు ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారాన్ని పొందడంలో సహాయపడుతుందని మరియు నికర ఆదాయాలను మెరుగుపరుస్తుందని ఋజువైనది.
Rajeshwari Desai
Senior Scientist (FRM)
AICRP-WIA
Research Complex
UAS, Dharwad-580 005
KarnatakaGeeta Channal
Senior Scientist (Extn)
AICRP-WIA
Research Complex
UAS, Dharwad-580 005
Karnataka
Source: LEISA India, March 2024 English Edition



