నిల గార్డెన్ – అభిరుచి విజయసాధనకు దారితీస్తుంది

ఒక వ్యక్తి తన అభిరుచిని కొనసాగించాలనే దృఢ సంకల్పం ఒక వ్యవస్థాపకురాలిగా అద్భుతమైన విజయాన్ని సాధించడంలో సహాయపడుతుంది. ఇది తన ఆర్చిడ్ వ్యాపారాన్ని వికసించెలా, అభివృద్ధి చెందేలా కృషి చేసిన శ్రీమతి సుభద్ర కుమారి కథ.

కేరళలోని వాయనాడ్‌లోని ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలలో ఉన్న ఒక వర్ధమాన అభివృద్ధి చెందుతున్న సంస్థ అయిన నిల గార్డెన్ వెనుక ఉన్న 63 ఏళ్ల దార్శనికురాలు సుభద్ర కుమారిని కలవండి, ఆమె అభిరుచి మరియు ఆర్కిడ్‌ల పట్ల వేళ్లూనుకున్న ప్రేమానుబంధాన్ని కలిగి ఉంది.

మొదట్లో పట్నంతిట్టకు చెందిన సుభద్ర కుటుంబం 1975 ప్రాంతంలో వయనాడ్ జిల్లాలో స్థిరపడింది. SSLC మరియు టెలికమ్యూనికేషన్ & టైప్‌రైటింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన సుభద్రకు చిన్నప్పటి నుండే మొక్కల పట్ల మక్కువ పెరిగింది. ముఖ్యంగా పుష్పించే మొక్కల పట్ల ఆమెకున్న ఉత్సాహాన్ని చూసిన కుటుంబం ఆమెను ప్రోత్సహిస్తూ వివిధరకాల మొక్కల జాతులను వివిధ ప్రాంతాల నుండి మొక్కల పెంపకం సామగ్రిని సేకరించడం ద్వారా ఆమెకు మద్దతు ఇచ్చింది.

సుల్తాన్ బతేరిలోని పూల పెంపకం ప్రియుల సంఘం అయిన అగ్రి-హార్టి సొసైటీలో సుభద్ర సభ్యురాలిగా చేరారు. కట్ ఫ్లవర్ వ్యాపారంపై వ్యవసాయ శాఖ ఈ సొసైటీని నిర్వహిస్తుంది. దీనికి వయనాడ్ అంతటా సభ్యులు ఉన్నారు. వాస్తవానికి సుభద్ర తన పూల పెంపకం ప్రయాణాన్ని 2003లో ఆంథూరియంపై శిక్షణతో ప్రారంభించింది. ఆంథూరియం కట్ పువ్వుల సేకరణ, సాగు మరియు ప్రాసెసింగ్‌పై శిక్షణ అందించబడింది. ఆ సమయంలో వయనాడ్ అంతటా కృషి విపానన సమితి అని పిలువబడే ప్రభుత్వ హోల్‌సేల్ మార్కెట్ ద్వారా మార్కెటింగ్ జరిగింది.

స్థానిక బస్సులో తన వదినతో కలిసి తాను ఎలా నేర్చుకోవడానికి వెళ్ళిందో ఆమె గుర్తుచేసుకుంది. బస్సు ఛార్జీకి తక్కువ డబ్బులు ఉన్నప్పటికీ, మొక్కల పట్ల ఆమెకున్న అంతులేని ప్రేమ కారణంగా ఆమె వెళ్ళేది. ఒకప్పుడు సొసైటీలో సభ్యులుగా ఉన్న ఆమె సహోద్యోగులు చాలా మంది పువ్వుల నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులతో పాటు మొక్కలపై వన్యప్రాణుల దాడులను ఎదుర్కొనలేక తరువాత దానిని కొనసాగించలేకపోయారు. అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆమె కొనసాగించింది. చివరికి ఆమె ఆసక్తి 2008లో అందమైన ఆర్కిడ్  పువ్వుల వైపు మళ్లింది.

త్రివేండ్రం వ్యవసాయ శాఖ అధికారులు ఆమెను సందర్శించినప్పుడు ఆర్చిడ్ సాగు ఆలోచనను పరిచయం చేశారు. ప్రారంభంలో ఆమె త్రివేండ్రంలోని ఒక ప్రైవేట్ నర్సరీ నుండి చిన్నకొనుగోలుతో ప్రారంభించింది, ఇది చివరికి ఆమె పూల పెంపకం ప్రయాణంలో ఒక మలుపుగా చెప్పవచ్చు. ఆ సమయంలో వయనాడ్ కొండ ప్రాంతంలోని వాతావరణంలో అనేక ఆర్చిడ్ రకాలు బాగా మనుగడ సాగించలేవని సాధారణ అభిప్రాయం. కానీ, ఆమె ఇప్పటికీ తన ఇంట్లో తన సొంత ఆర్కిడ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆమె స్వంత ఆర్కిడ్ సేకరణను రూపొందించడం ఆమె ప్రారంభ ప్రణాళిక. మొక్కలు పెద్ద సంఖ్యలో ప్రచారం కావడంతో, ఆమె తన సేకరణలో ఉన్న విస్తారమైన రకాల ఆర్కిడ్ లను మార్కెటింగ్ చేయడం వైపు మొగ్గు చూపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్కిడ్ లకు ఉన్న  మార్కెట్ సామర్థ్యాన్ని గుర్తించిన సుభద్ర తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

తన వ్యాపార స్నేహితురాలు రీనా సహాయంతో, ఆమె తన సేకరణకు జోడించడానికి మరియు వ్యాపారాన్ని విస్తరించడానికి థాయిలాండ్ మరియు తైవాన్ నుండి విదేశీ ఆర్కిడ్ లను దిగుమతి చేసుకుంది. 2010లో సుభద్ర తన ఆర్కిడ్ మార్కెటింగ్ వెంచర్‌ను అధికారికంగా ప్రారంభించింది. ప్రతి అడుగులోనూ ఆమె కుటుంబం యొక్క తిరుగులేని మద్దతు కీలకమైనది. ఆంథూరియం మరియు ఇండోర్ మొక్కల అమ్మకంతో ప్రారంభించి, ఆమె అపారమైన ఆర్కిడ్ సేకరణ ద్వారా ఈ వెంచర్ విస్తరించింది. వాయనాడ్‌లోని ఆర్కిడ్‌ల పరిధిని ఉద్యానవన శాఖ వారు వచ్చి ధృవీకరించడంతో ఆమెకు ఉద్యానవన శాఖ నుండి సబ్సిడీ కూడా వచ్చింది. ఇది సంస్థను విస్తరించడంలో ఆమెకు మరింత సహాయపడింది. ఇటీవల వయనాడ్‌లోని అంబలవయల్‌లోని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం మద్దతుతో ఆర్కిడ్ లను సేకరించడంతో పాటు వయనాడ్ ఆర్కిడ్  రైతుల కోసం ఉద్యానవన శాఖ పథకాన్ని కూడా ఆమె పొందింది.

ఆమె నేడు నిల గార్డెన్ లో ఆంథూరియం, ఫెర్న్స్, బెగోనియా, ఆఫ్రికన్ వైలెట్, హోయా మరియు ఇతర ఇండోర్ మొక్కలతో పాటు ఆర్కిడ్‌ల భారీ సేకరణను కలిగి ఉంది. ఆమె ఆర్కిడ్ సేకరణలో డెండ్రోబియం (100 పైగా  రకాలు), ఫాలెనోప్సిస్, మోకారా, ఒన్సిడియం, కాట్లేయా, వాండా, సింబిడియం, గ్రామటోఫిలమ్ మొదలైనవి ఉన్నాయి, వీటిలో కొన్ని ముఖ్యమైనవి, మంచి స్థానిక ఆర్కిడ్‌ల సేకరణ కూడా ఉన్నాయి.

2017లో ఆమె ప్రయాణం DD నేషనల్ టెలివిజన్‌లో ప్రీమియర్ చేయబడిన ప్రసిద్ధ కృషి దర్శన్ కార్యక్రమంలో ప్రదర్శించబడింది. ప్రతి ఆగస్టులో జరిగే బెంగుళూరు ఫ్లవర్ షో, వ్యవసాయ శాఖ (వైగా) యొక్క అగ్రి ఫెయిర్, RARS యొక్క పూపోలి ఫ్లవర్ ఫెస్టివల్, కల్పేట ఫ్లవర్ షో మరియు అనేక ఇతర ఈవెంట్‌లలో ఆమె తన  సేకరణను ప్రదర్శిస్తుంది.

ఆమె తన వెబ్‌సైట్ మరియు దేశవ్యాప్త ఎగ్జిబిషన్‌ల ద్వారా సుభద్ర యొక్క ఖాతాదారులు దేశవ్యాప్తంగా  విస్తరించారు. కేరళ మరియు బెంగళూరు ప్రాథమిక మార్కెట్లుగా అభివృద్ధి చెందాయి. అలాగే ఆమె గత కొన్ని సంవత్సరాలుగా మహారాష్ట్ర నుండి కోల్‌కతా వరకు కొనుగోలుదారులకు మార్కెటింగ్ చేసింది. ఆమె మంచి దీర్ఘకాలిక కస్టమర్ సంబంధాలను మెరుగుపరచే దిశగా మొక్కల ప్యాకేజింగ్‌ను మంచి సంరక్షణ మరియు నాణ్యతతో నిర్వహిస్తుంది.

ప్రస్తుతం ఆమె మొక్కల అమ్మకాల ద్వారానే సగటున నెలకు రూ. 50,000/- లాభం సంపాదిస్తోంది. వాణిజ్యపరంగా విజయం సాధించడంతో పాటు, సుభద్ర వృక్షశాస్త్ర ప్రశంస మరియు విజ్ఞాన్నిపంచే సంస్కృతిని పెంపొందించడానికి కట్టుబడి ఉంది. ఆమె తన తోటకు సందర్శకులను హృదయపూర్వకంగా స్వాగతిస్తుంది మరియు పువ్వుల పట్ల తనకున్న మక్కువను పంచుకుంటుంది. ఆర్కిడ్ సాగులో ఆసక్తి ఉన్న వర్ధమాన ఔత్సాహికులకు ఆమె శిక్షణ మరియు సలహా సేవలను కూడా అందిస్తుంది.

కట్ ఫ్లవర్ ప్రాసెసింగ్ మరియు నిల్వ కోసం వయనాడ్‌లో ఇప్పటివరకు పూర్తి స్థాయి సౌకర్యం లేదని ఆమె చెప్పారు. ముఖ్యంగా బెంగుళూరు వంటి పెద్ద మార్కెట్‌లతో చుట్టుపక్కల ఉన్న పువ్వుల వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం చొరవ తీసుకోగలదని ఆమె ఆశిస్తోంది.

సుభద్రకు మొక్కల పట్ల ఉన్న దృఢ సంకల్పం మరియు ప్రేమ, కృషి మరియు పట్టుదల ద్వారా ఒకరు తన కలలను ఎలా సాకారం చేసుకోవచ్చో చూపిస్తుంది. ఆమె తన తోటను పెంచుతున్నప్పుడు ఆమె తన సృజనాత్మక ఆలోచనలతో ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. వయస్సు మరియు లింగభేదం లేకుండా ఎవరైనా తమ అభిరుచిని కొనసాగించవచ్చని ఆమె విజయం భవిష్యత్ తరాలను ప్రేరణనిస్తుంది.

Archana Bhatt
Scientist
Community Agrobiodiversity Centre, MSSRF
Wayanad, Kerala
E-mail: archanabhatt1991@gmail.com

 

Source: LEISA India,  March 2024 English Edition

Recent Posts

ప్రయోజనకరమైన కీటకాలపై ప్రచారం పరాగ సంపర్కం జరిపే కీటకాల పరిరక్షణలో యువతను నిమగ్నం చేయడం

ప్రయోజనకరమైన కీటకాలపై ప్రచారం పరాగ సంపర్కం జరిపే కీటకాల పరిరక్షణలో యువతను నిమగ్నం చేయడం

పరాగ సంపర్కం జరిపే కీటకాల తగ్గుదల ఆహార భద్రత సంక్షోభానికి దారితీస్తు పర్యావరణ వ్యవస్థను కుప్పకూల్చుతుంది. పరాగ...

అగ్రిప్రెన్యూర్ గా మారే ప్రయాణం మహిళా రైతులకు సవాళ్లు మరియు ముందుకు వెళ్ళే మార్గం

అగ్రిప్రెన్యూర్ గా మారే ప్రయాణం మహిళా రైతులకు సవాళ్లు మరియు ముందుకు వెళ్ళే మార్గం

మహిళల నేతృత్వంలోని వ్యవసాయ సంస్థలను ప్రోత్సహించడం ఇకపై ఒక ఎంపిక కాదు, స్థిరమైన అభివృద్ధికి అవసరం. గ్రామీణ...

సౌరశక్తితో నడిచే శీతల నిల్వ వ్యవస్థ- స్థిరమైన సాంకేతిక పరిష్కారం

సౌరశక్తితో నడిచే శీతల నిల్వ వ్యవస్థ- స్థిరమైన సాంకేతిక పరిష్కారం

పునరుత్పాదక శక్తితో నడిచే కోల్డ్ స్టోరేజీ మౌలిక సదుపాయాల స్థాపన, కర్ణాటకలోని సడలి గ్రామంలోని చిన్న ఉద్యానవన రైతుల...