ఒడిశాలో చిరు ధాన్యాల పంట పద్ధతులను పునరుద్ధరిస్తున్న మహిళా నేతృత్వంలోని సంస్థలు

మొత్తం గృహ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో మరియు పోషక భద్రతను పరిష్కరించడంలో చిరు ధాన్యాలు ఒక మార్పు దిశలో ప్రధాన పాత్ర పోషించాయి. కొన్ని సంస్థలు కలిసి కట్టుగా, ఉమ్మడి దృక్పథాన్ని అనుసరిస్తూ ఈ మార్పును తీసుకువచ్చాయి. యఫ్ పి ఓ లలో మహిళల నేతృత్వంలో ఒడిశా మిల్లెట్స్ మిషన్ ద్వారా విలువను జోడించే గొలుసు విధానం యొక్క అన్ని అంశాలు క్రమపద్ధతిలో అనుసరించబడ్డాయి.

ఒడిశాలోని గ్రామాలు మరియు నగరాల మూలలు మరియు మూలల్లో మాండియా (ఫింగర్ మిల్లెట్ లేదా రాగికి స్థానిక ఒడియా పేరు) అనేది ప్రముఖ పదం. కేఫ్‌ల నుండి రెస్టారెంట్‌ల వరకు, ఈ ప్రసిద్ధ చిరు ధాన్యం పట్టణ ప్రజల ఆహార పళ్ళెంలో భోజనం, స్నాక్స్, కేకులు మరియు కుకీలుగా దాని స్థానాన్ని పదిలపరచుకుంది.

ఈ పంట ఎక్కడ పండుతుందో చూడటానికి, మనం ఒడిశాలోని ఇంకా చేరుకోని గిరిజన ప్రాంతాలకు చేరుకోవాలి. డిసెంబర్ నెలలో ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని మంక్డితాడ గ్రామాన్ని సందర్శించే ఎవరికైనా మాండియా పంట కోత సమయంలో వినిపించే క్రమబద్దంగా మ్రోగే చెక్క దుంగ లయలు ఒక ఆకర్షణగా నిలుస్తాయి. సమృద్ధిగా పండిన ఈ  పంట నూర్పిడి తరువాత ఒడిశాలోని కోరాపుట్ మరియు నబ్రంగాపూర్ జిల్లాల వాణిజ్య మండీలకు చేరుకుంది.

హర్ష ట్రస్ట్ అనే ఎన్జీఓ మద్దతుతో ఒడిశా మిల్లెట్ మిషన్ (OMM) తో చేతులు కలిపి పెద్ద ఎత్తున మిల్లెట్ సాగును చేపట్టడంలో ఆదివాసీ మహిళా రైతులు సమిష్టి కృషి వల్ల ఇది సాధ్యమైంది. తక్కువ పెట్టుబడులతో తమ ఎత్తైన వాలు భూములలో వృద్ధి చెందగల పంటను ఎంచుకోవడం ద్వారా, ఒడిశాలో చిరు ధాన్యాల పంట వ్యవస్థలను పునరుద్ధరించిన మహిళా నేతృత్వంలోని సంస్థలు రంచితా శివరామ్ మరియు సంగీతా బెహెరా మిల్లెట్స్ మొత్తం గృహ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో మరియు పోషక భద్రతను పరిష్కరించడంలో ముఖ్య కారకులుగా మారాయి. కలిసి పనిచేయడం ద్వారా, ఉమ్మడి దృక్పథాన్ని అనుసరించే సంస్థలు ఈ మార్పును తీసుకువచ్చాయి. FPO లలో మహిళల నేతృత్వంలో విలువ ఆధారిత గొలుసు యొక్క అన్ని అంశాలను  ఒడిశా  మిల్లెట్స్  మిషన్  ద్వారా  క్రమబద్ధంగా అనుసరించారు. పంటల ఎంపికలను పెట్టుబడులు అధికంగా ఉన్న పంటలైన మొక్కజొన్న మరియు వరి నుండి మిల్లెట్ ఆధారిత పంట వ్యవస్థలకు మరియు వినియోగదారులకు ఇస్టమైన ఆరోగ్యకరమైన ఆహారాలకు మార్చడంలో FPO సంస్థలు ముందున్నాయి.

ఒడిశా కొండలలో చిరుధాన్యాల ప్రయాణం

గిరిజనులు మరియు సంస్కృతికి నిలయమైన కోరాపుట్ మరియు నబరంగ్‌పూర్ జిల్లాలలో మొత్తం 2977 గ్రామాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో 50% కంటే ఎక్కువ జనాభా షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు (జనగణన, 2011). ఈ గిరిజన వర్గాలు తమ ఆహారం మరియు జీవనోపాధి కోసం వ్యవసాయం, పశువులు మరియు కలపేతర అటవీ ఉత్పత్తులు (NTFP) పై ఆధారపడి ఉంటాయి. ఇక్కడి గిరిజన మహిళలు గృహ ఆర్థిక భాద్యతలను చూసుకుంటారు.

కోరాపుట్ జిల్లాలోని బోరిగుమ్మ మరియు కుంద్రా బ్లాకుల గిరిజన రైతులు వ్యవసాయం కాకుండా ఇతర మెరుగైన మార్గాల కోసం వెతకడం ప్రారంభించిన సమయం అది. వాస్తవానికి, కోరాపుట్‌లో ఎనభై శాతం మంది రైతులు చిన్న మరియు సన్నకారు. తక్కువ ఉత్పాదకత కలిగిన 90% ఎత్తైన భూములను వారు కలిగి ఉన్నారు. సన్నకారు రైతులు కూలీ కార్మికులుగా పనిచేయడానికి సమీపంలోని నగరాలు మరియు రాష్ట్రాలకు వలస వెళ్లడం ప్రారంభించారు.

ఆదివాసీ సంస్కృతిలో చిరుధాన్యాలు ఒక అనివార్యమైన స్థానాన్ని ఆక్రమించాయి. స్థానిక ఆహారం మరియు గిరిజన సంస్కృతికి కేంద్రంగా, చిరుధాన్యాలు ఆదివాసీ రైతు కుటుంబాల రోజువారీ ఆహారంలో మరియు వారి సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో అంతర్భాగంగా ఉంటాయి. వాటి సరళత, పోషకాహారం సమృద్ధిగా ఉండటం మరియు సరసమైన ధరలకు లభించడం వల్ల, మిల్లెట్ ఆధారిత మంచి పోషకవిలువలు కలిగిన  రుచికరమైన వంటకాలైన మాండియా జౌ, ముద్దే మరియు పిఠా, సువాన్ ఉప్మా (చిన్న మిల్లెట్), కాల్చిన జొన్న, మాండియా టంపా (రాగి పిండి మరియు బియ్యం నీటితో గంజి), మాండియా అండ (బియ్యంతో రాగి పిండి) ఎల్లప్పుడూ గిరిజనుల ఆహార పళ్ళెంలో  భాగంగా ఉన్నాయి.

వరి, మొక్కజొన్న వంటి పంటలను చాలా సంవత్సరాలుగా సాగు చేయడం వల్ల వారు నిరాశకు గురవుతున్నారు. తరచుగా వచ్చే కరువు పరిస్థితులు, తెగుళ్ల దాడులు, తగినంత పెట్టుబడి లేకపోవడం, వాలు భూముల పై పొరలు కోతకు గురికావడం మరియు ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలవల్ల వారు సులభంగా ప్రభావితమయ్యారు. కొండ ప్రాంతాలలో శ్రమించే గిరిజన మహిళా రైతులకు స్థిరమైన, సులభమైన మరియు స్నేహపూర్వకంగా ఉండే చేయూత అవసరం.

మొత్తం గృహ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో మరియు పోషక భద్రతను పరిష్కరించడంలో చిరు ధాన్యాలు కీలకంగా మారాయి. కొన్ని సంస్థలు కలిసి కట్టుగా, ఉమ్మడి దృక్పథాన్ని అనుసరిస్తూ ఈ మార్పును తీసుకువచ్చాయి.

సంస్థాగత సహకారం ద్వారా చిరుధాన్యాల పునరుజ్జీవనం ప్రారంభమైంది

వర్షాధార ప్రాంతాలలో చిరుధాన్యాలు సాధారణంగా పండిస్తారు. ఎందుకంటే అవి వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, కరువు పరిస్థితులనుండి తట్టుకోవడానికి సహాయపడతాయి. వాతావరణానికి అనుకూలనమైన మరియు అధిక పోషక విలువలు కలిగిన చిధాన్యాల సామర్థ్యాన్ని గ్రహించి, పొలాలలో మరియు ఆహార పళ్ళెంలో మిల్లెట్లను పునరుద్ధరించడానికి ఒడిశా మిల్లెట్ మిషన్ (OMM) 2017లో ప్రారంభించబడింది. హర్ష ట్రస్ట్ భాగస్వామ్యం ద్వారా, ఈ కార్యక్రమం గిరిజన మహిళా రైతులను ముందంజలోనికి తీసుకురావడానికి ప్రాధాన్యతనిచ్చింది. గతంలో, సందర్భోచిత వాస్తవాలను అర్థం చేసుకుని, హర్ష ట్రస్ట్ గిరిజన మహిళా రైతులతో కలిసి జీవనోపాధి భద్రతను కల్పించడానికి మరియు వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది.

ఈ విషయంలో, ఏప్రిల్ 2014 నుండి ఈ ప్రాంతంలోని మహిళా రైతులతో కలిసి వారిని స్వయం సహాయక సంఘాలుగా నిర్వహించి ఈ స్వచ్చంద సంస్థ పనిచేస్తోంది,. ప్రారంభంలో, మొత్తం 350 మంది రైతులతో 31 స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి. ఈ స్వయం సహాయక సంఘాలను నోడల్ స్వయం సహాయక సంఘం అని పిలిచే ఒకే పాలక స్వయం సహాయక సంఘం నిర్వహించేది, తరువాత కంపెనీల చట్టం ప్రకారం ఇది రైతు ఉత్పత్తిదారుల సంస్థ (FPC)గా రూపాంతరం చెందింది. హర్ష ట్రస్ట్ జూలై 2017లో ఒడిశా మిల్లెట్ మిషన్ (OMM)తో కలిసి పనిచేయడం ప్రారంభించింది.

రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPOs) వ్యూహంలోని కీలకమైన అంశాలలో ఒకటి దశలవారీగా చిరుధాన్యాలను క్రమబద్ధీకరించడం. రైతులే స్వయంగా నాయకత్వం వహించిన FPO, చిరుధాన్యాల విలువ గొలుసుకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థగా పనిచేసింది. ఇది పట్టణ వినియోగదారులలో పెరుగుతున్న ఆరోగ్య స్పృహను తీర్చడంతో పాటు, గృహ ధాన్యాల వినియోగాన్ని పెంచడానికి దారితీసింది. మంచి డిమాండ్‌తో ముందుకు సాగే పోషకాహార కేంద్రంగా పనిచేస్తూ, చిరుధాన్యాల ఫ్యాన్సీ మెనూలు సంపన్నవర్గాల కుటుంబాలకు , ప్రభుత్వ సమావేశాలు, సెమినార్లు,పట్టణాలలో జరిగే విందు మరియు వివాహ వేడుకలలో అంతర్భాగమైపోయాయి.

పెరుగుతున్న డిమాండ్ ద్వారా ప్రోత్సహించబడిన మెరుగైన ఉత్పత్తి పద్ధతులు, ఖర్చు-ప్రయోజన అంశాలపై పెరిగిన అవగాహన మరియు నైపుణ్య నిర్మాణంతో, చిరు ధాన్యాల పంటలు,అధిక పెట్టుబడి అవసరమైనటువంటి పంటలతో పోలిస్తే సమానమైన మరియు అధిక లాభాలను అందించగలవని సంఘాలు నమ్మాయి. అంతేకాకుండా, ఈ పంటలు  తక్కువ కర్బన ఉద్గారలతో  ప్రాంతంలో చక్కని జీవావరణం మరియు జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో సహాయపడుతున్నాయి.

నారి ప్రగతి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (NPPCL) ద్వారా వృద్ధి ఊపందుకుంది.

ప్రారంభంలో హర్ష ట్రస్ట్ ఎన్జీఓ స్వయం సహాయక బృందాలు (SHGs) వంటి కమ్యూనిటీ ఆధారిత సంస్థలను ప్రోత్సహించింది, ఇవి వ్యవసాయ ఆధారిత జీవనోపాధి కార్యక్రమాలను చేపట్టడానికి వారికి మార్గనిర్దేశం చేశాయి. ఫిబ్రవరి 2020లో ఈ సమూహాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థగా, నారి ప్రగతి ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ (NPPCL)గా ఏర్పాటు చేశారు. 2020లో 570 మంది రైతులతో NPPCL ఏర్పడింది, తరువాత 2022 నాటికి 3200 మంది రైతులు సభ్యత్వం పొందారు. NPPCL స్వీకరించిన సేవా నమూనా కావలసినంత ఉత్సాహాన్ని పెంచింది. గిరిజన కుటుంబాలకు వినియోగం కోసం చిరుధాన్యాలను ప్రధానంగా ఎంచుకొన్నప్పటికీ , వాటి ఆర్థిక సామర్థ్యం ఇంకా గ్రహించబడలేదు. మహిళా రైతులకు చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి సాంకేతిక మరియు ఆర్థిక మద్దతు, క్రెడిట్ లింకేజీలు, ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ సౌకర్యాలు లేవు. వాణిజ్య మండీలు లేదా క్రమబద్ధీకరించబడిన మార్కెటింగ్ వ్యవస్థలు లేనందున రైతులు చిరుధాన్యాలను సరసమైన ధరలకు విక్రయించలేకపోతున్నారు. ఆర్థిక ప్రగతిని సాధించడానికి చిరుధాన్యాల ఆధారిత వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించడానికి OMM మద్దతుతో NPPCL పైన తెలిపిన అంతరాలను సరిగ్గా గుర్తించి పరిష్కరించింది.

బాక్స్ 1

"ఇంతకుముందు, నా భూమిలోని 1.5 ఎకరాలలో గృహ వినియోగం కోసం మాత్రమే రాగులను పండించాను. దిగుబడి రెండు క్వింటాళ్ల కంటే ఎక్కువ రాలేదు. రాగులు నాకు మంచి లాభాలను తెచ్చిపెడతాయని నేను ఎప్పుడూ గ్రహించలేదు. హర్ష ట్రస్ట్ మద్దతుతో ఒడిశా మిల్లెట్ మిషన్ (OMM) పాల్గొన్న తర్వాత, నేను అధునాతన మిల్లెట్ వ్యవసాయ పద్ధతులపై శిక్షణ పొందాను మరియు ఆరోగ్యకరమైన విత్తనాల ఎంపిక యొక్క ప్రాముఖ్యతను నేర్చుకున్నాను. ఈ సంవత్సరం అదే భూమిలో, నేను ఐదు క్వింటాళ్ల రాగులను పండించగలిగాను మరియు నా ఇంటి వినియోగానికి సరిపోయేలా కాకుండా రూ. 16,475 అదనపు ఆదాయాన్ని సంపాదించాను."

లైన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సరైన పంట స్థితిని మరియు మెరుగైన దిగుబడినిస్తుంది.

చిరు ధాన్యాల పునరుజ్జీవనానికి సమగ్ర వ్యూహాలు

చేయగలిగే బహుళ విధానాలను ఏకీకృతం చేయడం మరియు బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించింది . ఇది హర్ష ట్రస్ట్ మద్దతుతో మహిళా రైతుల నేతృత్వంలో ఉత్పత్తి, ప్రాసెసింగ్, వినియోగం మరియు మార్కెటింగ్ వంటి అన్ని అంశాలను మరియు సేవలను స్పృశించింది.

క్రింద హైలైట్ చేయబడిన అనేక కీలక వ్యూహాలు మిల్లెట్ విలువ గొలుసును విజయ పదం లో నడిపించాయి.

  • మహిళా రైతులకు చిరుధాన్యాల ఉత్పత్తిలో అవగాహన పెంపు మరియు శిక్షణా కార్యక్రమాలు: ముందుగా మహిళా స్వయం సహాయక సంఘాలు మరియు FPO సభ్యులతో ఫోకస్డ్ గ్రూప్ చర్చలు (FGDలు) మరియు లక్ష్య సాధన తరగతులను నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించబడింది, అదే సమయంలో వారిని జ్ఞాన సందర్శనలకు తీసుకెళ్లారు. చిరుధాన్యాల వ్యవసాయ వ్యవస్థలను పునరుద్ధరించడం యొక్క మెరుగైన ఉత్పత్తి పద్ధతుల ప్రాముఖ్యతపై వివిధ శిక్షణా కార్యక్రమాలు మరియు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు నిర్దిష్ట పద్ధతుల ప్యాకేజీ (PoP)పై దృష్టి సారించి నిర్వహించబడ్డాయి. చిరుధాన్యాల వ్యవసాయ విధానాల  ద్వారా ఆదాయ మెరుగుదల ప్రదర్శించబడింది. మహిళల నేతృత్వంలో ఈ జ్ఞానం ఇంటిల్లిపాదికి చేరువైంది. క్రింద వివరించిన విధంగా చిరుధాన్యాల వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించడానికి మొత్తం 141 శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
  • అధిక-నాణ్యత గల విత్తనాల ఉత్పత్తి సాధన: బోరిగుమ్మ, బొండగూడ, అంచల మరియు ఖత్రగడలోని నాలుగు విత్తన కేంద్రాల సహకారంతో దీనిని చేపట్టి, సుమారు 3200 మంది రైతుల విత్తన అవసరాలను తీరుస్తున్నాయి.
  • పంట యాజమాన్య పద్దతులను మెరుగుపరచడం (POP) మరియు మంచి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం: ప్రాథమిక యాజమాన్య పద్ధతులలో సహజమైన విధానాలతో సస్యరక్షణ నిర్వహణ పద్ధతులు,చిరు ధాన్యాల వృద్ది కొరకు ప్రత్యేక వ్యవస్థ, వరుసలలో విత్తనాలు విత్తటం మరియు నాట్లు వేయటం (బాక్స్ 2 చూడండి) కలిగి ఉన్నాయి.
  • మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాలను (SMI,LS,LT) స్వీకరించే రైతులకు మొదటి మూడు సంవత్సరాలు OMM నుండి అదనపు ప్రోత్సాహకం లభించింది. రైతు SMI కి హెక్టారుకు రూ. 5000 మరియు LS/LT కి రూ. 2500 వరకు పొందాడు మరియు తరువాత రెండు సంవత్సరాలలో, SMI కి రూ. 3000 మరియు 1500 మరియు LS/LT కి రూ. 1500 మరియు 1000 పొందాడు. ప్రస్తుతం అవి ఈ క్రింది విధంగా సవరించబడ్డాయి.
పట్టిక 1: హర్ష ట్రస్ట్ ద్వారా సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు
క్ర. సం.శిక్షణ భాగం పేరు శిక్షణ కార్యక్రమాల సంఖ్యపాల్గొనే వారి సంఖ్య
1.ఉత్పత్తి మెరుగుదల27864
2.పంటల యాజమాన్య పద్దతులు21672
3.విత్తనోత్పత్తి11352
4.విత్తనాల నిల్వ7224
5.విలువ జోడింపు7448
6.చిరు ధాన్యాల పోషక ప్రయోజనాలు9576
7.క్షేత్ర ప్రదర్శన381216
8.చిరు ధాన్యాలపై అవగాహన కార్యక్రమం172040
9.సమిష్టి మార్కెటింగ్4120

 

  • ఇంటి వద్దే సాంకేతిక మరియు విస్తరణ సేవలను అందించడానికి గ్రామ స్థాయి కేడర్‌లను కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌లుగా అభివృద్ధి చేయడం.
  • నూర్పిడి యంత్రాలు, గ్రేడింగ్ యంత్రాలు మొదలైన వాటి వినియోగాన్ని ప్రోత్సహించడానికి గ్రామ పంచాయతీ స్థాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు మరియు ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం. క్రింద వివరించిన విధంగా నాలుగు సిహెచ్‌సిలు, పది పల్వరైజర్లు మరియు ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించబడ్డాయి.
  • NPPCL ద్వారా సమిష్టి మార్కెటింగ్ మరియు MSP ఏర్పాటు: FPO ద్వారా రైతులు సమిష్టి ప్రయత్నాలు చేయడానికి వ్యవస్థీకృతమయ్యారు, ముఖ్యంగా, ఉత్పత్తుల సముదాయం, ప్రాథమిక ప్రాసెసింగ్, రవాణా మరియు మార్కెటింగ్. సమిష్టి ఉత్పత్తులు రైతులకు మెరుగైన బేరసారాల శక్తిని కలిగి ఉండటానికి మరియు రవాణా ఖర్చును తగ్గించడానికి వీలు కల్పించాయి. MSP వ్యవస్థను OMM స్థాపించింది.
  • మార్కెటింగ్ దుకాణాలు: రైతులకు మరియు మార్కెట్లకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి బోరిగుమ్మ, కథరగుడ, కెరప, నుగావ్‌లలో మండీలను స్థాపించారు. గతంలో, రైతులు పండించిన చిరు ధాన్యాలను విక్రయించడానికి ఎటువంటి దుకాణం ఉండేది కాదు మరియు వారు స్థానిక హాత్ (మార్కెట్)లో తక్కువ ధరలకు అమ్మేవారు. కొత్త మండీలు రైతులకు తమ ఉత్పత్తులను తగిన ధరకు విక్రయించడానికి ఒక వేదికను ఇచ్చాయి.

మండియా హాత్ అనేది చిరు ధాన్యాలను నిర్ణీత సరసమైన ధరకు అమ్మడం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఇది మిల్లెట్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి OMM చే ప్రారంభించబడిన ఒక చొరవ. మాండియాతో తయారు చేసిన ప్రసిద్ధ ఆహార పదార్థాలను విక్రయించే చిన్న దుకాణాలు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో తెరిచి ఉంటాయి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో మిల్లెట్లను మరింత ప్రాచుర్యం పొందేలా చేయడానికి 2021లో ఒడిశా ప్రభుత్వం నవంబర్ 10ని మండియా దివస్‌గా ప్రకటించింది.

  • సంక్షేమ పథకాలలో చేర్చడం: OMM ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలు (PDS), మధ్యాహ్న భోజన పథకాలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలలో చిరు ధాన్యాలను చేర్చడం.

బాక్స్ 2

సిస్టమ్ ఆఫ్ మిల్లెట్ ఇంటెన్సిఫికేషన్ (SMI) – SMI అనేది సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ (SRI) పద్ధతి యొక్క పొడిగింపు, ఈ విధానంలో తక్కువ విత్తన మోతాదు, విత్తన శుద్ధి, ఆరోగ్యకరమైన లేత నారును తగినంత అంతర మరియు వరుసలమద్య దూరం (గ్రిడ్ నమూనా), మెరుగైన కలుపు తీయుట మరియు పోషక నిర్వహణ పద్ధతులు వంటి నూతన వ్యవసాయ పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతి గ్రామాల్లో మిల్లెట్ ఉత్పత్తిని రెట్టింపు చేసింది.

లైన్ ట్రాన్స్‌ప్లాంటింగ్ (LT) – లైన్ ట్రాన్స్‌ప్లాంటింగ్ విధానంలో మొక్కలు వరుసలమధ్య ఉన్నఖాళీలను చక్కగా ఉపయోగించుకొని అధిక పంటదిగుబడులు పొందవచ్చు.

బహుళ పంటలు/అంతర్‌పంటలు – రాగి మరియు జొన్నలను బహుళ పంటలుగా పండించడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించడానికి మరియు ఆదాయాన్ని పెంచడానికి కలిసి అవలంబిస్తారు.

అద్భుతమైన ఫలితాలు

గత మూడు సంవత్సరాలలో బోరిగుమ్మ మరియు కుంద్రాలలో మిల్లెట్ పంట విస్తీర్ణం 1167 హెక్టార్లకు పెరిగింది. మెరుగైన ఉత్పత్తి పద్ధతులు సాంప్రదాయ సాగుతో పోలిస్తే రాగి మరియు సామ వంటి చిరు ధాన్యాల ఉత్పత్తిని మూడు నుండి నాలుగు రెట్లు పెంచాయి. ఎకరానికి 1-2 క్వింటాళ్ల స్వల్ప ఉత్పత్తి నుండి, రైతులు ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ మిల్లెట్ ఇంటెన్సిఫికేషన్ (SMI) ను స్వీకరించడం ద్వారా 6-7 క్వింటాళ్ల దిగుబడిని పొందుచున్నారు. OMM మరియు ఒడిషా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీ (OUAT) అందించిన పది నూర్పిడి మరియు ప్రాసెసింగ్ యంత్రాల యూనిట్ల స్థాపించడం వలన, శ్రమతో కూడిన నూర్పిడి కార్యకలాపాలను సులభతరం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) మధ్యాహ్న భోజన పథకంలో మిల్లెట్లను చేర్చడం మరియు బోరిగుమ్మ మరియు కుంద్రా బ్లాక్‌లలోని అంగన్‌వాడీలలో రాగి లడ్డూలు వంటి మిల్లెట్ ఆధారిత ఆహారాలను ప్రవేశపెట్టడం వల్ల గృహ వినియోగం పెరిగింది, ఇది మహిళలు మరియు పిల్లల పోషణపై ప్రత్యక్ష సానుకూల ప్రభావాన్ని చూపింది.

సమిష్టి మార్కెటింగ్ విధానం ద్వారా చాలని రవాణా మరియు మార్కెటింగ్ సౌకర్యాల సవాళ్లను FPO పరిష్కరించింది. నియంత్రిత మార్కెట్ మిల్లెట్ల అమ్మకపు ధరను కిలోకు రూ.15 నుండి రూ.35కి పెంచింది. సేకరణ సంస్థగా పేర్కొనబడిన NPPCL మహిళా రైతుల నుండి మిల్లెట్లను సేకరించింది మరియు బోరిగుమ్మ మండి (OMM ద్వారా ప్రత్యేకమైన మిల్లెట్ మండి)లో మార్కెటింగ్‌ను ప్రారంభించింది, ఇది అధిక ధరలను మరియు మహిళా సభ్యుల బ్యాంకు ఖాతాలకు నేరుగా చేరే సకాలంలో చెల్లింపును పొందింది. మండి స్థాపించిన తర్వాత, మిల్లెట్ ధర మూడు సంవత్సరాలలో క్వింటాల్‌కు రూ.2800 నుండి రూ.3578కి పెరిగింది. గత మూడు సంవత్సరాలలో NPPCL 24 గ్రామ పంచాయతీలలోని 93 గ్రామాలను కవర్ చేస్తూ 3511 మంది మహిళా రైతుల సభ్యత్వాన్ని పెంచడం ద్వారా తన సేవలను విస్తరించింది, మిల్లెట్ పునరుద్ధరణ మరియు విస్తరణ వేగాన్ని కొనసాగిస్తోంది.

గ్రామీణ మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి రాగి బిస్కెట్లు, మల్టీ-గ్రెయిన్ కుకీలు, రాగి మాల్ట్ మరియు స్నాక్స్ వంటి మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి నిల్వ గోడౌన్లు, ప్రాసెసింగ్ మరియు విలువ-జోడింపు యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా NPPCL తన వ్యాపార అభివృద్ధి ప్రణాళిక (BDP)ను దశలవారీగా క్రమబద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

బాక్స్ 3: జయంతి గౌడ అనే చిరుధాన్యాల రైతు అనుభవం

జయంతి గౌడ కోరాపుట్‌లోని బోరిగుమ్మ బ్లాక్‌లోగల  ఖత్రగడ గ్రామ పంచాయతీలోని మంక్డితల గ్రామంలో నివసిస్తున్న గిరిజన మహిళా రైతు. ప్రారంభ సంవత్సరాల్లో, ఆమె చిరుధాన్యాల వ్యవసాయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. NPPCLలో సభ్యురాలిగా చేరిన తర్వాత, ఒక ఎకరం భూమిలో మిల్లెట్ ఇంటెన్సిఫికేషన్ సిస్టమ్ మరియు ఇతర ఉత్పత్తి పద్ధతులను అవలంబించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆమె అర్థం చేసుకుంది. 2018-19లో భారీ మరియు అకాల వర్షపాతం కారణంగా ఆమె నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, NPPCL మద్దతుతో ఆమె చిరుధాన్యాల సాగును కొనసాగించగలిగింది. పెరిగిన ఉత్పత్తివలన ఆశించిన దానికంటే ఎక్కువ లాభం ఆమెకు చేకూరింది మరియు ఆమె విజయం చాలా మంది మహిళా రైతులను తన గ్రామంలో చిరుధాన్యాల సాగును చేపట్టడానికి ప్రేరేపించింది.

“మాకు ఉన్న 4.5 ఎకరాల భూమిలో, మేము 2.5 ఎకరాల పల్లం భూమిలో వరిని పండించాము. మిగిలిన 2 ఎకరాల ఎత్తైన భూమి ఎక్కువగా బీడు ఉంది, అక్కడ మేము అప్పుడప్పుడు చిరుధాన్యాలు పండించేవాళ్ళం. "NPPCL జోక్యం మరియు హర్ష ట్రస్ట్ అందించిన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో, మేము 1 ఎకరంలో రాగులను పండించడం ప్రారంభించాము, తరువాత మేము మొత్తం 2 ఎకరాల ఎత్తైన భూమిని పండించడానికి ప్రేరణ పొందాము, దీని నుండి మేము ఆరు క్వింటాళ్ల రాగులను ఉత్పత్తి చేయగలిగాము మరియు ఈ సంవత్సరం రూ. 20,262/- ఆదాయాన్ని సంపాదించగలిగాము" అని జయంతి చెప్పారు.

ముగింపు

కోరాపుట్ జిల్లాలోని బోరిగుమ్మ మరియు కుంద్రా బ్లాకులలో మహిళా రైతుల ప్రయాణం, స్థిరమైన సంస్థాగత విధానం చిరు ధాన్యాలను ఎలా పునరుజ్జీవింప జేయగలదో మొత్తం మీద ఒక దృక్పథాన్ని ఇస్తుంది.

దీని వ్యాప్తిపై సానుకూల ప్రభావాలు కూడా ఉన్నాయి. నబరంగ్‌పూర్ జిల్లాలోని ఝరిగావ్ బ్లాక్‌లో కూడా చిరు ధాన్యాల వైపు మార్పు కనిపిస్తోంది. హర్ష ట్రస్ట్ మద్దతుతో ఝరిగావ్‌లోని మంగళమణి ఎఫ్‌పిఓ 1456 మంది మహిళా సభ్యులకు అవకాశం కల్పించింది, దీని ఫలితంగా రెండేళ్లలో చిరు ధాన్యాల పంట విస్తీర్ణం 16 హెక్టార్ల నుండి 685 హెక్టార్లకు పెరిగింది. గ్రామీణ గిరిజన గృహాల పోషక భద్రతను నిర్ధారిస్తూ ఎఫ్‌పిఓలు ఆర్థిక పురోగతికి దోహదపడుతున్నాయి.

OMM ద్వారా మిల్లెట్ ఆధారిత పంట పద్ధతులను పునరుద్ధరించే సమగ్ర దృక్పథం రైతులలో వాణిజ్య స్థాయిలో మిల్లెట్‌లను తీసుకోవడానికి కొత్త విశ్వాసాన్ని తెచ్చిపెట్టింది. మాండియా స్టాల్స్, మాండియా హాత్ మరియు మాండియా దివాస్ వంటి కార్యక్రమాలు గ్రామాల నుండి నగరాలకు మిల్లెట్లను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి మరియు రైతు ఉత్పత్తిదారుల కంపెనీల ద్వారా అనేక మంది మహిళా రైతులు ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లను చేరుకోవడానికి అవకాశం కల్పిస్తాయి.

అంతర్జాతీయ వేదికల నుండి గ్రామ స్థాయి సమావేశాల వరకు సంవత్సరంలో చర్చనీయాంశమైన చిరుధాన్యాలు ఒడిశాలోని దక్షిణ జిల్లాల్లోని వందలాది గ్రామాలలో జీవనోపాధి మెరుగుదలకు కృషి చేస్తున్నాయి. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (IYoM)గా ప్రకటించడం వ్యవసాయ వర్గాలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించడంలో చిరుధాన్యాల ప్రభావంతో ప్రతిధ్వనిస్తుంది.

Ranchitha Sivaram and Sangeeta Behera
Harsha Trust,
First Floor, N1/36, IRC Village,
Nayapalli, Bhubaneswar
Odisha - 751015
E-mail: ranchithakumaran@gmail.com
Sangeetabehera12@gmail.com

 

Source: LEISA India- March 2023 English Edition

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....