సురక్షితమైన ఆహార ఉత్పత్తి దిశగా ఒక సమిష్టి ప్రయాణం

నేను, ఎన్. కేశవమూర్తి, నిజానికి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం. నేను 30 ఏళ్లుగా ఫ్యాక్టరీని నడుపుతున్నాను, మంచి ఆదాయాన్ని పొందుతున్నాను, కానీ కార్మిక సమస్య, పని ఒత్తిడి మరియు ఆరోగ్య సమస్యల కారణంగా, నేను వ్యవసాయం వైపు ఎక్కువ మొగ్గు చూపాను. " నోడి తిలీ మాడి కలి" ("చూడండి మరియు తెలుసుకోండి - చేయండి మరియు నేర్చుకోండి" నన్ను బాగా ఆకట్టుకుంది. ), మాగడి అనే ఊరిలోఉన్న అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ (KVK)శిక్షణలు నిర్వహిస్తుంది. ఆరోగ్యం క్షీణించటానికి కారణం ఎరువులు ఉపయోగించి ఆహారాన్ని పండించే పద్ధతి అని నేను గ్రహించాను. సేంద్రియ వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగింది.

నేను కొన్న నాలుగెకరాల పొలంతో పాటు మా నాన్నగారి నుంచి సంక్రమించిన మూడెకరాల భూమిలో వ్యవసాయ జీవితం ప్రారంభించాను. పొలంలో కొన్ని సిల్వర్ ఓక్, టేకు, మహోగని చెట్లు, రెండు బోర్‌వెల్‌లతోపాటు చుట్టూరా ముళ్ల కంచె ఉంది. స్వల్పకాలిక, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక పంటల మిశ్రమం ఉత్పత్తిని రెట్టింపు చేయడంలో సహాయపడుతుందని గ్రహించి, నేను "ఫారెస్ట్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్" విధానాన్ని అనుసరించాను.

ప్రారంభంలో, పొలంలో మిశ్రమ పంటకొరకు ధాన్యాలను వెదచల్లడం జరిగింది. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మల్చింగ్ మరియు బయోమాస్‌ను మట్టిలోకి దున్నడం మొదలైన అనేక పద్ధతులు అనుసరించబడ్డాయి. మొదట్లో నేను బీన్స్, బెండకాయ, బఠానీ, ఎర్రగడ్డ, బెండి, టమాటా, పచ్చిమిర్చి, దోస రకాలు, పొట్లకాయ వంటి స్వల్పకాలిక పంటల ద్వారా ఆదాయం పొందడం ప్రారంభించాను. నేను నిమ్మ (100), జామ (50), సపోటా (40), ఉసిరి (40), 30 మొక్కలు సీతాఫలం, గ్రీన్ యాపిల్, జామున్ వంటి మధ్యకాలిక పంటలు మరియు 50 కరివేపాకు, నల్ల మిరియాలు, ఏలకులు, మునగ,వంటి పంటలు నా పొలంలో పండించాను. దీర్ఘకాలిక పంటలలో సిల్వర్ ఓక్ (280), టేకు (120), మహోగని (160), మామిడి (100), కొబ్బరి (180), మర్రి , వేప , చింత, అలంజియం చెట్ల జాతులు ,రావి చెట్టు జాతులు, వెదురు మరియు చందనం చెట్లు మొదలైనవి ఉన్నాయి.

నా పొలంలో అనేక రకాల పెంపుడు జంతువులు ప్రధాన భాగమై ఉన్నాయి. హల్లికర్ ఆవులు - 5, మరియు మలెనాడు గిడ్డ ఆవులు - 5, గొర్రెలు మరియు మేకలు - 9, పౌల్ట్రీ - 60 (టర్కీ -10, కోళ్లు - 6, ఫైటర్ కోళ్లు - 4, ఖడక్నాథ్ కోళ్లు - 10), బాతులు - 9, కాపలా కుక్కలు  - 4, మరియు పిల్లులు -4 మొదలైనవి.

నేను నా పొలంలో పర్యావరణ అనుకూల సాగు పద్ధతులను అనుసరిస్తున్నాను. పరిమిత నీటి వనరులను సంరక్షించడానికి బిందు సేద్యం ఉపయోగించబడుతుంది, పశువుల మరియు మొక్కల వ్యర్ధాలను ఉపయోగించి కంపోస్ట్ మరియు వర్మీకంపోస్ట్ ఉత్పత్తి చేయబడతాయి.

పొలంలో అవి మరింత పునర్వినియోగంచబడతాయి. పశువుల పేడను బయోడైజెస్టర్లను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. నా పొలంలో తేనెటీగల పెంపకాన్ని కూడా చేర్చాను. పొలంలో తేనెటీగల పెంపకం జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తుంది

కలసికట్టుగా ముందడుగు

ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అభ్యసించడంలో ఎక్కువ మంది రైతు స్నేహితులు నాతో చేరడంతో, మేము "సత్వ ఆర్గానిక్స్" అనే 30 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసాము. మేము సురక్షితమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసాము మరియు రైతుల మార్కెట్‌లు, పాఠశాలల్లో విక్రయించడం మొదలైన వివిధ మార్కెట్‌ పద్దతులను  అన్వేషించాము.

కొనసాగిపుగా , మేము ఉద్యానవన శాఖ మద్దతుతో "సావనదుర్గా రైతు ఉత్పాదక కంపెనీ లిమిటెడ్" అనే ఒక రైతు ఉత్పత్తిదారు కంపెనీ(FPO) ని ఏర్పాటు చేసాము, ఇది ఒక కేంద్ర ప్రభుత్వ పథకం. చిన్న రైతుల వ్యాపార సమాఖ్య, రామనగర జిల్లా మాగాడి తాలూకాలోని పరంపరగత కృషి వికాస యోజన (PKVY), శ్రీ శ్రీ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ట్రస్ట్, బెంగళూరు వంటి సంస్థలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చాయి.

రైతు ఉత్పాదక కంపెనీ యొక్క ప్రధాన లక్ష్యాలు కొబ్బరి, మామిడి మరియు కూరగాయల పంటల రైతులకు సాంకేతిక వ్యవసాయ శిక్షణ మరియు సమాచారం అందించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం, సకాలంలో విత్తనాలు నాటడం, ఎరువులు, సేంద్రియ బయోలాజికల్ మందులు, మార్కెట్ యాక్సెస్ విలువ జోడింపును  ప్రోత్సహించడం.

రైతు ఉత్పాదక కంపెనీ ప్రధాన లక్ష్యాలు కొబ్బరి, మామిడి మరియు కూరగాయల పంటల రైతులకు సాంకేతిక వ్యవసాయ శిక్షణ మరియు సమాచారం అందించడం, విత్తనాలు సకాలంలో నాటడం, ఎరువులు, ఆర్గానిక్ బయోలాజికల్ మందులు, అదనంగా మార్కెట్ యాక్సెస్, ప్రోత్సాహక విలువలను అందించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం.

అవగాహన మరియు శిక్షణలతో, రైతులు ఇప్పుడు సురక్షితమైన ఆహారాన్ని పండిస్తున్నారు, భూసారాన్ని మెరుగుపరిచారు, వారి పంట ఉత్పత్తి ఖర్చులను తగ్గించారు మరియు జీవవైవిధ్యాన్ని మెరుగుపరుస్తున్నారు.

మేము ఆసక్తిగల రైతులను నెలకు 10,000 సంపాదించే 10 పంటలను పండించేలా ప్రోత్సహిస్తున్నాము. కొబ్బరి చెట్టులో నిమ్మ, మునగ, కరివేపాకు మరియు ఏలకులు వంటి వరుసలతో అంతరపంటగా సాగు చేశారు. గొర్రెలు మరియు మేకల పెంపకం, ఆవు దూడలు, తేనె, చేపల పెంపకం, వానపాముల కంపోస్టింగ్, మామిడి మరియు విలువ జోడించిన ఉత్పత్తుల ద్వారా కనీసం ఆదాయం 60 వేల రూపాయలు సంపాదించడంలో సహాయపడింది.

FPO డైరెక్ట్‌మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా రైతులకు సహాయం చేస్తోంది. అనేక మార్కెటింగ్ మార్గాలు అన్వేషించబడుతున్నాయి. ఉదాహరణకు, రైతు ఉత్పత్తి ప్రతి శనివారం గిరినగర్‌లోని పూర్ణప్రమతి పాఠశాల ప్రాంగణంలో మరియు బెంగళూరులోని పూర్ణప్రజ్ఞ లేఅవుట్‌లో విక్రయించబడుతోంది. పండ్లు మరియు కూరగాయలు నేరుగా సేంద్రియ దుకాణాలకు విక్రయిస్తారు.

FPO కూడా రైతులకు విలువ జోడించిన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో మరియు వాటిని విక్రయించడంలో సహాయపడుతుంది. "సమగ్ర సిరి" బ్రాండ్ పేరుతో విలువ ఆధారిత ఉత్పత్తులు మార్కెట్ చేయబడుతున్నాయి. ఇందులో తృణధాన్యాలు, ఊరగాయలు, తేనె, A2 పాలు, వెన్న, నెయ్యి మరియు నాటు కోడి గుడ్లు తృణధాన్యాల నుండి తయారైన మాల్ట్ లు  ఉన్నాయి.

వన ప్రచార కార్యక్రమంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము . దీని ప్రకారం, ప్రతి సంవత్సరం 365 కొత్త మొక్కలు, రోజుకు ఒక మొక్క మా తోటలో చేర్చడం  జరుగుతుంది .

మొత్తంమీద, ఈ చొరవ వినియోగదారులకు సరసమైన ధరలకు తాజా మరియు విషరహిత సేంద్రీయ కూరగాయల పంపిణీని అందించడంలో సహాయపడింది. కూరగాయలు, విలువ జోడించిన ఉత్పత్తులను అందించడం ద్వారా, మేము సమాజానికి "విష రహిత ఆహారం" అందిస్తున్నాము.

Keshavamurthy
S/o N. Nanjundayya
Ankanpalya, Motagondanahalli panchayat
Soluru Hobli, Magadi Taluk
Ramanagara District - 562127
E-mail: nkeshava42@gmail.com

ఆంగ్ల మూలం: లీసా ఇండియా, సంపుటి ౨౫, సంచిక ౪, డిసెంబర్ ౨౦౨౩

 

 

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....