కరువుకాటకాలకు మారు పేరుగా మారిన నెనమనహళ్లి (కోలారు జిల్లా) గ్రామంలో హరిత విప్లవం రావడానికి ఎన్. ఆర్. చంద్రశేఖర్ అనే రైతన్న కృషే కారణమని చెప్పకతప్పదు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఈ జిల్లా ఇతర విషయాలకన్నా వేల సంఖ్యలో ఉన్న అందమైన చెరువులకు బాగా సుప్రసిద్ధమైంది. అది ఒకప్పుడు. ఇప్పుడు ఆ నాటి చెరువులు లేవు. బోరు బావులు లేవు. వాటిలోని నీరు అట్టడుగు వరకూ ఎండిపోవడంతో అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈ జిల్లాలో భూగర్భ జలాలు 1200 అడుగుల లోతుకి వెళ్లినా చుక్క నీరు పడని స్థాయికి దిగజారిపోయాయి. ఈ జిల్లాలో నిత్యం నీరు అందించే జీవనదులు ఏవీ లేవు. అందువల్ల ఇక్కడ పంటలు పండించడం దాదాపు అసాధ్యం. అందుకు ప్రధానమైన కారణం తగినంత నీరు లేకపోవడమే. అలాంటి క్లిష్ట పరిస్థితులలో చంద్రశేఖర్ వ్యవసాయం చేపట్టి మంచి ఫలితాలు సాధించి చూపించాడు. అందుకు ఆయన అనుసరించిన మార్గం - అందుబాటులో ఉన్న కొద్ది పాటి నీటి సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకుంటూ, సేంద్రీయ సేద్యం చేపట్టడమే.
ఆయనకు ఉన్న భూమి కేవలం 30 గుంటలు (కేవలం 0.75 ఎకరా) మాత్రమే. అందులోనే ఆయన 500 బొప్పాస చెట్లు, 300 మామిడి చెట్లు, 1500 మల్బరీ మొక్కలు, కొంత భాగంలో కందులు, ఇంకా అనేక ఇతర రకాలైన బీన్స్, సోయాబీన్స్ వంటి అంతర-పంటలను సాగుచేపట్టాడు. కోలార్ జిల్లాలో నీటి లభ్యత చాలా ఖరీదైన వనరు కావటంతో, ఒక విధంగా చెప్పాలంటే బంగారం కన్నా ఎక్కువ ధర ఉంటుంది, ఆయన ఒక పరిష్కార మార్గం కనుగొన్నాడు. అదేమిటంటే – పొడవు, వెడల్పు, లోతు కూడా 3 అడుగులు ఉండే విధంగా తొట్టెల వంటి గోతులను సిద్ధం చేసాడు. వాటి సంఖ్య దాదాపుగా 45-50 వరకూ ఉంటుంది. అదే విధంగా పొడవు, వెడల్పులు 2 అడుగులు ఉండేలా రాగిమొక్కలను పెంచడం ప్రారంభించాడు. ఈ గోతుల్లోకి చేరుకునే కొద్ది పాటి నీటిని పొదుపుగా ఉపయోగించుకోవడమే కాక, నీటి తేమ పొడారిపోకుండా, భూసారం కాపాడే విధంగా ప్రతీ నాలుగైదు గోతులకు చుట్టూ హెబ్బల్ బీన్స్ మొక్కలను నాటేవాడు. బెండ సాగు ఫలాలు చేతికి అందిన తరువాత, ఈ హెబ్బల్ బీన్స్ పంట చేతికి వచ్చేది. అంతేకాక, ఆయన తన 30 గుంటల పొలంలో 70 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతు ఉండే చిన్న పాటి చెరువును నిర్మించుకున్నాడు. ఇందులోకి చేరుకునే నీటిని అత్యవసర సమయాలలో మొక్కలను కాపాడుకునేందుకు ఉపయోగించేవాడు.
తన పొలంలోని ప్రతీ అంగుళం నేలను ఆయన చాలా విలువైనదిగా భావించేవాడు. ఈ వివిధ రకాలైన పంటలతో పాటు హార్స్ గ్రామ్ (ఉలవలు), జనుపనార, ధియన్చా అనే రకపు మొక్కలు, ఇంకా ఇతర భూసార రక్షణకు తోడ్పడే కొన్ని మొక్కలు (వాటిని డికోటీలెడోనస్ అని ఆంగ్లంలో వ్యవహరిస్తారు. ఈ రకం మొక్కలలో రెండు కణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటికి భిన్నంగా ఏక కణ మొక్కలు వాటిని మోనోలెడోనస్ అంటారు) సాగుచేస్తాడు. ఇవి భూసారాన్ని కాపాడటంలో కీలకంగా పరిగణిస్తారు. భూసారంతో పాటు మట్టిలో తేమ స్థిరంగా నిలిచేందుకు ఇవి ఉపయోగపడతాయి. వీటిలో హార్స్ గ్రామ్ కారణంగా పొలంలో రాలిపడే ఆకులు, ఇతర వ్యర్థాలు అక్కడి మట్టిలో సేంద్రీయ లక్షణాలను మెరుగుపరుస్తాయి. రసాయనాలు ఎక్కువగా ఉపయోగించే రైతన్నలకు ఇది చాలా ఉత్తమమైన ప్రత్యామ్నాయం. ఈ మొక్కలతో పాటు చంద్రశేఖర్ సుబాబులం, లిన్ సీడ్ గ్లైరిసీడియా చెట్లను విరివిగా పొలం చుట్టూ పెంచుతూ వచ్చాడు. ఈ వివిధ రకాలైన మొక్కలు, చెట్ల నుంచి రాలిపడే ఆకులను, అలములను పొలం అంతటా ఎరువులకు మారుగా విస్తృతంగా ఉపయోగించేవాడు. ఫలితంగా భూసారం మెరుగయ్యేది. దిగుబడి అధికమయ్యేది.
అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే – పరిమితంగా ఉన్న నీటి వనరులను ఆయన చాలా పొదుపుగా ఉపయోగించేవాడు. మొక్కలకు అవసరమైన నీటిని సీసాలలో నింపి అందించేవాడు. నీటితో నింపిన సీసాలను మొక్కలకు కనీసం ఆరు అంగుళాల దూరంలో భూమిలో పాతిపెట్టేవాడు. అయితే అలా పాతిన సీసాలు ఆ మొక్కల వేళ్లకు దగ్గరగానే ఉండేట్లు చూసుకునేవాడు. వేసవిలో సీసాలలో నీటిని నింపిన తరువాత అవి ఆవిరై పోకుండా కాపాడేందుకు మొక్కల వేళ్లకు చేరేలా జాగ్రత్త తీసుకునేవాడు. ఉదాహరణకు, మామిడి మొక్కలకు నీరు పోయాలంటే బకెట్లలో పోయవలసి ఉంటుంది. 300 మొక్కలకు నీరు అందించాలంటే కనీసం 300 కుండల నీటిని సేకరించుకోవాలి. కానీ, ఆయన అనుసరించిన ఈ పద్ధతిలో ఒక కుండ నీరు 26 మొక్కలకు కావలసిన నీటిని సమకూర్చేది. అంటే మొత్తం 300 మొక్కలకు కేవలం 12 కుండల నీరు సిద్ధం చేసుకుంటే చాలు. ఆ రకంగా ఆయన 288 కుండల నీటిని ఆదా చేసుకునేవాడు. అంతేకాక, ఎంతో సమయాన్ని మిగుల్చుకునేవాడు. శ్రమను తప్పించుకునేవాడు. 2010లో ఆయన మామిడి దిగుబడి 20 టన్నులు. బొప్పాయి పంట చేతికి వచ్చిన తరువాత మామిడి దిగుబడి వచ్చేది. వీటితో పాటు ఆయన తేనె సేకరణ వ్యాపారం కూడా చేపట్టేవాడు.
చంద్రశేకర్ సాధించిన విజయాలు ఆయనను ఆ ప్రాంతంలోని రైతన్నలందరికీ ఆదర్శంగా నిలిచాడు. సేద్యం చేయడంలో అవసరంలేని ఖర్చులను తగ్గించుకునేందుకు ఆయన చాలా కృషి చేసేవాడు. అందులో భాగంగానే ఆయన సేంద్రీయ వ్యవసాయం అనుసరించాడు. రసాయనాలు వాడవలసిన అవసరం లేకుండా చూసుకున్నాడు. సేద్యం జీవనాధారంగా ఉన్న కుటుంబాలు ఆయన చూపిన మార్గం అనుసరిస్తే క్లిష్ట సమయాలలో కూడా మంచి లాభాలను సంపాదించుకోగలుగుతారు. ఆయన నోట ఇప్పుడు సగర్వంగా వినిపించే మాటలు : పర్యావరణకు మరింత హామీ జరగకుండా భవిష్యత్ తరాలు జీవించేందుకు ఇదే సరైన మార్గం.
ఎన్. ఆర్. చంద్రశేఖర్
ఆదర్శ రైతు, సేంద్రీయ వ్యవసాయదారు
నెనుమనహళ్లి, కోలార్ తాలూకా
కోలారు జిల్లా, కర్ణాటక.
టెలిఫోన్ : 08152 238971
మొబైల్ : 9448342803ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 17, సంచిక 3, సెప్టెంబర్ ౨౦౧౫



