లాభదాయకంగా అక్వాకల్చర్ వృద్ధి – ఉత్తమ నిర్వహణ పద్ధతులే కీలకం

 సామాన్యుల జీవితాలకు ఆరోగ్యపరంగా భరోసా ఇవ్వడంలోనూ, పర్యావరణాన్ని కాపాడడంలోనూ కూడా అక్వా రంగం (చేపల పెంపకం) ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నది. ఈ కారణంగా సురక్షితమైన పర్యావరణంలో చేపల ఉత్పత్తిని మరింత పెంచే లక్ష్యం సాధించాలంటే ఉత్తమ జీవోత్పత్తి విధానాలను అనుసరించడం అత్యవసరం. 
వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలకు విలువైన పోషకాలను అందించడంతో పాటు వారికి మరింత అదనపు రాబడి చేకూర్చడంలో అక్వా రంగం ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సామాన్య ప్రజలకు పోషకాలను అందించే ఆహార పదార్థాలలో చేపలు, చేపల ఉత్పత్తులకు రోజురోజుకీ గిరాకీ పెరిగిపోతోంది. ఈ గిరాకీ కి తగిన స్థాయిలో పెద్ద ఎత్తున చేపల పెంపకాన్ని చేపట్టడం అవసరం. అయితే ఈ లక్ష్యంతో సత్వర ఫలితాలనిచ్చే విధానాలపై దృష్టి ఎక్కువ అవుతోంది. ఈ విధానాల వల్ల అందుబాటులో ఉన్న వనరులను విిచక్షణ లేకుండా దుర్వినియోగం చేస్తున్నారు. సామర్థ్యానికి మించి అంతుపంతూ లేకుండా పరిమితి లేకుండా చేపలను స్టాకింగ్ చేయడం, చేపల చెరువుల్లో నీటిని అవసరం లేకున్నా మార్చి వేస్తూ ఉండడం, క్రమం లేకుండా వాటికి ఆహారం అందించడం, ఎరువులను (ఫెర్టిలైజర్స్) ఉపయోగించడం, అవసరం ఉన్నా లేకున్నా పెద్ద మొత్తంలో యాంటీ బయోటిక్స్ వంటి మందులను ఉపయోగించడం జరుగుతోంది. ఇటువంటి తప్పుడు విధానాల వల్ల వ్యతిరేక ఫలితాలే వస్తున్నాయి. తరువాతి తరాలకు హానికలిగించే విధంగా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఈ ధోరణి చేపల జీవితాలను, మాత్రమే కాకుండా జీవవైవిధ్యాన్నికి కూడా హాని కరంగా తయారవుతోంది.
పెద్ద పెద్ద చేపల పెంపకాన్ని మరింత ఎక్కువ విస్తీర్ణంలోచేపట్టడంతో పాటు దేశీయ చిన్న చిన్న చేపల జాతులను, రొయ్యలను (ప్రాన్స్) పెంచడం తక్షణ అవసరం. గ్రామీణ ప్రాంతాలలోని ఇండ్లలో రోజువారీ ఆహారంలో వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని కూడా ఆక్రమించేయడం జరుగుతోంది. మన దేశం చేపల ఉత్పత్తిలో అగ్ర స్థానంలో ఉందని గొప్పలు చెప్పుకుంటాం. వాస్తవం మరోలా ఉంది. పాఠశాల స్థాయి చిన్నారుల్లో పోషక విలువలు అతి తక్కువగా ఉంటున్నాయి. వారంతా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. బెంగాల్ పల్లె ప్రాంతాలలో సూక్ష్మ పోషకాల లోపం (మైక్రోనూ్యట్రియంట్ డెఫీషియెన్సీ) ఎక్కువగా ఉంది. చిన్నారులలోనూ, స్త్ర్రీలలో ఈ సమస్య ఎక్కువ. ఈ సమస్యను సకాలంలో సరిచేయని పక్షంలో దేశ భవితపై చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సూక్ష్మపోషకాల లోపం వల్ల ఎదుగుదల దెబ్బతింటుంది. రోగనిరోధక శక్తి క్షీణించిపోతుంది. రోగాల పీడ ఎక్కువ అవుతుంది. ఈ సమస్య పరిష్కారానికి రోజువారీ ఆహారంలో అదనపు చేర్పుల ద్వారా ప్రయోజనం ఉంటుంది. సూక్ష్మ పోషకాలను ఆహారంలో చేర్చడానికి చాలా తేలిక మార్గం ఒకటి ఉంది. ముందుగా చేపల ఉత్పత్తి మరింతగా పెంచవలసి ఉంటుంది. తీరాలకు దూరంగా ఉండే తాజా నీటి వనరులలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి. పర్యావరణాన్ని కాపాడే విధంగా ఈ కృషి జరగాలి. అదే సమయంలో ఉత్తమ అధికోత్పత్తికి వీలుగా మెరుగైన పశు సంవర్ధక పద్ధతులను పాటించాలి.
మధ్యేమార్గంగా (సెమీ ఇంటెన్సివ్) దేశీయ పెద్ద కార్ప్స్ చేపల పెంపకానికి తగినట్లుగా చెరువులను సమకూర్చుకోవడం ఒక అనువైన విధానం. ఇందులో సహజసిద్ధంగా చేపల ఉత్పత్తి (సూర్యరశ్మి ఆధారంగా చెరువులోని నీటిలోనే పెరిగే సహజసిద్ధమైన ఆహారం) ప్లాంక్ టోనిక్ పైనే చేపలు జీవిస్తాయి.) ఈ విధానంలోని ప్రధాన సూత్రం. ఈ విధానం విరివిగా వాడుకలో ఉంది. ప్లాంక్ టోన్ తరహా ఆహారంలో పచ్చటి పదార్థాలు, నీలం-ఆకుపచ్చ కలగలిసిన పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. వీటినే సూక్ష్మజీవజాలం (మైక్రో ఆల్గే) అని కూడా వ్యవహరిస్తారు. సూర్యరశ్మి ప్రభావం వల్ల నీటిలో కరిగిపోయిన ఆక్సిజన్ ను చేపలకు అందుతుంది. అదే సమయంలో ఈ మైక్రో ఆల్గే పదార్థాలు నీటిలోనే వృద్ధి పొందే జూప్లాంక్ టన్ జీవాలకు కూడా ఆహారంగా ఉపయోగపడతాయి. ఈ రకంగా వృద్ధి చెందే జూప్లాంక్ టన్ జీవజాలం చిరు చేపలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. పర్యావరణకు అనువైన తీరులో సహజసిద్ధమైన ఆహారం సమకూర్చడం ప్రధానంగా జీవసంబంధ అంశాలతో పాటు జీవసంబంధేతర అంశాల ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంలో సేంద్రియేతర పోషకాలను నీటి చెరువుల  అడుగు భాగాన ఉండే మట్టి ఆధారంగా అందజేయడం, అందుకు సూర్యకిరణాలే కీలకంగా ఉండడం, ఫలితంగా పైటో ఫ్లాంక్ టన్ జీవ జాలం వృద్ధి జరుగుతుంది.ఈ రెండు రకాలైన ప్లాంక్ టన్ జీవజాలం వృద్ధి చేపల తరహాకు చెందిన కార్ప్స్ వృద్ధికి కారణమవుతుంది.
ఇక పర్యావరణం పరంగా ఆలోచిస్తే నీటి ఉష్ణోగ్రత, కాంతి తీవ్రత, మట్టి లేదా నీటి నాణ్యత, వాటన్నిటి మధ్య జరిగే ప్రాకృతిక చర్య లేదా ప్రతిచర్యల తీరుతెన్నులు అన్నీ కిలిస్తేనే ఆ చెరువులో చేపల ఎదుగుదల అనేది సజావుగా సాగుతుంది. ఉత్పత్తి పెరగడానికి మనం అనుసరించే ఉత్తమ నిర్వహణ పద్ధతుల ప్రభావం కూడా ముఖ్యమైనదే. అందులో భాగంగా అనుబంధ ఆహార పదదార్థాలను కూడా చేపలకు అందజేయడం అవసరం. మొత్తం మీద వనరుల సద్వినియోగం వల్ల మాత్రమే అధికోత్పత్తి సాధ్యమవుతుంది. అందుకు తేలికైన నిర్వహణ పద్ధతులను అనుసరించాలి. సహజసిద్ధమైన ఆహారం అందించాలి. ఆ ఆహారం కూడా పర్యావరణహితమైనదే కావాలి.
ఉత్తమ ఆహారం అందించే పద్ధతులు
మధ్యేమార్గమైన సెమీ ఇంటెన్సివ్ చేపల పెంపకం విధానం ప్రకారం మన దేశంలో ఆరు రకాలైన చేపల పెంపకం జరుగుతుంది. ముఖ్యంగా తాజా నీటిలోనే వీటి పెంపకం చేపడుతున్నారు. ఇందుకు సహజసిద్ధమైన జూ ప్లాంక్ టన్ ను తొలి దశలో ఆహారంగా అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తరువాత కొద్ది కొద్దిగా విరామం ఎక్కువగా ఇస్తూ బాహ్యంగా సమకూరే ఆహారం అందిస్తారు. ఇది చేపల మలి దశల్లో ఎదుగుదలకు దోహదపడుతుంది. ఈ విధానమే చేపల పెంపకందారులు అనుసరిస్తున్నారు. చిరు దశలోసహజ ఆహారంపైనే చేపలు ఆధారపడతాయి. జూ ప్లాంక్ టన్ మిశ్రమంతో పాటు చెరువుల్లో ముందుగానే నిల్వచేసి ఉంచిన రోటిఫైయర్స్ ఆధారంగా చిరు చేపలను పెంచుతున్నారు. ఇక్కడ కీలకమైన దశ ఒకటి ఉంది. దానిని క్రిటికల్ స్టాండింగ్ క్రాప్ అని అక్వా రంగంలో వ్యవహరిస్తారు. ఈ దశలో చేపల ఎదుగుదల గరిష్టానికి చేరుతుంది. అక్కడి నుంచి వాటి శరీరం ఆహారాన్ని జీర్ణించుకునే శక్తి క్షీణించిపోవడం మొదలవుతుంది. ఈ దశ తరువాత చేపల పెరుగుదల చాలా నెమ్మదిగా సాగుతుంది. ఎందుకంటే వాటికి అందించే సహజసిద్ధమైన ఆహారం వాటి ఎదుగుదలకు సరిపోయే స్థాయిలో ఉండకపోవడమే. అటువంటి దశలో వాటి ఎదుగుదలకు తగిన ఆహారాన్ని బాహ్యంగా తయారీ చేసిన వాటిని అందించాలి.  ఈ అంశంపై జరిపిన అధ్యయనం ప్రకారం, ఈ దశలో 9 రకాలైన పోషకాలను అందించాల్సి ఉంటుంది. వాటిని అయిదు రకాలైన ఆహార పదార్థాలుగా చెప్పుకోవచ్చు. వాటిలో ప్రధానంగా వరి పొట్టు, వేరుశెనగ చెక్క, పత్తి గింజల ఆహారం, సన్ ఫ్లవర్ ఆధారిత ఆహారం, సోయా బీన్ ఆధారిత ఆహారం, ఆవాల ఆధారితం, నువ్వుల ఆధారితం, గోధుమల ఆధారితం, జొన్న ఆధారితం ముఖ్యమైనవి. ఇక అయిదు రకాలైన ప్రధాన ఆహార రూపాలు – వరి పొట్టు మాత్రమే, వరి పొట్టు, పత్తి గింజల మిళితం, వరి పొట్టు, వేరు శెనగ చెక్క మిశ్రమం, వరి పొట్టు, సన్ ఫ్లవర్ ఆధారితం, వరి పొట్టు, ఆవ గింజల చెక్క మిశ్రమం.
చేపలకు అందించే ఆహారం వాటికి రుచికరమైనదై ఉండాలి. అంతేకాక, చెరువులోని నీటి లక్షణాలకు అనుకూలంగా ఉండాలి. సరైన ఆహారాన్ని సరైన సమయంలో చేపల బరువుకు తగినట్లుగా అందిచడం అనేది చాలా కీలకమైన అంశం. కీలకమైన దశ అని చెప్పుకున్నాం కదా. ఆ స్థితి కంటే ముందు చేపలకు ఈ అనుబంధ ఆహారం అందించడం ఒక రకంగా వృధా అని చెప్పాలి. నిర్వహణ ఖర్చు పెరగడం తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు. అలాగే సరైన సమయానికి అటువంటి ఆహారం అందించలేకపోతే, చేపల ఎదుగదల తగ్గిపోతుంది. దిగుబడి కూడా తగ్గిపోతుంది. అందువల్ల ఈ ఆహారం అందించే సమయాన్ని చేపల బరువును, నీటిలోని ఉష్ణోగ్రతలపై ఆధారపడి నిర్ణయించాలి. ఉదాహరణకు లార్వా లేదా స్పాన్ దశ (జీవం పోసుకోని స్థితి లేదా గుడ్డు దశ) ల్లో ఒక గంట వ్యవధిలోనే అనేక సార్లు ఆహారం అందించాలి. కొద్దిగా ఎదిగిన తరువాత రోజుకు రెండు సార్లు సరిపోతుంది. సమృద్ధిగా ఆహారం చెరువులో పడేస్తే చేపల మధ్య తమ వంతు ఆహారం కోసం వాటి మధ్య అనవసరమైన పోటీ నివారించవచ్చు. వాటి ఎదుగుదలలో సమానత సాధించవచ్చు. ప్రొటీన్లు, శక్తి పోషకాలు ఎదుగుదలకు పూర్తిగా సహకరించేలా ఉండాలి. చెరువులో పెంచడానికి ఎంపిక చేసుకున్న వివిధ రకాలైన చేపల జాతులకు ఉపయోగపడేలా ఆహారం అందించడం చాలా ముఖ్యం.  వాటి జీవ అవసరాలకు తగినట్లుగా ఉండాలి. ఉదాహరణకు క్యాట్ రకం చేపలకు చీకట్లో ఆహారం అందించాలి. క్రాప్ రకం చేపలకు పగటి పూట ఆహారం అందించాలి. అందువల్ల ఏ రకం చేపలకు ఏ సమయంలో ఆహారం అందించాలో కూడా స్పష్టమైన అవగాహన ఉండాలి. అప్పుడే చేపల పెరుగుదలలో ఏకరూపత సాధించవచ్చు. అనవసరపు ఖర్చు తగ్గించుకోవచ్చు.
నీటి పొరల్లో మరుగు ప్రదేశాల వంటివి ఏర్పాటు చేయడం కూడా వాటి ఎదుగుదలకు, ముఖ్యంగా వివిధ రకాలైన కార్ప్ రకాల వృద్ధికి తోడ్పడుతుంది. అంటే ఆయా రకాలా చేపల జాతులు కాలనీల రూపంలో ఒక చోట గుమికూడి జీవిస్తాయి. ఇలాంటి మరుగు ఏర్పాటుకు చెరకు పిప్పి, పామ్ ఆకులు, కొబ్బరి ఆకులు, వెదురు గడలు ఉపయోగించవచ్చు. వాటితో పాటు సేంద్రీయ ఎరువును అందించడం మరింత ప్రయోజనకరం. వాటికి జతచేసి ఉంచిన ఆల్గే జీవపదార్థాలు ఆహారం కోసం వెతుకులాడుతుండే చేపలకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఉపరితలంలో కూడా వాటి సంఖ్య పెరుగుతుంది. సహజసిద్ధమైన ఆహారం రూపంలో జీవజాలం పెంపొందినట్లయితే నీటి నాణ్యత కూడా మెరుగుపడుతుంది.
పోషకాల్లో వైవిధ్యం పెంపు
కార్ప్ ఉత్పత్తికి కానీ, నీటిలోని పర్యావరణకు కానీ ఎలాంటి హానీ ఏర్పడకుండా అతి సూక్ష్మ పోషకాలను అభివృద్ధి చేయడంలో చిన్న చిన్న చేపలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. స్థానికంగా లభించే తాజా నీటి వనరులలో సహజంగా జీవించే లక్షణం ఉన్న ఈ విభిన్న రకాలైన చేపలు అంటే మైనర్ కార్ప్స్, క్యాట్ ఫిష్, పెర్చ్, ఈల్స్, ఫెదర్ బ్యాక్స్ ఇంకా సిచిల్డ్స్ వంటివి  ఈ రకంగా సూక్ష్మ పోషకాలను పెంపొందిస్తాయి. ఉదాహరణకు, ఈ పోషకాలు ప్రకృతిలోనే లభిస్తాయి. అద్భుతమైన ప్రభావం చూపిస్తాయి. ప్రభుత్వేతర సంస్థలతో పాటు ప్రభుత్వ మత్స్య శాఖ అధికారులు కూడా ఇటీవలి కాలంలో పోలీకల్చర్ ను అంటే చిన్న చిన్న చేపల జాతుల పెంపకాన్ని, మరి కొన్ని రకాలైన మత్స్య జాతులను పెంచి వాటిని సంరక్షిస్తున్నాయి. ఇలాంటి మత్స్య జాతుల సంరక్షణ కేంద్రాలు పంచాయతీలు లేదా గ్రామాల స్థాయిలో ఏర్పాటుచేస్తున్నాయి. అలాంటి ఒక మత్స్య సంరక్షణ కేంద్రం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని లక్ష్మీకాంతపూర్ లో ఉంది.
చేపల చెరువుల్లో బాతుల పెంపకం చేపల పెరుగుదలకు తోడ్పడుతున్నాయి. చేపల అధిక దిగుబడులకు కారణమవుతున్నది. పోషక ఆహారం రీసైక్లింగ్ చేయగలుగుతున్నాయి. చెరువులోని నీటిలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతున్నాయి.
నాణ్యమైన చేపల విత్తుల ఉత్పత్తి
పోషక విలువలతో కూడిన ఆహారం అందించడంలో సాధారణంగా చేపల పెంపకందారులు అంతగా శ్రద్ధ చూపించరు. అందువల్లనే చేప గుడ్లు నాణ్యమైనవిగా ఉండడం లేదు. చేపలు చిన్న వయసులోనే చనిపోతున్నాయి. వాటి ఎదుగుదల చాలా నెమ్మదిగా సాగుతోంది. చేపలలో ఉండే ఒక లక్షణం ఫకుండిటీ అంటారు. అంటే అధికోత్పత్తి సామర్థ్యం. ఈ కారణంగా రైతులు ఈ అంశానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. రోహు జాతి చేప, ఉదాహరణగా చూస్తే, లక్ష గుడ్లు పెడతాయి. కానీ వాటిలో సగానికి సగం చనిపోతాయి. అయినా రైతుకు మిగిలిన 50 వేల గుడ్లు లభిస్తాయి. అంటే ఒక్క రోహు చేప నుంచి రైతులు కనీసం 50 వేల రోహు చేపలను పొందుతున్నారు. ఇక వారికి దానిపై శ్రద్ధ ఉండదు కదా.
పోషకాలు, సరైన ఆహారం అందించడం అనేది చేపల పునరుత్పత్తిలో విజయం సాధించడంలో మౌలికమైన అంశాలు. అధిక దిగుబడికీ, సమ-ద్ధిగా చిన్న చేపల లభ్యత వీటిపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల సరైన పోషణ నివ్వడం, అత్యవసరమైన అమినో ఆసిడ్ ఇంకా ఫాటీ ఆసిడ్ వనరులను అందించడం తొలి దశలో (ఏప్రిల్ – జూన్ మధ్య కాలంలో) నాణ్యమైన గుడ్లు లభించడానికి   చాలా ముఖ్యమైన అంశం.
చిన్న స్థాయి సమీకృత చేపల పెంపకం విధానం
నీరు, భూమి, తదితర వనరులను ఆధారం చేసుకుని అధికోత్పత్తి సాధించడం, సమీకృత పెంపకం ప్రధాన సూత్రం. వ్యవసాయం / తోటల పెంపకం లేదా అక్వా రంగం అంటేనే బాతుల పెంపకం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం. వృథా అయ్యే నీటి వనరులను శుద్ధిచేసిన తరువాత చేపల పెంపకానికి వినియోగించడం ఇతర ప్రాథమిక సూత్రాలు.
బాతులు, చేపల మిశ్రమ సేద్యం అన్నవిధానం పశ్చిమ బెంగాల్ గ్రామీణ ప్రాంతాలలో సర్వసాధారణం. ఈ విధానంలో నీటిలో సహజంగా లక్ష్యమయ్యే పోషకాలనే ఉపయోగించుకుంటారు. బాతుల్లో అనేక రకాలున్నాయి. కానీ వాటిలో ఇండియన్ రన్నర్స్ అనే జాతి బాతుల పెంపకం ఎక్కువగా చేపడతారు. బాతులు చేపల చెరువుల్లో కలిసి తిరగాడడం వల్ల హాని కలిగించే కొన్ని క్రిములు, చీడలు, టాడ్ పోల్స్ వంటివి నశించిపోతాయి. ఫలితంగా నీరు చేపల ఎదుగుదలకు అనుకూలంగా మారుతుంది. బాతులు విసర్జించే నత్రజని పూరిత మలం చేపలకు ఆహారంగా ఉపయోగపడే జీవజాలం వృద్ధికి దోహదపడుతుంది. బాతుల విసర్జన నేరుగా నీటిలో కలిసిపోయి, కర్బనం, నత్రజని, ఫాస్ఫరస్ వంటి పోషకాలుగా రూపాంతరం చెందుతాయి. వీటి ఆధారంగా చేపలకు ఆహారం గా ఉపయోగపడే ఇతర జీవజాలం వృద్ధి చెందుతుంది. ఈ కారణాల వల్లనే చేపల చెరువులోనే బాతుల పెంపకం కూడా చేపట్టడం ఉపయోగకరంగా మారింది. చేపల దిగుబడినీ, వాటి ఎదుగుదలను, నీటి కాలుష్య నియంత్రణను సమకూరుస్తాయి. అయితే ఎన్ని బాతులను పెంచాలనే సమస్య ఎదురవుతుంది. దానికి ఒక లెక్క ఉంది. హెక్టారుకు 300 నుంచి 500 వరకు బాతులు ఉండవచ్చు. ఒక్కో బాతు అవి ఎదగడానికి అవసరమైన 36 రోజుల వ్యవధిలో 7 కిలోల వరకు విసర్డనలు నీటిలోకి చేరుస్తాయి. అంటే 500 బాతులను పెంచినట్లయితే ఇదే కాలంలో 3500 కిలోల వరకు విసర్జన లభించినట్లే. బాతుల పెంపకం మరో ప్రయోజనం కలిగిస్తుంది. అదేమిటంటే నీటి అడుగున పేరుకుపోయి ఉండే పోషకాలను వెలికి తీయడంలో ఇవి తోడ్పడతాయి. ఆ రకంగా చెరువులోని పోషకాలను రీసైక్లింగ్ చేయడంలో కూడా ఈ బాతులు – చేపల సమీకృత పెంపకం ప్రయోజనకరంగా ఉంటుంది. పల్లపు ప్రాంతాలలో బాతులు తమ తలలను నీటి అట్టడుగు వరకు తీసుకెళ్లి, మట్టిని పైకి కిందకు మళ్లించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ విధంగా బాతులు చేపట్టే మట్టి తవ్వకం మట్టిలో కూరుకుపోయిన పోషకాలను వెలికి తీసుకువస్తాయి. అదే విధంగా నీటిలో ఆక్సిజన్ మిళితమయ్యే తీరును మెరుగుపరుస్తాయి. అవి ఈదుతూ ఆడుతూ, వెంటాడుతూ నీటిలో ప్రకంపనలు సృష్టిస్తాయి. ఈ చర్యల వల్ల నీటిలో ఆక్సిజన్ ఎక్కువగా కలిసిపోతుంది.
మరో పద్ధతి వరిసాగు తో చేపల పెంపకం చేపట్టడం. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలోని మాల్డా, తూర్పు మిడ్నపూర్, హుగ్లీ, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఎక్కువగా వాడుకలో ఉంది. ఖరీఫ్ పంట సాగు కాలంలో భూమి చదును చేసే సమయంలోనే ఇందుకు అనువుగా ఏర్పాట్లు చేసుకుంటారు. ముందుగా వ్యవసాయ క్షేత్రానికి అన్ని దిక్కులా ఉండే గట్ల సమీపంలో మీటరు వెడల్పు, 25 సెంటీమీటర్ల ఎత్తు ఉండే కాల్వల వంటివి అమరుస్తారు. వాటికి వెదురు బొంగులతో నీటి సరఫరా ఏర్పాటు చేస్తారు. వాటిలోకి నీరు ప్రవేశించే మొదటి, వెలికి వచ్చే చివరి స్థానాల్లో స్క్ర్రీన్ తెరలను అమరుస్తారు. ఈ కాల్వల్లో చేపల పెంపకం చేపడతారు. కాల్వ వెంబడి మొత్తం పొలం చుట్టూ చేపలు తిరగగలుగుతూ ఉంటాయి. ఇలాంటి వరి సాగు క్షేత్రాలలో నీరు చేపల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఇతర రకాలైన వరి సాగు పొలాలతో పోలిస్తే ఈ విధానం చేపలకు ఎక్కువ అనుకూలం. ఈ పద్ధతిలో అనేక ప్రయోజనాలున్నాయి. వరి దిగుబడి పెరుగుతుంది. ఇలా వరి సాగుతో చేపల పెంపకం చేపట్టని పొలాలతో పోలిస్తే ఇది మరింత ప్రయోజనకరం. పొలంలో నీటి తడి విస్త-తంగా ఉండడం వల్ల కొన్ని రకాలైన చీడపీడల బెడద తగ్గిపోతుంది. వరి మొక్కల వేళ్లు గట్ల వెంట ఉన్న నీటిలోకి చేరడం వల్ల చేపలకు అత్యవసర ఆహారంగా అవి ఉపయోగపడతాయి.
ముగింపు వాక్యాలు
ప్రజారోగ్య సంరక్షణలో అక్వారంగానిది కీలక పాత్ర. పంచాయతీలు / తాలూకాలలో అందుబాటులో ఉన్న నీటి వనరులను  అక్వా రంగం అభివృద్ధికి కేటాయించడం అవసరం. పల్లె ప్రాంతాలలో అనేక రకాలైన వ్యవసాయ ఆధారిత అనుబంద ఉత్పత్తులు పుష్కలంగా ఉంటాయి. వాటిని చేపల పెంపకానికి ఉపయోగించవచ్చు. అలా చేస్తే జన్యుపరంగా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. అప్పుడే మేజర్ కార్ప్ పెంపకం లాభసాటి అవుతుంది. గ్రామీణ ప్రజలకు మరిన్ని జీవనోపాధి అవకాశాలు లభిస్తాయి. సామాజిక అడవుల్లో సామాజికపరంగానే అక్వా రంగాన్ని ప్రోత్సహించాలి. రకరకాల చేపల ఉత్పత్తిని చేపట్టాలి. ఈ రకంగా చేయడం వల్ల రెండు రకాల లాభం వస్తుంది. ఒకటి ఆయా చేప జాతులను కాపాడవచ్చు. కొన్ని జాతులు ఇప్పటికే అంతరించే దశకు చేరుకున్నాయి. చౌకగా ఆరోగ్యదాయకమైన చేపల ఆహారాన్ని మానవ ఆరోగ్య అభ్యుదయానికి అందించవచ్చు.
ప్రతాప్ ముఖోపాధ్యాయ
రిటైర్డ్ ప్రిన్సిపాల్ సైంటిస్టు
ఐసీఏఆర్-సీఐఎఫ్ఏ (www.cifa.in)
E-mail: pratap_in2001@yahoo.co.uk

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....